Sunday, June 30, 2024

*****యోగి - భోగి - రోగి*

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 


*యోగి - భోగి - రోగి*
                  
హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు. వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు. అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు.

ఒకసారి స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్చుకోమని పంపాడు.

*సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు.* 

*‘ఆయన నిన్ను గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ”*
*“అదెలా సాధ్యం? ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆయన ఒక జీవం లేని కర్రముక్కో రాయిలాగానో ఉంటాడు చలనం లేదు!” అని ఫిర్యాదు చేశాడు.* 

*“కాదులే అక్కడే ఉండు” అని భరోసా ఇచ్చాడు గురువు.* 

*ఒక రోజు హరి ఓం స్వామి కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్క నా రాయినా ?” అన్నాడు.*

*కంగుతిన్నాడు స్వామిరామా.    తను గురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని బోల్డు ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందంలో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానందం కలిగిస్తుంది? ఆ విశ్వ చైతన్యంలో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను. అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను.” అన్నాడు.* 

*ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి. హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా భావించి అనుభవించాడు.*

*ఓం హరి స్వామి ఒక సారి కళ్ళు తెరిచినప్పుడు కొన్ని మంత్రాలు చదివి అర్ధం చెప్పాడు… దానిభావం, లోకం అంతా రాత్రి వేళ నిద్ర పోతుంటే యోగులు, ఆత్మజ్ఞాన సంపన్నులు మేలుకొని ఉంటారు. ఇది ఉపనిషత్ వాక్యం ..!  తర్వాత దానిపై వివరణ ఇస్తూ ”రోజు మొత్తం మీద మంచి కాలం నిశ్శబ్ద రాత్రి వేళ మాత్రమే. అయితే దాని లోని అందాన్ని ఆ నిశ్శబ్ద భావాన్ని కొద్ది మంది మాత్రమే అనుభవించగలరు.*

*రాత్రి వేళలలో ముగ్గురు మాత్రమే మెలకువ గా ఉంటారు.                                        వారే… ‘యోగి   భోగి    రోగి!’*

*యోగి నిశీధి లో సమాదిగతుడై పరమానందాన్ని పొందుతాడు.*

*భోగి ప్రాపంచిక సుఖాలలో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆనందం అనుభవిస్తాడు.*

*రోగి జబ్బుతో ముక్కుతూ మూలుగుతూ నిద్ర లేకుండా గడుపుతాడు.* 

*యోగిది శాశ్వతానందం!*
*భోగిది క్షణికానందం!! *
*రోగి ది బాదానందం!!!*

*”మరి యోగికి నిద్ర క్కరలేదా?” అని అడిగాడు రామా.*

*దానికి ”మనసులో ఏమీ లేకుండా కళ్ళు మూసుకొంటే అది నిద్ర. కావాలని కళ్ళు మూసుకొని దేనిపైన నైనా దృష్టి పెడితే అది ధ్యానం।* 

*యోగి కళ్ళుమూసుకొని ఇంద్రియ భావాలను దూరం చేసుకొంటాడు. అప్పుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితి కలుగుతుంది. కళ్ళు మూసుకోవటం అంటే యోగికి అంతరేంద్రియమైన కన్ను ను తెరవటమే. అందరూ రెండుకళ్ళతో ప్రపంచ వస్తువులు చూస్తే యోగి సర్వ దేహమూ కన్నుగా మారుతుంది, సర్వ ప్రపంచం దర్శనీయమౌతుంది!” అని స్వామిరామా సందేహ నివృత్తి చేశాడు*.

జై గురుదేవ్....👏🏼👏🏼


No comments:

Post a Comment