Monday, January 4, 2021

జ్ఞానం కలగకముందు ఎలా ఉంటాడు జ్ఞానం కలిగిన తర్వాత ఎలా ఉంటాడు

ఒక మామూలు మనిషి
జ్ఞానం కలగకముందు ఎలా ఉంటాడు
జ్ఞానం కలిగిన తర్వాత ఎలా ఉంటాడు
ఉదాహరణ

మామూలు పాలు
మామూలు మనిషి ..
పాలను వేడి చేసి తోడు పెడితే
పెరుగు అవుతుంది
పెరుగును చిలికితే చల్ల అవుతుంది
చల్లను చిలికితే వెన్న వస్తుంది
వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది ...
ఆ వచ్చిన నెయ్యి
తిరిగి పాలలో కలవదు
తిరిగి పెరుగులో కలవదు
తిరిగి మజ్జిగలో కలవదు
తిరిగి వెన్నెలలో కలవదు
నెయ్యి అలాగే ఉండిపోతుంది....
అలాగే మనిషి కూడా
జ్ఞాని కాకముందు అంతట తిరుగుతాడు ...
కొంత కొంత జ్ఞానం కలిగే కొద్దీ
ప్రపంచానికి
సమాజానికి
కుటుంబానికి
బంధాలకు
చివరికి దేహానికి
ఇంద్రియాలకు
అంటకుండా సాక్షిగా మిగులుతాడు...
పాలలో నుండి వచ్చిన నెయ్యి
తిరిగి పాలలో కలవదు అలాగే
సమాజంలో నుండి జ్ఞాన మార్గానికి వెళ్ళిన మనిషి
జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత తిరిగి సమాజంలో కలవలేడు
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment