Wednesday, November 15, 2023

🌷తల్లి మనసు🌷 🔥Heart touching Memories🔥

 🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

🌷తల్లి మనసు🌷
🔥Heart touching 
Memories🔥

💎💎💎💎💎💎💎💎💎

🌺 ఓ తల్లి మనసు. ఒకప్పుడు నా ఇల్లు నవ్వులు వాదనలు అరుపులు కేకలు,అల్లరితో హడావిడిగా ఉండేది

🌺 ఇల్లంతా పెన్నులు , పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు , విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందర వందర గా ఉండేది.

🌺 నా రోజువారీ పని , అరవడం, వాళ్ళని కోప్పడ్డం , క్రమ శిక్షణ  చెప్పడం , చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది.
🌷ఉదయరాగం🌷

🌺 పొద్దున్న లేచిందగ్గరినించీ  ‘అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ, నా బూట్ లేసు పోయింది, నా హోమ్ వర్క్ బుక్ పోయింది , హోమ్ వర్క్ చెయ్య లేదు , స్కూల్ మానేస్తాను,’ ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు.
🌷నా దినచర్య🌷

🌺 విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?
🌷సంధ్యారాగం🌷

🌺 అమ్మా,?ఏదైనాపెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా, నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్నా అని వాళ్ళంటే చీకటి పడకుండా త్వరగా రావాలి, దెబ్బలు తగుల్చుకోకండి ఇవే నా గొంతు లోంచి అప్రయత్నంగా వచ్చే మాటలు .
🌷వర్తమానం🌷

🌺 ఇప్పుడు నేను అదే ఇంటిలో ,  వాళ్ళు అల్లరి చేసి కొట్టుకున్న  అరుచుకున్నచోట నిలబడి చూస్తున్నాను.

🌺 ప్రస్తుతం మా ఇంట్లో నీట్ గా సర్ది ఉన్న పక్కలు , మంచాలు , కొంచెం చిరిగిన పొట్టి అయిపోయిన బట్టల బీరువాలు , ఖాళీ అలమారాలు కానీ అప్పుడు పిల్లలు వాడిన సెంట్ల వాసన మాత్రం గాలిలో అలానే ఉంది.

🌺 ప్రతి పిల్లకి, పిల్లాడికి ఒక ప్రత్యేక సువాసన ఉండేది. ఆ వాసనలు ఇప్పటికీ నా ఖాళీ గుండెని నింపుతాయి.

🌺 ప్రస్తుతం నాకు వాళ్ళ అల్లరి ,  ఆటలు , ప్రేమతో ఇచ్చిన  కౌగిళ్లు , మధుర జ్ఞాపకాలు.

🌺 ఈరోజు మాఇల్లు ఎక్కడివక్కడ పొందికగా ఆరేసిన తడి బట్టలు , తెరవాల్సిన అవసరమేలేని చెప్పుల స్టాండ్ , శాంతి గా , ప్రశాంతంగా ఉంది. కానీ ఇది నిర్జీవమైన ఎడారి అనిపిస్తుంది.

🌺 ఇప్పుడు నేను ఎవరి మీదా అరవక్కరలేదు , ఎవరికీ ఏమీ చెప్పక్కర లేదు. అసలు మాట్లాడ్డానికే మనుషులే లేరు.

🌺 ఎప్పుడైనా నా పిల్లలువస్తే , నాతో గడిపి వెళ్లిపోతుంటే , వాళ్ళ బ్యాగ్ లు సద్దుకుంటుంటే , నా గుండెలు పిండి నట్టు అనిపిస్తుంది.

🌺 వాళ్ళు టాక్సీ ఎక్కి తలుపులు వేస్తుంటే, "వీధి తలుపులు వేసివెళ్ళండి" అని నేను అరిచిన సందర్భాలు గుర్తుకొచ్చి , కళ్ళ నీళ్లు తిరుగుతాయి.

🌺 ఈ రోజు నేనే అన్ని తలుపులు వేసుకుంటూ తీసుకుంటూ ఉంటే, పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా దేశంలోనో , విదేశాల్లోనే వాళ్ళ గమ్యాలు వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

🌺 వాళ్ళు ఎప్పటికీ నాపిల్లలు కాబట్టి , నాతోనే ఉండిపోవాలని నా స్వార్ధం చెబుతుంటే , వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, పిల్లల కోసం వెళ్ళాలిగా !

🌺 భగవంతుడా! పిల్లలందరూ ఎక్కడ వున్నా,సుఖంగా ఆనందంగా  ఉంటూ అభివృద్ధిలోకి వచ్చేట్టు చెయ్యమని రోజూ పూజా మందిరం ముందు కూర్చుని ప్రార్ధించడం తప్ప నేనేమి చేయ్యగలను?

🌺 పిల్లలు పెరుగుతూ తమ దగ్గరే ఉన్న తల్లితండ్రులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ..! వాళ్ళు మీ దగ్గర ఉండగానే వాళ్ళ అల్లరి ని ఆనందించండి, ప్రేమని ఆస్వాదించండి , ఆప్యాయత పంచండి , వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపండి.

🌺 మీ పెళ్ళికిముందు మీ అమ్మానాన్నలతో , అన్నదమ్ములతో , అక్కచెల్లెళ్ళతో గడిపారు. ఇప్పుడు వీళ్ళతో ఆనందించమని. అందరు మాతృమూర్తులకు , పితృ దేవులకు , అమ్మమ్మ నానమ్మ , తాతలకు ప్రేమతో అంకితం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment