Sunday, January 3, 2021

ఆలోచన మనదే ...ఆచరణా మనదే ...నిర్ణయం నీదే.... మనదే....

Forwarded from Davejigaru
మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయతీ
రెండవది దార్శనికత

చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్దత
రెండవది పారదర్శకత

ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం
రెండవది తత్వం

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం
రెండవది వివేకం

ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ
రెండవది నేర్పు

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం
రెండవది నీడ వీడిన చైతన్యం

గెలవడం వేరు
గెలిపించడం వేరు
మొదటిది నేను
రెండవది మేము

సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం
రెండవది చైతన్యం

మొదటిది కావాలో...
రెండవది కావాలో...
ఆలోచన మనదే ...
ఆచరణా మనదే ...
నిర్ణయం నీదే.... మనదే....

శుభోదయం
🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment