Thursday, January 14, 2021

నోటిలోని మాటే .. నుదిటి మీద వ్రాత

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group

🔺 బ్రహ్మర్షి పత్రీజీ సందేశాలు 🔺

🔹 నోటిలోని మాటే .. నుదిటి మీద వ్రాత”
అంటే
”🔶 మన నోటిలోకి పోయేది మనకు చెడుపు చేయదు ..
మన నోటి నుంచి బయటకు వచ్చేది మాత్రమే మనల్ని మలిన పరస్తుంది
🔹 ముఖం మనస్సుకి దర్పణం; వాక్కులు ఆత్మకు దర్పణం”

▶️ ప్రక్కవారి వాక్కుల ద్వారా వారి ఆత్మ యొక్క యదార్థ స్థితిగతులను మనం గ్రహించవచ్చు
స్వీయ ఆత్మ యొక్క స్థితి నుంచే వాక్కులు వస్తాయి గనుక!
ఇంకా మనం అంటున్నాం:
“▶️ఆత్మ యొక్క ఆత్మ అంట – నోటిలోని మాట అంట పనికిరాని మాటలంట – వద్దు వద్దు వద్దు అంట
మాట శుద్ధి వుండాలిరో .. ఆత్మ సిద్ధి కలగాలిరో”

🔺మనం ఒకానొక ఆత్మ పదార్థం
అయితే మనం “సిద్ధాత్మలు” గా మారాలంటే మన మాటలలో శుద్ధి ఉండి తీరాలి
ప్రతి వాక్కులోనూ అత్యంత శుద్ధత, అత్యంత సత్యత ఉండి తీరాలి
నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కూ, ప్రతి మాటా ఎంతో ముఖ్యమైనది
ఎంతైనా ఫలదాయకమైనది!
విషయం తెలిస్తేనే మాట్లాడాలి,
విషయం తెలియకపోతే మాట్లాడకూడదు
మాటలు ఎప్పుడూ ముత్యాల్లా ఉండాలి;
చిల్లర పెంకుల్లా వుండకూడదు.
నోటిలోనే మాటే నుదుటి మీద వ్రాత ” అని కూడా ” PSSM” అంటోంది
అంటే
వర్తమానంలో మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటా రాబోయే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది”
అని అర్థం
తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త !
“జ్ఞానయోగ సాధన” అంటే మన సకల మాటలలో ..
స్పష్టత, శాస్త్రీయత, సత్యత, క్లుప్తత వుండి తీరాలి ..
అప్పుడే “జ్ఞానయోగి” గా మనగలుగుతాం ..
” PSSM ” లో జ్ఞానయోగానికే ప్రథమ తాంబూలం!
ఆ తరువాతే ధ్యానయోగం, మరి కర్మయోగం
మాటలు ఎప్పుడూ తిన్నగా వుండాలి; తిక్కగా వుండకూడదు
“తగుదునమ్మా” అని నోరు విప్పరాదు !
ఆలోచించి, ఆలోచించి నోరు విప్పాలి!
తెలుసుకుని, తెలుసుకుని నోరు విప్పాలి!
శోధించి, శోధించి నోరు విప్పాలి !
మాటలలో వినయం ఉట్టి పడాలి; మాటలలో వినమ్రత వుండాలి
“విద్యా దదాతి వినయం” అన్నారు కదా..
“విద్య” అనేది వినయాన్ని ప్రసాదించాలి, వినమ్రతను ప్రసాదించాలి..
“విద్యలేని మనిషి వింత పశువు” అన్నారు కదా,
అంటే
“వినయంలేని మనిషి వింత పశువు” అని అర్థం
“తద్వద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః” అని వుంది భగవద్గీతలో
అంటే “జ్ఞానులకు, తత్వజ్ఞులకు సాష్టాంగ ప్రణామాలు చేసి,
సేవ చేసి, మరి సరియైన ప్రశ్నలు వేసి వారి ద్వారా
ఆ తత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి.” అని అర్థం
“వాక్‌క్షేత్రం” ప్రణమామ్యహం
“యోగీభవ”
“తస్మాత్ జ్ఞానయోగీభవ”
“తస్మాత్ ఆత్మజ్ఞానయోగీభవ”
ఓం తత్ సత్


లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍
VicTorY oF LiGhT🎇

💚🔆
Light Workers---- 🔄♻🔁 Connected with Universe*💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment