Tuesday, November 14, 2023

రేపు (Tomorrow)

 - రేపు  --  1980వ దశకం ఆరంభంలో రేపు  అనే ఓ మానసిక సంబందిత (సైకాలజీ) మాసపత్రిక వచ్చేది.  ఒరిస్సాలో దూరప్రాంతంలో ఉండటంవలన చందాకట్టి మూడేళ్లు తెప్పించాను.  తరువాత పత్రిక ఆగిపోయింది.  కంటెంట్ అంతా సైకాలజీ రిలేటెడే.  గనుక ఎక్కువ మందికి రీచవలేదు.  రేపు  అనేది ఒక లేని విషయం.  రేపు అనేది ఎప్పటికీ రాదు.  మరుసటిరోజు (రేపు) ఇవాళ అవుతుంది.  రేపు చేద్దామనుకునే పని ఎప్పటికీ చేయలేం.  ఈరోజు చేయాల్సిన పని ఈరోజే చేయాలి.. డూ ఇట్ నౌ అంటారు.  వాయిదాకి పోకుండా.  ఇవాళ చేయగలిగిన పని రేపటికి వాయిదా వేసేమంటే ఏదైనా ఆటంకం రావొచ్చు.. వాయిదా పడొచ్చు.. ఫలితంగా నష్టం ఇబ్బంది కలగొచ్చు.  అయ్యో నిన్న చేయలేకపోయామనే బాధ పడాలి.  గనుక మన పనులు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేయకుండా చేసుకుంటూ పోవాలని మానసిక నిపుణులు అంటారు.  నిజమే అనిపిస్తుంది.  రెండు మూడు సందర్భాల్లో ఈ వాయిదాల వలన కొంత నష్టం చవిచూసిన సంఘటనలు నా లైఫ్ లో ఉన్నాయి.  రేపు పత్రికలో ప్రతీ అంశం నన్ను ప్రభావితం చేసింది.  చక్కని జీవితానికి సోపానం ఈ రేపు పత్రిక అని నిస్సందేహంగా చెబుతాను.  సైకాలజీ మీద ఇంట్రెస్ట్ పుట్టించింది ఈ మ్యాగజైన్.  సైకాలజీ టుడే అనే ఆంగ్ల మాసపత్రికను కొనేలా చేసింది.  రేపు  పత్రికలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలో, వ్యక్తిత్వ వికాసానికి  సూచనలు సలహాలు వంటి అనేక విషయాలు ఉండేవి.. అన్నీ పనికొచ్చే విషయాలే ఉండేవి.. మన భావి జీవితానికి ఎంతగానో తోడ్పడే వ్యాసాలు శీర్షికలు ఉండేవి.  చాలా ఉపయోగకరమైన పత్రిక  రేపు  మంత్లీ మ్యాగజైన్.  రేపు అనేది రాదు అని మనం అనుకోవాలి.  మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఈరోజే చేసేయాలి అనే ఆలోచన మనలో బలంగా ఉండాలి.  ఈ సూత్రం..  సక్సెస్ఫుల్ లైఫ్ కి తొలిమెట్టు..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)

No comments:

Post a Comment