Wednesday, January 25, 2023

***నిర్విషయం... నిర్వాణం... నిస్సంకల్పం ... ఇది అంతర్ముఖ ప్రయాణం.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

అన్నిటినీ ఆత్మ స్వరూపంగా ... అనుభవించేవాడు ... అనుభవించబడేది .. అనుభవం .. మూడు ఆత్మయే అన్న నిర్ణయానికి రావాలి. 

పంచ కోశ వ్యతిరిక్త: అనేది జ్ఞాన మార్గంలో మొదటి మెట్టు. నిరపేక్ష దృష్టి లభించినప్పుడు ఈ పంచకోశాలు ఆత్మ స్వరూపంగా కనిపిస్తాయి. 

దేహాత్మ... అంతరాత్మ.. పరమాత్మ... కేవలాత్మ కలిపేస్తే అఖండం. 

పంచకోశాలు సాక్షీ సాధన ... వలన దాటిన వారు .. తనవలే ఇతరులను చూడటం వస్తుంది. 

శరీర త్రయ విలక్షణ: .. ఇది రెండవ మెట్టు. విచారణ .. సాధన తో దాటాలి. 

సదా నిర్విషయంలో ఉండాలి. 

తాపత్రయ వినిర్ముక్త: .. ఇది మూడవ మెట్టు .... సాధకునికి ఇవి మూడు అత్యంత ప్రధానం. 

నిర్వాణ స్థితి ప్రాప్తించిన వారే తాపత్రములు దాటగలరు.... తాపత్రయములు దాటక ... ముక్తి రాదు. 

కర్మఫల త్యాగం సంపూర్ణంగా చెయ్యాలంటే నిర్వాణ స్థితిలో ఉండాలి. 

స్వానుభవంలో ఇది లేనిదని నిర్ణయం ... ఎవరికి అయినదో వాడు తరించినవాడు. 

ఉన్నది అన్నామంటే ... అది ఏకమే అయి ఉండాలి. 

కూటస్థునిలో ఉన్న అపంచీకృత భాగం ఏదైతే ఉందో .. అది సర్వసాక్షి. 

పరం ... పరాత్పరము ..  బ్రహ్మాండ  సాక్షి ... వ్యక్తా వ్యక్తాలు పిండాండ 
ము. 

సదా ఆత్మ భావనలో ఉండాలి ... మూడు గుణాలు దాటాలి. 

అంతర్ముఖ సాక్షి తెలియబడితే తప్ప మూడు గుణాలు దాట లేరు. 

నిర్విషయం... నిర్వాణం... నిస్సంకల్పం ... ఇది అంతర్ముఖ  ప్రయాణం. 

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు
ఋభుగీత -18

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment