Wednesday, November 29, 2023

ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమార్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటే అవుతుంది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమార్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటే అవుతుంది.*
❤️ *మాలిన్యం నుండి మనసు ప్రక్షాళనమైతే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతున్నది.*
💖 *శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|*
*శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్‌ వృణీతే||'*
💓*విశ్వజిత్‌ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నాతండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో ‘తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు?’ అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.*
💞 *కాలగతిలో ఎలాగైనా నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక ‘తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.*
💕*నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడురోజులుగా నిరాహారుడై ఉన్నాడనే విషయం తెలుసుకున్న యముడాతనికి మూడువరాలను ప్రాయశ్చిత్తంగా అనుగ్రహించాడు.*
💝*ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని సత్ఫలితాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి.*
❤️ *కనుకనే యముడు నచికేతుని సంతృప్తి పరచడానికి 3 వరాలను అనుగ్రహించాడు.*
💓*యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రించింది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడిగిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమధర్మరాజు. మరణాంతరగతులను నిర్ణయించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే ఐనా అసాధ్యమనిపించే నచికేతుని కథారూపం సంగతి కాసేపు పక్కన పెడితే...*
💖*జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్పాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.*
💕 *ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం.*
❤️ *మనిషి కూడా జనన మరణ చక్రాన్ననుసరిస్తాడు. మనిషిజన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించేపనిలేదు.*
💕 *~మితిమీరిన ఆనందమే సుఖమనీ భావించనక్కర్లేదు.*
❤️ *జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు. మనుషులకంటే దేవతలు వందల సంవత్సరాలు అధికంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై ఉండొచ్చు.*
💓*కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మజీవితమైనా ఎంతటి వైభవంతో అలరారుతూ ఉన్నా ‘జీవితం క్షణికమే’ అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ'చైతన్యదిశగా అడుగులు వేయమంటుంది.*
💕 *కుటిలచిత్తంలేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు.*
💕*పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూఢమైనదీ ఆత్మ.*

❤️ *ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకలప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్యతత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.*

❤️ *''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|*
*బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''*
💞*~శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం.*
💞*శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment