Sunday, June 30, 2024

****భోజనం...

 భోజనం...

ముందుగా ఈ మధ్య కాలంలో, శుభకార్యాలలో భోజనం చేసే ముందు హరి నామస్మరణ చేసే ప్రవృత్తి పూర్తిగా నశించి పోయింది.పూర్వం భోజనం మొదలు పెట్టే ముందు అందరూ గట్టిగా "గోవిందా, గోవిందా" అని అప్పడు భోజనం చేయడం ప్రారంభించేవారు.

విస్తరలో పదార్థం వడ్డించగానే వెంటనే తినేయడమనేది మరొక రుగ్మతగా తయారైంది. అందరు కలిసి భోజనం చేయలేకపోతే... ఇంక నలుగురు కలవడంలో అర్థం ఏముంది... అలా తినడంలో హోటల్, తిండికి, శుభకార్యాలలోని ఆత్మీయ భోజనానికి వ్యత్యాసమేముంది. 

ఉన్నవాడికే కొసరి కొసరి పెట్టడం మనం నిత్యకనిపించే దృశ్యం. ఇలా ఎంతో ఆహారాన్ని వృధా చేస్తుంటాము.. లేని వాడు పొట్ట పట్టుకుని మన ఇంటి ముందు కూర్చున్నా పట్టించుకునేవాడు కరువు. అప్పటికే భుక్తాయసంతో ఉన్న వాడికి మరిన్ని వడ్డించాలని తాపత్రయం కనబరుస్తాము.

పైగా తినగలిగినంత తిను మిగిలింది వదిలేయి అంటూ ఇష్టమొచ్చినట్లు వట్టించే ప్రేమ కూడా మనలో ఎందరికో నిత్యానుభవమే...

ఇలా ఒక పక్క అన్నాన్ని దైవమని (పరబ్రహ్మ స్వరూపమని) దానిని ఎన్నో రకాలుగా వృధా చేసే వారు, తమ ప్రవృత్తిలో కాస్తంత మార్పు తెచ్చుకుంటే, కొన్ని కొట్ల మంది కడుపు నింపిన పుణ్యాన్ని పొందగలరు....

అలా కాక, విస్తరలో వదిలేయమని సలహా ఇస్తూ వడ్డించే, లేదా బలవంతాంగా వడ్డిపజేసేవారు తెలియకుండానే చాలా ఘోరమైన అపరాధం చేస్తున్నారు. సత్ కార్యానికి సత్ఫలితం వచ్చినట్లు ఇలా మరొకరికి లభించవలసిన బోజన పదార్థాలను వృద్ధా చేసే వారికి వచ్చే ఫలితాన్ని ఎవరికి వారే ఊహించుకోగలరు.

శుభకార్యాలలో ఎందరో చేసే మరొక ఘోర తప్పిదం ఏమిటంటే, తమకి ఇష్టం లేని పదార్థాలను వడ్డించక ముందే వద్దని చెప్పక పోవడం. అంతిమంగా విస్తరలో వడ్డించిన పదార్థాలను తినకుండానో లేదా ఎంగిలి చేసో వదిలేయడం.....

ఇటువంటి చర్యలకి ఫలితం వెంటనే ఉండకపోవచ్చు, కాని, మన బ్యాంకు ఖాతాలో డబ్బుకి వడ్డి వచ్చినట్లుగానే,ఇలాంటి చర్యలకి నష్టం కూడా చక్రవడ్డీలా పెరిగి ఏప్పుడో ఒకసారి దాని ఫలితాన్ని చూపించగలదు...

పెద్దలు పై విషయాలను కాస్తం శ్రద్దతో, ఓపికతో పట్టించుకుని మళ్ళీ అమలు చేయవలసిన అవసం ఎంతైనా ఉంది...

No comments:

Post a Comment