Saturday, August 31, 2024

**** మన సమస్త దుఃఖాలకు....

 మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్ఞానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!

Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.!

Any other knowledge satisfies wants only for a time.!

All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.!

--- Swami Vivekananda..

Friday, August 30, 2024

****పాఠములు చెప్పే… *గురుదేవులు*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పాఠములు చెప్పే…

                 *గురుదేవులు*
                  ➖➖➖✍️

*టీచింగ్ వృత్తి కాదు... విలువల జాతి నిర్మాణం..!* 

*ఈ చిన్న కథ విన్నారా…?!*

*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి....!* 

*అనుకోకుండా    ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లు మొక్కాడు...* 

*మాస్టారూ, బాగున్నారా..? 'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?* 


*'ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడంలేదు., గుర్తుపట్టలేకపోతున్నాను'*

*'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*

*'ఓహ్, నిజమా? సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*
*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?'*

*'నేను టీచరు అయ్యాను మాస్టారూ...’*

*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*

*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి తెలుసా..?'*

*'అదేంటి..? అదెలా..?'*

*'బహుశా మీకు గుర్తుండదు! ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!’*
*****************

*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ స్కూల్ కి తెచ్చుకున్నాడు.*
*దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది... ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను.* 

*కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది. లబోదిబో మని ఏడ్చాడు.*
*టీచరుకి  కంప్లయింట్ చేశాడు..!* 

*అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే..!*

*’ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు!  వాడి వాచీ ఎవరు తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను!’ అన్నారు మీరు.* 

*నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది? అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా?* 

*’అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..?’*

*కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు. ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు. కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.* 

*జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు.*

*తప్పదు కదా మరి,  మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు,*
*తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను.*
*అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు.* 
*నాకు అర్థం కాలేదు...!*

*‘వాచీ దొరికింది, కళ్లు తెరవండి!’ అన్నారు మీరు.*

*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక...  ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా ఇజ్జత్ మీరు కాపాడారు!* 

*అది తరువాత అర్థమైంది...  ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో..?’*

*అలా నన్ను రక్షించారు మీరు..! నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్...!*
*కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా. నా అంతట నేనే మారిపోయేలా చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..?  కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*

*’అప్పుడు ఆ టీచర్ సావధానంగా చెప్పాడు ఇలా...*
*“ఒరేయ్, మీరు నా పిల్లలురా..! నా బిడ్డలురా!!     టీచరు  పిల్లలను  ప్రేమతో చూసుకుంటూ భయం, భక్తులు అలవడేట్లుగా  పిల్లలును  మార్చుతూ పాఠాలు చెప్పాలి!* 
*ఆరోజు..*
*అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీమొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నాప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...!*
*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకూ తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*✍️


*అందుకే…*

*గురుబ్రహ్మ గురుర్విష్ణుః*
*గురుర్దేవో మహేశ్వరః*
*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ*
*తస్మై శ్రీ గురవే నమః*

*ఒకదేశం ఉన్నత స్థితిలో ఉందీ అంటే… దానికి కారణం ఇలాటి గొప్ప ఉపాధ్యాయుల వల్లనే…!*🙏

*ఆనందాశృవులతో…*
*ఉపాధ్యాయులందరికీ అంకితం...*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏🏼

Life lessons
 *ఆ రాజుగారికి ఒకటే కన్ను ఒకటే కాలు. ఆయన తన రాజ్యంలో ఉన్న చిత్రకారులను పిలిచి తన బొమ్మను అందంగా గీయమని ఆదేశించాడు. కానీ ఆ చిత్రకారులు ఎవ్వరూ అందంగా గీయలేక పోయారు. ఒక కన్ను ఒక కాలు లేని వ్యక్తిని అందగాడిగా చిత్రీకరించడం సాధ్యమా ?? ఎట్టకేలకు ఒక చిత్రకారుడు రాజుగారి చిత్రాన్ని అందంగా రూపొందించడానికి ఒప్పుకొన్నాడు. కష్టపడి అన్నట్లుగానే రాజు గారి చిత్రాన్ని గొప్పగా మలిచాడు. అందంగా తీర్చిదిద్దాడు.*

*నిజంగా రాజు గారి చిత్రం చాలా అందంగా వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఆ చిత్రకారుడు రాజుగారిని వేటాడుతున్న భంగిమలో చిత్రించాడు.*

*ఒక కాలు వొంచి ఒకే కాలు మీద నిలబడినట్లు, ఒక కన్ను మూసుకుని ఇంకొక కన్నుతో గురిపెడుతున్నట్లు- ఓహ్... అద్భుతంగా చిత్రీకరించారు.* *ఎదుటివారి బలహీనతలను బయటపెట్టకుండా, వాళ్ళ బలాలను చూపిస్తే గొప్పగా ఉంటుంది కదా !!!
 *రోకలి పూజ (సరదా జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**************************
    ఒకూర్లో రంగయ్య అని ఒకడుండేటోడు. వానికి బంధువులంటే చానా చానా ఇష్టం. ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని కాలు కింద పెట్టనీయకుండా మర్యాదలు చేసేటోడు. రోజుకోరకం పిండివంటలు చేపిచ్చి కడుపు నిండా తినిపించేటోడు. ఎప్పుడూ పొరపాటున గూడా ఎవ్వరినీ విసుక్కునేటోడు కాదు. రంగయ్య వుండేది నగరంలో, దాంతో నగరంలో పనిబడి వచ్చేటోళ్లందరూ రంగయ్య ఇంటికే వచ్చేవాళ్ళు. కొంతమంది ఏకంగా పదిరోజులూ, ఇరవై రోజులూ గూడా తిష్ట వేసేటోళ్ళు.
రంగయ్య గురించి తెలిసి ఎక్కడెక్కడి దూరపు బంధువులు గూడా వరుసలు కలుపుకోని ఇంటికి రావడం మొదలు పెట్టినారు. ఏదో నెలలో ఒక రోజు రెండు రోజులంటే పరవాలేదు. కానీ రోజూ ఎవరో ఒకరు వస్తా వుంటే ఎట్లా? వచ్చినవాళ్ళందరికీ అడిగినవన్నీ చేసి పెట్టలేక రంగయ్య పెండ్లాం కిందామీదా ఐపోతా వుండేది. అదీగాక అందరు అది కావాల ఇది కావాల అని అడిగేటోళ్ళే గానీ పనిలో కొంచంగూడా సాయం చేసేటోళ్ళు కాదు. అంతేగాక రంగయ్య సంపాదించేదంతా వాళ్ళకే సరిపోసాగింది. పెండ్లాం బిడ్డలు పస్తులున్నా పరవాలేదు గానీ వచ్చిన వాళ్ళకి కొంచెంగూడా లోటు రాకూడదు అంటూ రంగయ్య అప్పుల మీద అప్పులు చేస్తా మరీ పెట్టసాగినాడు. పెండ్లాం ఎంత నెత్తీ నోరూ కొట్టుకున్నా రంగయ్య పట్టించుకొనేటోడు కాదు. ఇది ఇట్లాగే జరిగితే ఏదో ఒక రోజు వీధిలో పడడం ఖాయం అనుకోనింది రంగయ్య పెండ్లాం. దాంతో బంధువులు ఇంటికి రాకుండా చేయడం కోసం ఒక ఉపాయం పన్నింది.
ఒకసారి ఇంటికి ఐదుమంది బంధువులు వచ్చినారు. రంగయ్య వాళ్ళకి బాగా మర్యాదలు చేసి "కూర్చోండి బజారుకి పోయి మాంచి నాటుకోడి తీసుకోని వస్తా. మధ్యాన్నం రాగిముద్ద నాటుకోడి పులుసు తిందురుగానీ" అంటూ బజారుకు పోయినాడు. రంగయ్య అట్లా పోయిన కాసేపటికి రంగయ్య పెళ్ళాం ఒక మంచి రోకలి బండ తీసుకోనొచ్చి బంధువులకు కనబడేటట్లు దేవుని గదిలో పెట్టి, దానికంతా పసుపు పూసి, బొట్లు పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది.
అదిచూసి బంధువులు, “ఇదేందబ్బా ఈమె రోకలికి పూజ చేస్తా వుంది. ఇట్లాంటి పూజ ఎక్కడా చూడలేదే" అనుకోని ఆమె దగ్గరకొచ్చి “ఏందమ్మా... ఏం పూజ చేస్తా వున్నావు" అనడిగినారు. దానికామె మా ఆయనకి ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి పట్టుకోనింది. మా ఇంటి పక్కనే ఒక పెద్ద మంత్రగాడున్నాడు. వాడు "ఏం లేదూ... ఎవరయితే ఈ మంత్రించిన రోకలిబండతో రోజుకొకరి చొప్పున నూటా ఒక్క రోజుల్లో నూట ఒక్కమంది తలకాయలు పగలగొట్టి ఆ రక్తంతో అమ్మవారికి అభిషేకం చేస్తారో, వాళ్ళకి అమ్మవారు ప్రత్యక్షమయి అడిగినంత సంపదలిస్తుంది" అని చెప్పినాడు. ఆరోజు నుండీ నా మొగుసు ఎక్కడెక్కడి బంధువుల నందరినీ వెతికి మరీ పిలుచుకోనొచ్చి వాళ్ళ తలకాయలు పగలగొట్టి పూజ చేస్తా వున్నాడు. నిన్నటికి అరవైమంది పూర్తయినారు. ఈరోజు మీలో ఎవరికి మూడిందో ఏమో" అనింది. ఆ మాటలు వింటూనే వాళ్ళు అదిరిపడినారు. ఆమె ఆగు ఆగంటున్నా వినకుండా బెరబెరా సామాన్లన్నీ సర్దుకోని పెట్టెలు తీసుకోని బైటకు వురికినారు.
వాళ్ళట్లా బైటకి పోవడం ఆలస్యం, రంగయ్య కోడి తీసుకోని ఇంటికి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంకేముంది ఇంట్లో బంధువులూ లేరు, వాళ్ళ సామాన్లు లేవు. "ఇదేందే ఎక్కడికి పోయినారు వీళ్ళంతా" అనడిగినాడు.
దానికామె “ఏం చెప్పమంటావు. వాళ్ళకు మనింట్లో రోకలిబండ బాగా నచ్చిందంట. అదివ్వమన్నారు. కొంచెం సేపు ఆగండి కూరలోకి మసాలా దంచి ఇస్తా అన్నా... దానికే వాళ్ళకు కోపం వచ్చింది. అడిగిన వెంటనే ఇవ్వనందుకు అలిగి పెట్టెలు సర్దుకోని ఎంత పిలుస్తా వున్నా ఆగకుండా అట్లాగే వెళ్ళిపోయినారు. ఇదిగో తొందరగా ఇది తీసుకోని పోయి వాళ్ళకి ఇచ్చి రాపోండి" అని రోకలిబండ రంగయ్య చేతిలో పెట్టింది.
రంగయ్య రోకలిబండ తీసుకోని వాళ్ళని వెతుక్కుంటా వేగంగా పోతావుంటే ఊరి పొలిమేరల్లో ఐదుమంది పోతా కనబన్నారు. రంగయ్య గట్టిగా “ఆగండి ఆగండి. ఇదిగో మీరడిగిన రోకలిబండ తీసుకోండి" అని అరిచినాడు. వాళ్ళు ఎవరబ్బా పిలుస్తా వున్నారు అని వెనక్కు తిరిగి చూసినారు. చూస్తే ఇంకేముంది.... చేతిలో రోకలిబండ పట్టుకోని వేగంగా తమవైపే వురుక్కుంటా వస్తా వున్న రంగయ్య కనబడినాడు. అంతే వాళ్ళు అదిరిపడినారు. “రేయ్... వాడు మన తలలు పగులగొట్టడానికి రోకలిబండ తీసుకోని పరిగెత్తుకొని వస్తా వున్నాడు. దొరికినామా మనపని అంతే. సక్కగా స్వర్గానికే" అంటూ మరింత వేగంగా వానికి దొరకకుండా పారిపోయినారు.
అట్లా పారిపోయిన వాళ్ళు కనబడిన బంధువులకంతా రంగయ్యకు పట్టిన పిచ్చి గురించి చెప్పడం మొదలు పెట్టినారు. కొద్దిరోజుల్లోనే విషయం బంధువులకంతా తెలిసిపోయింది. భయంతో అందరూ రంగయ్య ఇంటికి పోవడం మానుకున్నారు. ఎవరన్నా కనబడినా పలకరించినా పలకకుండా తప్పించుకొని పోసాగినారు. ఎందుకట్లో అందరూ ఒక్కసారిగా తనింటికి రావడం మానుకున్నారో రంగయ్యకు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. రంగయ్య పెండ్లాం మాత్రం తన ఉపాయం పారినందుకు లోపల్లోపల చానా సంబరపడింది.
**************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.


 *నాణెం పై తెలుగు భాష.*
**************************
*ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.*
----------------------------------------
*ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.* 
**************************
*ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.*
----------------------------------------
*పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు,గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు.*
**************************
*అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.* 
----------------------------------------
*(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???* 
**************************
*అంటూ చురక వేశారు. పటేల్ గారు, గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.*
----------------------------------------
*భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.*
**************************
*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*
---------------------------------------
🌺 *జై శ్రీమన్నారాయణ* 🌺
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
       *మన మంచితనం మనల్ని కాపాడుతుంది*
ధనము వలన సౌకర్యాలు కలుగుతాయి కానీ ఆనందం శాంతి లభించదు. మంచి భార్య లేదా మంచి భర్త మంచి పిల్లలు మంచి కుటుంబం మంచి స్నేహితులు ఆనందకరమైన జీవితం కలగాలంటే ధనము కంటే ఎక్కువ పుణ్యమే ఉండాలి.. ధనము పది పర్సెంట్ ఉంటే పుణ్యం 20% ఉండాలి..
 అలా ఉంటేనే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం మనకు ఉంటుంది.. ఒకవేళ పాప పెర్సెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇబ్బందికరమైన భర్త లేక భార్య, బాధించే సంతానం, మోసం చేసే స్నేహితులు, ద్వేషించే బంధువులు, ఆత్మీయత అనురాగం లేని జీవితం,
 రోగాలు, శత్రువులతోని మానసిక సంక్షోభంతోని మన జీవితం సాగుతుంది..అదే పుణ్యం ఉంటే ఆనందంగా ఉంటుంది..
 ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం కానీ, పుణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేయం.. పుణ్యం వలన సకల శాంతి కలుగుతుంది..
  
🌸 **చిన్న కథ** 🌸

*ఒక వ్యక్తి ప్రతి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో  కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.*

*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో... "అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో... “నాయనా నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*

*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావు అని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.*

*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు... అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే... బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైంది.*

*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ? దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?*

*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు*

*ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి.*
 *మనము చేసే సామాజిక సేవ, మానసిక సేవ, ఆధ్యాత్మిక సేవ, మనల్ని తప్పకుండా రక్షిస్తుంది* 
 **సేకరణ:- నమిలకొండ.రమణాచార్యులు..
తిరుమల నగర్ రోడ్ నెంబర్ 3 కరీంనగర్ 9440072364...

తృప్తి..!* ➖➖➖✍️

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               *!..తృప్తి..!*
               ➖➖➖✍️

 
కళ్యాణ మండపం ముందు మా క్యాబ్ ఆగింది. 
నేను, మా ఆవిడ క్యాబ్ దిగి లోపలకు వెళ్ళగానే "అక్కా! బాగున్నావా?” అంటూ ఒకావిడ ఆప్యాయంగా పలుకరిస్తూ, దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువుల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇక చూడాలి 
ఆ ఆత్మీయ పలుకరింపుల జడివాన.
"ఏం వదినా! బాగున్నావా?" ,
"ఏం పిన్నీ! ఇంత ఆలస్యంగా వచ్చావేం? " 
"అవునే అమ్మాయి! ఇల్లా చిక్కిపోయావేమిటే?"
"అత్తా! నువ్వు వస్తే గానీ సందడి రాలేదు " 
అలా రక రకాల పలుకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి
"నేను బాగానే వున్నాను. మీరందరూ బావున్నారా?" అని అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది.

నేను మా ఆవిడ వున్న వైపు అడుగులు వేసాను. అడపా దడపా, నేను కూడా నా శ్రీమతి తో  ఫంక్షన్లకు వెళ్ళడం వల్ల నేను అక్కడ వున్న చాలా మందికి పరిచయస్తుడనే.
అక్కడ ఒక కుర్చీలో సెటిల్ అయిపోయి తెలిసిన వాళ్ళను పలుకరించడం మొదలుపెట్టాను. 
మా ఆవిడ చలాకీగా తిరుగుతూ, సంతోషంగా నవ్వుతూ, అందరినీ పలుకరిస్తూ,  వారి వారి కష్ట సుఖాలు అడిగి మరీ తెలుసుకోసాగింది. 
“అత్తా! ఏమిటి చాలా పాడైపోయావు? కిందటి సారి నిన్ను చూసినప్పుడు బాగానే వున్నావు” అని మా ఆవిడ పలుకరింపు విని అటు వైపు  నా దృష్టి సారించాను. ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి వుంది.
ఆ ముసలావిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ "వయసు అయిపోయింది కదే" అని నెమ్మదిగా అంది.
"ఎప్పుడూ చలాకీగా వుండే నీ లాంటి వారిపై వయసు ప్రభావం వుంటుందంటే నేను నమ్మను" అని నా శ్రీమతి నవ్వింది. 

ఇంతలో పెళ్లి బాజాలు మ్రోగటంతో అందరూ అక్షింతలు పట్టుకుని స్టేజ్ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు.

"అక్కా! క్రిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావో, ఏమిటో, అంతవరకూ పెళ్లి అంటే విముఖత చూపిన అది ఇప్పుడు పెళ్లికి సుముఖంగా వుంది.  అంతే కాదు దాని ప్రవర్తనలో కూడా  చాలా మార్పు కనిపించింది.  కోపం, తొందరపాటు తనం బాగా తగ్గించుకుంది. ఇప్పుడు దానికి సంబంధం కుదిరింది" అని ఆనందంగా చెప్పింది పెళ్ళిలో మొదట పలుకరించిన ఆవిడ.

"చాలా మంచి కబురు చెప్పావ్!" అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి.
 
"పిన్నీ! మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో?" బాధ వెళ్ళగక్కుకుంది మరొకావిడ.

"ఏం భయపడకు.  నీకు ఏ మాత్రం అనుమానం వున్నా, పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయ్.  బాబాయ్ గారు కూడా తీరికగానే వున్నారు" అని భరోసా ఇచ్చింది నా శ్రీమతి.
దాంతో ఆవిడ ముఖం వికసించి, "థాంక్స్" చెప్పింది.
అందుకే అందరూ  నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు. తన దగ్గర ఏముంది, ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది. 

పెళ్లి అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి, తన అత్తయ్య  కష్టాలలో వున్నట్లు తెలుసుకుంది. వున్న ఒక్క కొడుకూ ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ సరిగ్గా చూడటం లేదని బంధువులు  చెప్పగా వింది.

భోజనాలు అయ్యాక నా శ్రీమతి  "రండి. ఒకసారి మా అత్తయ్య ను పలుకరిద్దాం" అని పిలిచింది.
"సరే, పద" అని తనను అనుసరించాను.

"బాగున్నారా పిన్నిగారూ?" అని ఆవిడను పలుకరించేను.
"దేవుడి దయ వల్ల బాగానే వున్నాను బాబూ" అని సమాధానమిచ్చింది.
నా శ్రీమతి, వాళ్ళ అత్త దగ్గరకు వెళ్ళి, ఆమె చేతులను ఆప్యాయంగా అందుకుని“అత్తా! నాకు ఒక సాయం చేయగలవా? రిటైర్ అయిన తర్వాత  మీ అబ్బాయి గారికి జిహ్వ చాపల్యం పెరిగి రోజుకొక రకం వంట చేయమని నన్ను తినేస్తున్నారు. ఇంత కాలం ఈయన గారికీ, పిల్లలకూ కారేజ్ లు కట్టీ కట్టి అలసిపోయాను.  ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట వుండడం వల్ల, ఈయనగారు రిటైర్ అవడం వల్ల కొంత వూపిరి తీసుకో గలుగుతున్నాను. ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక ఏవేవో పిండివంటలు చేయమని కోరుతున్నారు.  నాకేమో నడుము నొప్పి కూడా వచ్చింది. పనిమనిషి వున్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు ఎవరైనా 'నా వారు' అనే వారు పక్కన సాయంగా వుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది.  ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండకూడదూ" అని అర్థించింది.
నా మీద అంత అభాండం వేసేసరికి నేను ఖంగుతిన్నాను.
"నేనెప్పుడు నిన్ను అది చెయ్యమని, ఇది చెయ్యమని వేధించాను?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించాను.

 "చూసావా అత్తయ్యా! ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయనగారికి నచ్చదు." అని టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి.
మా ఆవిడ సమయస్ఫూర్తి కి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
"పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా?" ప్రశ్నించింది ఆవిడ.
"ఆ ముచ్చటా తీరిపోయింది. వంట మనిషిని పెట్టుకున్నాము.  ఆవిడ ఏ రోజూ సమయానికి రాలేదు కదా, రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేయదు. ఏ రోజు వస్తుందో, రాదో తెలియక ఆవిడ కోసం చూసి, చూసి, సమయం వృధా చేసుకుని, తర్వాత వంట పని చేసుకోవాలంటే చిరాకు వచ్చేది. పైగా మన లాగ పద్ధతిగా పని చేయరు.  ఎన్ని సార్లు వాళ్లకు పని చేసే పద్దతి నేర్పినా కూడా వాళ్ళ పద్దతిలోనే వాళ్ళు పనిచేస్తారు.  స్టౌ మంట ఎక్కువ పెట్టీ, గిన్నెలు మాడ్చేసి, స్టౌ చుట్టూ పథార్థాలు జల్లేసి, వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకుని తినేసేది అనుకో" అని తన గోడును వెలిబుచ్చింది.

"మా ఇంటిలో ఇన్ని సీన్లు జరిగాయా!" అని ఆశ్చర్య పోవటం నా వంతైంది. అబద్ధాలంటే అసహ్యించుకునే మా ఆవిడ అతి సులభంగా ఇన్ని అబద్ధాలు ఆడిందంటే దానికి తిరుగులేని కారణమేదో తప్పకుండా వుండే వుంటుంది అని అనుకున్నాను..

"అయ్యో! అలా జరిగిందా? నేను వచ్చినా నీకు సుఖం వుండదే. నా బరువు కూడా నువ్వే మొయ్యాలి. ఆరోగ్యం బాగుంటే నెల రోజులు ఏమిటే? ఒక సంవత్సరం పాటు వచ్చి వుండేదాన్ని" అని బలహీనంగా చెప్పింది ఆవిడ.
"నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు.  మీ అబ్బాయి, కోడలితో మేము మాట్లాడతాం. నువ్వు మాతో వచ్చేసేయి" అని బలవంతంగా ఆవిడను వొప్పించింది నా శ్రీమతి.
తర్వాత, ఎవరూ పక్కన లేని సమయం చూసి నా శ్రీమతి "అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ప్రస్తుతం ఆవిడ కొన్ని కష్టాలకు  గురై అనారోగ్యం పాలైంది. ఆవిడను ఒక నెల రోజులు పాటు మనింట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను.  మనమేమాత్రం జాలితో ఆవిడను పిలిచామని అనిపించినా ఆవిడ రాదు.  అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది" అని గుట్టు విప్పింది.

మొత్తం మీద ముగ్గురము 
మా ఇంటికి వెళ్లిపోయాము.

"ఏంటీ! ఇవ్వాళ, పులిహోర, పాయసం కావాలా? రేపు దద్దోజనం, చక్ర పొంగలి చేయాలా? చాలా బాగుంది మీ కోరికల లిస్ట్" అని వంట గదిలోనుండి మా ఆవిడ అరుపులు విని నవ్వుకున్నాను.     ప్రతి రోజూ నా పేరు చెప్పి "అత్తా! ఇవ్వాళ మీ అబ్బాయి గారు ఇది చేయమంటున్నారు, రేపు అది చేయాలంటున్నారు"   అని రోజుకొక  రకం  పిండివంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి. 

మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే, నా శ్రీమతి  బలవంతంగా ఆవిడతో తినిపించింది.
"అత్తా! నువ్వు పక్కన నిలబడితే చాలు. నాకు చాలా ధైర్యంగా వుంటుంది.  ఏ పనైనా చేసెయ్యగలను"  అని అంటే ఆవిడ "ఇప్పుడు నేను నిలబడటం తప్పితే ఏం చేస్తున్నానే" అంటూ సిగ్గు పడింది.

"మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్ర పట్టటం లేదు బాబూ" అని ప్రతి రాత్రి ఆవిడతోనే   పక్క గదిలో పడుకుని పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేసేది.

వేళకు తిన్న తిండి కంటే,
ఈ నెల రోజులలో నా శ్రీమతి చూపెట్టిన ఆప్యాయతకు, అనురాగానికి, ఆ ముసలావిడ ఆరోగ్యం చాలా చాలా మెరుగైంది. ఆవిడే స్వయంగా నా శ్రీమతి తో 
"మా అబ్బాయిని ఇక రమ్మనవే. ఇంటికి వెళతాను"  అని చెప్పింది.

నా శ్రీమతి  వొప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం వుండాలని బలవంతం చేసింది.

అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్లతో  
"ఒసేయ్! దేవుడు నీకు ఎంత మంచి మనసును ఇచ్ఛాడే. ఇక్కడకు వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నువ్వు నాకు సాయం చేయడానికే తీసుకొచ్చావు అని.   నడుం నొప్పి వంకతో నన్ను తీసుకువచ్చి, మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు.  మీ ఆయన పేరు చెప్పి రక రకాల రుచికరమైన వంటలు చేసి నాతో తినిపించావు. మీ ఆయన గురక పెడతాడు అని అబద్దం చెప్పి రాత్రిళ్ళు నా పక్కనే పడుకుని, తియ్యటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో తిరిగి ఉత్సహాన్ని నింపావు.
కొన వూపిరితో వున్న నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేవు. వచ్చే జన్మలో నైనా  నీ ఋణం తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను" అని చేతులు రెండూ జోడించింది.

"తప్పు అత్తా! నీ లాంటి వారు నాకు దణ్ణం పెట్టకూడదు.  ఆశీర్వదిస్తే చాలు" అని ఆప్యాయంగా కౌగలించుకుంది నా శ్రీమతి. 

"పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా వుండాలి.  మీరు చల్లగా వుంటే పది కుటుంబాలని మీరు చల్లగా వుండేటట్లు చేయగలరు" అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది.

ఈ  దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి.
మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని పిలిపించింది.  

తల్లిలోని ఉత్సాహం, ఆనందం చూసి అతను ఆశ్చర్య పోయాడు. 

కుశల ప్రశ్నలు అయిన తర్వాత, వాళ్ళ అత్తయ్యను వంట గదిలోకి పని మీద పంపి,   నా శ్రీమతి ఆ అబ్బాయితో  
"నిన్ను ఎంత ముద్దు, మురిపెంగా మీ అమ్మ పెంచిందో నాకు తెలుసు.  ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ కూడా వస్తుంది. అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి? మనిషి బ్రతికి వున్నప్పుడే చేయగలిగింది చేయాలి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడి కట్టినా ప్రయోజనం లేదు. నీ చదువు నీకు సంస్కారం నేర్పలేదా? ఇంకోసారి మీ అమ్మని బాధ పెట్టేవని నాకు తెలిస్తే నేను వూరుకోను. ఈ వయసు వాళ్లకు ప్రేమ, అభిమానాలు పుష్కలంగా కావాలి. ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో" అని మెత్తగా చివాట్లు వేసింది.

"అమ్మకూ, నా భార్యకు, తేడాలు వచ్చి ఇలా జరిగింది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనీయను" అని సిగ్గుతో తల దించుకున్నాడు అతను. 

మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది.✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 🌳మా స్టారు..🌳

పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నారు విద్యాసాగర్ గారు..
ఆయన రిటైరయ్యి నాలుగేళ్లు అయ్యింది...
స్వస్థలం కర్నూల్ పట్టణం..అక్కడే ఎక్కువకాలం లెక్చరర్ గా పని చేసారు.. ఎన్నో అనుభూతులు... గతం ప్రసాదించిన వరం.. ఆ అనుభూతుల్లోనికి తొంగి చూడటం అలవాటయ్యింది విద్యాసాగర్ గారికి..
ఆయనో పిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో.. అప్పుడు ఆయన వయస్సు పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు...అప్పటికే సీనియర్ కాలేజీ లెక్చరర్... స్టూడెంట్స్ కి ఇష్టమైన లెక్చరర్ కూడా..

ఆయన పనిచేస్తున్న కాలేజీ ఒక రెసిడెన్షియల్ కాలేజీ..మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు..దాదాపుగా తొంభై శాతం విద్యార్థులు నిరుపేదలే...కష్టపడి చదివి, ఎంట్రెన్స్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులై వచ్చిన వారే అందరూ.. నెలకు వంద రూపాయలు స్టైఫండు  ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి .. అవి వారి తిండికే సరిపోయేవి... 

ఇంకో రెండు రోజుల్లో దసరా పండుగ సెలవులు.. ఆ రోజు రాత్రి  పది గంటల తరువాత విద్యార్థులు ఉన్న హాస్టల్ నిరీక్షణకు వెళ్ళారు ఆయన ...ఆ కళాశాల లో పని చేస్తున్న ప్రతి లెక్చరర్ కి అదో ప్రత్యేకమైన డ్యూటీ...

హాస్టల్ లో నలభై గదులున్నాయి. రెండు వందల మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు..మిగతా రెండు వందల మంది కాలేజీకి దగ్గర్లో ఉన్న కాలనీల లో అద్దెకు ఉండేవారు .హాస్టల్ లో ఖాళీ అయినప్పుడు వచ్చి చేరేవారు..

హాస్టల్ నిరీక్షణకు దాదాపు రెండు గంటల సమయం పట్టేది.. నలభై గదుల్లో ఉన్న విద్యార్థులు  ఎలా చదువుతున్నారో చూడాలి ..నిరీక్షణ చేస్తున్న లెక్చరర్..

నిరీక్షణ మొదలయ్యింది ఆ రోజు రాత్రి.. 
మధ్య మధ్యలో గదుల్లోనికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి ముందుకు కదులుతున్నారు..

8 వ నంబర్ రూము.... తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి.. ఏవో మాటలు వినిపిస్తున్నాయి..చదువు కోకుండా ఈ మాటలేమీటీ.. అనుకుంటూనే దగ్గరగా వెళ్లి  మాటలు విన్నారు... ఆ తరువాత ముందుకు కదిలారు.. ఒక గంట తరువాత స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలు దేరారు విద్యాసాగర్ మాష్టారు... 

ఆ రోజు రాత్రి చాలా సేపటి వరకూ ఆయనకు నిద్ర పట్టలేదు..

ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పట్టింది ఆయనకు...

టైం కి కాలేజీకి వెళ్ళడం ఆయనకు అలవాటు..
మొదటి పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాసుకి వెళ్ళారు...
పాఠం మొదలు పెట్టే ముందు మాములుగా అందరినీ అడిగారు .

"దసరా సెలవులు వస్తున్నాయి కదా .. ఈ పది రోజులు ఇంటికి వెళ్ళే వారు ఎందరు ? "

మొత్తం క్లాసులో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు.. ముగ్గురు తప్పించి అందరూ ఇంటికి వెళ్తున్నామని చేతులు యెత్తారు..చేతులు ఎత్తని ముగ్గురి పేర్లు ఆయనకు తెలుసు.. 
"హాయిగా సెలవులు గడిపి రండి..కొన్ని రోజులు కాలేజీని మరచి పొండి..."నవ్వుతూ అన్నారు ఆయన..
క్లాసు చెప్పడం మొదలు పెట్టారు..గంటన్నర తరువాత క్లాసు ముగించి స్టాఫ్ రూమ్ కి వెళ్ళారు ఆయన....

ఒక అరగంట తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఉన్నారు ఆయన.. 

"సర్..నిన్న రాత్రి హాస్టల్ విజిట్ కి వెళ్ళాను..ఒక రూం లోనుండి విద్యార్థులు మాట్లాడుకున్న మాటలు విన్నాను.."
"సర్ ! దసరా సెలవులు కొంతమంది పిల్లలకు కష్టం కలిగిస్తున్నాయి.. కొంత మందికి తల్లి దండ్రులు లేరు..ఎవరి పంచనో ఉండి చదువుతున్నారు ఇన్నాళ్లూ..ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.. ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో వాళ్లకు అర్థం కావటం లేదు ..హాస్టల్ కూడా మూసేస్తున్నాం .. తిండి కూడా ఉండదు పిల్లలకు.. సెలవుల్లో.."
"నాదో రిక్వెస్ట్ సర్ .. హాస్టల్ తెరిచి ఉంచుదాం ..రెండువందల మందిలో కనీసం ఒక ఇరవై మంది హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది.. వీలయితే మెస్ కూడా ఏర్పాటు చేయాలి మనం...చెప్పడం ఆగారు.. విద్యాసాగర్ గారు..

ప్రిన్సిపాల్ అంతా విని ఆశ్చర్య పోయారు.. "అయ్యో.. ఇన్నాళ్లూ ఈ విషయం నా దృష్టికి ఎవరూ తీసుకు రాలేదు..."బాధ పడ్డారు ఆయన..

ఆలోచనలో పడ్డారు  ప్రిన్సిపాల్..కాసేపటి తరువాత తేరుకుని అన్నారు..

"హాస్టల్ తెరిచి ఉంచడం కష్టం కాదు ..మెస్ ఏర్పాటు చేయడం కష్టం.. మెస్ లో పని చేస్తున్న వాళ్లకు సెలవులు ఇచ్చి తీరాలి.. ఏం చేయాలి ? .." ఆలోచనలో పడ్డారు ఆయన..

"అది పెద్ద కష్టం కాదు సర్.. దాదాపు పాతిక మంది లెక్చరర్లము ఉన్నాము..పిల్లలు మా ఇళ్ళల్లో భోజనం చేస్తారు..ఆ సంగతి నేను చూసుకుంటాను..మీరు హాస్టల్ తెరిచే ఉంచి పుణ్యం కట్టుకోండి.." బ్రతిమ లాడారు విద్యాసాగర్ గారు..

"అలాగే ..తప్పకుండా హాస్టల్ తెరిచే ఉంచుదాం...ఇక్కడే ఉండాలనుకునే విద్యార్థులు నిరభ్యంతరంగా ఉండవచ్చు సెలవు రోజుల్లో...వాచ్ మన్లు గా ఒకరిద్దర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం...ఇక భోజనాల సంగతి...మా ఇంట్లో కూడా నలుగురికి నేను ఏర్పాటు చేస్తాను .."అన్నారు ప్రిన్సిపాల్..

ఆయనకు నమస్కారం చేసి స్టాఫ్ రూం కి నడిచారు విద్యాసాగర్ గారు..

లంచ్ సమయం లో స్టాఫ్ రూం లో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు ఉదయం ఫస్ట్ ఇయర్ పీరియడ్ లో సెలవులకు ఇంటికి వెళ్ళని ముగ్గురు విద్యార్థులు..

"ఏమిటి ? చెప్పండి .."అడిగారు ఆయన. ..

ఒక నిముషం మాటలు లేవు..నెమ్మదిగా ఒక విద్యార్థి చెప్పాడు..
"మాకు కూడా ఇంటికి వెళ్ళాలని ఉన్నది ..అమ్మని, నాన్నని చూడాలని ఉంది..అలాగే తమ్ముళ్ళను చెల్లాయిలను కూడా..కానీ వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు .అందుకే మేం ఉదయం చేతులు ఎత్తలేదు సర్..."చెప్పాడు ఒక విద్యార్థి..మిగతా ఇద్దరూ ..అవును సర్...అన్నారు... ఈ విషయం అందరి ముందు చెప్పలేక పోయాం సర్... క్షమించండి...అన్నారు ఆ ముగ్గురూ..

"సరే..మీరు క్లాసుకి వెళ్ళండి....మీతో తరువాత మాట్లాడుతాను.. " అంటూ వాళ్ళను పంపేశారు విద్యాసాగర్ గారు...

పిల్లలు ఇంత కష్ట పడుతూ ఉన్నారా ? సెలవులకు  ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవా ?? ఆయన మనసు  ఎంతో బాధ పడింది.. ఏం చేయాలి.. ఏం చేయాలి...

ఆ పిల్లలు ముగ్గురికి ..సెలవులకు ఇంటికి వెళ్ళడానికి ట్రెయిన్ టిక్కెట్లు కొన్నారు...మళ్ళీ రావడానికి, ఖర్చులకు ..ఒక్కొక్కరికి వంద రూపాయలు అదనంగా ఇచ్చారు...విద్యా సాగర్ గారు...

అయినా ఆయన మనసులో ఏదో బాధ...ఇలా విషయం చెప్పకుండా తమలో తాము బాధ పడుతున్న విద్యార్థులు ఎందరో..? 

ఆయన మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది....

దసరా , సంక్రాంతి సెలవులకు ..వారం రోజుల ముందు ..విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టు లో పరీక్ష పెట్టేవారు ..వంద మార్కులకు..కనీసం ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులకు ..వంద రూపాయలు నగదు పారితోషికం...అందజేసేవారు....ఇంకేముంది.... ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులకు..ఇలా ఇవ్వసాగారు.. దసరా , సంక్రాంతి పండుగలకు..విద్యాసాగర్ గారు ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టేవారు.. ఆ  రోజుల్లో.. ఆ కాలేజీలో ఆయన ఉన్న ఐదేళ్ల లో ఇలాగే గడిచింది .ఆయనకు తృప్తిగా ఉంది...ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకున్నారు..ఆయన కూడా కొంత సాయం చేసే వారు మిగతా గ్రూప్ విద్యార్థులకు..

ఆ రోజులు గుర్తుకు వచ్చి ..నవ్వుకున్నారు ఆయన..ఆ పిల్లలు ఎలా ఉన్నారో...ఎక్కడ ఉన్నారో... వాళ్ళు కనిపించినా గుర్తు పట్టడం కష్టం.. 

"కాఫీ తీసుకోండి.. "అంటూ వచ్చింది ఆయన శ్రీమతి.. 

"దసరా పండుగ వస్తోంది కదా.. మన పని మనిషి పిల్లలకు బట్టలు కొందామా ?" అడిగింది ఆవిడ...

ఆవిడ వంక తదేకంగా చూశారు విద్యాసాగర్ గారు..

"అలాగే..."అంటూ ఆలోచనలో పడ్డారు..

ఒక గంట తరువాత శ్రీమతి కి చెప్పారు... "అలా ..మా కాలేజీ వరకూ వెళ్లి వస్తాను.."

"మీ కాలేజీ ఏమిటి ? మీరేమైనా కట్టించారా ? "నవ్వింది ఆయన శ్రీమతి..

ఆయన కూడా నవ్వారు..

హైదరాబాదు లో డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన..విద్యా విభాగంలో.. ప్రస్తుతం కర్నూల్ లో సెటిల్ అయ్యారు...

*** *** ***

కాలేజీ కి చేరుకుని ..తిన్నగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళారు..అక్కడ ఉన్నవారికి ఆయన తెలుసు..నమస్కారం చేసారు అందరూ... కాసేపు వారితో గడిపి...ప్రిన్సిపాల్ రూం లోనికి అడుగు పెట్టారు ఆయన...

"నమస్కారం ప్రిన్సిపాల్ గారు..నా పేరు విద్యా సాగర్.. ఈ కాలేజీలో ముప్పై ఏళ్ల క్రితం లెక్చరర్ గా పనిచేశాను..ఒకసారి చూసి పోదామని వచ్చాను...." చెప్పారు ఆయన..
ప్రిన్సిపాల్ .. అక్కడున్న మిగతా వాళ్ళు చూస్తూ ఉండగానే .. విద్యాసాగర్ గారి కాళ్ళకు నమస్కారం పెట్టారు...

"సర్...మీరు నాకు తెలుసు....నేను కూడా ఇదే కాలేజీ లో కామర్స్ చదివాను... మీరిచ్చిన వంద రూపాయల్లో సగం నాకిచ్చేవాడు నా రూం మేట్...మీ పేరు చెప్పుకుని మేము సెలవుల్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం .."వినయంగా చెప్పారు...ప్రిన్సిపాల్..

విద్యాసాగర్ గారికి ఆశ్చర్యం.. ఎన్ని ఏళ్ల క్రితం మాట... కొన్ని వందల రూపాయల సాయం... అదీ పిల్లలకు.... ఇంకా ఇలా కొంతమంది గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉంది...

జేబులో నుండి చెక్కు తీశారు...ఇరవై వేల రూపాయలు...వ్రాసి సంతకం చేసి..ప్రిన్సిపాల్ చేతికి అంద జేశారు..
"పిల్లల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాను..."చెప్పారు విద్యా సాగర్ గారు..

"అలాగే సర్...తప్పకుండా.."

"మీరు నేర్పిన బాట లోనే నేను నడుస్తున్నాను.. పండుగల ముందు పరీక్షలు పెట్టి..కొంతమందికి నగదు బహుమతి ఇవ్వడం మొదలు పెట్టాను.. మీరు వెలిగించిన కాగడా ..ఇంకా వెలుగుతూనే ఉంది మాష్టారూ... నా ముందు వాళ్లు కూడా ఇలాగే చేసారు..అవసరం ఉన్న వాళ్లకు ..వాళ్ల ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా ..మీరు చేసిన పనిని మేం కొనసాగించాం..
మీకు అభ్యంతరం లేక పోతే అప్పుడప్పుడూ వస్తూ ఉండండి .."వేడుకున్నాడు ..ప్రిన్సిపాల్...

ప్రిన్సిపాల్ తో బాటుగా టీ త్రాగి..తృప్తిగా బయటకు నడిచారు...కాదు..కాదు..కారు వరకూ..దాదాపు అందరు లెక్చరర్లు వచ్చి దిగ బెట్టారు.. ప్రిన్సిపాల్ కారు డోర్ తీసి పట్టుకుని.. అన్నాడు.. "మమ్మల్ని ఆశీర్వదించండి మాష్టారూ.."

విద్యాసాగర్ గారికి..కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి...ప్రతి జన్మ లో ఉపాధ్యాయుడుగా పుట్టాలని కోరుకు న్నారు .. దేవుణ్ణి..
*** ***
"మీకోసం  ఆయన ఎవరో వచ్చారు.... ఇంకో గంట లో వస్తానని వెళ్ళారు...ఏదో పేరు చెప్పారు...ఆc.. సుబ్బారావు గారట....పెద్ద రైల్వే  ఆఫీసర్ లా ఉన్నారు ఆయన. .." చెప్పింది ఆయన శ్రీమతి..

ఎవరో సుబ్బారావు...గుర్తుకు రాలేదు విద్యాసాగర్ గారికి..

ఇంకో అరగంట లో వచ్చారు ఆ సుబ్బారావు గారు 

షరా మామూలే ...వచ్చిన సుబ్బారావు గారు  ఆయన కాళ్ళకు నమస్కరించడం ...
వచ్చిన సుబ్బారావు గారు  చెప్పారు ..
"ముప్పై ఏళ్ళ క్రితం.. ఒక మధ్యాహ్నం..మీ రూం కి వచ్చిన ముగ్గురిలో నేను ఒకడిని మాష్టారూ.. అప్పుడు మీరు ట్రెయిన్ టికెట్ కొనిపెట్టి..వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి..
ఈ రోజున ..అదే రైల్వేలో ..రైల్వే బోర్డు మెంబరుగా పని చేస్తున్నాను... అంతా మీ చలవే..వినయంగా చెప్పాడు.. సుబ్బారావు..
 ఎంతో సంతోష పడ్డారు విద్యాసాగర్ గారు... సుబ్బారావు ని దీవించి పంపారు ..విద్యాసాగర్ గారు.. అతను తెచ్చిన స్వీట్ ని తిన్నారు ఆప్యాయంగా...
ఆ రుచి గొప్పగా ఉంది ఆయనకు.... అలా ఎప్పుడూ అనిపించలేదు ..
ఆయనకు బాగా నిద్ర పట్టింది ఆ రాత్రి.. నిద్రలో వెలుగుతున్న  కాగడా ...కనిపిస్తూనే ఉంది.. సంతోషంగా ట్రెయిన్ లో వెళుతున్న విద్యార్థులు కూడా కనిపించారు..కలలో..

మాష్టారు గా విద్యను అందరూ బోధిస్తారు... విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆదుకునే .. విద్యాసాగర్ లాంటి కూడా మాస్టార్లు అరుదుగా  ఉంటారు... చేసిన సాయం బయటకు చెప్పడం వారికి ఇష్టం ఉండదు.... వారే నిజమైన మాష్టార్లు.... విద్యా సాగరులు..

💐💐🌹
 సగుణోపాసన - నిర్గుణోపాసన

సామాన్య భక్త శ్రేణికి చెందినవారు తమ పూజా మందిరంలో ఇష్టమైన దైవ విగ్రహాలను, చిత్ర పటాలను ప్రతిష్ఠించుకొని, వాటిలోనే దైవాన్ని దర్శించుకుంటూ, తోచిన సామాగ్రితో పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. ఇది సగుణోపాసన, భగవంతునికి రూపం, నామం, రంగు ఇవేమి లేవని, ఆయన సకలగుణాతీతుడని విశ్వసించేది ఆత్మతత్వం అదే నిర్గుణోపాసన.

ఆత్మదర్శనం అత్యుత్తమైనది ఇది మొదటి శ్రేణి. భగవంతుని గురించిన జ్ఞానం, ధారణ రెండో శ్రేణి. విగ్రహాలు, చిత్రపటాల పూజ మూడో శ్రేణి. తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాల సందర్శనం నాలుగో శ్రేణి. వీటిలో చివరి రెండు మార్గాలు సామాన్య భక్త కోటికి సులభతరం. నిర్గుణోపాసనకు మొదటి మెట్టు సగుణోపాసనే. మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం. మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు. మనిషిని మనీషిగా (జ్ఞానిగా), భోగిని యోగిగా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చి, అలౌకిక ఆనందాన్ని ఇచ్చేదే ఆధ్యాత్మికం. అది మానవ హృదయాన్ని వికసింపజేస్తుంది. సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికం అంటే పూజలు, జపాలు, తీర్థయాత్రలు అనే భావన చాలా మందిలో ఉంది. నిజానికి అవన్ని జీవన సోపానాలు మాత్రమే. మనసును నిగ్రహించుకొని, దృష్టిని అంతర్ముఖం చేయాలి. అప్పుడే మనిషి ఆత్మజ్ఞాన సంపన్నుడిగా మారతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.

ఇక్కడ మీకు శ్రీరామ, హనుమ సంభాషణ చెప్పాలి. "హనుమా! నీకు నాకు ఉన్న అనుబంధం ఎలాంటిదంటావు ? రాముడి ప్రశ్న. “శ్రీరామా శారీరకంగా నీవు, నేను వేరు. భావనాపరంగా నీవు యజమానివి, నేను బంటుని. ఆధ్యాత్మికంగా నీవూ-నేనూ వేరు కాదు, నీవే నేను - నేనే నీవు" అని హనుమ బదులిచ్చాడు. శరీరధారణ ద్వారా సంక్రమించిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను మనిషి శరీరధారణ తన ప్రమేయం లేకుండా పొందుతూనే ఆత్మస్వరూపం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.. ఆత్మశోధనలేకుండా కేవలం తినటం, నిద్ర, కలలకే పరిమితం కావడం మనిషి చేయవలసిన పనులు కాదు. ఆత్మశోధనలోనే యోగులు తరించారు. మనిషికి, సమస్త ప్రాణికోటికి చివర గమ్యం "ఆత్మ" దర్శనమే.

అసామాన్య శిష్యుడు

 అసామాన్య శిష్యుడు

(శృ౦గేరి శారదా పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషం)

గురువు సమక్షంలో శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలో గురుగీతలో చెప్పబదివుంది. “శిష్యుడు గురువుగారి పవిత్రమైన పాదుకలు, ఆసనము, ఇతర వస్తువులను భక్తితో పూజించాలి. గురువు నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనుకనే నడవాలి, ఆయన నీడ దాటకూడదు” జగద్గురువులు ఇద్దరు ఒక చోట వున్నప్పుడు చూసే అదృష్టం ఉన్నవాళ్ళు శ్రీ సన్నిధానం తమ గురువుల సన్నిధిలో ఎలా ప్రవర్తించేవారో, ఎంత భక్తితో వుండేవారో చూసి తన్మయులైపోయేవారు. ప్రతిరోజు అనుష్టానం పూర్తి చేసుకున్నాక గురువు (అభినవ విద్యాతీర్థ స్వామి) గారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి తరువాత తమ దైనిక కార్యక్రమం ప్రారంభించేవారు భారతీ తీర్థ స్వామివారు. ఆయన మాటను, ఆయనను ఎన్నడూ దాటలేదు. ఇద్దరూ కూర్చోవలసి వస్తే ముందుగా గురువుగారు కూర్చునేంతవరకు నిలబడి తరువాత ఆసనం స్వీకరించేవారు. గురువుగారి సన్నిధిలో తాము ఏ నియమాలు పాటించాలో వాటిని పాటిస్తూ ఇతరులు ఎలా ప్రవర్తించాలో బోధిస్తుండేవారు.

ఒకసారి ఒక పిల్లవాడు వచ్చి సన్నిధానం వారిని మంత్రోపదేశం చెయ్యమని అడిగాడు. అతనికి గురువును ఎలా అడగాలో సవివరంగా చెప్పి శ్రీచరణుల వారి వద్దకు పంపారు. ఆయన దగ్గర సరిగ్గా ప్రవర్తన లేకపోయినా ఉపేక్షించారు గానీ తమ గురువుల దగ్గర సాంప్రదాయం పాటింపచేసారు. 

ఒకసారి శబరిమల యాత్రలో ఒక భక్తుడు ఒక రమణీయమైన ప్రదేశం చూపి ఇక్కడ గురువుగారిని విశ్రమించవలసిందిగా ప్రార్ధిస్తే బావుండును అని సన్నిధానం వారికి విన్నవిస్తే ఆయన “గురువుగారిని ఏమైనా చేయమని చెప్పడానికి మనం ఎవరు? వారికన్నీ తెలుసు. మన పని వారి ఆజ్ఞను పాటించడం మాత్రమే” అని సున్నితంగా మందలించారు భారతీ తీర్థ స్వామివారు. ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పుడు పరస్పరం లేఖలు వ్రాసుకునేవారు. శ్రీ మహాసన్నిధానం లేఖలలో ఉదాత్తత, ప్రేమ కనబడేది. శ్రీ సన్నిధానం వారి లేఖలలో మర్యాద, భక్తి, కావ్యసౌన్దర్యం తొణికిసలాడేవి.

భారతీ తీర్థులు గురువుగారిని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు పక్కవారు వారి బాధను స్వయంగా చూసి ఆశ్చర్యపోయేవారు. శ్రీ సన్నిధానం వారు గురుదేవులను సమీపించి మోకరిల్లి వారి పాదాలు స్పృశించి నమస్కరించేవారు. ఎడబాటుని సహించలేకున్నారని స్పష్టంగా తెలుస్తూవున్నది. తల్లి తన బిడ్డను బుజ్జగించినట్లు శ్రీ మహాసన్నిధానం వారు ఆయనను ఓదార్చారు. రెండు నెలల తరువాత గురుదర్శనం చేసుకోబోతున్నామన్న ఆనందం వారి మాటలలో, చేతలలో స్పష్టంగా కనబడింది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ప్రశంసిస్తూ  డా. మండవ మిశ్ర అనే ఒక సంస్కృత పండితుడు “నేను ఎంతోమందిని చూసివున్నాను. శ్రీ శంకరాచార్యుల శిష్యులు ఎలా వుండేవారో అనుకునేవాడిని? వీరిని చూసాక స్పష్టమయ్యింది.” అని అన్నారు.

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం
 *🌹ఆయన మరణించాక ఎవరు వచ్చారు?*

           *చాలా కాలం క్రితం ఉత్తరప్రదేశ్ లోని బృందావనానికి దగ్గర్లో ఒక చిన్న గ్రామంలోకి ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న గుడిసె కట్టుకొన్నాడు. గుడిసె మధ్యలో ఒక తెర ఆ గుడిసెను రెండు భాగాలుగా విడదీస్తుంది.*

               *ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ, పూజిస్తూ వుండేవాడు. మాట్లాడే ప్రతి మాటకు ముందు , వెనుక "శ్రీకృష్ణ" అని లేదా "రాధేశ్యాం" అని అనేవాడు. ఒక్కోసారి కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు, మరోసారి "అయ్యో, అంత ఇబ్బంది వచ్చిందా?" అని కళ్ళు తుడుచుకొనేవాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఇతరులకు అర్థం అయ్యేది కాదు. కొంత కాలానికి అతను ఒక పిచ్చివాడు అని ఆ గ్రామ ప్రజలు నిర్ణయించేసారు.*

                *ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే, "ఉండండి, మా అబ్బాయికి తినిపించివస్తాను" అని గుడిసెలోకి వెళ్ళేవాడు. ఎవరైనా ఏమైనా అడిగితే "ఉండండి, మా అబ్బాయి పిలుస్తున్నాడు" అంటూ లోపలికి వెళ్ళేవాడు.*

            *ఇతను ఒక్కడే  కదా, లోపల ఎవరు ఉంటారు? అబ్బాయి ఎవరు? ఎక్కడ ఉంటాడు? అని అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు లోపలకి వెళ్లి చూద్దామంటే, వెళ్ళినప్పుడు లోపల గొళ్ళెం పెట్టుకొంటాడు. ఆకస్మాత్తుగా ఎవరైనా లోపలికి వెళ్లి "మీ అబ్బాయి లేడే?" అని అడిగితే "పక్క గ్రామానికి వెళ్ళాడు,  పక్క ఊళ్ళోని దేవాలయం వెళ్ళాడు" అని అనేవాడు.* 

             *రోజంతా అతని పనులు వింతగా వుండేవి. ఆవులకు గడ్డి, పళ్ళు తెచ్చి పెడతాడు, చీమలకు బెల్లమో, గోధుమ పిండినో పెడతాడు, మధ్యాహ్నం గోధుమ రొట్టె ముక్కలను పెట్టి కాకులను పిలుస్తాడు. మొత్తం మీద ఆయన వ్యవహారం వింతగా ఉండేది.*

              *కొంత కాలం తరువాత ఆయనకు ఆరోగ్యం దెబ్బతినింది. ఎవరో ఉండబట్టలేక అడిగేసారు "నీవు చనిపోతే నీ శవాన్ని ఎవరు దహనం చేస్తారు?" అందుకు ఆయన "ఇంకెవరు చేస్తారు? మా అబ్బాయి వస్తాడు, చేస్తాడు" అన్నాడు.*

             *పది రోజుల తరువాత ఆయన మరణించాడు. ఆ ఊరి వాళ్ళు అతని శవాన్ని ఏమి చేయాలి? అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్న భయాలు, అనుమానాల కారణంగా, అతని శవాన్ని తాకితే తమకేమైనా ప్రమాదం ఉంటుందేమోనని వాళ్ళు దగ్గరికి రాలేదు.*

                *ఇంతలో ఎక్కడినుండో ఒక అబ్బాయి అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యం ఏమంటే ఆ అబ్బాయి రాగానే ఆ పల్లె లోని ఆవులన్నీ ఒక్క సారిగా అంబా అని అరిచాయి.  అతను వచ్చాడు. ఆయన శవాన్ని చేతుల్లోకి తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని పాదముద్రలు పడిన చోట పువ్వులు వచ్చి పడుతున్నాయి. అక్కడంతా సుగంధం వ్యాపిస్తోంది. అతను శవాన్ని దహనం చేసాడు.  ఇంతలో ఆ పల్లె అంతా వినిపించేలాగా ఒక స్వరం ఇలా పలికింది ,*

            *"మీరు ఈ వ్యక్తికి అప్పుడప్పుడైనా కాస్త తిండి పెట్టారు. ఇపుడు మీరు మీ ఇళ్లలోకి వెళ్లి చూసుకోండి"*

               *వాళ్ళు వెళ్లి చూసుకొంటే వాళ్ళు గింజలు దాచుకోనే పాత్రలు, సంచులు, గాదెలు అన్నీ ధాన్యం తో నిండి ఉన్నాయి. ఆశ్చర్యం!  ఆనందం ! ఎవరు అతను? ఇంకెవరు?  శ్రీకృష్ణుడే !*

          *శ్రీకృష్ణుడిని నిర్మలమైన మనసుతో, పూర్తిగా నమ్మి ధ్యానిస్తే మనకు ఏమి జరుగుతుందో తెలుసా?*

         *ముందుగా ఇతరులు మన మీద నిందలు వేస్తారు, మన సంపద (డబ్బు ) తగ్గిపోవడం మొదలవుతుంది,*

              *మనం ఎవరికి సహాయం చేస్తుంటామో, ఎవరిని సేవిస్తువుంటామో వాళ్ళు మనను నిందిస్తారు, బయటకు గెంటేస్తారు,* 

             *మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకురారు.*

            *అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎదుటివారిని ద్వేషించకుండా వుంటూ, మంచినే చేస్తూ, శ్రీ కృష్ణుడి మీద చెదరని విశ్వాసం, భక్తి కలిగివుంటే, అప్పటినుండి మన జీవితంలో నిజమైన ఆనందం అనేది అనుభవంలోకి రావడం ప్రారంభం అవుతుంది.*

             *మనను చట్టుముట్టిన "మాయ" ను తొలగించడం కోసం భగవంతుడు జరిపే లీల అది. నాకున్న అనుభవంతో చెపుతున్నాను. ఆయన పెట్టే కష్టమైన పరీక్షలు నిజానికి మన మంచికోసమే అయ్యివుంటాయి. ఖచ్చితంగా. దీన్నే ఇంగ్లీష్ లో A blessing in disguise అంటారు.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
 

_*నీ పిలుపే*_
*_తెలుగుకు గెలుపు..!_*
++++++++++++++++++
      *గిడుగు జయంతి*
           29.08.1863
✍️✍️✍️✍️✍️✍️✍️
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
         విజయనగరం
        9948546286
💐💐💐💐💐💐💐💐

భాష ఆయన గుండె ఘోష..
అమ్మ గర్భాలయంలో
నవమాసాల 
*_మాతృభాష కోర్సును_* 
పూర్తిచేసి బయటికొచ్చాక
ఆ అమ్మకే 
అమ్మభాష నేర్పిన 
నిఖార్సు తెలుగోడు..
నీ భాష నీ గుండెని తట్టాలన్నా..
అక్కడి భావాలను వెతికిపట్టాలన్నా 
గ్రాంధికం నీ మాధ్యమం..
వ్యవహారికమే నీ ఉద్యమం..
అన్న గిడుగు..
ఈరోజున 
*_నీ భాషా సంస్కృతికి గొడుగు!_*

తెలుగు మాత్రమే చదివి 
ఊరుకోని గిడుగు..
మరిన్ని భాషలు నుడివి
ఎన్నో భాషల 
సారమ్ము తెలిసి..
మాతృభాష సొగసు 
గని మురిసి..
వ్యావహారికాన్ని వ్యాప్తి చేసి
తెలుగు పొద్దుకు 
తానే వేగుచుక్కై..
*_తెలుగు జాతికి_*
*_తానే పెద్దదిక్కై..!_*

ఎక్కడుంటే అక్కడే పోరు..
మాతృభాష కోసం ఆతృత...
గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు
వ్యవహార భాషోద్యమ 
స్థాపక ఘనుడు గిడుగు
చదివితివా..నేర్చితివా
అంటే నీ చదువు 
అక్కడే ఆగిపోతుందని..
నీకొచ్చిన భాషే 
నీ యవ్వారం..
అదే నీ చదువుల సారం..
ఇలా చేసి ఉద్బోధ..
*_తీర్చాడు తెలుగోడి బాధ!_*

గుండె రగిలే భావానికి..
కడుపు మండే ఆకలికి..
ఒళ్లు మరిచే ఉద్వేగానికి..
ఆకాశం లాంటి ఆవేశానికి..
నీ వ్యక్తీకరణ..
*_నీ భాషలోనే_*
*_ధృవీకరణ.._*
ఎవరి సులువు 
వారి వాడుక భాషే..!
అంతేనా..ఆనాడు తెలుగోడి
గుండెల్లో రగిలిన స్వరాజ్యకాంక్ష..
స్వరాష్ట్ర పిపాస..
దిక్కులు పిక్కటిల్లగ
చెప్పాలంటే 
నువ్వు  నేర్చిన సొంత బాస..
నువ్వు మెచ్చిన నీ యాస..
అది నీకే వర్తింపు...
దాంతోనే తెలుగుకు గుర్తింపు..!
ఇదంతా గిడుగు తెగింపు..
*_నీ భాష తెనుగింపు..!_*

_తేట తేనియల తెల్లని_ 
_పాల మీగడ గిడుగు.._
_కూరి తెలుగు భాషకు_
_గొడుగు గిడుగు..!_
ఆయన తెలుగు సరస్వతి
నోముల పంట...
ఆయన వాదం అర్థం కాక 
తెలుగు వారికి 
ఎంత కష్టం
ఎంత నష్టం..!
*_ఇది పెద్దల మాట.._*
*_తేనెల మూట..!!!_*

వ్యావహారిక భాషోద్యమ
పితామహుడు 
గిడుగు రామ్మూర్తి
జయంతి సందర్భంగా
అక్షర ప్రణామాలు..
🙏🙏🙏🙏🙏🙏🙏
 డెంగ్యూ మరియు ఇతర విష జ్వరాలకు ఈ ర‌సం వ‌రం లాంటిది..

▪️బొప్పాయి ఆకుల ర‌సం..

డెంగ్యూ వ‌చ్చిన వారు బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకుంటారు. బొప్పాయి ఆకులు డెంగ్యూ జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఈ ఆకుల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప‌రంగా డెంగ్యూకు బొప్పాయి ఆకులు గొప్ప ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. క‌నుక ఈ ఆకుల నుంచి జ్యూస్ త‌యారు చేసి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

▪️ఎంత మోతాదులో తాగాలంటే..

ఈ ఆకుల‌ను కొన్ని తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటి నుంచి ర‌సం తీయాలి. ఆ ర‌సాన్ని పెద్ద‌లు అయితే రోజుకు 10 నుంచి 15 ఎంఎల్ మోతాదులో, పిల్ల‌లు అయితే రోజుకు 5 ఎంఎల్ మోతాదులో తాగాలి.

▪️మ‌రీ ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు..

బొప్పాయి ఆకుల రసాన్ని మోతాదులో మాత్ర‌మే తాగాల్సి ఉంటుంది. మ‌రీ ఎక్కువ‌గా తాగితే వాంతులు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే కొంద‌రికి విరేచ‌నాలు కూడా అవ‌చ్చు. క‌నుక ఈ ఆకుల ర‌సాన్ని మోతాదులో మాత్ర‌మే సేవించాలి. 

▪️మరిన్ని ఉపయోగాలు:-

బొప్నాయి ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు ఎలాంటి జ్వ‌రాన్న‌యినా స‌రే త‌గ్గిస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు సైతం ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలోని నొప్పులు సైతం త‌గ్గుతాయి. బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. లివ‌ర్ పెర‌గ‌డం, జీర్ణ‌క్రియ మంద‌గించ‌డం, శ‌రీరంలో వాపులు వంటి వ్యాధులు ఉన్న‌వారు కూడా బొప్పాయి ఆకుల ర‌సాన్ని రోజూ తాగాలి.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.
 


డయాలిసిస్ చేసే సమయంలో శరీరంలోని రక్తాన్ని కిందున్న ఎర్ర ట్యూబ్ ద్వారా బయటకు తీసి, డయాలిసిస్ యంత్రంలో శుభ్రపరిచి, నీలి రంగు ట్యూబ్ ద్వారా తిరిగి శరీరంలోకి పంపిస్తారు. శరీరంలోని రక్తమంతా శుభ్రపరచడానికి సుమారుగా 4 గంటలు పడుతుంది. ఈ నాలుగు గంటలు శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి...

ఈ ప్రక్రియ వారానికి మూడు సార్లు, నెలకు 12 సార్లు నిర్వహించాలి. ప్రతిసారీ 4 గంటలు, అంటే నెలకు 48 గంటలు, వెచ్చించాలి...

డయాలిసిస్ అవసరం లేని వారిలో, ఈ ప్రక్రియను, ఎలాంటి ప్రయాస & అసౌకర్యం లేకుండా, కిడ్నీలు రోజుకు 36 సార్లు వాటంతటవే చేస్తాయ్...

ఇది చదివిన తరువాత మిత్రులు.. అతిగా మద్యం సేవించక పోవడం, ధూమపానం చేయకపోవడం, బయట హోటళ్లలలో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే తినుబండారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, అధిక చక్కెర, మైదాతో తయారయ్యే పదార్థాలను చాలా చాలా మితంగా తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా శారీరక శ్రమ చేయడం వంటి ఉత్తమ జీవన శైలి అలవాట్లను అలవరచుకొంటే మంచిది. ఎందుకంటే ఇవి మన కాలేయం& కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన మార్గాలు.

నోట్ రోడ్ సైడ్ ఫుడ్ తిన్న త్రాగినా నీ పని గోవిందా గోవిందా 🤣😂🤣 ఇంట్లో వండినవి తిన్నండి 🙏🏿

సాయి పేరుమీద ఉన్న కథలు సినిమాలు వ్రతాలూ

 *సాయి పేరుమీద  ఉన్న కథలు సినిమాలు  వ్రతాలూ*

 *పూజావిధనలు  ఛాలిసాలు అన్నీ నిజమైనవి కావు కల్పిత కథలు.*

*సాయి చచ్చిపోయినా 50 సంవత్సరాలతరువాత  తప్పుడు కథ రాసాడు  ఎక్కిరాల భరద్వాజ అనే  తాగుబోతు వెదవ,  దాని ఆధారంగా  బాల చందర్  దాగుల్బాజీ వెదవ సాయి మీద సినిమా తీసాడు, అప్పటినుండి  హిందువులు  పిచ్చిగా సాయి ని  మొదట సాయి తర్వాత బాబ తర్వాత గురువు తర్వాత  దత్తాత్రేయుడు  తర్వాత అవధూత   తర్వాత అంటే 1990 లొ అమ్ముల సాంబశివరావు అనే టీచర్ సాయి చరిత్రనే  మార్చి  రాస్తూ  శ్రీరామ కోటి  ని  సాయి కోటిగా  మార్చి  స్కూల్ పిల్లల చేత  రాయించి బాబా భక్తులుగా మార్చాడు,*

*అప్పటినుండి  సాయిరాం అని మొదలెట్టి  ఇప్పుడు మొత్తం  హిందూ దేవుళ్ళ  పేర్లు  గ్రంధాలు  మంత్రాలూ  పూజ విధానాలు వ్రతాలూ అన్నిటికి ముందు సాయి పేరు చేర్చి  హిందూ దేవుళ్ళకి చెయ్యవలసిన పూజలు సాయి కి చేస్తున్నారు*
 
హనుమాన్ సాలీసా సాయి శాలిసా
రామకోటి సాయి కోటి, సత్యనారాయణ వ్రతం     సాయి సత్యనారాయణ వ్రతం
గాయత్రీ స్త్రోత్రం సాయి గాయత్రీ స్త్రోత్రం
వెంకటేశ్వర సుప్రభాతం  సాయి సుప్రభాతం*

సీతారామ్   సాయిరాం
శ్రీ కృష్ణ    సాయికృష్ణ
శ్రీదుర్గ     సాయిదుర్గ
శ్రీ గణేష్     సాయి గణేష్
మణికంఠ     సాయిమణికంఠ

*తిరుపతి వెంకన్నకి చేసే అన్నీ సేవలు వ్రతాలూ అభిషేకలు  హరతులు   సాయి పేరుమీద సాయి గుడిలో  సాయికి చేస్తున్నారు    ఒక్కటేమిటి ప్రతి హిందూ ఆచారాన్ని ఆ ముస్లిమ్స్ అడుక్కు తినే ఫకీర్ కి అంటగాట్టేసి*
ప్రచారంచేస్తున్నారు  అది తెలియని ముర్క హిందువులు గుడ్డిగా 
ఆ ఫకీర్ ని హిందూ దేవుళ్ళు కన్నా ఎక్కువగా  పూజలు చేస్తూ  హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు   చాలా చోట్లా హిందూ దేవుళ్ళ రూపంలో ఆ ఫకీర్  గాడి విగ్రహాలు పెట్టేసారు 
పరమ అసహ్యం గా ఉంటున్నాయి

హిందువులు మేలుకోకపోతే
రామాయణం  సాయి రామాయణం
మహాభారతం   సాయి భారతం
భగవత్ గీత    సాయి గీత 
దేవి భాగవతం    సాయి భాగవతం    గా మార్చి  హిందూదేవుళ్ళు పోయి  సాయి పేరు మిగులుతాది   హిందూ గుడులు అన్నీ సాయి గుడులుగా మారతాయి 

సాయిని దేవుడిగా నమ్మే ముర్క హిందువుల  వల్ల చాలా ప్రమాదం ఉంది హిందూ ధర్మానికి   ఇప్పటికే  పూర్తి సాయి భక్తులుగా మారిన వారు  సాయి ని తప్పా హిందూ దేవుళ్ళని అసలు పూజించరు  
సాయి అసలు పేరు చంద్మీయా  సైవుద్దీన్ 
సాయి  అల్లమాలిక్ ఏక్ హై అన్నాడు  సాయి భక్తులు అందరు   అల్లాని నమ్మాలి  ముస్లిమ్స్ గా మారండి  అంటారు రాబోయో రోజుల్లో  హిందూ గుడులు సాయి గుడులుగా తర్వాత  మషీద్ లు దర్గాలు గా మారి   ముస్లిమ్స్ వక్షబోర్డ్ ఖాతాలోకి పోయి  హిందూ ఊర్లు అన్నీ  ముస్లిమ్స్ ఊర్లుగా మారిపోతాయి జాగర్త 

ఇపప్పటికైనా  హిందువులు కళ్లు తెరవండి

జై శ్రీరామ్ 
సర్వేజనా సుఖినోభావంతు 🙏
 తెలుగంటే...గోంగూర
తెలుగంటే...గోదారి
తెలుగంటే...గొబ్బిళ్ళు
తెలుగంటే...గోరింట
తెలుగంటే...గుత్తోంకాయ్
తెలుగంటే...కొత్తావకాయ్
తెలుగంటే....పెరుగన్నం
తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం
తెలుగంటే...పోతన్న
తెలుగంటే...బాపు
తెలుగంటే...రమణ
తెలుగంటే...అల్లసాని పెద్దన
తెలుగంటే...తెనాలి రామకృష్ణ
తెలుగంటే...పొట్టి శ్రీరాములు
తెలుగంటే...అల్లూరి సీతారామరాజు
తెలుగంటే...కందుకూరి వీరేశలింగం
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...శ్రీ శ్రీ
తెలుగంటే...వేమన
తెలుగంటే...నన్నయ
తెలుగంటే...తిక్కన
తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...క్షేత్రయ్య
తెలుగంటే...శ్రీనాధ
తెలుగంటే...మొల్ల
తెలుగంటే...కంచర్ల గోపన్న
తెలుగంటే....కాళోజి
తెలుగంటే...కృష్ణమాచార్య
తెలుగంటే...సిద్ధేంద్ర
తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి
తెలుగంటే...రాణీ రుద్రమదేవి
తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు
తెలుగంటే...రామలింగ నాయుడు
తెలుగంటే...తిమ్మనాయుడు
తెలుగంటే...రామదాసు
తెలుగంటే...ఆచార్య నాగార్జున
తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం
తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి
తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
తెలుగంటే...సింగేరి శంకరాచార్య
తెలుగంటే...అన్నమాచార్య
తెలుగంటే...త్యాగరాజు
తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన
తెలుగంటే...విశ్వేశ్వరయ్య
తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్
తెలుగంటే...చిన్నయ్య సూరి
తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగంటే...పీవీ నరసింహారావు
తెలుగంటే...రాజన్న
తెలుగంటే...సుశీల
తెలుగంటే...ఘంటసాల
తెలుగంటే...రామారావు
తెలుగంటే...అక్కినేని
తెలుగంటే...సూర్యకాంతం
తెలుగంటే...ఎస్.వీ.రంగారావు
తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు
తెలుగంటే...పండుమిరప
తెలుగంటే...సంక్రాంతి
తెలుగంటే...సరోజిని నాయుడు
తెలుగంటే....భద్రాద్రి రామన్న
తెలుగంటే...తిరుపతి ఎంకన్న
తెలుగంటే...మాగాణి
తెలుగంటే...సాంబ్రాణి
తెలుగంటే...ఆడపిల్ల ఓణి
తెలుగంటే...చీరకట్టు
తెలుగంటే...ముద్దపప్పు
తెలుగంటే...ఓంకారం
తెలుగంటే...యమకారం
తెలుగంటే....మమకారం
తెలుగంటే...సంస్కారం
తెలుగంటే...కొంచెం ఎటకారం
తెలుగంటే...పట్టింపు
తెలుగంటే...తెగింపు
తెలుగంటే....లాలింపు
తెలుగంటే...పింగళి వెంకయ్య
తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు
తెలుగంటే....టంగుటూరి ప్రకాశం
తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం
తెలుగంటే...భాస్కరుడు
తెలుగంటే...దేవులపల్లి
తెలుగంటే...ధూర్జటి
తెలుగంటే...తిరుపతి శాస్త్రి
తెలుగంటే...గుఱ్ఱం జాషువ
తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ
తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య
తెలుగంటే...కోరాడ రామచంద్రకవి
తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం
తెలుగంటే...మల్లన్న
తెలుగంటే...నండూరి
తెలుగంటే...పానుగంటి
తెలుగంటే...రామానుజం
తెలుగంటే...రావి శాస్త్రి
తెలుగంటే...రవి వర్మ
తెలుగంటే...రంగనాధుడు
తెలుగంటే...కృష్ణదేవరాయలు
తెలుగంటే...తిరుపతి వెంకటకవులు
తెలుగంటే...విశ్వనాథ
తెలుగంటే...నన్నే చోడుడు
తెలుగంటే...ఆరుద్ర
తెలుగంటే...ఎంకి
తెలుగంటే...ఆదిభట్ల
తెలుగంటే...గాజుల సత్యనారాయణ
తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ
తెలుగంటే...ఆర్యభట్టు
తెలుగంటే...త్యాగయ్య
తెలుగంటే...కేతన
తెలుగంటే...వెంపటి చిన సత్యం
తెలుగంటే...ఉషశ్రీ
తెలుగంటే...జంధ్యాల
తెలుగంటే...ముళ్ళపూడి
తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం
తెలుగంటే...తిలక్
తెలుగంటే...అడివి బాపిరాజు
తెలుగంటే...జక్కన
తెలుగంటే...అచ్చమాంబ
తెలుగంటే...దాశరథి
తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర
తెలుగంటే...ముక్కుపుడక 
తెలుగంటే...పంచెకట్టు
తెలుగంటే...ఇంటిముందు ముగ్గు
తెలుగంటే...నుదుటిమీద బొట్టు
తెలుగంటే...తాంబూలం
తెలుగంటే...పులిహోర
తెలుగంటే....సకినాలు
తెలుగంటే....మిర్చి బజ్జి
తెలుగంటే...బందరు లడ్డు
తెలుగంటే....కాకినాడ ఖాజా
తెలుగంటే.....జీడిపాకం
తెలుగంటే...మామిడి తాండ్ర
తెలుగంటే...రాగి ముద్ద
తెలుగంటే...జొన్న రొట్టె
తెలుగంటే...అంబలి
తెలుగంటే...మల్లినాథ సూరి
తెలుగంటే...భవభూతి
తెలుగంటే...ప్రోలయ నాయకుడు
తెలుగంటే...రాళ్ళపల్లి 
తెలుగంటే...కట్టమంచి
తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట
తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ
తెలుంగు ఆణమంటే తెలంగాణ
తెలుగంటే..... నీవు నేను మనం
జై తెలుగు తల్లీ 🙏

- లక్ష్మీకాంత్ గారి రచన
గిడుగు రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ..🙏
తెలుగు భాషా ప్రేమికులందరికీ 
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో శుభోదయం 💐❤️
 *ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం*
**************************
వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు , బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ తెలిసిందే. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి , తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతినే మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చేవారిలో విరేశలింగం పంతులు , గురజాడ అప్పారావు ఎప్పుడూ ఉంటారు. వారికి సమాన స్థాయిలోనే కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి.
----------------------------------------
1863 , ఆగస్టు 29న అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ , ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు రామ్మూర్తి ... ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు , చరిత్ర , శాసన పరిశోధకుడు , వక్త , విద్యావేత్తగానూ ఆయన మంచి పేరు సాధించారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే గాక.. అవి మంచి ఫలితాలనూ సాధించడం మరో విశేషం. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు.. విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.
**************************
పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 వరకు పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష , విద్య , శాసన పరిశోధన , చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించారు. ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ గిడుగు రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి ఆయన స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే గడిపారు.
----------------------------------------
*తెలుగు వికాసానికి తోడ్పాటేది... ?*
**************************
దేశ భాషలందు తెలుగు తెస్స అని వాదించే మనం.. ఈ రోజుల్లో తెలుగులో మాట్లాడడానికే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో తెలుగు భాషకు కందుకూరి , గురజాడ , గిడుగు రామ్మూర్తి లాంటివారు ఎంతో కృషి చేసి మన భాషకు గౌరవం అందేలా చేశారు. కానీ ప్రస్తుత రోజుల్లో అంతా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం చదువులు.. తెలుగు ఉనికే తగ్గిపోయింది. పాఠశాలలో చదువులు అంటే సరే.. కనీసం ఇంట్లో అయినా తెలుగు మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. తెలుగు భాష అభివృద్ధి అనేది మన ఇంటి నుంచే మొదలైతే.. అది దేశమంతటా వ్యాప్తి చెందుతుంది. అలా ప్రతి ఒక్కరూ అనుకుంటేనే తెలుగు భాషకు గౌరవం ఇచ్చినట్టు. ఎంత సాధించినా.. ఏం చేసినా... మన మాతృభాషలో ఉన్న కంఫర్ట్  మరేభాషలోనూ ఉండదు కదా..                              ----------------------------------------

****ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది...

 ఒక పల్లెటూరు లో ఒక  హోటల్ ఉంది...
అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది
వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో  ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు.
సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు... 

అందరు హోటల్ లో
కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్
గారు వచ్చారు...

అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్
గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని
చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా
చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా 
ఇటురా అని పిలిచాడు...

ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత
చేసానయ్య అని చెప్పాడు...

మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ
కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే
నీకు ఇష్టమా అని అడిగాడు...??

అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా
మొహం పెట్టి చెప్పాడు...

మరి ఏంటి ఏమైనా
డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే
చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...

అదేం లేదయ్యా .. నేను ఒక్కటి అడగాలి
అనుకుంటున్నా .... అడగనా అన్నాడు ...??

సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...

మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా
ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే
ఏం చేస్తారు ...?? అని అడిగాడు.

ఏముంది .... అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు ...??

అప్పుడు ఆ తాత ...
మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి
సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??

అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో
ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...

అపుడు తాత అడిగాడు ...... మీరు ఇంత మంది ఇక్కడ
భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల
మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...

దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ..... ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...

అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా
కట్టిస్తారు... 

కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా  మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని
పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??

డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని
అడిగాడు...??

ఆ తాత ఇలా చెప్పాడు ..... కోట్లు ఉన్న కోటీశ్వరుడు  అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు, దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఏదో  ఒక్కసారి అయినా మమ్మల్ని  గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి  అని చెప్పాడు...

అందుకే బాబు .... ఇందాక మీరు సగం అన్నం లో
చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి
చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...

ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు ...

మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం
భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...

ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే
మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని
సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట
అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి
అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని
బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...
 *దేవుని చేరిన ఉత్తరం* - ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన మంచి కథ - డా.ఎం.హరి కిషన్-కర్నూలు-9441032212
**************************
ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు చాలా అమాయకుడు. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. అందరిల్లలో చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్లు పెట్టినవి తింటూ ఉండేవాడు.
ఆ పిల్లవానికి చదువు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక సమయం దొరికినా చదువుకుంటూ, రాసుకుంటూ, నేర్చుకుంటూ వుండేవాడు. ఆ పిల్లవానికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి ముచ్చటపడి వాళ్ళ పక్కింటి అతను తీసుకుపోయి హాస్టల్ వున్న ఒక బడిలో చేర్చాడు.
నెమ్మదిగా ఆ పిల్లవాడు బాగా చదువుకుంటూ, ఎప్పటికప్పుడు చెప్పినవి చెప్పినట్లు నేర్చుకుంటూ పదవ తరగతి పాసయ్యాడు.
కాళేజీలో చేరదామంటే డబ్బులు లేవు. ఎలాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటే "ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కు. నమ్ముకున్న వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు" అని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
దాంతో ఒక ఉత్తరం కొని "స్వామీ... ఇప్పుడు నేను కాలేజీలో చేరడానికి డబ్బులు కావాలి. ఎలాగైనా పంపించు. నిన్నే నమ్ముకున్నా నువ్వే నాకు దిక్కు" అని రాశాడు. చిరునామా రాయాల్సిన చోట "దేవుడు, స్వర్గం" అని రాసి ఉత్తరాన్ని గుడికి తీసుకొని పోయి హుండీలో వేశాడు.
ఊహించని విధంగా ఆ పిల్లవానికి నాలుగు రోజుల తరువాత వెయ్యి రూపాయల మనియార్డర్ తో పాటు ఒక ఉత్తరం వచ్చింది. అందులో "బాబూ... నువ్వు బాగా కష్టపడి చదవాలి. నిన్ను నమ్మి వెయ్యి రూపాయలు పంపుతున్నా. నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదిస్తే నీ చదువు కోసం ఇంకా ఎంతైనా సహాయం చేస్తా. మాట నిలబెట్టుకో. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పకు" అని రాసి వుంది.
ఆ ఉత్తరాన్ని, డబ్బులను చూసి ఆ పిల్లవాడు ఆనందంతో పొంగిపోయాడు. "భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడు" అని సంబరపడ్డాడు. 
అప్పటినుంచి మరింత పట్టుదలగా చదవసాగాడు. అవసరమైనప్పుడల్లా ఉత్తరం రాయడం ఆలస్యం డబ్బులు వచ్చి పడేవి. అలా ఇంటర్ తో బాటు ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతాన్ని "దేవుడా ఇదంతా నీవు నాకు పెట్టిన బిక్షే" అంటూ తీసుకుపోయి దేవుని హుండీలో వేశాడు.
ఒక పేద అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. మొదటి శుభలేఖ ఆ దేవునికే పంపాలి అని దానిపై చిరునామా రాశాడు. అది చూసి ఆ అమ్మాయి "అదేంది దేవుడు, స్వర్గం అని రాస్తున్నావు. ఉత్తరాలు ఎక్కడైనా భగవంతునికి చేరుతాయా" అంది ఆశ్చర్యంగా.
అప్పుడు ఆ యువకుడు ఆమెకు జరిగిందంతా చెప్పాడు. ఆమె కాబోయే భర్త అమాయకత్వానికి నవ్వుకొని "దేవుడు అలా పంపించడం అసాధ్యం. దీని వెనక ఎవరున్నారో కనుక్కుందాం" అంది.
తర్వాతరోజు "స్వామీ... నాకు అత్యవసరమైన పనిబడింది. ఒక పదివేలు సహాయం చేయండి" అని ఒక ఉత్తరం రాసి దాన్ని తీసుకొని పోయి దేవుని హుండీలో వేశారు. దూరంగా కూర్చుని ఆ హుండీనే గమనించసాగారు. కాసేపటికి గుడి పూజారి వచ్చి హుండీలోని కానుకలు అన్నీ బయటకు తీశాడు. అందులో ఆ పిల్లవాడు రాసిన ఉత్తరం కనబడింది. దాన్ని చదివి ఎవరికో ఫోన్ చేశాడు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీసుకు పోయి పదివేలు మనియార్డర్ చేశాడు.
అది చూసిన ఆ యువకునికి తనను ఆదుకుంటున్న దేవుడు ఎవరో అర్థమైంది. వెంటనే పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆయన "నాయనా నీకు డబ్బులు పంపిస్తున్నది నేను కాదు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక తెలుగు టీచర్. నువ్వు మొదటిసారి ఉత్తరం రాసి హుండీలో వేసినప్పుడు నేను చదివి దానిని పక్కన పెడుతుంటే అప్పుడే గుడికి వచ్చిన ఆ టీచర్ గమనించాడు. అంతా చదివేసరికి ఆయనకి చాలా జాలి వేసింది. రహస్యంగా నీ గురించి విచారణ చేశాడు. నువ్వు అమాయకునివని, అనాధవని, చదువు తప్ప ఏమీ తెలియదని తెలుసుకుని నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడు. అతను బదిలీపై వెళ్ళిపోతూ నీ నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా తనకు తెలియజేయమని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి నీవు ఉత్తరం రాసిన వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పగానే డబ్బు పంపే ఏర్పాటు చేస్తున్నాడు" అని చెప్పాడు.
ఆ తెలుగు టీచర్ ఏ ఊరికి బదిలీ అయ్యాడో కనుక్కొని ఇద్దరూ ఆ ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక ఆ చిరునామా పట్టుకుని ఇంటికి వెళ్లారు. అది చాలా పాత ఇల్లు. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. తలుపు మూసి ఉంది. చిన్నగా కొట్టారు.
ఒక ముసిలామె వచ్చి 'ఎవరు' అంటూ తలుపుతీసింది.
"అమ్మా... సార్ ఉన్నాడా" అని అడిగారు.
ఆమె వాళ్ళ వంక చూసి "ఇంకెక్కడి సారు నాయనా... ఈ లోకాన్ని వీడి మూడు సంవత్సరాలవుతా ఉంది. ఇంతకూ మీరెవరు. ఇంత దూరం వచ్చారు" అంది.
సారు చనిపోతే తమకి డబ్బులు ఎవరు పంపిస్తున్నారో అర్థంకాక తన గురించి వివరించాడు.
దానికి ఆమె ఆ పిల్లవాణ్ణి ఆప్యాయంగా చూస్తూ "నాయనా... నిన్ను ఇదే మొదటిసారి చూడడం. అందుకే గుర్తుపట్టలేకపోయాను. సారు చనిపోతూ చనిపోతూ నీ గురించి చెప్పాడు. ఎన్ని కష్టాలలో ఉన్నా నీకు మనియార్డర్ పంపడం మాత్రం మానకూడదు. అని మాట తీసుకున్నాడు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్ డబ్బులో నీకు పంపిస్తున్నాను" అనింది.
ఆ మాట వినగానే ఆ పిల్లవాడు కదిలిపోయాడు.
ఆమె కాళ్లు పట్టుకొని "అమ్మా... ఎందుకు నామీద అంత ప్రేమ మీకు, మీ ఆయనకి" అన్నాడు కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉంటే.
ఆమె ఆ పిల్లవాని తల నిమురుతో "నాయనా మా ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడే ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ తరువాత పిల్లలు ఎవరూ పుట్టలేదు. వాడు చానా అమాయకుడు. అచ్చం నీలాగే వుంటాడు. మా ఆయన నీలో తన కొడుకుని చూసుకున్నాడు" అని చెప్పింది.
ఆ యువకుడు నెమ్మదిగా పైకి లేచాడు. "అమ్మా... నేను అనాధను కాను. మీ బిడ్డనే. ఇకనుంచి నీలో నా తల్లిని చూసుకుంటాను. నాకు దారి చూపించిన మీకు చివరి వరకు తోడుగా నిలబడతాను" అంటూ ఆమె చేయి పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

****ఒకప్పుడు పెళ్లి తంతు అంటే

 ఒకప్పుడు పెళ్లి తంతు అంటే దాదాపు మూడు నాలుగు గంటలు ఉండేది కానీ ఇప్పుడు గంట సేపు దాటితేనే ఇంకా ఎంతసేపు  కుర్చోబెడతావు  అని అయ్యగారి మొహం చూస్తున్నారు ... 
 త్వరగా కానివ్వండి కూర్చునే ఓపిక. లేదు  అని అంటున్నారు నవ దంపతులు

హల్ది ఫంక్షన్  పేరుతో వికృత చేష్టలు 

పసుపు నీళ్ళకి బదులు బీర్లు పోసుకోవడం 

కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన  మంగళ స్నానం వీడియోలు తీసి సోషల్ మీడియా లో పెట్టుకోవడం

పెళ్లికి ముందు ఫోటో షూట్ లో పేరుతో 
ముద్దులు. పెట్టుకోవడం 

స్టేజ్ మీద పెళ్లి కూతురు ఐటం సాంగ్ లు చేయడం

తడి బట్టలతో చిల్లర వేషాలు వేసి దేశాన్ని ఉద్దరించినట్టు 
 పోస్ట్లు చేసుకోవడం .

ఇలా చెప్పుకుంటూ పోతే మన సంప్రదాయాన్ని 
మనమే నాశనం చేసుకుంటున్నాం 

ఇవన్నీ తప్పు అని చెప్పాల్సిన  తల్లితండ్రులు కూడా  పోనీలే అని సైలెంట్ గా ఉండటం

పోనీ వీళ్ళు గట్టిగా వద్దు అని చెపితే మీకు తెలవదు మీరు సైలెంట్ గా ఉండండి. అని పెళ్లి చేసుకునే జంటలు వీళ్ళ మాట వినకపోవడం..

పెళ్లి అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు  అనే స్టేజ్ నుండి పెళ్లి అంటే ఎంజాయ్ చేసే పార్టీ స్థాయికి
దిగజార్చేసారు 

ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తాదొ 🫢🤐🤐

****పూజారి -- కానుకలు

 పూజారి -- కానుకలు
~~~

మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు.
హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది. 
అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.

హుండీ ఎవరు తెరుస్తారు ? 
ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ?
 ప్రభుత్వప్రతినిధి ! .
అంటే 
భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట! 
సరే ! 
మరి పూజారి ఎవరు ?
పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట)
ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక అలౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తర, శతసహస్రనామాలతో  పూజించి, స్వామీ ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని ప్రార్ధించి వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు! ...

మరి ఆయన జీతమెంత ? 
చాలాచాలా తక్కువ ! బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత!.
పూజారా ! మేము పిల్లనివ్వం ! అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో.

కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో ! కోకొల్లలు!

వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా?.
మన కుటుంబాలు కార్లలో తిరగాలి.
మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి.
విహారయాత్రలకు వెళ్ళాలి.
అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం. ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం !.

కానీ 
ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము. ఇదెక్కడి న్యాయం.
నా విన్నపం ఏమిటంటే ! హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి లేదా పూజారి చేతికి కానుకలు ఇవ్వండి !
కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు !
ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు నిత్యం చూస్తున్నాం!, ఈ రోజు గుళ్ళల్లో అర్చకులు నిరంతరం సుస్వరంతో మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు! .
ఆ వృత్తిలో పూజారులకు తగినంత ఆదాయం వస్తే  వారు సలక్షణంగా మరింత భక్తితో, శ్రద్ధతో పూజలు చేస్తారు ! 
మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా ! పడగొట్టడమా ! ఆలోచించండి.

*****మనం సేఫ్ కాదు...*

 ❓
*మీరు గమనించారా గత కొద్ది కాలం నుండి అత్యధికంగా ప్రమాదాలు గురవుతున్నాయి వీటి వెనకాల ఉగ్రవాద ప్రణాళిక ఉందని పసిగట్టారా*❓

*ఇది యుద్ధ కాలం...మనం సేఫ్ కాదు...*

విమానాశ్రయాల దగ్గరలో ...ముఖ్యంగా రన్ వే లకి అనుకుని *చికెన్ మటన్ బీప్ *మార్కెట్లు* ఉన్నాయేమో చూడండి...

మనం సేఫ్ కాదు...

*రైల్వే ట్రాకుల వెంబడి....చిన్న చిన్న ఇల్లు కట్టుకుని...లక్షలాది మంది...ఆ ప్రజలు బంగ్లాదేశ్ మయన్మార్ నుండి వచ్చిన రోహిన్యాలు నివశిస్తున్నారా...గమనించండి...*

మనం సేఫ్ కాదు....

పెద్ద పెద్ద విద్యుత్ ప్రాజెక్టులు..డ్యామ్ లకి ఆనుకుని ఉన్న కాలనీల్లో ఇరవై శాతం మించి ఆ ఎడారి గుడారాలు ఉన్నాయా....

మనం సేఫ్ కాదు...

కీలక మైన పెద్ద జాతీయ రాష్ట్ర రహదారులు వెంబడి...మూడు నాలుగు వందల మంది ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉండి... రోడ్డు కొంచెం కుంచించుకుని కనబడుతోందా....

మనం సేఫ్ కాదు....

*మన రక్షణ దళాల ఆర్టిలరీ డిపోలు....సైనిక సిబ్బంది నివాసాలకి ఆనుకుని...వందల సంఖ్యలో ఆ ఇళ్లు...ప్రార్థనా స్థలాలు ఉన్నాయా....*

మనం సేఫ్ కాదు....

రాజధాని చుట్టూ... రాజధానులకి చేరుకునే రోడ్లు ఇరుకుగా ఉండి....దగ్గర గ్రామాల్లో వంద శాతం ఆ జనాభా ఉన్న ప్రాంతాలు ఉన్నాయా....

మనం సేఫ్ కాదు....

*ఆయిల్ డిపోలు ఉన్న ప్రాంతాలు...గ్యాస్ పైపులైన్లు...పెట్రోలియం సరఫరా కేంద్రాలు...వీటిని రవాణా చేసే వాహనాలు...నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంది గమనించండి....*

మనం సేఫ్ కాదు....

*మనది అతి పెద్ద దేశం...అందులోనూ సెక్యులర్ భూతం ఆవహించిన అమాయకపు ప్రజలున్న దేశం...*

మనం సేఫ్ కాదు....

హిందువులకి మాత్రమే నీతులు చెప్పే...నీరుగార్చే రచయితలు..కవులు..కళాకారులు ...ఛానల్ పత్రికా నిర్వాహకులు...ఎక్కువ మంది ఉన్నారా....

మనం సేఫ్ కాదు....

*నిత్యం మొబైల్ ఫోన్లు పట్టుకుని దాంట్లోనే ఉన్నా కూడా...ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి తెలియని పిల్లలు ఉన్న ఇళ్లు ఎక్కువ ఉన్నాయా...*

మనం సేఫ్ కాదు...

బంగ్లాదేశ్ ...శ్రీలంక ...మయన్మార్...పాకిస్తాన్ లు భారత్ లోనే ఉన్నాయి....మనకీ వాళ్ళకీ చాలా దూరం అనుకుంటున్నారా....

యుద్ధం భారత్ లోనే జరుగుతోంది....

మనం సేఫ్ గా ఉన్నామా...

గమనించండి....

రాబోయే రోజుల్లో... అతి చిన్న కారణానికి కూడా దేశ వ్యాప్త బందులు..హర్తాళ్ళూ...నిర్వహించడానికి *రాహు దళం సిద్ధం అవుతోంది...*

మనం సేఫ్ కాదు...

*రైళ్లు పట్టాలు తప్పించి ట్రయల్ చూసారు.... వందే భారత్ పై రాళ్ళు విసిరి కొట్టి చూసారు...*

*ఢిల్లీని నిర్బంధించి🙄 చూసారు...ఎర్రకోట పై ఖలి జెండా ఎగరేసి హెచ్చరిక పంపారు..*.

*త్రివిధ దళాధిపతి హెలికాప్టర్ కూలిపోయింది...*

*మన ప్రధానిని సరిహద్దు ఫ్లై ఓవర్ పైన కదలనివ్వలేదు...ప్రక్క దేశపు ప్రధాని పారిపోయి ఇక్కడ తలదాచుకునే స్థితిని కల్పించారు.*.👆🏻.

మనం సేఫ్ కాదు...

చెయ్యాల్సిన రిహార్సల్స్ అయిపోయాయి...ఇంక ప్రత్యక్ష ప్రకటనే మిగిలి ఉంది...🔥

*నిజమే మోడీ నాయకుడిగా జాతీయ వాద ప్రభుత్వం ఉన్నది కాబట్టి సరిపోయింది...🫠.*

*లేకుంటే....ఒక్కసారి ఊహించండి*.🤔..❓

*అయినా మనం సేఫ్ కాదు...*☹️.
*మన దేశంలో అధికార లెక్కల ప్రకారం సుమారు  10 కోట్లు అనాధికార లెక్కల ప్రకారం 15 కోట్ల  రోహింగ్యాల పైమాటే మన*
 భారతదేశం అంతట  వచ్చి నివసిస్తున్నారు. హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ బైంసా గజ్వేల్ జగిత్యాల్ లాంటి అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు 
వీరిని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు
*NRC CAA* లాంటి చట్టాలు *BJP* తీసుకువస్తే హిందూ వ్యతిరేక పార్టీలు ఏకకంఠంతో వ్యతిరేకించాయి
ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్న చొరబాటు దారులతో అలాగే వారికి మద్దతిస్తున్న వారితో ప్రమాదం

ఇప్పటికీ... ధృవ్ రాఠీ...వాగేశ్వర్ ల మాటలకి చెల్లుబాటు ఎక్కువ...ఇక్కడి హిందువులు, బంగ్లా హిందువులంత ధైర్యం....ఐక్యత ఉన్నవాళ్లు కాదు... అవేర్నెస్ ఉన్నవాళ్లు కాదు...

మనం సేఫ్ కాదు...

*ఈ పోస్టు పంచి అభిప్రాయం అడగండి...ఇది ఏదో రెచ్చగొట్టేదిగా ఉందీ...పంచేది కాదు అనిపించే జనం నీ చుట్టూ ఉన్నారా...*

*సేఫ్ కానే కాదు...*
 శ్రీ భగవాన్ ఉవాచ - కర్మ, సన్న్యాస యోగము



లేనివాడై ఉపరతిని పొంది, పరమాత్మ ధ్యానము నందు ఆనందించువాడు. పరమాత్మయే పరమానంద స్వరూపుడు, నిరంతరము, అట్టి అక్షయసుఖ సాగరుని అభేదభావముతో ధ్యానించుచు, తాదాత్మ్యమును చెందుటయే అక్షయానందము ననుభవించుట. ఇదియే సర్వోత్కృష్టమైన ఆనందము.

22. యేహి సంస్పర్శజాభోగా, దుఃఖయోనయ ఏవతే | 
ఆద్యంత వంతః కౌంతేయ, న తేషు రమతే బుధః ॥

విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నమగు భోగము లన్నియును, (భోగలాలసులకు సుఖములుగా కన్పించినను) నిస్సందేహముగా నవి దుఃఖ హేతువులే, మరియు, ఆది అంతములు గల అనిత్యములు. కావున ఓ అర్జునా! బుద్ధిమంతుడు వాటియందు ఆసక్తుడు కాడు.

వ్యాఖ్య :- బాహ్యాకర్షణలు క్షణికములు. తృష్ణను పెంచునట్టివి. వివేక వంతుడు ఇటువంటి క్షుద్రమైన సుఖముల నాశింపక, శాశ్వతమైన ఆత్మయందే రమించును. ఆనంద నిలయమైన ఆత్మను, తనయందే ఉంచుకొని, బాహ్యమైన వస్తువులయందు క్షణిక సుఖాలవెంట పరువులెత్తడం శుద్ధ అవివేకమని భావము.

23. శక్నోతీహైవ యః సోఢడుం, ప్రాక్ శరీర విమోక్షణాత్ । కామక్రోధోద్భవం వేగం, సయుక్తః ససుఖీ నరః ॥

ఎవడు ఈ జన్మము నందే, దేహమును చాలించుటకు పూర్వమే, కామ క్రోధముల వలన కలిగిన ఉద్వేగమును సహించుటకు సమర్థుడగుచున్నాడో, (అదుపులో నుంచుకోగలడో) ఆ సాధకుడే యోగి మరియు సుఖి కూడాను.

వ్యాఖ్య:- కామక్రోధములు మానవునకు మిక్కిలి ప్రమాదకరమైన అంతః శత్రువులు, (3/37) అని భగవానుడే చెప్పి యుండెను. కావున వీటిని ఈ జన్మ యందే, ఈ శరీరమును విడువక పూర్వమే అణగద్రొక్కి వాటి ఉధృతమును శమింప జేయవలెనని భగవానుని హెచ్చరిక. ఏలనన దుర్లభమైన ఈ మానవ జన్మ మరల మరల రాకపోవచ్చును. ఈ జన్మ యందు వీటిని ఉపేక్షించినచో నివి మరుజన్మ యందును విజృంభించి, దుర్జయమయి పోవును. నీచజన్మలకు దిగజార్చును. వీటిని ఈ జన్మలోనే నియంత్రించిన సాధకుడు యోగియు, సుఖియు అగును.

****జీవితప్రయాణం చాల చిన్నది....

 జీవితప్రయాణం చాల చిన్నది....

*నాకు కోపం రాదు. ఎందుకంటే జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.*

ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. 
తరువాతి స్టాప్ వద్ద, 
ఒక బలమైన, 
క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, 
ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 

వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి 
తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగింది.?

వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు,
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.* 
నేను తరువాతి స్టాప్లో దిగబోతున్నాను కాబట్టి, 
ఈ కొంత సమయానికి అసభ్యంగా ప్రవర్తించాల్సిన 
అవసరం లేదు.

ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది:

*అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు* 

*ఎందుకంటే  ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని 
మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 

పనికిరాని వాదనలు, 
అసూయ, ఇతరుల మీద చాడీలు చెప్పడం, వారి మనస్సులను  బాధపెట్టడం,
ఇతరులను క్షమించకపోవడం, ఎంత ఉన్నా అసంతృప్తి
మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు 
శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.

మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? 
ప్రశాంతంగా ఉండు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీకు 
ద్రోహం చేశారా, 
బెదిరించారా, 
మోసం చేశారా లేదా 
అవమానించారా? 
విశ్రాంతి తీసుకోండి. 
ఒత్తిడి కి గురికావొద్దు.
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? 
దాన్ని వదిలేయండి. 
దాన్ని విస్మరించండి. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీతో విభేదించారా, 
బాగా ఆలోచించండి...? 
గట్టిగా ఊపిరి తీసుకోండి. 
అతన్ని / ఆమెను విస్మరించండి. 
మన్నించి మరచిపోండి. 
“ఎంత ముఖ్యమైనా 
మీ మనసుకు నచ్చని, 
నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, 
వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. 
వారికి దూరంగా మనశ్శాంతి తో ఉండండి, 
కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. 
దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు దిగిపోతారో ఎవరికీ తెలియదు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మనకు అన్ని సమయాలలో అండగా ఉండే 
స్నేహితులను అభినందిద్దాం.
మనం 
గౌరవంగా, 
దయగా, 
క్షమించేలా ఉందాం.
తద్వారా, 
మనం కృతజ్ఞత 
మరియు 
ఆనందంతో నిండిపోతాము. 
చివరికి గుర్తుంచుకోవాల్సింది. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

*ఎప్పుడు జీవితయాత్ర  ముగుస్తుందో ఎవరికీ తెలియదు..* 

*ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. !!*

మీ..
డాక్టర్. వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్. 
9393613555,
9493613555.
 *భగవంతుడి భాష*
               

*మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి మనం భాషను సముచిత మైన సాధనంగా వినియోగించు కుంటున్నాం. భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం. మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది.*

*నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది. భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? రమణమహర్షి మౌని. ఆయన భాష మౌనమే. ఆయన బోధలూ మౌనంద్వారానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌనసాధనం ద్వారానే జ్ఞానబోధ చేశాడు. అలాగే మహానుభావులెందరో మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. భగవంతుడూ మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం ప్రసాదించాడు.*

*నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల- వీటన్నింటి ద్వారా పరమేశ్వరుడు మనకెన్నో అమూల్య సందేశాలు అందజేస్తున్నాడు. జ్ఞానసంపదను పంచి పెడుతున్నాడు.*

*ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువూ మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. మబ్బులు వర్షిస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని పులకింపజేస్తున్నాయి. పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాస ద్వారా సకల ప్రాణి కోటికీ మనుగడనిస్తోంది. సృష్టిచక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు, ఒక్కో రకమైన సామర్థ్యం, శక్తీ ఏర్పాటు చేశాడు భగవంతుడు.*

*అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా, తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. అనంతకోటి నామధేయాలున్నట్టే ఆయనకు అనంతకోటి భాషలూ ఉన్నాయి. ఎవరికి ఏ భాష ద్వారా కర్తవ్యబోధ చేయాలో అలా చేస్తున్నాడు. అలాగే మనకు తన మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేస్తున్నాడు. వాటిని గ్రహించటం, ఆచరించటం- మన సుకృతం, వివేకం, ఆసక్తి మీద ఆధారపడ్డాయి.*

*వేదాలు, శాస్త్రపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతాది పవిత్రగ్రంథాల ద్వారా మనకెన్నో ధార్మిక విషయాలు, నీతి సిద్ధాంతాలు నిర్దేశితమయ్యాయి.*

*తపస్సంపన్నులు, మునులు, రుషులు, బుధులు, వేదజ్ఞులు, పౌరాణికులు, పండిత శ్రేణులు, ప్రవక్తలు మనకు పరమాత్మ భాష ద్వారానే రసానంద సిద్ధిని కలగజేస్తున్నారు. మన సుఖ జీవనయాత్రకు ఉపయోగపడుతున్న విషయ పరిజ్ఞానమంతా పరోక్షంగా ఆయన భాషా వ్యవహారమే. ఒక్క మనిషి తప్ప ప్రకృతిలోని ప్రత్యణువూ నిస్వార్థంగా సేవచేస్తోంది. ఆ సేవలు, సుఖాలు పొందిన మానవుడు మాత్రం కృతజ్ఞతాహీనుడై ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రకృతినుంచి పరమాత్మ భాషను, భావాన్నీ, సందేశాన్నీ గ్రహించి, తదనుగుణంగా నడచుకోవాల్సి ఉంది.*

*అనంతమైన భగవంతుడి భాషల్లో కొన్ని మనకు బాగా తెలిసినవే. అవే సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్ఛీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థబుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధినిర్వహణ... ఇలాంటివి. ఇవన్నీ మనకు ఎంత బాగా తెలుసో, అంత బాగా మనసుకు దూరంగా ఉంచుతాం. అందుకే భగవంతుడి భాష అవగతం కాదు. ఆ సద్గుణాలన్నింటినీ మహానుభావులెందరో ఎప్పుడో సుగ్రాహ్యం చేసుకున్నారు. ఆచరించి చూపారు.*

*కనుక, వారందరికీ భగవద్భాష సుబోధకమే అయింది. ప్రధానంగా గ్రహించవలసింది- భక్తి ఒక్కటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఆర్తుల సేవ దానికి తోడైతేనే ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించగలం.*

 *అప్పుడే మనం భగవద్భాషను సంపూర్ణంగా సాకల్యంగా అవగాహన చేసుకున్నవాళ్లమవుతాం. సద్గురువు మార్గప్రదర్శనంలో సముచితమైన శిక్షణ పొంది, సాధనచేసి సార్థక జీవన ప్రస్థానం సాగిస్తే భగవంతుడి భాషలన్నీ మనకు అర్థమైనట్టే.*

*జీవించి, వికసించి, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందడమే జీవితం. 'నేను' అనే మాటకు అర్థం తెలుసుకో గలిగితే, ఆ మాటను హృదయం నుంచి తొలగించగలిగితే భగవద్భాషా పరిజ్ఞానం పొందగలిగినట్టే! అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. అందుకే వీలైన్నన్ని భగవంతుడి భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం...🙏🏻 
                                                   
🪷⚛️✡️🕉️🪷
 చలాచల బోధ:--
ఇప్పుడు బంధ మోక్షాలు ఎవరికి? ఆత్మకా?అనాత్మకా? ఆత్మ నిత్య ముక్తము, ఆనంద లక్షణయుతము.ఆత్మకు చావు పుట్టుకలు లేవు.సదా ఉంటూనే ఉంటుంది.ఆత్మకు బంధము లేదు.కావున ముక్తి కొరకు ఆరాట పడదు, ప్రయత్నం చేయవలసిన పని లేదు.ఇక అనాత్మ జడము, ఆత్మ చైతన్యం వలన చైతన్యవంతమై పని చేస్తుంది.అనాత్మ అనగా శరీర ప్రాణ మనసులు యాంత్రికంగా పని చేస్తాయి.
శరీర ధర్మం జనన మరణాలు.ప్రాణ ధర్మం ఆకలి దప్పులు.మనసు ధర్మం శోక మోహాలు.ఈ ఆరు ధర్మాలను కలిపి షడూర్ములు (షట్+ఉర్ములు) అని అంటారు.షడూర్మి సహితః జీవః.
షడూర్మి రహితః శివః 
అని శాస్త్రం చెబుతోంది.అనగా ఎవరికైతే ఈ షడూర్ములను కలిగి ఉంటారో వారు జీవ భావంతో ఉంటారు.ఎవరైతే షడూర్ములను రహితపరచు కుంటారో వారు జీవ భావమును విడచి పెట్టి, శివుడు లేక బ్రహ్మానంద స్వరూపుడు అయి ఉంటారు.అయితే ఈ షడూర్ములను ఎవరు పోగొట్టుకుంటారు?అమనస్కమైన తరువాత ఎవరు మిగిలి ఉంటారు?సాధన చతుష్టయ సంపత్తి కలవాడైయున్న "నేను నేనైన నేను"ఉంటాడు.ఈ "నేను నేనైన నేను"అంటే ఎవరు? శరీర త్రయం విలక్షణమైన నేను మరియు పంచకోశ ధర్మ వ్యతిరిక్తమైన ధర్మం ఉన్న నేను.ఇంకా మెలుకువ కల నిద్ర లేని నేను.అనగా షడూర్ములు లేని నేను.కావున బంధ మోక్షాల విషయము 'నేను'కు ఉన్నది.షడూర్ములు నాకు ఉన్నాయి అని అనుకునే 'నేను'కు బంధం ఉంది.కావున ఆ'నేను'కు మోక్షేచ్ఛ ఉంటుంది.షడూర్ములు నాధర్మాలు కాదు, నేను వాటి కంటే వేరుగా విలక్షణంగా ఉన్నాను అనే నిశ్చయ జ్ఞానం కలిగి యున్న 'నేనే'అనగా "నేను నేనైన నేనే"ఆత్మను "అహం బ్రహ్మ"అని యే, నేను 'కు స్వానుభవం ఉంటుందో ఆ 'నేనే'ముక్తుడు. కనుక ఆత్మకు బంధ మోక్షాలు లేవు,అనాత్మకు బంధ మోక్షాలు లేవు.మధ్యలో ఉన్న, నేను 'కు తన అజ్ఞానంలో బంధ మోక్షాలు ఉన్నాయి.శరీర త్రయం నేను కాదు అని విలక్షణమైన నేను కు బంధ మోక్షాలు లేవు.అలాగే పంచ కోశ ధర్మాలు నాకు లేవు అని వ్యతిరిక్తమైన ధర్మం అనగా సచ్చిదానంద లక్షణం గల నేను కు బంధ మోక్షాలు లేవు.మూడు అవస్థలు నాకు లేవు అని అవస్థా త్రయమునకు నేను సాక్షిగా ఉన్న నేనుకు బంధ మోక్షాలు లేవు.
అందుకే రమణ మహర్షి వారు 'నేను ఎవరు 'అనే ప్రశ్నను పెట్టి ఆ నేనును విచారణ చేసుకొనమని ప్రవచనమును అందించారు.

ఇప్పుడు పంచకోశాలంటే ఏమిటి?అనే వివరాలను మరియు వాటి ధర్మాలను చెప్పుకుందాము.
సశేషం!
 చలాచల బోధ:--
మన స్వభావములో కూడా ఈ రెండు గుణాలు ఉన్నాయి.మనలోని తమోగుణము వలన మన ఆత్మ మనకు తెలియదు.దీనిని ఆవరణ అని అంటారు.మనలోని రజోగుణము వలన మన ఆత్మకు బదులు అనాత్మ యైన శరీర త్రయమే నేను అనే విక్షేపము కలుగుతుంది.అలాగే పంచకోశాలు నేను అనే విక్షేపము కూడా కలుగుతుంది.అంతటా ఉన్న బ్రహ్మ గోచరించద.బదులుగా ఈ కల్పిత జగత్తు గోచరిస్తుంది.ఈ తమోగుణ రజోగుణ జంటను అవిద్య అని అంటారు.మనలోని అవిద్య వలన మనకు ఆవరణ మరియు విక్షేప దోషముల వలన ఆత్మను మరిచి, అనాత్మ యైన మూడు శరీరాలను,పంచకోశాలను నేను అని అనుకోవడమే అజ్ఞానం అనబడుతుంది.అవిద్యా దోషము పోగానే నేను ఆత్మను లేక అహం బ్రహ్మ అనే జ్ఞానం కలుగుతుంది.
ఉదాహరణకు మన కన్ను తనను తాను చూడజాలదు.బదులుగా మన కన్ను బాహ్యమైన శబ్ద స్పర్శ రూప రస గంధములను గ్రహిస్తుంది.అనేక విషయాలను గ్రహించడమే కాకుండా ఆ విషయాలతో తాదాత్మ్యత చెందుతుంది.అటువంటి తాదాత్మ్యత వల్లనే ఈ "నేను"నిజంగా ఆత్మ అయియున్న తనను ఆత్మ లక్షణాలను అనుభవించకుండా తాను కానటువంటి స్థూల శరీరం నేను అనియు, సూక్ష్మ శరీరం నేను అనియు,కారణ శరీరం నేను అనియు ఈ శరీరానుసారమైన అనుభవాలను పొందుతూ ఉంటుంది.అవిద్యా దోషమే ఈ శరీరానుసారమైన జీవితాన్ని అనుభవిస్తూ, ఇంద్రియ భోగాలే ఆనందము అని అనుకుంటూ.తనను తాను ఈ సంసారములో బంధించుకొని నాడు ఈ మానవుడు.పుణ్య పాపాలను చేస్తూ ఫలితముగా సుఖ దుఃఖాలను అనుభవీస్తూ, స్వార్థంతోను,కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనెడి అరిషడ్వర్గమునకు లోబడి,జనన మరణ చక్రంలో తనను తాను బంధించుకున్నాడ.ఎలాగైతే ఒక సాలిపురుగు తనలోని పదార్ధమును బయటకు తెచ్చి సాలిగూడు కట్టుకొని,తన వృద్ధాప్యంలో కదలలేక తన గోళ్ళకు దారాలు బంధించగా, ఆహారం లేక చచ్చి పోవునట్లు మానవుడు తన బంధానికి తానే కారణమవుతున్నాడు.మానవుడు బుద్ధి జీవి గనుక ఆత్మానాత్మ వివేకముతో తన బంధమును తనే విడిపించుకొని బంధ విముక్తుడు కావాలి.అప్పుడే మానవ జన్మ సార్థక మవుతుంది.
సశేషం!
 🪷🙏🏻🪷🙏🏻🪷

🙏 *రమణోదయం* 🙏

*ఇహ పరాల్లో పొందే అల్ప సుఖానుభవాలపై ఆశలు పెంచుకొని దుఃఖిస్తున్న ఓ మనసా! నీవు ఎటువంటి తలపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలని దాటిన బ్రహ్మానంద ముక్తిని నిశ్చయంగా పొందుతావు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.379)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹
               
*శ్రీ గురుభ్యోనమః*

      నీ హృదయంలో  ఒక  నిజం  ఉంది !  నీ హృదయంలో  ఒక  సత్యం  ఉంది !  చావులేని  ఆ పదార్థం  గురించి  తెలుసుకుంటేనే  గాని,  చావులోంచి  నువ్వు  బయట  పడలేవు.  పుట్టినవాడు  చనిపోతూ  ఉంటాడు,  చనిపోయినవాడు  పుడుతూ  ఉంటాడు.  ఇది  సంసారం.  కోరికలతోనే  నువ్వు  పనులు  చేస్తావు,  కోరికతో  పని  చేయటం  మానవు,  కోరిక  వల్లే  సంసారం  కూడా  వస్తుంది. 

*భగవద్గీతలో  చెప్తాడు ..  కామ్యకర్మలు  చేసినంతకాలం ..  మనిషివెంట  నీడ  ఏవిధంగా అయితే  వెంటాడుతుందో,  అదేవిధంగా  కోరికలు  కోసం  పనిచేసేవాడికి,  సంసారం  ప్రతీజన్మలో  నీడలా  వెంటాడుతుంది.*  
కొంతమంది  ఉంటారు ..  మీరు  మాకేమీ  ఉపకారం  చెయ్యద్దు,  మా ముఖంవంక  చూసి  కొంచెం  నవ్వుండి  చాలు  అంటే  నవ్వరు.  నవ్వితే  మాకేం  కలిసి  వస్తుందని !  వాళ్ళకి  నవ్వటం  వల్ల  కూడా  కలిసి  రావాలి.  మా ఇంటికి  వస్తే  మీరేం  తెస్తారు ?  మీ ఇంటికి  వస్తే  మాకేం  ఇస్తారు ?  ఇదీ ..  ఇప్పుడు  సిద్ధాంతం !  వీళ్ళకి  సంసారం  ఏం  విడిచిపెడుతుందన్నాడు  భగవవద్గీతలో  భగవంతుడు !  కృష్ణుడంటే ..  ఊరికే  వసుదేవుడు  గారి  అబ్బాయి  అయి  చెప్పలేదు.  ఆయన  పరబ్రహ్మమై  చెప్పాడు,  పరిపూర్ణుడై  చెప్పాడు,  ఈశ్వరుడై  చెప్పాడు,  సర్వజ్ఞుడై  చెప్పాడు,  నారాయణుడై  చెప్పాడు అది  *భగవద్గీత !!*

*శంకరాచార్యులవారు  అన్నారు ..*  ఎన్ని  పుస్తకాలకైనా  వ్యాఖ్యానం  వ్రాయచ్చు  కానీ,  *భగవద్గీత* కు  వ్యాఖ్యానం  రాయటం  కష్టం.  భగవంతుడు  చెప్పిన  మాటకు  లోతు  ఎంతుందో నాకు  తెలియటం  లేదు  అన్నారు ఆచార్య స్వాములవారు.  

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                        
🪷🙏🏻🪷🙏🏻🪷