Saturday, January 2, 2021

*"గర్భం"* (Pregnancy) *"మాతృత్వం"* (Motherhood)

🟢 పితామహ పత్రీజీ 28-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 28-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"గర్భం" (Pregnancy)
"మాతృత్వం" (Motherhood)

"గర్భస్థ శిశువు యొక్క స్వభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది తల్లి పైన, ఆమె ఉండే వాతవరణం పైన ఆధారపడి ఉంటుందని భావిస్తారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. తల్లి కేవలం సమ్మతించిన లేక అసమ్మతితో ఉన్న సాధనం మాత్రమే ; భవిష్యత్తులో రాబోయే బిడ్డ యొక్క బలీయమైన విధికి అనుగుణంగానే ఆమె పని చేస్తుంది."

"గొప్ప సుగుణాలు మరియు మేధ సంపత్తి కలిగిన బిడ్డ కావాలని ఓ స్త్రీమూర్తి నిశ్చయించుకున్నట్లయితే, ఉత్తమమైన మార్గం ఏమిటంటే గర్భం దాల్చక ముందు నుంచే తన కోరిక పట్ల నియంత్రణ కలిగి, ఉన్నతమైన విషయాల పట్ల అభిరుచి కలిగి ఉండటమే."

"ఒకవేళ స్త్రీ, పురుషులిద్దరు, వారి దేహాలలోను, ఆలోచనలలోను స్వచ్ఛత కలిగి ఉంటే , అటువంటి పరిస్థితులలోనికి రావడానికి ఎదురుచూస్తున్న శరీరి- నేను (doer) యొక్క విధి, వారికి ఆకర్షింపబడుతుంది. గర్భం దాల్చక ముందే విధి అనేది నిర్ణయించబడి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత తల్లి, ఆ శరీరి- నేను (గర్భస్థ శిశువు) పునర్జీవించదలచుకున్న తన స్వభావాన్ని మరియు మానసిక ధోరణులను, మార్చలేదు."

"బిడ్డ యొక్క రూపు రేఖలు ఎలా ఉండాలి లేక తన జీవితంలో ఎటువంటి స్థానాన్ని కలిగి ఉండాలి అనే విషయాలపై, తల్లికి ఎటువంటి హక్కు లేదు, అదే విధంగా ఆ బిడ్డ యొక్క లింగ నిర్థారణ చేయటానికి కూడా తల్లికి హక్కు లేదు; దానిని మార్చే ప్రయత్నం చేయటమంటే చట్టాన్ని వ్యతిరేకించటమే మరియు అది బిడ్డను గాయపరుస్తుంది."

"తండ్రి యొక్క వంశపారంపర్యత, అతని బీజకణంపై దృఢమైన ముద్రగా కలిగి ఉంటుంది అదే విధంగా తల్లి యొక్క వంశపారంపర్యత ఆమె బీజకణంపై ముద్రగా కలిగి ఉంటుంది మరియు శరీరి- నేను యొక్క స్వంత వంశపారంపర్యత తన శ్వాస- రూపం పై ముద్రగా కలిగి ఉంటుంది. ఆ బిడ్డ యొక్క శ్వాస - రూపం ద్వారా కలిగి ఉన్న వంశపారంపర్యతతో సమానత్వం లేకుండా అది తల్లి లేక తండ్రి నుంచి వంశపారంపర్యతగా ఆ బిడ్డకు రాలేదు."

"బిడ్డ పుట్టిన తర్వాత, పిండంగా ఉన్నప్పుడు ఏవైతే ధోరణులు ప్రవేశపెట్టబడ్డాయో మరియు పునరుద్ధరించబడ్డాయో, అవి క్రమంగా శారీరక ఆకృతి, రూపురేఖలు, మానసిక ధోరణులుగా రూపుదిద్దుకుంటాయి."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment