Monday, April 29, 2024

బంధాలు, వాటి తాలూకు సుఖ దుఃఖ సంబంధాలు....

 🌹మనిషి జీవితం ప్రేమానుబంధాలతో నడుస్తుంది.జీవితం గడుస్తున్న కొద్ది, కాలములో కొన్ని బంధాలు కలుస్తుంటాయి. కొన్ని విడిపోతుంటాయి. కొన్ని బాధ పెడుతుంటాయి. కొన్ని ఆనంద పెడుతుంటాయి. ఈ బంధాల సంబంధాలు లేకపోతే భూమిపై మానవుని జీవితం చాలా కష్టం. కొన్ని బంధాలు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాయి. కొన్ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవటాలు సమముగా ఉన్న చోట బాంధవ్యం బాగుంటుంది. ఇరువైపులా చివరి వరకు ఆనందముగా జీవితం సాగుతుంది. కానీ ఈ సక్రమతను మనుషులు గుర్తించరు, పాటించరు. దీనివలన బంధాలను ఒక్కొక్కసారి కోల్పోవలసి వస్తుంది. ఈ ఎడబాటు చాలా బాధను కలిగిస్తుంది. కాని ఇటువంటి వారితో కలసి ఉండటం అంతకంటే దుఃఖముగా ఉంటుంది.జీవితం ఇంతే... ఇలాగే సాగుతుంది... ఎంత ఓర్చుకున్నా - నేర్చుకునేది ఉన్నంత కాలం సృష్టి ఆటలో మన జీవిత నడక ఇలాగే సాగుతుంది. బంధాలు,  వాటి తాలూకు సుఖ దుఃఖ సంబంధాలు - అంతరంగములో అంటించుకున్న అనుబంధాల ముద్రలు. ఇవి మనిషిని నిరంతరం కదుపుతూనే ఉంటాయి. అది సుఖమో, దుఃఖమో ఈ సంభంధ బాంధవ్యాల కదలికలు లేకపోతే జీవితమే లేదు. ఈ కదలికలు మన వైపు నుండి వీలున్నంత మంచిగా కదపటం తప్ప మన చేతిలో ఏమి లేదు. ఈ సత్యాన్ని గ్రహించి మనతో ఉన్న బంధాలన్నిటికీ పంచగలిగినంత ప్రేమను, మంచిని పంచటమే ఆధ్యాత్మికత. బంధాలు అంటే కుటుంబం మాత్రమే కాదు - నీకు తెలిసిన అందరూ, నువ్వు తెలిసిన అందరూ...
మంచి మనం మాత్రమే చేయగలిగినది... చేయించటం కుదరదు... 🌹god bless you 🌹

No comments:

Post a Comment