Sunday, January 3, 2021

కుటుంబంలో ఉన్నవారితో కోపతాపాలు, ప్రేమ, ఆప్యాయతలు, అనేవి మనకు, మనమే పంచుకోవాలి,* సరిచేయడానికి ప్రయత్నం చేయాలి, అవి *గూ గు ల్ లో ఎంత వెతికినా దొ ర క వు ..

.
💧🍨💧

ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా, చదవాలి

అరటిపండును, మామిడిపండు సీతాఫలం, సపోటాను తొక్క తీసి, గుజ్జు తింటాం, మామిడి టెంకను, సీతాఫలం, సపోటా గింజను వేరే విధంగా ఉపయోగించుకుంటాం, జామ పండును మొత్తం తినేస్తాం, ఏ పండు తిన్నా, మనకు ఆరోగ్యమే ..

ఒక్కోటి ఒక్కో రుచి తీపి, పులుపు, వగరు ఇందులోనే కాస్త తేడాలతో ఎన్నో రుచులు ! ప్రతిది మనకు ఇష్టమే, అయితే, పండును తింటున్నప్పుడు అందులో మనకు గుర్తుకు వస్తుంది, ఆ పండు మధురత్వం, మిగిలిన భాగంను ఏదోవిధంగా ప్రకృతి సహజంగా ఉపయోగించుకుంటాం ..

మనుషులు అందరూ పండ్లలాంటివారే, మనకు కావల్సింది తీసుకొవాలి, అందులో మన కుటుంబంలోని అందరూ ఒక్కోరకం పండు, ఒక్కొక్కరిదీ ఒక్కో స్వభావం, భార్యలా భర్త ఉండడు, తమ్ముడిలా అక్కలా ఉండకపోవచ్చు, అమ్మ వేరుగా ఉంటుంది, నాన్న ఇంకోలా ఉంటాడు, తమ్ముడికి అక్కకూ పోలిక ఉండకపోవచ్చు అయితే, అందరూ పండ్లలాగే, మనకు మంచి చేసేవాళ్లే ..

మనిషి విషయంలో, కుటుంబ సభ్యులు, చేసిన మంచికంటే, వాళ్లు చూపించిన కోపమో, చిరాకో, ఆసహనమో, విసుగో మనకు, ఎక్కువ గుర్తుంటుంది .. ఇది చాలా తప్పు ..

పండులో కూడా మనకు తినడానికి అవసరం లేని, గింజ, తొక్క కూడా భాగమే అనుకుంటాం, అయినా, దాన్ని ద్వేషించం, ఆ పండులాగే, కోపతాపాల, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం, అని అర్థం చేసుకోంటే, ఇది గుర్తించగలిగితే, ఏ మనిషిని ద్వేషించకుండా సంపూర్ణంగా ప్రేమిస్తాం .. మన తప్పులను సరిదిద్దుకుంటాం, జీవితాన్ని సరిదిద్దుకుంటాం ..

కుటుంబంలో ఉన్నవారితో కోపతాపాలు, ప్రేమ, ఆప్యాయతలు, అనేవి మనకు, మనమే పంచుకోవాలి, సరిచేయడానికి ప్రయత్నం చేయాలి, అవి గూ గు ల్ లో ఎంత వెతికినా దొ ర క వు ..

💎💎💎🍨💎💎💎
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment