Sunday, June 30, 2024

*****స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే

 🍁 *స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే*🍁

✍️ మురళీ మోహన్ 
👌ఒక రోజు ఆది శంకరాచార్యులు 
శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది. 

శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా. 
లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా?’ అని అడిగారు.
.
శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ‘గురువర్యా! తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది. 
మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు. 
ఆవు ఎక్కడికి వెళ్లినా అతణ్ని అనుసరించాలి. 
మనిషి యజమాని, ఆవు బానిస’ అని చెప్పారు.

ఇప్పుడు చూడండి’ అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది. 
యజమాని దాని వెంట పరుగుపెట్టాడు.

అప్పుడు శంకరులు ‘శిష్యులారా! ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికీ ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. 

మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు. 
మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం. 
వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి. 
అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్లిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే’ అని బోధించారు శంకరులు.🤘

***"మరణం - పునర్జన్మ : ప్రశ్నోపనిషత్ 3 వ ప్రశ్న

 మరణం - పునర్జన్మ : 

ప్రశ్నోపనిషత్ 3 వ ప్రశ్న 

9) మం. తేజో హ వా ఉదానస్తస్మాదు పశాంతతేజాః పునర్భవ మింద్రియైర్మ నసి సంపద్యమానైః 

నిజంగా తేజస్సే ఉదానం అనే వాయువు. తేజస్సు అంటే అగ్ని. అగ్నిలో వేడి వెలుగు రెండూ ఉంటాయి. కాబట్టి సూర్యుని తేజస్సులో ఉండేది ఉదానమే. 
ఎవరిలో యీ ఉదానము శాంతించి పోతుందో (వేడిమి తేజస్సు తగ్గి పోతాయో) అట్టివారు మనస్సులో విలీనమైయున్నట్టి ఇంద్రియాలతో సహా మరియొక శరీరాన్ని పొందటానికి పోతారు. అంటే ఉదానం శాంతించటంతోనే చనిపోతారు. అప్పుడు వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమై పోతాయి. ఆ మనస్సు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందటానికి పోతుంది.

10) మం. యచ్చిత్త స్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః॥ సహాత్మనా యథాసంకల్పితం లోకం నయతి 

మరణ కాలంలో మానవునికి ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనతో సహా అతడు (జీవి) ముఖ్య ప్రాణమును పొందుతాడు. ఆ ముఖ్యప్రాణమే అగ్నితో (ఉదాన వాయువుతో) కలిసి జీవాత్మను సంకల్పానుసారమైన కోరికలకు అనురూపమైన) లోకాలకు తీసుకుపోతుంది.

(మానవుని ఆత్మ అయిదు కోశాలతో ఆవరింపబడి ఉంటుంది.  1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. విజ్ఞానమయ 5. ఆనందమయ కోశాలు

i) అన్నమయకోశం ఈ స్థూలశరీరం.

ii) ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ కలిసి సూక్ష్మశరీరం.

iii) ఆనందమయకోశం కారణ శరీరం.

జీవించి ఉండటమంటే ఆత్మ కారణశరీరంలో, కారణశరీరం సూక్ష్మ శరీరంలో, సూక్ష్మశరీరం స్థూలశరీరంలో ఉండటం. మరణించటం అంటే స్థూలశరీరం నుండి సూక్ష్మకారణ శరీరాలు రెండూ వేరైపోవటం, మరొక జన్మ కలగటానికి ఇట్లా వేరైపోయిన సూక్ష్మశరీరమే కారణం. కాబట్టి, మరణ సమయంలో ఏ మనోభావంతో ఉందో ఆ మనోభావంతోనే జీవాత్మ ప్రాణమయ కోశం వద్దకు వస్తుంది - పునర్జన్మను పొందుతుంది).
 "జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 1వ భాగము.
''ముండక ఉపనిషత్తు'' లేదా ''ముండకోపనిషత్తు'' అధర్వణ వేదములోనిది. ప్రాచీన ఉపనిషత్తులలో ఇది ఒకటి. తలపైనున్న జుట్టును పూర్తిగా తీసివేయుటకు ఉపయోగించే కత్తిని "ముండకము" అని అంటారు. జుట్టును అజ్ఞాన చిహ్నంగా భావించి పూర్తిగా దానిని తొలగించి, సర్వసంగపరిత్యాగిగా జీవించు వానిని "ముండకుడు" అంటారు. ఈ ఉపనిషత్తులో "బ్రహ్మవిద్యకు" అంటే "ఆత్మవిద్యకు" ఎక్కువ ప్రాధాన్యత యివ్వడం జరిగింది. ఇందులో భాగాలను ముండకములని, అవాంతరభాగాలను ఖండములని విభజించుట జరిగింది.
శాంతిమంత్రము :
ఓ యజ్ఞప్రియులైన దేవతలారా! ఎల్లప్పుడూ మేము మంచి మాటలనే విందుముగాక! మంగళకరమైన వాటినే చూచెదముగాక! పరిపృష్టి గల అవయములతో మిమ్ములను స్తోత్రము చేయుదుముగాక! మీ చల్లని దీవెనలతో దీర్గాయుర్దాయమును పొందెదముగాక! కీర్తిగల ఇంద్రుడు, అంతా నెరింగిన ఆదిత్యుడు, ఆపదలను రూపుమాపు గరుత్మంతుడు, దేవగురువైన బృహస్పతి మాకు శుభమును ప్రసాదించెదరుగాక! ఓం శాంతిః శాంతిః శాంతిః.
ఉపోద్ఘాతము :
గృహస్థాశ్రమంలో నున్న (సంసార జీవితాన్ని అనుభవిస్తున్న) శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షిని, స్వామీ! ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అంగిరసడు, శౌనకునికి "పరావిద్య" మరియు "అపరావిద్య" అనే రెండు విద్యలను బోధిస్తాడు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమైన ధర్మాధర్మము లకు సంబంధించిన జ్ఞానం. ఈ రెండింటిలో పరావిద్య శ్రేష్టమైనదని, దాన్ని జ్ఞానంతో గ్రహించువాడు ఈ సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడని బోధిస్తాడు.
ఆ విశేషాలను తదుపరి భాగంలో పరిశీలిద్దాము.. 🙏🏻

*********మిహిత పుబ్బాంగమ, భగవాన్ బుద్ధుడు నిత్యం చిరునవ్వుతో ఉండే వ్యక్తి.బుద్ధుడిని సహచరులు "మిహిత పుబ్బంగమా" అని బుద్ధుడిని పిలిచేవారు.ఆ మాటకు అర్థం “నిత్యంచిరునవ్వుతో” ఉండే వ్యక్తి అని.

 *మిహిత పుబ్బాంగమ*
                  
*భగవాన్ బుద్ధుడు నిత్యం చిరునవ్వుతో ఉండే వ్యక్తి.బుద్ధుడిని సహచరులు "మిహిత పుబ్బంగమా" అని బుద్ధుడిని పిలిచేవారు.ఆ మాటకు అర్థం “నిత్యంచిరునవ్వుతో” ఉండే వ్యక్తి అని. బుద్ధుడు ఏనాడూ విచార వదనంతో లేరు.బుద్ధుడు విగ్రహాలు కాని, చిత్రాలు కాని మనం చూస్తే ఎక్కడా విచార వదనంతో,అందోళనతో,బాధ కాని ఆవేదన కానీదుక్ఖంతో కూడి ఉండినట్లు కానీ కనబడవు.అలాగే బౌద్ధ ఆరామాలు కూడా ఎంతో ప్రశాంతంగా,నిర్మలంగా ఉంటాయి.అక్కడి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.* 

*బౌద్ధం వ్యాకులతకు,విచారానికి,ఉదాసీనతకు,ఆవేదనతో కూడిన దృష్టికి పూర్తిగా వ్యతిరేకం.సత్యాన్ని కనుగొనడానికి ఈ భావనలే ఆటంకాలు.జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కోవోవాలో భగవాన్ బుద్ధుడు చెప్పారు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను గురించి ఆలోచిస్తూ జీవితాన్ని దుక్ఖమయం అని తెలుసుకోవాలి అని బుద్ధుడు చెప్పారు.*

      *బౌద్ధులకు పాపులమనే ఆత్మ న్యూనతా భావం లేదు.బుద్దుడు చెప్పినట్లుగా గతం పట్ల విచారం కానీ,భవిష్యత్ కోసం వెంపర్లాడ లేకుండా ఇప్పుడు ఇక్కడ ఏముందో దానితోనే జీవించాలి.అలా ఎవరు అయితే జీవిస్తారో వాళ్ళు ప్రశాంత వదనంతో కాంతి తో ప్రకాశిస్తారు.అలా బౌద్ధ భిక్ఖులు జీవిస్తారు.గృహస్తులు కూడా పూర్తిగా బౌద్ధులు అయితే వాళ్ళు కూడా జీవిస్తారు.ముఖ్యంగా బౌద్ధ భిక్ఖులు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ వ్యాకులత చెందకుండా ,శాశ్వతంగా వర్తమానంలో అంటే ప్రస్తుతంలో జీవిస్తూ సుఖ సంతోషాలు పొందుతారు.*
       *కోసల రాజు ప్రసేన్ జిత్ ఒకరోజు బుద్ధునితో మాట్లాడుతూ,ఇతర గురువులు వారి శిష్యులు వాడిపోయి,బక్కచిక్కి,పాలిపోయి,వికారంగా ఉంటారు.అదే భగవాన్ బుద్ధుని శిష్యులు ఆనందం తొణికిసలాడుతూ,ఉల్లాసంగా,ఆహ్లాదంగా,సంతృప్తి చెందిన ఇంద్రియాలతో,ఆందోళన లేకుండా నిర్మలంగా,ప్రశాంతంగా,జింకల వలె తేలికపాటి హృదయంతో ఉంటారని అన్నారు.బౌద్ధులు పవిత్ర జీవితాన్ని సాధ్యమైనంత మేరకు గడుపుతూ అందరికంటే సుఖంగా జీవిస్తారు.నిజమైన బౌద్ధులు అయితే ఎప్పుడూ ఆనందంతో ,ఉత్సాహంతో ఉంటారు.అత్యంత సుఖమైన జీవితాన్ని ఇతర మతాల వారి కంటే బౌద్దులే గడుపుతారు.బౌద్ధులకు భయాలు,ఆందోళనలు ఉండవు.ఎప్పుడూ ప్రశాంతతను కోరుకుంటారు,అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కాంక్షిస్తారు.ఉన్నది ఉన్నట్లు చూసేవారు బౌద్ధులు.ఎలాంటి కష్టాలు వచ్చినా తలక్రిందులు అవరు.జీవితంలో దుక్ఖం సహజం.ఈ జీవితం పట్ల వ్యాకులత అనవసరం.కోపం అసహనం ఉండకూడదు.ద్వేషం అవలక్షణం అని బౌద్ధం చెబుతుంది. ప్రతీఘ అనగా జీవుల పట్ల,దుక్ఖం పట్ల,దుక్ఖానికి సంబంధించిన విషయాల పట్ల కలిగే ద్వేష భావన.ఈ ద్వేష భావన వలన మనలో చెడు ఆలోచనలు మొలకెత్తి చెడు ప్రవర్తనకు దారి తీస్తుంది.కాబట్టి దుక్ఖం పట్ల కోపాన్ని గానీ అసహనాన్ని గానీ కలిగి ఉండరాదు.ఈ దుక్ఖం గురించి సరిగా అర్థం చేసుకోవాలి.దుక్ఖం ఎలా వచ్చింది,ఈ దుక్ఖాన్ని ఎలా రుపుమాపుకోవాలి అని మనం తెలుసు కోవాలి.దీని కోసం మనం తెలివిగా ,సహనంగా గట్టి సంకల్పాన్ని అలవర్చుకోవాలి.*

    *”ఎవరు దుక్ఖాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారో వారు దుక్ఖ సముదాయాన్ని,దుక్ఖ నిరోధాన్ని,దుక్ఖ నిరోధ మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.” అని బుద్ధుడు చెప్పారు.బుద్దుడు  దుక్ఖం గురించి చెబుతూ ఇలా అంటారు “దుక్ఖం శ్రద్ధకు ,శ్రద్ధ ప్రమోదానికి,ప్రమోదం ప్రీతికి,ప్రీతి ప్రశాంతతకు,ప్రశాంతత సుఖానికి,సుఖం సమాధికి,సమాధి వస్తువుల యథాతథ జ్ఞానానికి,దర్శనానికి దారి తీస్తాయి.వస్తువుల యథాతథ జ్ఞాన దర్శనం భోగాల నిరాకరణకు ,భోగాల నిరాకరణ విరాగానికి,విరాగం విముక్తికి,విముక్తి తృష్ణాక్షయ జ్ఞానానికి అంటే అర్హంతత్వానికి దారి తీస్తాయి.”*

*నీవు చేసిన చెడు పనులే నీ దుక్ఖానికి కారణం.ఇతరుల నుండి కూడా దుక్ఖం కలుగుతుంది. ఇతరులు మనల్ని పీడిస్తే ఆ పీడించే వ్యక్తి తన స్వార్థం కోసం తపిస్తాడు. అతనికి ఆ పీడించడంలో కలిగే సంతోషం కొంత కాలం మాత్రమే. వాస్తవానికి అది సంతోషం కాదు.*

*మన ఆలోచనల ఫలితంగానే మన జీవితం తయారవుతుంది. గడచిన కాలంలో వచ్చిన ఆలోచనల ఫలితమే నేడున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నాడు బుద్ధుడు.అందువల్ల ఈ రోజు మనం చేయగలిగే పనులను సరైన ఆలోచనలతో చేయగలిగితే రేపు సహజంగానే మంచిగా ఉంటుంది. ఆ మనిషి గురించి తెలిపేది అతని మాటలవల్ల, అతని చేష్టలవల్ల. మాట కత్తికన్నా పదునైనది. అందుకే బుద్ధుడంటాడు "* *నాలుక ఒక పదునైన చాకు లాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు*". *పదాలకున్న శక్తి అపరిమితం. అవి మనసును విరిచేయగలవు, లేదా మనసును పరిమళింపచేయగలవు. పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు. అందుకే మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. మంచిమాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయంటాడు బుద్ధుడు.*

*మనిషి తన జీవిత కాలంలో ఉన్నతుడు కావాలంటే తన చరిత్రను, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి మరియు ప్రజల సమిష్టత్వంతోను అంటాడు బుద్ధుడు. ఒక పువ్వు ఎలా తానే వికసించి, పరిమళిస్తుందో, అందరికి అందాన్ని, సువాసనను వెదజల్లుతుందో అలాగా మనిషి కూడా తన్నుతాను మార్చుకుంటూ పదిమంది మార్పుకు దోహదం చేయగలగాలని బుద్ధుడు మానవాళికి బోధించారు.*
................................................🌳

*🍀ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించే వారిలో నేను కూడా ఒకణ్ణి.☘️ -తథాగత గౌతమ బుద్ధుడు*


*మనిషి జీవితంలో సంతోషం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంతోషం లేని మనిషి వేటి మీదా ఆసక్తి కనబరచలేడు.నిద్ర సరిగ్గా పట్టక సతమతమవుతాడు బ్రతకడం ఒక భారంగా భావిస్తాడు. ప్రతి క్షణం ఆ మనిషి జీవితం కడు బాధాకరంగా మారుతుంది. మనిషి సంతోషాన్ని ఒక్కోదాంట్లో వెతుక్కుంటూ ఉంటాడు.చివరకు ఆ సంతోషం లభించక మదనపడతాడు. ఆందోళన చెందుతాడు.తప్పిదాలు కూడా చేస్తాడు.*
   *తథాగతుడు సంతోషాన్ని పొందడం ఎలా అనేది బోధించారు. ఈ ప్రపంచం సంతోషం కోసం ప్రాకులాడుతుంది.ఈ వాస్తవాన్ని బుద్ధుడు గుర్తించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మన గురించి కూడా మనం ఏమిటన్నది తెలుసుకోవాలి అని భగవానుడు చెప్పారు. సమాజంలో పరిస్థితి పట్ల పూర్తి ఎరుకతో మనం మసలుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు.*
  *ఇష్టం లేని ఉద్యోగం చేయాల్సి రావడం, ఇష్టం లేని భర్త లేదా భార్యతో  కొందరు జీవించాల్సి రావడం వలన అలాగే సమాజంలో కులం కారణంగా కోరుకున్న అతను లేదా ఆమెతో జీవించలేని పరిస్థితి దాపురించడం వలన జీవితం దుక్ఖమయం అవుతుంది. జీవితంలో రుచి ఉండదు.మానసికంగా బాధ అనుభవించాల్సి వస్తుంది. ఇదే దుక్ఖం. ఈ దుక్ఖం పట్ల కోపం ,ద్వేషం సహజంగా మనిషిలో కలుగుతుంది. ఈ దుక్ఖం మనిషి లో ఆందోళన, వ్యాకులత కలిగిస్తుంది. మనిషి దుక్ఖం పట్ల అసహనాన్ని ,ఆందోళనను ,ద్వేషాన్ని కలిగి ఉండరాదు అని బౌద్ధం చెబుతోంది. దుక్ఖం పట్ల ద్వేషం పెట్టుకోవడం వలన దుక్ఖం సమసిపోదు. మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది అని బౌద్ధం చెబుతోంది. దీనికోసం తెలివితో ,సహనం తో వ్యవహరించాలని బౌద్ధం చెబుతోంది.*

  *భగవానుడు సుఖ సంతోషాలు గురించి చెబుతూ సుఖసంతోషాల కోసం నేరుగా వెంపర్లాడటం వలన అవి మనకు లభించవని తెలియజేసారు. ఎవరైతే వ్యక్తిగత కోరికలు సంతృప్తి పరచుకోవాలి అని తాపత్రయ పడతారో వాళ్ళు చిక్కుల్లో పడతారు. వ్యక్తిగత కోర్కెలను తీర్చుకోవాలని అదే పనిగా మనిషి జీవించడం ధర్మం కాదని భగవానుడు చెప్పారు. జీవితంలో కష్టాలు అనివార్యంగా వస్తుంటాయి పోతుంటాయి.ఈ కష్టాలను ఎవరైతే ఎదుర్కొంటూ ముందుకు సాగుతారో వాళ్ళు మహత్తరమైన ఆనందాన్ని పొందుతారు అని బుద్ధుడు చెప్పారు. ఉన్నది ఉన్నట్లు చూడటం వలన ఆనందం లభిస్తుంది. మనలో ఎలాంటి ఆందోళన, వ్యాకులత కలుగదు. ఎంతటి కష్టాలు వచ్చిన చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ గొప్ప ఆనందానుభూతిని పొందవచ్చు. దానికి భగవాన్ బుద్ధుని జీవితం ఒక ఉదాహరణ.బుద్ధుడు రాజ్యాన్ని, సకల సుఖాలను త్యజించారు. జ్ఞానోదయం కోసం ఏడు సంవత్సరాల పాటు ఎన్ని కఠిన పద్ధతులు అవలంభించారో.ఎంతగా కష్టాలు పడినారో అంత మాత్రాన ఆయన ఆనందం పొందకుండా ఉన్నారా? లేదు కదా ఆయన ఈ కష్టాలను ఎదుర్కొంటూ మహత్తర ఆనందానుభూతిని పొంది మనకు ఆ ఆనందాన్ని పొందే మార్గాన్ని గురించి బోధించారు.*

   *బౌద్ధులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఉండాలి కూడా. యథాభూత జ్ఞానం కలిగి ఉంటే ఇది మనకు కూడా సాధ్యమే.బౌద్ధ భిక్ఖువులు చాలా స్వచ్ఛమైన మనసు తో ఉంటారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటారు.భిక్ఖువుల ఇంద్రియాలు కూడా వేటి వేటి కోసమో వెతకడం జరగదు.వాళ్ళ ఇంద్రియాలు సంతృప్తి చెంది ఉంటాయి. భిక్ఖువులు ఇంత సంతోషంగా ఎందుకు ఉంటారు అంటే బుద్ధ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వలనే.బుద్ధ ధర్మాన్ని స్వయంగా అనుభూతి చెందుతూ ఆనందంగా ఉంటారు.*

*మానవ జీవితంలో సుఖం, దుక్ఖం సహజం...మనుషులు దుక్ఖం వస్తే తట్టుకోలేరు,సుఖం వస్తే ఎంతగానో ఆనందిస్తారు.ఒక నాణేనికి రెండు వైపులా సుఖం, దుక్ఖం ఉంటాయి. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండరు.కుటుంబం, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి ఉంటారు.మనిషి ఒక సామాజిక జంతువు.మన జీవితంలో కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో మనం విచారంగా ఉంటాం.నిరాశకు లోనవుతాం..ఇలాంటి సమయంలోనే మనిషిలో నైతికత దెబ్బ తినడానికి అవకాశం ఏర్పడుతుంది. మన జీవితంలో ప్రతిసారీ సంతోషం ఉండాలి అని అనుకోవద్దు. భగవాన్ బుద్ధుడు చెప్పిన ఈ మాటలను మనం సదా మననం చేసుకోవాలి. "చింతించకు నేను పర్వతంలా నీ వెనుక నిలబడి ఉన్నాను."*

*మనం జ్ఞానం వైపు నడవాలి, వినయాన్ని అలవర్చుకొని జీవించాలి. అప్పుడే దుక్ఖానికి లోనుకాకుండా జీవించగలం.బుద్ధ భగవాన్ చెప్పిన మాటలను ఆచరించడం ద్వారా  ఆనందం మన సొంతం అవుతుంది.శాంతిని అనుభవించగలం.*

*బుద్ధ భగవాన్ చెప్పినట్లు "పెద్ద పెద్ద శారీరక రోగాలన్నీ మానసిక రోగాల నుండే పుట్టుకొస్తాయి.  అన్ని మానసిక రోగాలు రాగ ద్వేషాల వల్లే జనిస్తాయి." కాబట్టి మనం మనసులో ఎలాంటి చెడు బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉందాం...*

*✍🏽అరియ నాగసేన బోధి*

*🌻భవతు సబ్బ మంగలమ్🌼☸️🌼🪷*

****మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.._

 *మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.._* 
ఆర్మీ అధికారికి  ఓ వ్యక్తి దగ్గర  నుండి  లేఖ వచ్చింది.*_ 
అందులోని విషయం ఇలా ఉంది ..._* 
అయ్యా!_* 
నా పేరు  సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా  పని చేస్తూ  రిటైర్ అయ్యాను.*_ 
 _*నా కొడుకు ఆర్మీ లో  ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం  లో వీరమరణం  పొందాడు.*_ 
 _*ఈ ఏడాది అతను  ప్రాణాలు విడిచిన  చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి  చూస్తున్నాము.*_ 
 _*అనుమతి ఇస్తే సంతోషము , అలా కుదరదు  మీ ఉద్యోగాలకు ఏదైనా  ఇబ్బంది కలుగుతుంది  అనుకుంటే  వద్దు  అని ముగించారు.*_  

 _*ఆ ఉత్తరం  చదివాక  ఆ అధికారి కళ్ళు  తడిచాయి  వెంటనే  వారిని  ప్రభుత్వ  ఖర్చులతో  పిలిపించండి.*_  _*అలా ఒకవేళ  ప్రభుత్వం ఖర్చు  పెట్టకపోయినా  సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు.*_  

 _*ఆ వృద్ధ  దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా  వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు.*_ 

 _*ఎందుకు బాబు నువ్వు మాత్రం  ఇలా నువ్వు ఎంత  పెద్ద  అధికారివి  అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు.*_  

 _*అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన  వారు నేను మీ అబ్బాయితో  కలిసి పని చేసాను.*_ 
*అని ఒక నిమిషం  మాటలురాక నిలబడిపోయాడు.*  
 _*పర్లేదు బాబు ఏ విషయమైనా  ధైర్యంగా  చెప్పు నేను ఏడవను అని చెప్పాడు.*_ 
 _*మీరు కాదు నేను ఏడవకుండా  ఉండాలి  కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం  మొదలుపెట్టాడు.*_  

 _*ఆనాడు పాకిస్థానీలతో  యుద్ధం జరుగుతున్నది  మా దగ్గర*_ _*ఆయుధాలు* *అయిపోవడంతో నేను డెత్* *ఛార్జ్ తీసుకుంటాను అని*_ _*ముందుకు  వచ్చాను.*_ _*అప్పుడు మీ కొడుకు నన్ను లాగి*_ 
 _*నీకు పిచ్చా నీకు పెళ్ళై  ఇద్దరు పిల్లలు ఉన్నారు.*_ 
 _*నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను  అని ముందుకు వెళ్లి  ఆ తూటాలను  తన శరీరంలో తీసుకున్నాడు.*_  
 _*శత్రువులను 13 మందిని చంపి  ఇక్కడే మరణించాడు.*_ 

 _*అతడిని మొదటగా పట్టుకున్నది  నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు  పోయింది*._  _*శరీరంలో 42 తూటాలు  ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు.*_  
 _*అక్కడ వింటున్న  తల్లి తన చీర  కొంగును అడ్డుపెట్టుకుని  ఏడ్చేసింది.*_  

 _*ఆరోజు  నేనే శవాన్ని  తీసుకురావలసింది  దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది  కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు  అతడి కాళ్లపై వేయాల్సిన  ఈ పూలు ఇలా వేసి  నా ఋణం  తీర్చుకుంటున్నాను  అని అన్నాడు.*_ 

 _*బాబు నా కొడుకు పుట్టినరోజుకు  వస్తాడని  బట్టలు కొనిపెట్టాము  కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ  వదిలి  పెట్టాలని తెచ్చాము  కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని  అర్థం అవుతున్నది.*_ 
 _*నీకు అభ్యన్తరం  లేకపోతే  తీసుకో బాబు  అని అతనికి  ఇచ్చి  ఎంతో  గర్వంతో  వెనుకకు  తిరిగారు  ఆ తల్లితండ్రులు.*_  

 _*ఇలాంటి కథలు  వాస్తవాలు  ఇంకెన్నో*_  
 *ఇవేవి మనకు తెలియవు  మనం ఆలోచించను  లేము*  
 *రాజకీయనాయకుడికి పాలాభిషేకం  చేసుకుంటూ*_  
 _*నటించే హీరోలకు  భారీగా         కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని  మన సమయాన్ని మన విలువని  పోగొట్టుకుంటున్నాము.*_  

*ఇలాంటి వీరజవాన్ల ఎంతో మంది  మనం బాగుండాలని  వారి ప్రాణాలను  త్యాగం చేస్తున్నారు.* 
 _*కనీసం మనం గుర్తించలేక  పోతున్నాం*_ ..

*****పెళ్ళిళ్ళ........సరదాలు......సంబరాలు....

 🚩పెళ్ళిళ్ళ........సరదాలు......సంబరాలు....🌷
👉🏿అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి తల్లి
‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. అంతే!
వాడి అల్లరి అటకెక్కిపోతుంది. చేతులు కట్టుకుని మరీ
నిలబడతాడు. అదీ పెళ్లి అనే మాటకున్న శక్తి!
😂
👉🏿 పెళ్లి నూరేళ్ల పంట
అంటారు. ‘కాదు... కాదు నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు ఆడవాళ్లు. అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం.
👉🏿పెళ్లి సరసాలకు మూలం. సరదాలూ ఉంటాయి. ‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. నిజమే దంపతులు ఒకరికొకరు మానసికంగా తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు. ‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.
👉🏿‘అప్పగింతలవేళ అమ్మాయికది ఆఖరి ఏడుపు. అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే అయినప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు?
👉🏿
ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. అసలు సమస్య అదే!
👉🏿‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. సాక్షాత్తూ బ్రహ్మకే
నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది.
👉🏿'మా ఆయనకు హృదయం లేదు’ అని మరొకావిడ
పతిదేవుణ్ని తూలనాడుతుంటుంది.
అది అన్యాయం! విష్ణుమూర్తికే సొంతానికి హృదయం లేదు.
దానిని లక్ష్మీదేవి ఎప్పుడో ఆక్రమించేసింది.
👉🏿‘మా ఆయన ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది.
ఏం చేస్తాం? శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే!
ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ.
🚩ఇన్ని నిజాలు తెలిసీ భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు.
సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే.
👉🏿‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు.
పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి.
చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు.
👉🏿హెల్మెట్టూ భార్యా ఒకే రకం. నెత్తిన పెట్టుకుంటే తలకాయకు బోలెడంత భద్రత అని ఒకాయన స్వానుభవంతో ఉపదేశించాడు.
👉🏿పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, ఉత్తమంబు.
👉🏿వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును
శిష్యుడొకరు ‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు.
ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా.
శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు?
మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు.
అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.
దాంతో సోక్రటీసు ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు.
భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు.
కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.
👉🏿దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు?
ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు.
భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? ఎన్నెన్ని ఘోరాలు?
ఎన్నెన్ని నేరాలు?
శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే.
👉🏿ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.
అయినప్పటికీ ‘వివాహం ప్రకృతి, వివాదం వికృతి’ అని వెనకటికి ఒకాయన ‘పెళ్లి’కిలించాడు. కానీ ఈ వివాదం సంతోషం సృష్టించాలి. సంతోషం దాంపత్యానికి సగం బలం- కాదు కాదు సంపూర్ణ బలం.
ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే.
👉🏿పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.
👉🏿భార్యాభర్తలన్నాక ఎక్కసక్కెమాడుకోకపోతే ఏం మజా?
‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని,
కడిగినప్పుడు నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్యను అడిగాడు.
ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. దాంతో మొగుడు కంగుతిన్నాడు.
👉🏿ఆ మాటకొస్తే అతివ అంటే ఎక్కువగా మాట్లాడు వ్యక్తి అనేదే పిండితార్థం. పండితార్థం.
👉🏿మూడు ముళ్లయినా, ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే!
దానికి సాటీ లేదు! పోటీ లేదు.

వింజమూరి

****తల్లిదండ్రుల యొక్క బాధ్యత?

 తల్లిదండ్రుల యొక్క బాధ్యత?

సుపుత్రో సప్తమోరసః అనే నానుడి.  అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం.  పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి.  మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి.  కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి.
మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులు గా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.
 "కొన్ని జన్మల నుండి 'వాసనాబలము. తరుముకు వస్తు ఉటుంది. శరీరం వదిలి పెట్టేసినా మనసు అదే కాబట్టి ఆ వాసన జీవుని పట్టుకుంటుంది. దీనిని అధిగమించడానికి వీలుగా ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే మనకు బుద్ధిని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలమును గెలిచే ప్రయత్నమును మీరు చేయుట...

**** *🌹వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

 *🌹వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా?🌹*

             *పీఠాధిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు,వింటే చాలు. మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.*

              *మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది.ఆ పాటలోఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు. అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటి బిడ్డకి.*

           *సనాతన ఋషులు తాము దర్శించిన సత్యాన్ని మనకి అటువంటి అమ్మలాలిపాట లాగా వేదాలలో నిక్షిప్తం చేశారు. సంస్కృత భాషలో ఉన్న వేదం తప్పు లేకుండా చదవగలిగితే,స్వరాలతో సహా పొల్లుపోకుండా గానం చేయగలిగితే, ఈ ప్రకృతే పరవశించిపోయి వింటుంది.*

          *అడవిలోని మృగాలు కూడా ఆ ధ్వని తరంగాలకు ముగ్దులై బద్దులై పరవశిస్తాయి. క్రూర మృగాలు సైతం తమ సహజ ప్రవృత్తిని మార్చుకొని సాత్వికంగా ప్రవర్తిస్తాయి. ఇది నిరూపితమైనది.* 

             *మన పురాణాలలో ముని ఆశ్రమాల గురించిన పలు వర్ణనలలో ఈ విషయాన్ని చెప్పారు కూడా ! ఇక, బుద్ధిలేని జీవులే అలా బుద్ధికలిగి ప్రవర్తించినప్పుడు కేవలం వేదాన్ని వినడం చేత బుద్ధి జీవులలో విజ్ఞాన వీచికలు పరిమళించవా?*

             *వేదమంత్రాన్ని పలకడం , లేదా అలా వేదశబ్దం ధ్వనిస్తున్న ప్రదేశంలో ఉండడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు మన పరిశరాలనీ , వాతావరణాన్నీ ప్రభావితం చేస్తాయి.*

           *ఆ శబ్దం బ్రహ్మం అవుతుంది. ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మన చుట్టూ రేడియో తరంగాలు, AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV తరంగాలు ఉంటాయని తెలిసిన విషయమే.*

             *లేకపోతె మనం రేడియోలు, టీవీలు , సెల్ ఫోనులు ఆపరేట్ చేయలేము కదా ! ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు వాటి వాటి నిర్దుష్ట ఫ్రీక్వెన్సీ (frequency)తో మనను చుట్టుముట్టి వుంటాయి.*

            *ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి.*

            *ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది.ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి.* 

             *ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొలగిస్తాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం అనే రిసీవర్ ద్వారా కేవలం మంచికి సంబంధించిన తరంగాలు మన మెదడుకు అందుతాయి.*

              *తద్వారా మన బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యంమాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తాయి. అటువంటప్పుడు అదే మంత్రం మరిన్ని సార్లు మనమే కనుక చదవగలిగితే, ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలుగుతాము.*

                 *మరింత శక్తియుతంగా  ఆ పాజిటివ్ శక్తిని మనం గ్రహించగలుగుతాము. ఉదాహరణకి, ఒక గదిలో చెడువాసన వస్తోంది. అక్కడ గుగ్గిలంతో పొగ వేశారంటే, ఆ ప్రాంతమంతా చక్కని సువాసనతో నిండిపోవడంతో పాటు అక్కడున్న సూక్షమ క్రిములు కూడా బయటికి వెళ్లి , ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కదా ! ఇది కూడా అలాగన్నమాట !!*

            *కాబట్టి వేదమంత్రాన్ని, మంత్ర పాఠాన్ని అర్థం తెలియకుండా, కేవలం విన్నప్పటికీ కూడా ఫలాన్ని అందిస్తుంది. పురాణాలలో ఈ కథని విన్నా చదివినా అనంతమైన ఫలం దక్కుతుంది. అంటాను భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. అని చెబుతుంటారుకదా !*

             *అటువంటిది , ఆ భగవంతుని వ్యక్తీకరణని వివరించే వేదాన్ని వింటే ఫలం దక్కదా !! చక్కగా వేదం శ్రవణం చేయండి. ఏదైనా శుభకార్యక్రమాలు ఉన్నప్పుడు వేదం పండితులని ఆహ్వానించి వేదాశీర్వాదాము తీసుకోండి.*

         *సర్వేజనాః సుఖినోభవంతు !!* 

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

****ఎవరు ధన్యులు?

 ఎవరు ధన్యులు?

(శృ౦గేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి బోధలు)

వరమభయముదారం పుస్తకం చాక్ష హారం
మణివలయ మనోజ్ఞై: పాణి పద్మైర్దధానా!
సిత వసనలలామా కుంద ముక్తాభిరామా
వసతు శశి నిభాస్యా వాచి వాగ్దేవతా నః!!

ప్రతి ఒక్కడికీ తనయొక్క జీవనం పవిత్రంగా జరగాలి. తాను ఇంకా ఉత్తమమైన స్థితిని పొందాలి. తన జీవనం వ్యర్ధం కాకూడదు.చాలా దుర్లభమైనటువంటిది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ మానవ జన్మ దొరికింది. దీనిని వ్యర్ధం చేసుకోకూడదు అనే భావన సహజంగానే ఉంటుంది. ఈభావనకు తగినట్లు మనం ఎలా నడుచుకోవాలి? మన జీవనాన్ని ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి? ఏది మనకు శ్రేయస్కరం? అనే ప్రశ్నకు మనయొక్క ధర్మ గ్రంథాలు అనేకమైనటువంటి విస్తృతమైన రీతిలో జవాబులు చెప్పాయి. ఉపనిషత్తులు చూచినా భగవద్గీతను చూసినా, ధర్మ శాస్త్రాలు పరికించినా ఈ ప్రశ్నలకు మనకు జవాబులు దొరుకుతాయి. కానీ వాటన్నిటినీ విస్తారంగా చూసి తీర్మానించుకో దగ్గ శక్తి మనకు లేదు. ఎవరో మహాత్ములు వేదశాస్త్రములందు ప్రజ్ఞ కలిగినటువంటి వారు వాటిని చూసి తెలుసుకోగలిగినప్పటికీ సామాన్యులమైన మనకు అంత ప్రజ్ఞ, ఆ విశేషమైన శాస్త్రార్ధం చూసి సారభూతమైన విషయాన్ని గ్రహించుకోదగ్గ శక్తి లేదు గనుక భగవత్పాద శంకరుల వారు అటువంటి విషయాన్ని అత్యంత సరళమైన రీతిలో మనకు ఉపదేశించారు.

వేదాంతములందు, శాస్త్రములందు, నిగూఢ౦గా ఉన్న విషయాల్ని గహనంగా విషయాల్ని, సరళంగా మనకు తెలియజెప్పి ఈవిధంగా మనం ఉంటే మన జన్మ ధన్యమవుతుంది అని సెలవిచ్చారు. వారియొక్క అమూల్యమైన వచనములను మనం తెలుసుకోవాలి, మననం చేయాలి, ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మనయొక్క  జీవనం పవిత్రమౌతుంది, ధన్యమౌతుంది. అత్యంత సారభూత౦గా వారు చెప్పిన మాట

"త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే
మానావమాన సదృశాః సమదర్శినశ్చ
కర్తారమన్యమవగమ్య తదర్పితాని
కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః!!

సకల శాస్త్రములయందు చెప్పబడినటువంటి అర్ధాన్ని సారభూత౦గా దీంట్లో చెప్పి ఈవిధంగా మీరు నడుచుకోండి. మీజివితం పవిత్రమౌతుంది అన్నారు. దాంట్లో వారు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటి అంటే ముఖ్యంగా మనకు అహంకార మమకారములు అనేటువంటివి ఈ సంసార బంధానికి హేతువులుగా ఉన్నాయి. ఇవి మనిషికి శతృవులుగా ఉన్నాయి అని వింటూ ఉంటాము. పెద్ద భూతంలాగా మనిషిని ఆక్రమించి వారితో అకార్యములను చేయిస్తుంది. అకార్యములు చేసే  వీరందరికీ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే భావన మనసులో ఉంటుంది. నా దగ్గర డబ్బు ఉందనో, అధికారం ఉంది అనో, నాకు విద్య ఉంది అనో, భావనలు మనస్సులో ఉంది అకార్యములు చేస్తాడు. ఇక్కడ నిన్ను అడిగేవాడు ఉండకపోవచ్చు. శరీరం విడిచి పెట్టిన తరువాత నిన్ను అడిగేవాడు ఒకడున్నాడు. వాడి కళ్ళు గప్పటానికి నీకు వీలులేదు. అనే విషయం వాడి మనసు తీసుకోవడం లేదు. మహాభారతంలో అభిమన్యు ఆరుగురు అతిరధులు అధర్మంతో వధించిన విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు "సంజయా! ఎంత పాపానికి ఒడిగట్టారు మనవాళ్ళు. నిశ్శస్త్రుడైనటువంటి పిల్లవాడిని ఆరుగురు అతిరధులు చేరి వధించారు. నేను ఈ శరీరం వదిలి పెట్టి వెళ్ళిన తరువాత నాతమ్ముడు పాండు ఇది న్యాయమా అని  నన్ను అడిగితే  ఏం జవాబు చెప్పను?"  అప్పుడు సంజయుడు ఈ ఒక్కటే కాదు మీరు అనేక ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వస్తుంది అన్నాడు.  కాబట్టి అహంకారభూయిష్టులమై  అధర్మాన్ని ఆచరిస్తూ వాస్తవాన్ని మరచి పోతున్నాము. అహంకారం మనకు పనికి రాదు. ఇది బంధానికి కారణం అవుతుంది. బంధం అంటే జన్మ మరణ ప్రవాహం. ఎప్పటిదాకా ఈ ప్రవాహంలో ఉంటామో మనకు విముక్తి లేదు.

"పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం
 ఇహ సంసారే బహు విస్తారే కృపయా పారే పాహి మురారే!!" 

ఈ ప్రవాహం నుంచి బయట పడాలి అంటే అహంకారాన్ని, మమకారాన్ని వదిలిపెట్టు. గీతోపదేశం ప్రారంభమైనది అర్జునుని మమకారం వల్ల.

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

****భోజనం...

 భోజనం...

ముందుగా ఈ మధ్య కాలంలో, శుభకార్యాలలో భోజనం చేసే ముందు హరి నామస్మరణ చేసే ప్రవృత్తి పూర్తిగా నశించి పోయింది.పూర్వం భోజనం మొదలు పెట్టే ముందు అందరూ గట్టిగా "గోవిందా, గోవిందా" అని అప్పడు భోజనం చేయడం ప్రారంభించేవారు.

విస్తరలో పదార్థం వడ్డించగానే వెంటనే తినేయడమనేది మరొక రుగ్మతగా తయారైంది. అందరు కలిసి భోజనం చేయలేకపోతే... ఇంక నలుగురు కలవడంలో అర్థం ఏముంది... అలా తినడంలో హోటల్, తిండికి, శుభకార్యాలలోని ఆత్మీయ భోజనానికి వ్యత్యాసమేముంది. 

ఉన్నవాడికే కొసరి కొసరి పెట్టడం మనం నిత్యకనిపించే దృశ్యం. ఇలా ఎంతో ఆహారాన్ని వృధా చేస్తుంటాము.. లేని వాడు పొట్ట పట్టుకుని మన ఇంటి ముందు కూర్చున్నా పట్టించుకునేవాడు కరువు. అప్పటికే భుక్తాయసంతో ఉన్న వాడికి మరిన్ని వడ్డించాలని తాపత్రయం కనబరుస్తాము.

పైగా తినగలిగినంత తిను మిగిలింది వదిలేయి అంటూ ఇష్టమొచ్చినట్లు వట్టించే ప్రేమ కూడా మనలో ఎందరికో నిత్యానుభవమే...

ఇలా ఒక పక్క అన్నాన్ని దైవమని (పరబ్రహ్మ స్వరూపమని) దానిని ఎన్నో రకాలుగా వృధా చేసే వారు, తమ ప్రవృత్తిలో కాస్తంత మార్పు తెచ్చుకుంటే, కొన్ని కొట్ల మంది కడుపు నింపిన పుణ్యాన్ని పొందగలరు....

అలా కాక, విస్తరలో వదిలేయమని సలహా ఇస్తూ వడ్డించే, లేదా బలవంతాంగా వడ్డిపజేసేవారు తెలియకుండానే చాలా ఘోరమైన అపరాధం చేస్తున్నారు. సత్ కార్యానికి సత్ఫలితం వచ్చినట్లు ఇలా మరొకరికి లభించవలసిన బోజన పదార్థాలను వృద్ధా చేసే వారికి వచ్చే ఫలితాన్ని ఎవరికి వారే ఊహించుకోగలరు.

శుభకార్యాలలో ఎందరో చేసే మరొక ఘోర తప్పిదం ఏమిటంటే, తమకి ఇష్టం లేని పదార్థాలను వడ్డించక ముందే వద్దని చెప్పక పోవడం. అంతిమంగా విస్తరలో వడ్డించిన పదార్థాలను తినకుండానో లేదా ఎంగిలి చేసో వదిలేయడం.....

ఇటువంటి చర్యలకి ఫలితం వెంటనే ఉండకపోవచ్చు, కాని, మన బ్యాంకు ఖాతాలో డబ్బుకి వడ్డి వచ్చినట్లుగానే,ఇలాంటి చర్యలకి నష్టం కూడా చక్రవడ్డీలా పెరిగి ఏప్పుడో ఒకసారి దాని ఫలితాన్ని చూపించగలదు...

పెద్దలు పై విషయాలను కాస్తం శ్రద్దతో, ఓపికతో పట్టించుకుని మళ్ళీ అమలు చేయవలసిన అవసం ఎంతైనా ఉంది...

***** 'భావ తరంగణి'.(గల్పిక) రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.

 'భావ తరంగణి'.(గల్పిక)
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
             **********

'ఇదేమిటి? మళ్ళీ ఓ కొత్త గ్రూపా?...'

'చెప్పా పెట్టకుండా.. నన్ను అడగకుండా ..నన్ను ఎవరు చేర్చారు?'..

'నన్ను ఈ గ్రూపులో చేర్చినందుకు ధన్యవాదాలు.. కవితలు రాయచ్చునా?'...

'మాలాంటి కొత్త స్త్రీ రచయిత్రులకు వారంలో ఒకరోజు కేటాయించండి'.......

'గుడ్ మార్నింగ్ లు, గుడ్ ఈవెనింగ్ లేనా ?సాహిత్యం ఏమైనా ఉంటుందా?'.....

'భావ మూర్తి గారు ఆరంభించారంటే నిర్దిష్టమైన చక్కటి ఆలోచనతోటే ప్రారంభిస్తారు! ఆయన కథలు నవలలు నాటకాలు తెలుగు వారికి పరిచయమైనవే కదా!'....

'రోజుకో గ్రూపు ప్రారంభించేస్తున్నారు! గుడ్ మార్నింగ్ లు పెట్టలేక చూస్తున్నాను! పలక తుడిచినట్టు  రోజూ పొద్దుటే స్క్రీన్ తుడుచుకోవడానికిడానికే అరగంట పడుతోంది! నన్ను తీసేయండి'....

'ఇష్టం లేకపోతే మీరే వెళ్ళిపోవచ్చు కదా!'.....

'నాకు తుడుచుకోవడమే గాని దీనిలో నుంచి వెళ్లిపోవడం రాదు మహా ప్రభో! అందుకని నా పేరు తీసేయండి!'....

'సమూహం ప్రారంభించి ఎంతసేపైనా దీని ఆశయాలు ఏమిటో ఎవరూ చెప్పరేం?'....

'కొంచెం ఓపిక పట్టండి సార్! పిల్లోడు పుట్టగానే వెంటనే బాలసారె చేస్తామా? గ్రూపు ఓపెన్ చేసిన వారు ఆశయాలు చెప్పకుండా ఉంటారా?'....

'భావ మూర్తి గారు ఆరంభించారంటే ఆ గ్రూపు ఆశయాలు గొప్పవే అయి ఉంటాయి!'....

'సార్ గ్రూపులో సమస్యా పూరణాలు కూడా పెడితే బాగుంటుంది!'....

'ఎవరైనా రాజకీయాలు ప్రారంభిస్తే వెంటనే గ్రూప్ లో నుంచి తొలగించేయండి! ఇది మాత్రం స్ట్రిక్ట్ గా అమలు చేయండి!'.....

'నేను ఇప్పుడిప్పుడే కొత్తగా కథలు రాయడం మొదలు పెట్టాను. నా కథలు ఈ గ్రూపులో పెట్టవచ్చునా?'...

'సుజాతనగర్ లో చిన్న కుటుంబమునకు వంట చేయుటకు ఎటువంటి బాదరా బందీలు లేని 30 ఏళ్ల యువతి కావలెను. మంచి జీతం, వసతి ఉంటుంది కింది నెంబర్ సంప్రదించండి*****'......

'అయ్యా భావ మూర్తి గారు ఆరంభించారంటే ఇది సాహిత్యానికి సంబంధించిన గ్రూపు! ఇందులో ఇలాంటిపచన ప్రకటనలు దయచేసి పెట్టవద్దు అని మనవి!'.....

'మనవాళ్లు మొత్తానికి టి20 లో ప్రపంచ కప్ గెలుచుకొచ్చారు! వారందరికీ నా శుభాకాంక్షలు!'.....

'మా ఆవిడ నన్ను నిమిషానికోసారి "నువ్వు కొడాలి నాని లా తయారయ్యావు!..." అంటూ తిడుతోంది! ఈ కొడాలి నాని ఎవరో దయచేసి ఎవరైనాచెప్పగలరా?'....

'కల్కి సినిమా నిన్ననే చూశాను! అదిరిపోయింది! అందరూ చూడండి!'.....

'వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా?.. కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా?... పువ్వు మీ అదృష్టం చెప్పగలదు!.. వెంటనే కింది నెంబర్ ను సంప్రదించండి******'

'అయ్యా భావ మూర్తి గారు! అడ్మిన్ గారు! మీరు ఎక్కడున్నారో వెంటనే గ్రూపులోకి రావాలి! మీరు అయ్యవారిని చేయబోతే కోతి అయ్యేలా ఉంది! రకరకాల వ్యాపార ప్రకటనలతో గ్రూపు భ్రష్టు పట్టిపోతోంది! మీరు వెంటనే వచ్చి ఈ గ్రూపు ఆశయాలు వివరించమని మన సభ్యులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను! ఎక్కడున్నా త్వరగా రండి!'......

"అయ్యా! సభ్యులందరూ నన్ను క్షమించాలి. నేను మా ఆవిడని రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చాను! రైలు మూడు గంటల ఆలస్యం అని తెలిసింది! ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మా ఇంటికి తిరిగి వెళ్ళలేను! మళ్ళీ రాలేను! అందుకని ప్లాట్ఫారం మీదే కూర్చున్నాను! ఏమీ తోచక ఒక గ్రూప్ క్రియేట్ చేశాను! రైలు ప్లాట్ఫారం మీదకు వస్తోంది! అందుకని గ్రూపు క్యాన్సిల్ చేస్తున్నాను! ఎవరికి వారే గ్రూపు విడిచి వెళ్లి పోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను! సెలవు నమస్కారం! మీ భావ మూర్తి!!"
                         ******************
(కేవలం సరదాగా రాసింది . ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు! కేవలం సరదా!.. సరదా!... అంతే!..)
 చదువుని సర్వమంగళం చేసుకున్న మనం దాని గురించి ఆలోచన చేయడం మనేశాము...

బట్టీలు పట్టించి, విద్యని గ్రహించి నేర్చుకునే  నైపుణ్యాలను చంపేస్తున్నారు...

ఎంత చెరుపు జరిగినా,
ఎంత విద్య చెడినా,
పేరెంట్స్ కు కావాల్సింది రంగు రంగుల క్లాస్ గదులు,
హంగు ఆర్భాటాలు చూపించే హాస్టల్ గదులు...

ఎక్కడ బిడ్డల నైపుణ్యానికి విలువ, గౌరవం, గుర్తింపు దక్కుతుందో అక్కడ చేర్పించండి...

అలాంటి విద్యాసంస్థలు దాదాపుగా లేవు...
 *శ్రీరమణీయభాగవత కథలు- 17*
( బాపు-రమణ )

జరిగిన కథ:
అమృతాన్ని రాక్షసులు పాతాళానికి తీసుకెళ్తారు. నాకు ముందు అంటే నాకు ముందని పోట్లాడికుంటుంటే, *మోహినీ అవతారం* లోని శ్రీ మహావిష్ణువు రంగప్రవేశం చేస్తాడు.

ఇక చదవండి
******
మోహిని:
మా అన్నయ్య ధన్వంతరి. ఇక నేను వారి కొరకై
అమృతము ప్రసాదించెదను గాక! అని గొప్పలు చెప్పగా నేను వారనేక దివ్య ఓషధులు వేసి చిలికినందువలన గదా ఈ అమృతము వచ్చినది! నా గొప్ప ఏమున్నది' అని నిలదీశాను.

అందరూ ఘొల్లున నవ్వారు.

మోహిని:
అందుకే నామీద కోపం వచ్చి వుంటుంది. స్వయంవరం జరపకుండా ఎక్కడో దాంకొని ఏడిపిస్తున్నాడు. నాకు చాలా దుఃఖంగా వుంది. చచ్చిపోదామంటే ఇందాకే అమృతం తాగేశాను. చావుకూడా రాదుకదా!

రాక్ష:
నిజమా? ఈ మందు నిజంగా పని చేస్తుందా?

నువు తాగావు కదా పని చేసిందా మరి? ఎలా తెలుసు?

మోహని వాడి వైపు కోపంగా చూసింది. తటాలున వాడి చేతిలోని కత్తి లాక్కుని పాడుచుకుంది. మెడ కోసుకుంది. అంతా అదిరి పడి చూశారు, 

మోహిని లక్షణంగా వుంది. చెక్కు చెదర లేదు. విరక్తిగా కత్తి వాడి మొలలో దోపింది. అందరూ భక్తితో చూశారు. కొందరు దణ్ణాలు కూడా పెట్టారు.

ఒకడు:
మోహినీ దేవీ! నువ్విటురావడం మా అదృష్టం.

మరొకడు:
అమృతం కోసం మేము కొట్టుకుంటున్నాం. ముందు ఒక తండ్రి ఇద్దరు తల్లుల బిడ్డలుగా పోరాడాం.

ఇంకొకడు: ఇపుడు ఒక్కమ్మ బిడ్డలుగా కూడా పొత్తు కుదరడం లేదు.

ఒకడు: నువ్వు మాకు అమృతం పంచు నీ యిష్టం వచ్చిన వాడిని వరించు.

మోహిని :ఇంతకీ మీరు దేవతలా దానవులా?

ఒకడు;
ఏం దానవులయితే పెళ్లాడవా? చంపేస్తాను.

మో:
(పకపకా నవ్వి) చావనుగా!

వాడు తెల్లబోతాడు - మిగతా వాళ్లు నవ్వుతారు

మో:
(కలశం పట్టుకున్న వాడికి తగుల్తూ) (గోముగా) దానవులయితేనే పెళ్లాడతాను. పైకి వచ్చే ముందు మా సముద్ర దేవతలు చెప్పారు. అమ్మా దేవతలను నమ్మకు. వారు వేదములూ అవి చదివేసి పైకి నవ్వునటించి తరువాత దగాచేయుదురు. దానవులు మాత్రం కల్లాకపటం లేనివారు. ముద్దోస్తే ముద్దు పెట్టుదురు; కోపము వచ్చిన ఫెడేలుమని కొట్టుదురు (అని ఒకడిలెంప వాయగొడుతుంది.) అని చెప్పారండి.

అంతా మురిసి పోయారు.

మంచిది! ఓ పని చేదాం మీరు కోరి నట్టే నేను అమృతం పంచుతాను. కానీ మీరంతా గట్టిగా కళ్లుమూసుకోవాలి. ఎందుకో చెప్తా.

అంటూ పొడుగు వాడిని ముట్టుకుంది. వాడు మంత్రముగ్ధుడిలా కలశం ఇచ్చేశాడు. వయ్యారంగా నడుమున వుంచుకుంది. రాక్షసులందరూ అనుకరిస్తూ తామూ వయ్యారంగా నడుములు వంచి చేతులు పెట్టుకున్నారు. ఎముకలు పటపట మన్నాయి.

మో:
మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డిస్తాను. కానీ మీరందరు- ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవరాదు.

అంతా ఆనందంతో తలలూపి నెత్తిన చేతులు పెట్టుకుని

అందరూ: ఉహూఁ!  ఒట్టు!

మేమ స్వయంవర పరీక్షలో ఒకొక్కరినీ చూసుకుంటూ వెడతాను. నచ్చక పోతే అమృతం పోసేస్తా అంటే- నచ్చని వాళ్లకే ముందు అంటే అమృతం దోసిట పోశానంటే నేను
వరించలేదన్నమాట!

అంతా అర్థమయినట్లు తలలూపారు.

మో:
నేను వరించలేదని కోపగించి అమృతం వద్దన కూడదు.

అంతా అబ్బే అన్నట్టు అడ్డంగా తల లూపారు..

అలా పంచి పంచి నాకు నచ్చిన వాడికే అమృతం వడ్డించను (సిగ్గు అభినయిస్తూ) ఆయనను భుజం తట్టి బుగ్గగిల్లి మేల్కొలుపుతాను. అప్పుడు ఆయన చేత అమృతం తాగిస్తాను అదే నా స్వయంవరం. అదే నాపెళ్లి,

రాక్షసులు ఎవరికి వారు తామే అన్నట్లు మురిసి పోతున్నారు.

మో:
(కంటనీరు పెట్టుకుని గద్గదంగా) దానవాగ్రణులారా! నేను పెళ్లాడబోయే ఆ ఒక్కడూ తప్ప మిగతా వారందరూ నా అన్నటి తలి దండ్రులే (దుఃఖంతో) ఆ ప్రేమతో నన్ను దీవించండి.

ఆమె దుఃఖం చూసి అందరికీ కంట నీరు తిరిగింది. పసిబిడ్డల్లా వెక్కివెక్కి ఏడ్చారు.

మో: (కష్టంగా) కళ్ళు తుడుచుకోండి.

అంతా కళ్లు తుడుచుకున్నారు.

మో:

కళ్లు మూసుకోండి. ఇహ తెరవకండి.

అంతా కళ్లు మూసుకున్నారు. తలలూపారు. మోహిని నిశ్శబ్దంగా నవ్వి అమృత భాండంతో మాయమైంది. స్వర్గంలో దేవతలంతా మోకరిల్లి కూచున్నారు అమృత కలశంతో మోహిని అమృతం పంచసాగింది.

*రాక్షసుల పాతాళ గుహ*
మసక వెలుతురు. దిగులుగా వుంది. నిశ్శబ్దం. రాక్షసులంతా కళ్లు మూసుకుని కూచున్నారు. అందెల రవళి- గాజుల చప్పుడు మాత్రం వినిపిస్తున్నాయి. అంతా తమలో తామే నవ్వుకుంటూ...

ఆహా! ఇంత సేపైంది

ఇంకా నా వంతు రాలేదు.

మిగతా అందరికీ ఇచ్చేస్తోంది.

నా ఒక్కడికే ఇవ్వలేదు.

నేనే వరుణ్ణి

నన్నే పెళ్లాడుతుంది.

నన్నే!

నన్నే!

రాహువుకి అనుమానం వచ్చింది. కళ్లు మూసుకునే చేత్తో తడిమి కుడివాడిని అడిగాడు...

రాహువు:
నీకిచ్చేసిందా?

ఒకడు:
లేదు. నీకు?

రాహు:
నీకు?

మరొకడు;
అబ్బే లేదు

రాహు :
(ఇంకోడితో) నీకు?

ఎదుటివాడు: నా వంతు అప్పుడే ఎక్కడ! ఇన్ని వేలమందికి ఇచ్చాక చివరికదా! రాహువుకి అనుమానం వచ్చింది. మెల్లగా ఓ కన్ను తెరచి చూశాడు. అంతా కూచుని వున్నారు. మోహిని కనబడలేదు. భయమేసి ఒక్కసారిగా రెండు కళ్లు తెరచి చూశాడు. అంతా లొట్టలువేస్తూ కళ్లుమూసుకుని కూచున్నారు. 

మోహిని లేదు. గ్రహించాడు. నెమ్మదిగా లేచి మాయమయ్యాడు. కేతువు కూడా మాయమై వెంటవెళ్లాడు.

ఇద్దరూ స్వర్గంలో రూపుదాల్చారు. మోహిని దేవతలకు అమృతం పోస్తోంది. ఇద్దరూ కామరూప విద్యతో కోరి దేవతల రూపం ధరించారు. నెమ్మదిగా దేవతల వరసలో కలిసిపోయారు. 

చంద్రుడు గమనించాడు. సూర్యునికి చెవిలో చెప్పి చూపించాడు. ఇద్దరూ కలసి మోహిని వంక చూశారు. మోహిని వారిని చూసింది. వారు ఆ వరసలో కూచున్న రాహుకేతువులను చూపించి నోట్లో వేళ్లు పెట్టుకుని కోరలు సూచిస్తూ రాక్షసులు అని తెలిసేలా సైగ చేశారు. 

మోహిని కన్నులర మోడ్చింది. నుదుటి తిలకం లోంచి సుదర్శనం వచ్చింది. రాహుకేతువులిద్దరూ పక్కవాడి దోసిట్లో చెయ్యి పెట్టి ఒక చుక్క నోటిలో వేసుకున్నారు. చక్రం వచ్చి వారి తలలు నరికింది. ఒక్క చుక్క అమృతం పొందడం వల్ల ఆ తలలు మాత్రం ప్రాణంతో వున్నాయి.

రాహు:
సూర్య చంద్రులారా! మా మొండెం చచ్చినా- తలమిగిలింది. మేము మిగిలాము. మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష వేసితీరతాము. కలకాలం అనుభవిస్తారు.

*పరీక్షిత్తు యాగశాల*

శుక: ఓ రాజా! ఆ రాహు కేతువులు నాటి నుంచి నేటికీ ఏటేటా సూర్య చంద్రులను నోట పట్టి విడుస్తూవుంటారు. 

అవే ఈ నాటి గ్రహణాలు. కాస్త అమృతాన్ని నోట పెట్టిన పుణ్యానికి వారి నోటి మాట పొల్లు పోకుండా శ్రీహరి వారిని ఇందుకు అనుమతించాడు. 

మోహినీ దేవిగా అవతరించిన విష్ణు భగవానుడు అందమే ఆయుధంగా నడిపిన మరొక
మధురమైన కథ విను.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

కాకపోతే ఈరోజుల్లో ఇంతగా తమ తల్లిదండ్రులుకోసం యజ్ఞం చేసే నిశ్వార్ధ పిల్లలు ఎంతవరకు వున్నారో అనేదే మిలియన్ డాలార్ల ప్రశ్న

 *✍️ 👏 🤝 👍 బయట వర్షం పడుతోంది, లోపల క్లాస్ జరుగుతోంది, మీ అందరికీ తల వంద రూపాయలు ఇస్తే  మీ కోసం  మీరు  ఏమి కొంటారు అని పిల్లలందరికీ అడిగారు మాస్టారు .. .  నేను వీడియో గేమ్‌లు కొంటానని ఒకరు, నేను క్రికెట్ బల్  కొంటాను అనీ మరొకరు ..*

 *కొందరు నేనే అందమైన బొమ్మను కొంటాను , చాక్లెట్లు కొంటాము అనీ మరికొందరు అన్నారు.  ఒక పిల్లవాడు ఏదో ఆలోచనలో మునిగి వున్నాడు గురువు అతన్ని అడిగాడు, నీవు ఏమి ఆలోచిస్తున్నారు?*

 *నీ కోసం  ఏమి కొంటావు అనీ ..*

 *👉 ఆ పిల్లాడు మాస్టార్ తో సార్ , మా అమ్మకి చూపు సరిగ్గా కనబడదు .. కాబట్టి అమ్మకి కంటి అద్దాలు కొనిస్తాను అన్నాడు.  మాస్టర్ అందుకు  మీ అమ్మకి మీ నాన్నగారు అద్దాలు కొనగలడు ..నీవు నీకు ఇష్టమైనవి కొనవచ్చు కదా!!*

*👉 అందుకు ఆ చిన్నారి చెప్పిన సమాధానం టీచర్‌ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది.  మా నాన్న ఇక ఈ లోకంలో లేరని ఆ చిన్నవాడు చెప్పాడు..  మా అమ్మ     బట్టలు కుడుతుంది,  అలాగే కుట్టు పని నేర్పుతుంది, చూపు తక్కువగా ఉండడం వల్ల బట్టలు సరిగ్గా కుట్టడానికి రావడం లేదు .. అందుకే నేను బాగా చదువుకుని పెద్దవాడిని అయ్యి అమ్మకు సకల సంతోషాలుఇవ్వాలి అనుకున్నాను* 

 *మాస్టర్ ,  ఇలా అన్నాడు .. ఆమ్మా కొడుకా, నీ ఆలోచనే నీ సంపాద. నేను  ఇచ్చిన మాట ప్రకారం ఈ 100 రూపాయలు అప్పుగా ఇస్తున్నాను.  నీవు బాగా సంపాదించి అమ్మాకు బాగా చూసుకో ఆ 100 రూపాయలు  అప్పుడు తిరిగి ఇవ్వు .  మరియు నీవు  గొప్పవాడు  కావాలని నేను కోరుకుంటున్నాను అనీ తలపై నిమురుతూ  ఆశీర్వదించారు*

 *15 సంవత్సరాల తరువాత, *

 *బయట వర్షం పడుతోంది.  లోపల తరగతులు జరుగుతున్నాయి.  అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ వాహనం వచ్చి పాఠశాల ముందు ఆగింది.  దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు.  స్కూల్లో నిశ్శబ్దం.  అయితే ఇది ఏమిటి?  జిల్లా కలెక్టర్ వృద్ధ ఉపాధ్యాయుడి కాళ్లపై పడి "సార్ నేను దామోదర్ దాస్ అలియాస్ ఝండు.*

 *👉 మీ అప్పులో రూ. 100 తిరిగి ఇవ్వడానికి వచ్చాను." పాఠశాల సిబ్బంది మొత్తం ఆశ్చర్యపోయారు. వృద్ధ ఉపాధ్యాయుడు వంగి ఉన్న యువ కలెక్టర్‌ను లేపి గట్టిగా కౌగిలించుకుని ఏడుపు ప్రారంభించాడు.*

 *👉 మనం కోరుకుంటే, మన ఆత్మవిశ్వాసం మరియు శ్రమ బలంతో మన విధిని మనమే వ్రాసుకోవచ్చు మరియు మన విధిని ఎలా వ్రాయాలో మనకు తెలియకపోతే, మన విధిని పరిస్థితులే వ్రాస్తాయి.*

*👉 కాకపోతే ఈరోజుల్లో ఇంతగా తమ తల్లిదండ్రులుకోసం యజ్ఞం చేసే నిశ్వార్ధ పిల్లలు ఎంతవరకు వున్నారో అనేదే మిలియన్ డాలార్ల ప్రశ్న🙏💐👍*

*****

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
అచల గురు విమలానంద 
బొడ్ల మల్లికార్జున్ రాజయోగి.

"గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః |
గురుసాక్షాత్ పరః బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||"

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు.!!
 గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.

‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశాన్ని
అందిస్తాడు!!

  అనేక "గురు"అవతారాలున్నాయి. అందులో
పరిపూర్ణమైనది శ్రీగురుదత్తావతారం!!

 జగద్గురువు అయిన తను కూడా ప్రకృతి నుండి గురువులను గ్రహించానుఅని దత్తగురువు చెప్పాడు!!

శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యదురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానము ఇచ్చాడు!!

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు(24) గురువు లున్నారు!!

జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము (కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు !!
ఇవి నా గురువులు.

వాటి నుండి గ్రహించినది విను.

1- భూమి నుండి – క్షమా, పరోపకారత్వం!!

2- వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము!!

3- ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం!!

4- జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం!!

5- అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం!!

6- సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే!!

7-  చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.!!

8- పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.!!

9- అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.!!

10- సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.!!

11- మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.!!

12- తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!!

13-  గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.!!

14- మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.!!

15- లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.!!

16- చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!!

17-  పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.!!

18- కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.!!

19- బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.!!

20- కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.!!

21- శరకారుడు నుండి–ఏకాగ్రతనుసాధిస్తాడు!

22- సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.!!

23-  సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.!!

24- పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల భగవత్ రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).
అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు.!!

ఇక, ఆచార్యులు గురువులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే!!
ఆ రోజుల్లో గురువులకు ఈ క్రింది లక్షణాలు ఉండేవి.!!

#శిష్యవాత్సల్యం
#బ్రహ్మనిష్ఠ
#వేదశాస్త్రములసంపూర్ణపరిజ్ఞానం
#బోధనాకౌశలం
#మనస్తత్త్వాన్నితెలుసుకునేలక్షణం
#అందరిపట్లసమభావాన్నికలిగిఉండటం

శిష్యులు  గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది!!శుభమ్ భూయాత్!!

జై గురుదేవ్👏🏼👏🏼

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!

 🔔 *సత్సంగం* 🔔

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!

కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది. 
కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 

పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.

1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.

2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది. 

3. వివాహ వ్యవస్థ నిలబడదు

4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు

5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు

6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర
ములకే పడిపోతుంది

7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది

8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు

9. అది ఎప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది

10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది .కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు

11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి

12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు

13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు

14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృత యుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది 

15.ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.

16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి     పోతుంది

17 అంత గొప్ప అవతారం కల్కి అవతారం

ఓం నమో నారాయణాయ నమః
 శ్రీమదిరామాయణము.
(213 వ ఎపిసోడ్),,

""" సాధూనాం దర్శనం పుణ్యం,
      స్పర్శనం పాప నాశనం,
      సంభాషణం కోటి తీర్థం,
      వందనం మోక్షసాధనం."""

మహర్షులను దర్శించినంత మాత్రముననే పుణ్యం లభిస్తుంది
ఇంకావారి పాదాలని స్పర్శించిననే మనపాపాలన్ని ప్రక్షాళనమవుతాయి.,
ఇంకా వారితో కొద్ది సేపు సంభాషించిననూ కోటితీర్థ లాభము లభిస్తుంది, ఇక వారికి నమస్కరిస్తే ఏకముగ మోక్షమే ప్రాప్తిస్తుంది.

రామాయణములోని భరతుని పాత్ర విశేషముగ ప్రస్తావించబడింది.కారణము భరతునికి ఇతరులయెడ యున్న ప్రేమాభిమానములే దానికి కారణము.కానీ భరతుడు తన తల్లిని దూషించినంతగా ఇతిహాసాలలో మరెవరు తల్లిని అంతగా దూషించియుండరు.

"'" మృత్యుమాపాదితో  రాజా త్వయా మే పాపదర్శిని!|,
సుఖం పరిహృతం మోహాత్ కులే~స్మిన్  కులపాంసని||,(అయో.కాం.73-05),,

ఓ పాపిష్టిదానా! ధశరథమహారాజుని మృత్యుకౌగిటజేర్చిన పుణ్యము నీదే.ఓ కులకళంకితా ! ఈ వంశమువారి శాంతిసుఖములను నేలపాలు చేసితి'వని దూషిస్తాడు.

రాముడు తన తల్లి కౌసల్యను ప్రేమించినట్లే నిన్నును గౌరవాదరములతో సేవించుకున్నాడు.అంతేకాదు పెత్తల్లి కౌసల్యామాత కూడ ధర్మబుధ్దితో స్వంతసోదరిలా నిన్ను చూచుకున్నది.

"" తవాపి సుమహాభాగా జనేంద్రాః కులపూర్వగాః,
బుద్దేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః||,(74-24),

ఓ క్రూరాత్మురాలా ! నీవు జన్మించిన కేకయవంశరాజులు అందరు సచ్చరిత్రగలవారే.కానీ నీకేల ఈ నింద్యమైన బుధ్దిమోహము దాపురించినది.నీ కోర్కెను నేను తీర్చిన నా జీవితమునకే కళంకమేర్పడి ముప్పుఏర్పడును.

"" కౌసల్యాం ధర్మసంయుక్తాం వియుక్తాం పాపమిశ్చయే|,
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామిని||,(74-12),

ఓ పాపాత్మురాలా ! ధర్మపరాయణయైన కౌసల్యాదేవి కి పుత్ర ఎడబాటు కల్పించితివి,పతివియోగము కావించి వైధవ్యము తెచ్చిపెట్టితివి.ఇంతటి దుర్మార్గురాలవైన నీకు నరకమే ప్రాప్తించవలయును.

ఇంతగా తల్లిని దూషించాటానికి తగు కారణములున్నను తల్లిని దూషించిన పాపము ఆనాటి నుండి తల్లి పట్ల నిత్యక్రోధత్వము వలన అది భరతుని  మొదటిసారిగ పాపకళంకితునిగ చేసినది.మరి అంతటి కళంకితునికి పరమాత్మ (రాముని)దర్శనము ఎలా ప్రాప్తించినది.

చిత్రకూటములో రాముని కలుసుకొనటానికి బయలదేరిన భరతాదులకు భరద్వాజ మహర్షి దర్శనభాగ్యము ఏర్పడినది.అందరు ఆ మహర్షిపాదాలకి నమస్కరించారు.(సాధూనాం దర్శనం పుణ్యం),వారిపుణ్యపాదాలు స్పర్శించి వారితో సంభాషణచేసి వందనాలు చెయ్యడము తో భరతుని పాపాలు తొలగిపోయే అవకాశమేర్పడినది.దర్శన మాత్రముతో భరతునిలో క్రోధము కొద్దిగా తగ్గినది.మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పడికి భరతుని కరుణించటానికి తానే సంబాషణకు ఉపక్రమించారు.

"" తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః,
విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాత్రూణాం తవ రాఘవ||,(92-18),

ఓ భరతా ! మీ తల్లుల గురించి ఈ సమయములో విశేషముగ తెలుసుకొనగోరుతున్నానని తనకేమియు తెలియనివాడివలే సంభాషణ మొదలుపెడతారు(సంభాషణం కోటితీర్థం),అప్పటికి భరతుడు కోపాన్ని త్యజించక 

""" క్రోధ నామకృతప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీమ్|,
ఐశ్వర్య కామాం కైకేయీమ్ అనార్యామార్య రూపిణీమ్||,(92-25),,

ఈమెయే నాతల్లి కైకెయి.మిగుల క్రోధస్వభావురాలు, వివేకశూన్యురాలు,తాను అంగత్తెనని,ఐశ్వర్యురాలనని గర్వపడునది.పైకి ఉత్తమురాలుగ కనపడినను క్రూరాత్మురాలు,పాపబుధ్దిగలది.మా కష్టములన్నిటికి ఈమెయే కారకురాలని తల్లిని పరిచయముచేస్తాడు.ఇదియే భరతుడు తల్లిపట్ల చేసిన చివరి దూషణ.కారణము.మహర్షితో చేసిన సంభాషణ భరతుని పాపాలకు ప్రక్షాళన జరిగింది.భరతునితో మహర్షి 

"" న దోషేణావ గంతవ్యా కైకేయీ భరత! తథా|,
రామప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి||,(92-29),

ఓ భరతా ! ఇకనుండి నీవు నీ తల్లిని తప్పు పట్ట వద్దు. ఇందు ఆమె"" దోషము ఇసుమంతైనను లేదు."", నీ సోదరుల వనవాసము జగత్తునకు, ఎల్లరకును భవిష్యత్తులో హితము కూర్చగలదని పలికి భరతుని మందలించెను.

రామాయణములో భరద్వాజ మహర్షి దర్శనము తర్వాత భరతుడు తల్లిని నిందించిన సంఘటనలు మనకి కనపడవు.కావున మహర్షుల దర్శనభాగ్యము ఎల్లవేళల శ్రేయస్కరమని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

****ధర్మ నిష్ఠ

              *_నేటి మాట_*

                   *ధర్మ నిష్ఠ* 
రాముడు, "తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది?      రావణాసురుడు ఘోర తపస్సు చేసి, అనేక శక్తులను, వరములను పొందాడు!!...

    మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే!!...
     కానీ! రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?

     కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన, జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు, మనిషిగా పుట్టాడు, ఎటువంటి మాయలూ చేయలేదు...

నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు,
కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".

ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి.
     "ధర్మాన్ని రక్షిస్తే! అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.

ఇందులోని విచిత్రమేమిటంటే, ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. 
ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు, అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు!!..

శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు, ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.

తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక   "అస్త్ర శస్త్రాలను"   కైవసం చేసుకున్నాడు.
పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.

అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు.
రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.

*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  | |*
 
*అని ఉపనిషద్వాక్యం.*

ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము ,   వేదశాస్త్రముల అధ్యనము,    శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట,  అంతరింద్రియ నిగ్రహము,  దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే, దివ్యశక్తి ప్రదాయకములే.

దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు. 
 మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. 
అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు.
 ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.

కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.

అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు. 
కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".

 ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. 
సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.

               *_🌻శుభమస్తు.🌻_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

*****టెన్షన్స్ లేని జీవితం కోసం కొన్ని పర్సనల్ రూల్స్ పెట్టుకుంటే బావుంటుంది అనిపిస్తోంది. అందులో కొన్ని.....

 టెన్షన్స్ లేని జీవితం కోసం కొన్ని పర్సనల్ రూల్స్ పెట్టుకుంటే బావుంటుంది అనిపిస్తోంది. అందులో కొన్ని..... 


1. నీ సమస్యలు ఎవరికీ చెప్పకు
2. ఎవరితో సమస్య ఉంటే వారితోనే నేరుగా మాట్లాడు
3. ఎక్కువ ఆలోచించు, బిజీగా ఉండు 
4. అక్టివ్ గా ఉండు, కనీసం యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించు 
5. స్పీడ్ గా పని చేయి 
6. ఏదైనా చేయాలి అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయి 
7. ఫోన్ ఎక్కువ వాడకు 
8. బుక్స్ ఎక్కువ చదువు 
9. కరెంట్ అఫైర్స్ చదువు 
10. అనవసరంగా ఎక్కువ అందుబాటులో ఉండకు
11. మాత్రలు వేస్కో (ఏస్కోవాల్సి ఉంటే)
12. ఫిట్నెస్ మైంటెన్ చేయి
13. స్వీట్ & కార్బ్స్ ఎక్కువ తినకు
14. బాగా నిద్రపో
15. నీ గురించి ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నా పట్టించుకోకు
16. ఎదుటివాడు కూడా నీలా ఆలోచించాలి అనుకోకు
17. వీలైతే థాంక్స్ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయి. లేదా మూసుకొని ఉండు
18. అడగకుండా హెల్ప్ చేయకు
19. ఉచిత సలహాలు ఇవ్వకు
20. అప్పు ఇవ్వకు, తీసుకోకు
21. ఒకవేళ అప్పు కావాలి అంటే బ్యాంకు లో తీసుకో
22. అనవసర వస్తువులు కొనకు 
23. హోటల్స్ లో తినడం తగ్గించు
24. పని చేపించుకున్నాక ప్రతిఫలం ఇవ్వు
25. ఏదీ ఉచితంగా తీసుకోకు
26. ఆఫీస్ ని ఇంటికి మోసుకురాకు
27. రోజూ ఏమి చేయాలో ముందురోజు షెడ్యూల్ వేసుకో
28. ఇవాళ ఏమి చేశావో రాత్రి పడుకునేముందు నిన్ను నువ్వు అసెస్ చేసుకో 
29. సుఖంగా ఉండడానికి కాకుండా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు
30. ఉన్న రిలేషన్స్ చాలు. ఎక్కువ రిలేషన్స్ పెట్టుకోకు
31. నెలకు ఒకసారి ఎక్కడికైనా తిరిగి చావు
32. ఎప్పుడూ ఇంట్లోనే ఓ మూల మంచం మీద పడి చావకు
33. కథలు, కవితలు, వ్యాసాలు రాయి. రాయడం ఆపకు 
34. నేర్చుకోవడం మానేస్తే చచ్చినట్టే, రోజూ కొత్తగా ఉండాలి అంటే కొత్తగా నేర్చుకోవాలి 
35. జ్ఞానమే నీకు గౌరవాన్ని ఇస్తుంది. దాన్ని రోజూ సంపాదించుకో 
36. నమ్మిన వాళ్ళను మోసం చేయకు. ఒకళ్ళను నమ్మించాలని ఏదీ చేయకు.
37. నిన్ను నమ్మని వాళ్ళను దగ్గరకు కూడా రానివ్వకు
38. నవ్వడం మర్చిపోకు 
39. ఏడుపు వస్తే ఆపుకోకు
40. నిన్ను ప్రేమించే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, అందుబాటులో ఉండు
41. సొంతంగా నీ పనులు నువ్వే చేసుకో 
42. వీలైనన్ని పనులు నేర్చుకుంటూ ఉండు 
43. నీ ద్వారానే జరిగే పనులకు ప్రయారీటి ఇవ్వు. మిగతా పనులు వేరే వాళ్లకు అప్పగించు
44. 15 రోజులకు ఒకసారి హైర్ కట్ చేస్కో 
45. పొట్ట పెంచకు
46. బట్టతల, తెల్ల జుట్టు వస్తే పట్టించుకోకు. వయసుకు తగ్గట్టు ఉండడమే అందం అని గుర్తించుకో 
47. సాయం చేసిన వారి పట్ల కృతఙ్ఞతతో ఉండు
48. నిజాయితీగా మాట్లాడు. సందర్భాన్ని బట్టి సైలంట్ గా ఉండడం కూడా మంచిదే అని తెలుసుకో.
49. మనసులో ఒకటి ఉన్నప్పుడు బయట ఇంకొకటి చెప్పకు
50. మొహమాటపడొద్దు 
51. ఒకళ్ళ మెప్పు కోసం ప్రయత్నించకు 
52. తప్పు, పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకో, క్షమాపణలు చెప్పు, హుందాగా ఉండు 
53. కారణాలు, సంజాయిషీలు చెప్పడం తగ్గించు 
54. నిన్ను ప్రశ్నించి, నీతో పొట్లాడే వాళ్ళ వర్షన్ కూడా ఆలోచించు
55. రోజూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ & పిల్లల్తో టైం గడుపు
56. నీతో నువ్వు కనీసం ఒక 10 నిముషాలు అయినా రోజూ మాట్లాడుకో 
57. శుభ్రంగా ఉండు, నీ చుట్టూ శుభ్రంగా ఉంచుకో
58. ఆల్టర్నెట్ ఇన్కమ్ మీద దృష్టి పెట్టు.
59. ఒకళ్ళతో ఎవ్వర్నీ కంపేర్ చేయకు. ఒకళ్ళు నిన్ను, నీ భావాలని కంపేర్ చేస్తే సహించకు.
60. ఏసీ ఎక్కువ వాడకు.
61. గిఫ్ట్స్ తీసుకోకు. కాస్ట్లీ గిఫ్ట్స్ అస్సలు తీసుకోకు.
62. పొదుపు చేయి.
 *జీవితంలో ఈ మూడు దశల్లో విచారంగా ఉండకండి:*

(1)మొదటి శిబిరం :-
*58 నుండి 65 సంవత్సరాలు*
            
పని స్థలం మిమ్మల్ని తప్పించుకుంటుంది. మీ కెరీర్‌లో మీరు ఎంత విజయవంతుడైనా లేదా శక్తివంతుడైనా, మిమ్మల్ని సాధారణ వ్యక్తి అని పిలుస్తారు.   కాబట్టి, మీ గత ఉద్యోగం యొక్క మనస్తత్వం మరియు ఆధిక్యత యొక్క భావాన్ని పట్టుకోకండి

(2)రెండవ శిబిరం :-
*65 నుండి 72 సంవత్సరాలు*

ఈ వయస్సులో, సమాజం మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది.   మీరు కలుసుకునే మరియు కలుసుకునే స్నేహితులు మరియు సహోద్యోగులు తగ్గిపోతారు మరియు మీ మునుపటి కార్యాలయంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు. "నేను ఉన్నాను..." లేదా "నేను ఒకప్పుడు..." అని చెప్పకండి, ఎందుకంటే యువతరం మిమ్మల్ని గుర్తించదు మరియు మీరు దాని గురించి బాధపడకూడదు!

(3) మూడవ శిబిరం :-
*72 నుండి 77 సంవత్సరాలు*

ఈ శిబిరంలో, కుటుంబం మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది.   మీకు చాలా మంది పిల్లలు మరియు మనుమలు ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం మీరు మీ భాగస్వామితో లేదా మీ స్వంతంగా ఒంటరిగా జీవిస్తారు.

మీ పిల్లలు అప్పుడప్పుడు సందర్శించినప్పుడు, అది ఆప్యాయత యొక్క వ్యక్తీకరణ, కాబట్టి తక్కువ తరచుగా వచ్చినందుకు వారిని నిందించకండి, ఎందుకంటే వారు తమ స్వంత జీవితాలతో బిజీగా ఉన్నారు!

చివరకు 77+ తర్వాత, 
భూమి నిన్ను నాశనం చేయాలనుకుంటోంది.   ఈ సమయంలో, విచారంగా ఉండకండి లేదా దుఃఖించకండి, ఎందుకంటే ఇది జీవితంలో చివరి దశ, మరియు ప్రతి ఒక్కరూ చివరికి ఈ మార్గాన్ని అనుసరిస్తారు!

కాబట్టి, మన శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగా, జీవితాన్ని పూర్తిగా జీవించండి! 
మీకు నచ్చినది తినండి,
తాగండి, ఆడుకోండి మరియు మీకు నచ్చినది చేయండి.

సంతోషంగా ఉండు, సంతోషంగా జీవించు..

ప్రియమైన సీనియర్ సిటిజన్ సోదర సోదరీమణులారా,
           

58+ తర్వాత స్నేహితుల సమూహాన్ని ఏర్పరచుకోండి మరియు నిర్ణీత ప్రదేశంలో, నిర్ణీత సమయంలో కలుసుకుంటూ ఉండండి.   టెలిఫోనిక్ కాంటాక్ట్‌లో ఉండండి.   పాత జీవిత అనుభవాలను నెమరువేసుకుంటూ ఒకరికొకరు పంచుకోండి. 
        
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి.🙏😊
 🕉️ *జై శ్రీ సత్యసాయి రామ్* 🕉️


*_"గాలి కనిపించనంత మాత్రానా ఊపిరి పీల్చడం మానేయడం లేదు కదా! అలానే దేవుడు కనిపించనంత మాత్రానా నమ్మడం మానేయకూడదు. బ్రతకాలంటే గాలి పీల్చాలి తప్పదు. ఆనందమును అనుభవించాలంటే దేవుని నమ్మి తీరాలి. నిజానికి దేవుడు కనపడాలి అని కోరుకునే కంటే దైవత్వాన్ని అనుభవించాలి అని కోరుకోవడం ఉత్తమం. కలియుగంలో  ఇది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి!. అయినా దైవత్వాన్ని అనుభవించకుండా దేవుని చూసి ఏమి చేస్తారు??! నిజ తత్వాన్ని అనుభవించనివారు నిజ రూపాన్ని దర్శించి ఏమి చేస్తారు? కనుక నిజ భక్తులు ఎల్లపుడూ దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఉన్నపుడు, మన భక్తిలో విశ్వాసములో నిజం ఉన్నదని ఆయన అనుకున్నపుడు ఆయనే ఏదో రీతిగా  దర్శనం ఇస్తాడు."_*

వ్రణ చికిత్సా న్యాయము"

 శ్రీమద్రామాయణము.

(211వ ఎపిసోడ్),

""""""వ్రణ  చికిత్సా  న్యాయము"""""

"" వైద్యో నారాయణో హరిః""ఇది అనాదిగా వస్తున్న నానుడి. వ్యాధులనుండి రక్షిస్తున్న వైద్యుని నారాయణ స్వరూపముగ చూడటము హైందవ సాంప్రదాయము.అటువంటి నారాయణ స్వరూపము చేసే పనులన్నియు దైవకార్యాలే.ఇక్కడ అందరము గమనించుకోవాల్సినది వైద్యుడు రోగికి చక్కని ఆరోగ్యము చేకూర్చలనే తపనతో శరీరములో చెడిపోయిన భాగాలను శస్త్రచికిత్స చేసి తొలగించును.దానికై పదునైన కత్తులతో రోగి శరీరాన్ని కోయునప్పుడు తాత్కాలికముగ రోగికి బాధ కలిగినను తదుపరి అతనికి స్వస్థత కలిగి ఆరోగ్యముగ నుండును.ఈ శస్త్ర చికిత్స రోగిని హింసించుటకో బాధపెట్డుటకో చేయునది కాదుకదా.చికిత్సానంతరము అతడు ఆరోగ్యవంతడై ఆనందముగ జీవించును.""దీనినే "" వ్రణచికిత్సాన్యాయము అని పిలచెదరు.

రామాయణము అయోధ్యాకాండములో రెండు ముఖ్యమైన సంఘటనలో పై న్యాయమును అన్వయము చేసుకొన వచ్చును రాముడు వంచించాడనో మభ్యపెట్టడనో కొంత మంది భావన చేస్తుంటారు.

"" తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః""
సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా|,(40-46),

""నాశ్రౌషమితి రాజానమ్ ఉపలబ్దో~పి వక్ష్యసి|,
చిరం దుఃఖస్య పాపిష్టమ్ ఇతి రామః తమబ్రవీత్""(40-47),

సుమంత్రుడు సీతారామలక్ష్మణులను రథముపై ఎక్కించుకొని వనవాసమునకు తీసుకు వెడుతుండగ,దశరథుడు " హా రామా హా సీతా హా లక్ష్మణా అని విలపిస్తు  'సుమంత్రా రథమును ఆపుమ'ని గట్టిగ అరుస్తున్న సందర్భములో తన తల్లితండ్రుల శోకము గుర్తించి రాముడు సుమంత్రునితో "ఓయీ రథమును త్వరగా పోనిమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
రాముడు రథాన్ని త్వరగా తోలమంటున్నాడు.అక్కడ మహారాజు ఆగమని ప్రాధేయపడుతున్నాడు.ఈ సంకటస్థితోలో రాముడు సారథి స్థితి గమనించి " ఓయీ  నీవు తిరిగి అయోధ్యకి వచ్చినప్పుడు 'నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని' మహారాజు అడిగితే నేను వినలేదని" చెప్పు. ఏలనగా ఇట్డి దుఃఖపరిస్థితిలో యున్న రాజును ఓదార్చుటకు ఇది సమయము కాదని చెప్పవచ్చునని అనునయిస్తాడు.
ఇక్కడ రాముడు మహారాజుని మభ్యపెట్టి వంచనకు గురి చేయమని ఆజ్ఞాపించాడని అనుకునే అవకాశము కలదు.అక్కడ రోగికి చేసే శస్త్రచికిత్సలో కత్తి వాడటము వంచన మోసము ఎలాకాదో ఇక్కడ రాజాజ్ఞ ధిక్కారముగానీ మభ్యపెట్టుట అనే విషయము అసంబద్దము. నేను "వినలేదు" అనుమాటకు అర్థము అవును మీ ఆజ్ఞ పాటించలేదని కూడ వచ్చును.కనుక అది అనృతము కాదని రెండవ వ్యాఖ్యానము.

ఇక  వనవాసమునకు బయలదేరునప్పడు అయోధ్యా వాసులు పెక్కురు రాముని రథమును వెంబడించి బయలదేరిరి.అలా వారందరు తమసా నదీ తీరానికి చేరి ఆ రాత్రి అక్కడ బస చేసారు.అంత రాముడు ఉషఃకాలముననే లేచి సీతాలక్ష్మణులను నిదురనుండి లేపి సుమంత్రుని చేరి రథమును సిధ్దము చేయమని అంటూ ఈ అయోధ్యా పురవాసులు భార్యాపుత్రులను వదలి మనవెంట వచ్చారు.వీరి పట్టుదల మనలను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లుటయే.కనుక వీరు నిద్ర లేవకమునుపే వీరు పసిగట్టలేని మార్గమున వేగముగ వెళ్లీపోదామని ప్రయాణము సాగిస్తాడు.

"'ముహూర్తం త్వరితం గత్వా నివర్తయ రథం పునః,
యథా న విద్యుః పౌరా మం తథా కురు సమాహితః||,(46-31),

ఓ సారథీ ముందు రథాన్ని ఉత్తరదిశగా అనగా అయోధ్య వైపు మళ్లించు.తదుపరి రథాన్ని అటునిటు చాలాసార్లు త్రిప్పుము.అని రథపు చక్రజాడలు ప్రజలు గుర్తించవీలు లేకుండగ కోసలదేశపొలిమేరలు దాటి గంగాతీరమునగల శృంగబేరపురమును చేరిరి.

ఇక్కడ రాముడు తన ప్రజలను మభ్యపెట్డి వారిని గందరగోళ పరుచుట వంచనక్రింద మనము గ్రహించరాదు.అట్లు మభ్య పెట్టకపోయినచో వారందరు తమ తమ భార్యాబిడ్డలకు దూరమై ఇబ్బంది పడెదరు.ఈ విధముగ చేసినచో వారు గత్యంతరములేక అయోధ్యకు తిరిగి వెళ్లెదరు.వారికి వనజీవన బాధలు తప్పును.కనుక ఇది వంచనక్రిందకురాదు.

కొన్ని కొన్ని సమయాలలో మన పనులు ఇబ్బందికరములైనను తర్వాత వారికి ఆనందము కలిగినయెడల అట్టి కార్యములు సదా ఆహ్వానింపదగినవే యని గ్రహించాలి.

కనుకనే రామాయణము మనకోసము ఆరాటపడేవారికి, మన శ్రేయస్సు కోరుకునేవారికి తాత్కాలికముగ వారికి కష్టము కలిగినను వారికోసం  వారి ఆనందముకోసము నిష్కర్షముగ కొన్ని కొన్ని పనులు చేయుటలో తప్పులేదని తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.

****చిన్న సందిగ్ధాలకు కూడా రామాయణంలో సమాధానం దొరుకుతుంది అన్నాడు."

 *సత్సంగం!!!*

ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి ఒకాయన రైల్వేస్టేషన్ లో
కూర్చుని తను ఎక్కాల్సిన రైలు కోసం ఎదురు చూస్తూ రామాయణం చదువుకుంటూ కూర్చున్నాడు.
ఓ యువకుడు భార్యతో సహా వచ్చి పక్కనే నిల్చుని ఇలా
అంటున్నాడు.
“మీ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే చదవడానికి ఇంకే
పుస్తకం లేనట్టు ఎప్పుడు చూసినా రామాయణం పట్టుకుని చదువుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎన్నో పుస్తకాలుండగా మీరింకా రామాయణమే చదువుతున్నారు. అసలేంటి దాని గొప్ప?” అని అడిగాడు.
ఆ వ్యక్తి ఏమీ సమాధానం ఇవ్వకుండా
చిరునవ్వు నవ్వుకుంటూ చదవడంలోనే లీనమైపోయాడు. రైలు రావడం మరో అర్ధగంట ఆలస్యం కావడంతో ఆ యువకుడు అలా బయటకి వెళ్ళొచ్చాడు. అతను తిరిగొచ్చేసరికి
ఆయన ఇంకా రామాయణం చదువుతూనే కనిపించాడు. అతనికింకేమీ తోచక ఆ పల్లెటూరి వ్యక్తిని ఇంకా విమర్శించడం మొదలుపెట్టాడు.
కొద్ది సేపటి తర్వాత రైలు రానే వచ్చింది.
సీటు కోసం అందరూ తోసుకుంటూ ముందుకు చొరబడిపోతున్నారు. లోపలికెళ్ళేసరికి ఆ యువకుడు, పల్లెటూరాయన పక్క పక్క సీట్లలోనే కూర్చుని ఉన్నారు. ఆయన మాత్రం రామాయణం చదవడం మానలేదు.
ఉన్నట్టుండి ఆ యువకుడు భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. ఎక్కడా కనపడ లేదు. అప్పటికే బయల్దేరిన రైలు ఆపడానికి గొలుసు లాగాడు. ఇంకా ప్లాట్ఫారం మీదనే ఉందేమోనని ఆతృతగా
వెతుకుతున్నాడు.
అప్పుడా పల్లెటూరాయన “నువ్వు రామాయణం చదువుంటే నువ్వు ఈ పొరబాటు చేసుండేవాడివి కావు” అన్నాడు.
“ఏంటీ?” అతను ఆశ్చర్యంగా చూశాడు.
అప్పుడాయన ఇలా అన్నాడు.
“రామాయణంలో రాముడు, సీతాలక్ష్మణ సమేతుడై గంగా తీరాన నిలిచి ఉన్నాడు. అప్పుడే పడవ వచ్చి ఆగింది. రాముడి ముందు సీతని అందులో ఎక్కమని తర్వాత తను ఎక్కాడు”
నువ్వు నన్ను ఇంతకుముందు అడిగావు కదా?
రామాయణం ఎందుకు చదువుతూ ఉంటావనీ… ఇందుకే చూశావా ఇలాంటి
చిన్న సందిగ్ధాలకు కూడా రామాయణంలో సమాధానం దొరుకుతుంది అన్నాడు."

కొన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారి జోకులు.

 *కొన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారి జోకులు.*

*రచన : ముళ్ళపూడి వెంకటరమణ*


 *వకీళ్ళు* 
    
 
“డాక్టర్, మంచినీళ్ళకు వెళ్ళి వస్తూండగా మంచం కోడు తగిలి కాలు బెణికింది, ఏం చెయ్యమంటారు?" అడిగారెవరో ఫోనులో.

"కుంటండి" అన్నాడు డాక్టరు మండిపడి.

"అలాగేనండి. అర్ధరాత్రిగదా, ప్రస్తుతానికి నిద్రపోతాను. రేప్పొ ద్దున్న మీ సలహా పాటిస్తా వీలైతే" అన్నాడు ఇవతలి మనిషి తొణుకూ బెణుకూ లేకుండా.

మర్నాడు డాక్టరుగారు ఒక పెళ్ళికి వెళ్ళారు. అక్కడ లాయరు మిత్రుడు కనిపించాడు. మాటల సందర్భంలో ఈ వైనాలన్నీ చెప్పి, " ఇలాటి వాడికి బిల్లు పంపాననుకోండి ఫోను చేసినందుకు. దావా వేస్తే డబ్బొస్తుందంటారా ?"

"నిక్షేపంలా బిల్లు పంపండి, వృత్తిరీత్యా మీరు చెప్పే ప్రతి మాటకీ డబ్బు పుచ్చుకోవలసిందే." అన్నాడు లాయరు.

మర్నాడు ఉదయం డాక్టరుగారికి ఒక బిల్లు అందింది నిన్నటి సలహాకి లాయరుగారి ఫీజు బిల్లు ఆది.
    
😄
కోర్టుతో జోస్తీ జాస్తిగా ఉన్న ఒక ముద్దాయి, లాయర్లు వాదించే పద్ధతులు చూసి చూసి, ఒకసారి తన తరపున తనే వాదించబోయాడు.

"నువ్వు బ్యాంకులో దొంగతనానికి వెళుతుండగా చూసినట్టు ఈయన సాక్ష్యం" అన్నాడు ప్రాసిక్యూటరు.

"ఏవయ్యా సాక్షి, నేను బ్యాంకులో కెళుతుండగా నువ్వు చూశావా?" అన్నాడు దొంగ.

"అవును చూశాను"

"మళ్ళీ తిరిగి యివతలకి వస్తూండగా చూశావా?"

"లేదు"

"చూశారాండి. సాక్షి ప్రకారం నేనింకా అక్కడే ఉన్నానన్న మాట, కాని నిజానికి ఇక్కడే ఉన్నాను గదా, ఈ కేసు అబద్దం అన్న మాట" అన్నాడు దోషి.
😁

"నీ జన్మలో ఎక్కడేనా ఓ రూపాయి డబ్బులు గడించిన పాపాన పోయావూ?" అని గర్జించాడు లాయరు.

"చిత్తం. కిందటేడు మీరు ఎలక్షనుకి నిలబడ్డప్పుడు మీకు ఓటివ్వడానికి మీదగ్గరైదు రూపాయలుచ్చుకున్నా గదండి. "
😆

“నీతరుపున వాదించడానికి లాయర్ని పెట్టుకోవా?" అన్నాడు న్యాయమూర్తి విచారణ ఆరంభిస్తూ.

"అబ్బే ఎందుకండీ. నే నెలాగా నిజం చెప్పేద్దామనుకుంటున్నాను. ఇంక లాయరెందుకూ?" అన్నాడు ముద్దాయి..

😃
ఒక ఆసామి కారు ప్రమాదంలో దెబ్బ తిన్నాడు. కాలుపోయింది. కర్ర దున్నలు పెట్టారు.

మూణ్ణాల్లయినా అతను ఆ కర్రలు పట్టుకునే నడవసాగాడు, కట్లు అలానే ఉంచి. 

"అదేమిటి? ఈ పాటికి నయమైపోయుం టుందే. కట్లు విప్పి, ఆ కర్రలు కూడా పారెయ్యొచ్చుగా" అన్నాడొక మిత్రుడు.

"డాక్టరుగారు అదే అంటున్నారు, ఇవన్నీ తీసెయ్యొచ్చని, ప్లీడరుగారు ఒప్పుకోటం లేదింకా."    
 😀
" మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".

"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక" 
🤣


కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.
😂

"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."
😁

"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".
😃

"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."
😆

"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని   పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.
🤣

"డాక్టర్ గారూ, భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"
😅

 ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ 
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?" 
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే..
😁

అమ్మల గన్నయమ్మ! - అంటే ఎవరూ? “అమ్మమ్మండీ?”
😆

*భశుం*
💐

꧁☆•┉┅━•••❀❀•••━┅
 ★ 'సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!... సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిజినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?' ఈ డైలాగ్స్ విన్న వెంటనే గుర్తొచ్చే పేరు ముత్యాలముగ్గు అలా సరైన టైమింగ్ తో అద్భుతమైన డైలాగ్స్ రచనతో ఈలలు వేయించిన ఆయన పేరు తెలియని ఆంధ్రుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే తెలుగువారి నేస్తం బుడుగు కళ్ల ముందు ప్రత్యక్షమై పెదవులపై చిరునవ్వు మెరువని పాఠకులు ఉండరనే నిజానికి రూపమై నిలిచిన "ముళ్ళపూడి వెంకటరమణ" 93 వ జయంతి (28-6-1931) నేడు.

★ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఉదరపోషణార్థం ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి వచ్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తల్లి విస్తరాకులు కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన బ్రతుకు పోరుని స్మరిస్తూ ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం' అన్న ఆ మాటల వెనుక ఉన్న మానవత్వం నిండిన ఆత్మవిశ్వాసం ఏ తరానికైనా తరగని వెలుగును చూపే హృదయ దీపం.

★ గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన ప్రతి చిత్రం ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడోసుకునేవి. భద్రాద్రి రాముడి దర్శనం తో  రచన పూర్తి చేసుకొనేవి. మొదట్లో ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా ఆయనలో రచయిత కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, సినీరంగ ధోరణులపై విసుర్లు, సమీక్షలను అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ ఆసక్తికరంగా చదివేవారు. అలా డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్‌ నటించిన గుడిగంటలు, మూడో సినిమా ఏఎన్నార్ నటించిన మూగమనసు లు. మూడూ సూపర్‌ హిట్‌ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఆరుకాయలై పండింది.

★ ఇప్పుడైతే తెలుగువాళ్లు తమ భాషలో ఆలోచించలేని వాళ్ళు అయ్యారు కాని, కొద్ది కాలం క్రితం రమణ గారు పుట్టించిన బుడుగు ప్రసక్తి లేకుండా రోజు గడించేది కాదంటే అతిశయోక్తి కాదు. వారి హాస్య, వ్యంగ్య కథలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను నిలుపుకున్నాయి. వైవిధ్య భరితమైన, విస్తృతమైన ఈ కథల నుంచి పలుకుబళ్లు, కొత్త పదాలు, కొత్త అర్థాలు, తెలుగువాళ్ల మాటల్లో, పాటల్లో భాగమయ్యాయి.

★ జీవితపోరాటంలో పోర్టు గుమస్తా, ప్రూఫ్ రీడర్, పత్రికా సంపాదకుడు, ఫ్రీలాన్స్ జర్నలిజం, సినీ రచన, సినీ నిర్మాత వంటి ఎన్నో వృత్తులు చేసిన ముళ్లపూడి వెంకటరమణ అనుభవాలు ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. ఆ అనుభవదీపపు వెలుగుల్లో మనల్ని సరైన దారుల్లో నడుతాయి. దురదృష్ట వశాత్తు మనం తెలుగు చదవడం న్యూనతగా భావించే భ్రాంతిజీవులమైనా ము.

★ బాపుతో జట్టు కట్టకముందే కొన్ని చిత్రాలకు కథ సంభాషణలు సమకూర్చి నా సాక్షి నుంచి శ్రీరామ రాజ్యం వరకూ బాపుతోనే ప్రయాణించి ఎన్నో కళాఖండాల రూపకల్పనలలో బాపు సగమైతే, తాను మరో సగమయ్యారు. తెలుగు భాషకు, సంస్కృతికి, సంప్రదాయానికి వెలుగైనారు.

★ రమణ సృష్టించిన అన్ని పాత్రలలోనూ అగ్రగణ్యుడు బుడుగు. చివరిగా ఒక్క మాట... తెలుగువారు మాత్రమే ఎంజాయ్ చేయగలిగిన భాష 'బుడుగు' ది. ఇతర భాషల్లోకి అనువదింపబడటా నికి వీలు పడనిది బుడుగు. తెలుగు వారికి మాత్రమే బుడుగు చదివే అదృష్టం ఉంది. చదవండి. మళ్ళీ చదవండి. పిల్లలకు చదవడం రాకపోతే చదివి వినిపించండి. వాళ్ళ చిరునవ్వుల్లో మీ బాల్యాన్ని వెతుక్కోండి. ఆయన ఆత్మకథ కోతి కొమ్మంచి చదివి తెలుగువాళ్ళము అని గుర్తు తెచ్చుకుందుముగాక!
 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•
 *నవ్వుతూ ఏడిపిస్తుంది జీవితం* 
*ఏడుస్తుంటే లాలిస్తుంది ఆసాంతం..* 


*నేడు( 28-6-1931) ముళ్ళపూడి వెంకటరమణ గారి 93 వ పుట్టినరోజు సందర్బంగా...*


8వ ఏట వరకు తన ఇంట చక్రవర్తి వైభోగం, తండ్రి మరణంతో తల్లకిందులైన కుటుంబం, పదవ తరగతి వరకే చదివిన పురాణాలు, గ్రంధాలు, తెలుగు, ఇంగ్లీష్ నవలలతో అపార జ్ఞానం, మద్రాసులో మెట్ల కింద చిన్న గదిలో అమ్మ, అమ్మమ్మ తో కలసి మొదలుపెట్టిన కష్టాల జీవితం,
హార్బర్ లో కూలీ పని చేయడం, పది రూపాయల కోసం చొక్కా గుండీలు, విస్తరాకులు కుట్టడం, నెలకి పావలా కోసం ట్యూషన్స్ చెప్పడం, తినడానికి తిండి లేకుండా, వేసుకోడానికి రెండు జతల బట్టలు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా దుర్భరమైన పేదరికాన్ని, ఆకలితో అలమటించిన రోజుల్ని, నిరుద్యోగ పర్వాన్ని అన్నింటినీ కూడా ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవడం...

ఎన్ని కష్టాలు ఎదురైనా తన సృజనాత్మకతపై వీడని నమ్మకం, ఆకలి కన్నీటి జల్లుల్లో నవ్వుల పన్నీటి చినుకుల్ని కలుపుకుంటూ సాగిన జీవితం, జీవిత రథచక్రాల కింద పడి నలిగితే తప్ప మనిషనేవాడు రాటుదేలడు అన్నట్లుగా ఎన్నిసార్లు జీవితం తనని అణగదొక్కడానికి చూసినా, దాదాపు పదేళ్ళ పాటు ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొని ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంధం.

ఆయన రచనలు పదహారణాల తెలుగు తనానికి ప్రత్యక్ష సాక్ష్యం, మాటలు ముత్యాల మూటలు, రామాయణం ఆయనకు అత్యంత ప్రియం, ఆయన రామభక్తి అపారం, బాపు ఆయన ప్రాణ నేస్తం....

మన తెలుగింటి చిచ్చర పిడుగు బుడుగు సృష్టికర్త, హాస్య చక్రవర్తి, మేటి సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారికి జయంతి శుభాకాంక్షలు 

రవణ (షార్ట్ కట్ లో ఇలానే అంటారుస్మీ) పుట్టినప్పుడు ఏం జరిగిందనే ఆసక్తి అందరికీ ఉండటం సహజం. దానికీ రవణే ఇలా సమాధానం చెప్పుకున్నారు.

గోదారి కెడాపెడాగా నేను తూగోజీలో, బాపు పగోజీలో పుట్టాం – ట. అప్పుడు ప్రపంచంలో పూలవాన కురవలేదు. ప్రళయాలు రాలేదు. గంధర్వులు పాడలేదు. కోకిలల్ని ‘కుహూ’ అనమంటే ‘ఊహూ’ అన్నాయని గిట్టని వారి ప్రచారం – అచ్చరలాడలేదు (దుబాయి టూరు వెళ్ళాయిట) పేపర్లు సప్లిమెంట్లు వేయలేదు. టీవీ యాంకర్లు ‘హలో బాపూ అండీ హలో రవణాంకుల్’ అని గ్రీటింగ్సులు చెప్పలేదు. భూచక్రంలో భూమండలంలో ఆ రోజు తెల్లారగానే సూర్యుడు మామూలూగానే ఉదయించాడు. ఆ రాత్రి చంద్రుడు కూడ అలవాటు ప్రకారం వెన్నెలే కాశాడు. చుక్కలు తళుకు తళుకు మన్నాయి. కొబ్బరాకులు మిలమిలమన్నాయి. పువ్వులు పూశాయి…” 

***

ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న ధవళేశ్వరంలో జన్మించారు. ఇతని అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనం లోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్థిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు.

1945లో "బాల" పత్రికలో రమణ మొదటి కథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 

1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిన బుడుగు వ్రాశారు. దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.

ఆయన మొదటగా మాటలు రాసిన మూడు సినిమాలు ఘనవిజయం అందుకున్నవే.. అవి రక్తసంబంధం, గుడిగంటలు, మూగమనసులు..

ఇతర సినిమాలు-ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు, దాగుడుమూతలు, ప్రేమించి చూడు, తేనె మనసులు, కన్నె మనసులు, నవరాత్రి, పూల రంగడు, ప్రాణమిత్రులు, సాక్షి, బంగారు పిచుక,  బుద్ధిమంతుడు, కథానాయకుడు, బాలరాజు కథ, భలే రంగడు, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, గోరంత దీపం, జీవన జ్యోతి, కలియుగ రావణాసురుడు, రాజాధి రాజు,  సీతా కళ్యాణం,  మనవూరి పాండవులు, రాజాధిరాజు, వంశవృక్షం,  పెళ్ళి పుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధా కళ్యాణం,  త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు, రాధాగోపాలం, జేబుదొంగ, మంత్రిగారి వియ్యంకుడు, బుల్లెట్, జాకీ, కళ్యాణ తాంబూలం, శ్రీనాథ కవి సార్వభౌముడు, పెళ్ళి కొడుకు, రాంబంటు, సుందరకాండ, శ్రీరామరాజ్యం..

ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని:

బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన

ఋణానందలహరి (అప్పుల అప్పారావు - అప్పుల ప్రహసనం

విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం

గిరీశం లెక్చర్లు - సినిమాలపై సెటైర్లు

రాజకీయ బేతాళ పంచవింశతి - రాజకీయ చదరంగం గురించి

ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం 

అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి

కథా రమణీయం - 1 : సీతాకళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు

కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు

బాల రమణీయం : బుడుగు
కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు

కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు

సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు

సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109

కోతి కొమ్మచ్చి: ఆయన జీవిత చరిత్ర. స్వాతి పత్రికలో ప్రచురితమైంది.
ఇద్దరు మిత్రులు (వెండితెర నవల)
తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు

రమణీయ భాగవత కథలు
రామాయణం (ముళ్ళపూడి, బాపు)
శ్రీకృష్ణ లీలలు
🥰
 
꧁☆•┉┅━•••❀❀•••━┅

Story ఇత్తడి సామాను

 ఇత్తడి సామాను

ఉదయం 6:00  గంటలు అయింది. రాజమ్మ గారు స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని   హాల్లో టీవీలో వార్తలు చూస్తున్న  పెద్ద కొడుకు రఘు దగ్గరకొచ్చి "ఒరేయ్ రఘు ఒక పెద్ద వ్యాన్ తీసుకురా అలాగే ఇద్దరు మనుషుల్ని కూడా పురమాయించు. పైన ఉన్న ఇత్తడి సామాను అంతా మనం రాజమండ్రి పట్టుకెళ్ళి  అమ్మేద్దాం అంటూ తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాడు రఘు. "అమ్మలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని ఆలోచించసాగాడు. ఒరేయ్ నా మాటలు వింటున్నావా లేదా అంటూ రెండోసారి రెట్టించేసరికి అలాగే అమ్మ అంటూ స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు.

రఘు రాజమ్మ గారి పెద్ద కొడుకు. రాజమ్మ గారికి నలుగురు కూతుళ్లు  నలుగురు కొడుకులు పెళ్లిళ్లు అయిపోయి అంతా హైదరాబాదులోనే సెటిలైపోయారు. రాజమ్మ గారు మాత్రం  ఆ ఊరు వదలలేదు. లంకంత కొంప.  చేతినిండా పనివాళ్ళు. నెలకొకసారి రఘు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమ్మ గారి బాగోగులు చూసుకుని వెళ్తాడు. మిగిలిన పిల్లలు పండక్కి పబ్బాలకి వచ్చి వెళుతుంటారు.

రాజమ్మ గారికి ఆ ఇత్తడి సామానికి అవినాభావ సంబంధం ఉంది. ఆమె వాటిని కన్నతల్లిలా  చూసుకుంటుంది. ఎవరి చేతిలో నుంచి అయినా చెంబు జారిపోతే అయ్యో సొట్టపడిపోతుంది రా ఎప్పుడో మీ తాతయ్య అజ్జరం నుంచి తీసుకొచ్చిన  చెంబు అంటూ ప్రతి సామానుకి ఒక కథ చెబుతూ ఉంటుంది. ఆ సామాను ఏ సందర్భంలో కొన్నారు ఎక్కడ కొన్నారు సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది అన్ని చెప్పుకుంటూ వస్తుంది. ఆ సామాను అంటే రాజమ్మకు అంత మమకారం. ఒక ఇత్తడి సామాన్లు కొట్టులో కూడా ఇన్ని రకాలు ఉండవేమో ఆ ఇంట్లో మటుకు తాతలనాటి  ఇత్తడి సామాను అంత ఉంది. అప్పట్లో ఇత్తడి సామాన్లు వాడకం ఎక్కువగా ఉండేది. దానికి తోడు రాజమ్మ  కుటుంబం జమిందారీ కుటుంబం. 

ఆ రోజుల్లో ఆడపిల్లల్ని అత్తారింటికి పంపేటప్పుడు ఇత్తడి సామాను సారెగా పెట్టేవారట. అంతేకాకుండా ఎప్పుడు ఇంట్లో సంతర్పణలు సమారాధనలు జరుగుతూ ఉండేవి ట. అందుకోసం వంట పాత్రలు రకరకాల సైజులలో ఇత్తడి గుండిగలు, ఇత్తడి కళాయిలు ,గోకర్ణాలు కొమ్ము చెంబులు మర చెంబులు గ్లాసులు పళ్ళాలు మర చెంబులు ఒకటి కాదు రకరకాల సామాన్లు ఆ కాలంలో కొని పని అయిపోయిన తర్వాత కొన్ని వాడుకోవడానికి ఉంచి మిగిలినవి శుభ్రంగా చింతపండు వేసి తోమించి మిద్ది మీద దాచేవారు. మధ్యలో స్టీల్ సామాను వచ్చి ఇత్తడి సామాను  వాడకం మానేశారు.

ఇప్పటి కూడా రాజమ్మ ప్రతి పండక్కి ఆ సామానంత కిందకి దింపించి ఇద్దరు మనుషులు పెట్టి చింతపండు తో తోమించి అటక మీదకి ఎక్కించే సాంప్రదాయం కొనసాగిస్తూనే ఉంది.
అయితే మొన్న సంక్రాంతి పండక్కి సామానంత కిందకి దింపించి శుభ్రంగా తోమించి పిల్లలందరినీ పిలిచి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని రాజమ్మ చెప్పింది. అయ్య బాబోయ్ ఇత్తడి సామానా మాకు పెట్టుకోడానికి చోటు లేదు అని ఒకళ్ళు, తోమించడానికి పనిమనిషి లేదని ఒకరు , అంత బరువైన సామాను మొయ్యలేమని ఒకరు, ఇత్తడి సామానుతో వండితే గ్యాస్ అంతా ఒక్కరోజులోనే అయిపోతుందని ఒకరు ,ఇలా తడుముకోకుండా  పిల్లలందరూ కారణాలు టకటక చెప్పేసారు.

 రాజమ్మ గారు మళ్ళీ మాట్లాడకుండా మీకు వీటి విలువ తెలియదు. ప్రతి సామాను వెనుక ఎంతో అభిమానం ఆప్యాయత ఉన్నాయి. ఈ ఇత్తడి పళ్ళెం నా పెళ్లి నాటిది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎలా ఉంది.వీటి విలువ రూపాయల్లో లెక్కపెట్టుకున్న సరే అప్పటికి ఇప్పటికి ఎంతో పెరిగింది. ఆరోగ్యరీత్యా కూడా ఇవి చాలా మంచివి. వీటితో వండిన ఆహార పదార్థాలు తిని మేము ఇప్పటికీ రాళ్లల్లా ఉన్నాము. మీరు ఆ స్టీలు గిన్నెలలో అన్నం వండుకుని ఇలా రోగాలు బాధపడుతున్నారు. మీరు వాడే సామాన్లు మహా అయితే రెండు మూడేళ్లు వాడుకుంటారు. కానీ ఇత్తడి సామాను వయస్సు వంద సంవత్సరాలు పైనే ఉంటుంది. నాకంటే పెద్దవి. ఇవి మన పూర్వీకులు ఆస్తి  అంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి రాజమ్మ సామానంత మిద్దెక్కించేసింది. 
అనుకున్నట్టుగానే రఘు వ్యాన్లో ఇత్తడి సామాను అంతా ఎక్కించి రాజమ్మను కారులో ఎక్కించుకొని రాజమండ్రి బయలుదేరాడు . సామాను వ్యాన్లో ఎక్కిస్తున్నప్పుడు రాజమ్మ మౌనంగా ఉండిపోయారు. అంటే ఏదో మనసులో బాధపడుతుంది అన్నమాట.  అలా రాజమండ్రి చేరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షాపులో కూర్చుని రాజమ్మ బేరమాడి  ఆ సామాను అంతా అమ్మేసింది. ఒకటా రెండా నాలుగు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ రూపాయలన్నీ రఘు చేతులో పెట్టి కళ్ళు తుడుచుకుంది రాజమ్మ.  రాజమ్మ ఉద్దేశం రఘుకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయమని. పిల్లలందరికీ  సమానంగా ఇవ్వమని అర్థం కాబోలు. మౌనంగా ఉన్న అమ్మని ఏమీ పలకరించకుండానే కారులో ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసా రు. మర్నాడు రాత్రి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు రఘు. వెళ్లేముందు ఆ సొమ్ము ఏం చేయాలో కూడా చెప్పలేదు రాజమ్మ. 

రఘు హైదరాబాద్ వెళ్లిన వెంటనే తమ్ముళ్ళకి చెల్లెలికి అక్కలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. మనం సామాను పట్టుకు వెళ్ళకపోవడం మూలాన్ని అమ్మని బాధ పెట్టినట్టున్నాము. అయినా మన పరిస్థితి మనది. ఆ సామాను మనం తెచ్చుకున్న పెట్టుకోవడానికి చోటు లేదు. నిత్య కృత్యానికి ఉపయోగించలేము. 

అయితే ఈ సొమ్ము మనం కూడా ముట్టుకోకుండా అమ్మ పేరున  వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చేద్దాం అన్నారు అందరూ. వెంటనే ఆ పని పూర్తి చేసి రాజమ్మ కి ఫోన్ లో విషయం అంతా పూర్తిగా చెప్పాడు. పిల్లలు చేసిన మంచి పనికి రాజమ్మ ఎంతగానో సంబరపడింది. ఇన్నాళ్లు ఎన్నో సంతర్పణలకు ఉపయోగించిన ఈ సామాను ఇప్పుడు పరోక్షంగా మళ్లీ నిత్య అన్నదానానికి ఉపయోగపడడంతో ఆనంద పడింది రాజమ్మ. 

కాలం మారిపోయింది. వేష భాషల్లో ను వస్త్రధారణలోను ఇంటిలో ఉండే సామాన్లలోను చాలా మార్పులు వచ్చేసాయి. ఎంతోకాలంగా అపురూపంగా చూసుకున్న సామాన్లు ఇప్పుడు ఎవరు వాడడం లేదు. అవి మిద్దె మీద పెట్టడం తప్పితే. ఉమ్మడి కుటుంబాలు విడిపోయి కుటుంబాలన్నీ వలసపోయి అపార్ట్మెంట్లో కాపురాలు వచ్చి అధునాతన సామగ్రి మీద మోజు పెరిగి ఆ పాత తరం సామాన్లు ఏం చేయాలన్నది ఈనాటి సీనియర్ సిటిజెన్లకి ఒక తీరని సమస్య. 

రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ
 వేసవిలో...🌸
 బుజ్జాయిల జ్ఞాపకాలు!

ఖాళీ అయిన పిట్ట గూడులా నా మనసు...
వేసవి సెలవులకి ఊరెళ్లిన 
మా బుజ్జాయిల జ్ఞాపకాలు 
పాత ఛాయా చిత్రాలతో ఊసులు!
పెరిగిన ఉష్ణోగ్రతల కంటే 
అసౌకర్యంగా...
అదోలా...
ఏమి తినబుద్ధికాకుండా,
రాత్రిళ్లు నిద్ర లేకుండా!

పెన్సిళ్లతో గోడలపై అల్లరిగా 
గీసిన పిచ్చిగీతలు,
అక్కడక్కడా పడేసిన పేపర్ పడవలూ, రాకెట్లు!
ఆ మూల ఈ మూల పడున్న కలర్ ఫుల్ వాటర్ బాటిళ్ళు!
మమ్మల్ని హత్తుకునేది ఎవరని ప్రశ్నించే టెడ్డీ బేర్లూ... పిల్లోలు!

పండుగాడు పక్కనజేరి "కతజెప్పునానీ "
అంటున్నట్టే ఉంది!
బిట్టు అల్లరిగా సెల్ లాక్కున్నట్టే ఉంది!
ఇల్లు ఇల్లంతా పిల్లలేరబ్బా అని వాపోతున్నట్టే!!

కళ్లజోడు లాగి పెట్టుకోని 
ఫోజివ్వడం...
చేతి గాజులు సవరిస్తూ పాట పాడటం 
చిన్నిమనసుల్లో నా వాళ్ళు అనే భరోసా!
కోట్లు కుమ్మరించినా దక్కని మమకారం!
ఈ వేసవిలో చిన్నారులకి 
హైదరాబాద్ ఎగ్జిబిషన్లు, స్నో ల్యాండ్ విహారాలు...
ఒక్కోటి వాళ్ళబాల్యం గుర్తులు!!

✍️ఎం. వి. ఉమాదేవి.

భగవంతుని అనుగ్రహం*

              *_నేటి మాట_*

    *భగవంతుని అనుగ్రహం*
భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!!...

మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకు, మన సామాను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిల్ రిక్షా లేదా టాక్సీలో తీసుకెళ్తాం!!...

ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది,  స్టేషన్‌కు చేరుకుని రైలులో కూర్చున్నాక, రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళుతుంది!!...

     రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా!...
      అలా పెట్టుకుంటే అంతటి కన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది?? 
       మనల్ని మోసే రైలు మన లగేజిని మోయాలేదా?! 

అలాగే మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, అప్పుడు నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి...

అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, అయన మనకు మంచిదానినే యిస్తాడు...

ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...

               *_🌸శుభమస్తు.🌸_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*
 *శ్రీరమణీయభాగవత కథలు- 15*
( బాపు-రమణ )

జరిగిన కథ:

అదితికి దేవతలు.. దితికి దైత్యులు పుడతారు.
దుర్వాస మహర్షి శాపం వలన దేవతలు స్వర్గం కోల్పోయి మహావిష్ణువును శరణు కోరుతారు. ఆ దైవం, దానవుల సహాయంతో సముద్ర మథనం చేసి అమృతం సాధించమంటాడు.

ఇక చదవండి
******

అన్నా తమ్ముడూ అంటూ దేవతలు దానవులతో వరసలు కలిపి సాగర మధనం గురించి! చెప్పి కలిసి రమ్మన్నారు. బలిని ఇంద్రుడు కౌగిలించుకున్నాడు.. కొండని పెకలించారు. దానిని మోయలేక పోయారు. గరుత్మంతుడిని పిలిచారు. తమ్ముడా నువ్వే మొయ్యగలవు నీకు వాటా యిస్తాం అమృతం అన్నారు మహేంద్రుడు. గరుత్మంతుడు కొండని సునాయాసంగా మోసుకుని వెళ్లి పాల సముద్రంలో దింపాడు. 

దేవతలు వాసుకిని ప్రార్ధించాడు. అతనికీ వాటా ఆశపెట్టారు. వాసుకి కదలలేనని తనను మోసుకుని తీసుకు వెళ్లమని అంది. వాసుకిని తీసుకుని రావడానికి నీవే సమర్ధుడవు. నీ అంతటి బలశాలి లేదు అని దేవతలు గరుడుని ఉబ్బేశారు. 

గరుడునికి గర్వం తలకెక్కింది వాసుకిని నిర్లక్ష్యంగా పైకెత్త బోయాడు ఎంత పైకి తీసినా ఇంకా పాము చుట్టలుగా కింద మిగులుతూనే వుంది. గరుడుడు భంగ పడ్డాడు.

దేవతలు, గరుడుడు శివుని ప్రార్ధించారు.

శివుడు కరుణించాడు. చెయ్యి చాపి వాసుకిని వాన పాములా ముని వేలితో పైకిత్తి కొండకి చుట్టాడు.

శ్రీహరి అభినందించాడు. గరుడుని వినయం నేర్చుకోమన్నాడు.

ఇంద్రాది దేవతలు తోక వైపు కదిలారు. విష్ణువు వారించి తలవైపు నడవమన్నాడు. 'మంటలూ పొగలూ వస్తాయి తలలోంచి, భరించలేము, మనకి తోకే మంచిది' అన్నాడు ఇంద్రాదులు.

'తల పట్టుకుంటేనే తోక దక్కేది' అన్నాడు విష్ణువు. దేవతలు పాము తల పట్టుకో బోయారు. దానవులు మండి పడ్డారు. 'ఛీఛి తోక పట్టే ఖర్మ మాకేల తుచ్చమయిన ప్రుష్టం తలయితేనే వస్తాం' అన్నారు. దేవతలు ఆనందంగా సరేనన్నారు.

సాగర మధనం ప్రారంభమయింది. పర్వతం నీటిలోకి దిగబడి పోయింది. దేవతలు విష్ణువును ప్రార్ధించాడు. శ్రీహరి కూర్మావతారం ధరించి సముద్రంలో ప్రవేశించి కొండని వీపు మీద భరించి పైకెత్తాడు.

ఇదే *కూర్మావతారం*

మధనం సాగింది. వాసుకి తల నుంచి పొగలూ నుంటలూ రాసాగాయి రాక్షసులు గిలగిలలాడి పోయారు. ఆహంకారంతో తామే కోరుతున్నది కనక బాధలు అనుభవించక తప్పలేదు.

మధనం సాగింది.

ఇంతలో పొగలు సెగలూ విజృంభించాయి. హాలాహలమనే విషం నాలుగు వైపులా లేచింది. అందరూ కకావికలై అటూఇటూ పరిగెట్టారు. శివుని వేడుకున్నారు.

అయన భవాని అనుమతి తీసుకున్నాడు. *మింగెడిది గరళము* అయినా ఇతరుల మేలు కోసం కదా. అందువల్ల మంగళసూత్రం మదిలో నమ్మిన ఆ సర్వమంగళ సరేనంది. 

పరమ శివుడు - తన కడుపులోని ముజ్జగాలకు హాని జరగకుండా ఆ గరళాన్ని కంఠంలోనే నిలిపి నీలకంఠుడయ్యాడు.

మధనం సాగింది. కామధేనువు ఉద్భవించింది. యజ్ఞాలకు అవసరమని మహర్షులు తీసుకున్నారు.

ఐరావతం అనే నాలుగు దంతాల తెల్లఏనుగు వచ్చింది. ఇంద్రుడు తీసుకున్నాడు. ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రాన్ని కూడా తీసుకోబోతే విష్ణువు ఆ గుర్రాన్ని రాక్షసరాజు బలికిప్పించాడు.

కల్పవృక్షాన్ని పారిజాతాన్ని అతిధ్యం పేరిట ఇంద్రుని రాణి శచీదేవి తీసుకుంది. 

చల్లని చంద్రుడు ఉదయించాడు. 

విషం మింగిన శివునికి అలంకారంగా ఇచ్చారు. 

మత్తుకలిగించే వారుణి పుట్టింది. దాన్ని రాక్షసులు వశం చేసుకున్నారు. 

ఆ తరువాత పద్మాసనం మీద శ్రీ మహాలక్ష్మి ఉదయించింది. ఆవిడ వైజయంతి మాలను శ్రీహరి మెడలో వేసి ఆయనను వరించింది.

దివ్య తేజంతో సువర్ణ పాత్రలో అమృతంతో ధన్వంతరి ఉద్భవించాడు. 

వెంటనే దానవులు అతని మీదకురికి అమృత పాత్రను బలవంతంగా లాక్కుని పారిపోయారు. దేవతలు గోలపెడుతూ తరుమబోయారు. విష్ణువు వారించాడు.

*పాతాళగుహ*

పొడుగ్గా వున్న దానవుడు ఒకడు, రెండు చేతులతో అమృత భాండాన్ని పైకిత్తి పట్టుకున్నాడు. చుట్టూ మూగి వున్న మిగతా రాక్షసులు ఒకరినొకరు తోసుకుంటూ నాకివ్వు నాకు ముందు ఇలాతే- చంపుతా అంటూ కేకలు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)