Sunday, January 10, 2021

బ్రహ్మర్షి పత్రీజీ గారి సందేశాలు "ఆరోగ్యమే మహాభాగ్యం”

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group


🟦బ్రహ్మర్షి పత్రీజీ గారి సందేశాలు🟦
🔺ఆరోగ్యమే మహాభాగ్యం”🔺

🟧శారీరకపరంగా ఆరోగ్యమే మహాభాగ్యం
🟧 మానసికంగా ప్రశాంతతే మహాభాగ్యం
🟧సామాజికపరంగా ప్రాణమిత్రులుండటమే మహాభాగ్యం
🟧ఆధ్యాత్మికపరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యం
🟦ఆహారపరంగా రెండు పూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యం
🟦కుటుంబపరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి వుండటమే మహాభాగ్యం
🟧 ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలనూ, చెట్లనూ పెంచగలగడమే మహాభాగ్యం
🟧 పక్షులనూ, జంతువులనూ పోషిస్తూ, వాటిని సంరక్షిస్తూ వుండగలగడమే మహాభాగ్యం
🟧 రోజంతా కష్టపడి తరువాత కొన్ని గంటలైన సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం
🟦ప్రతిరోజూ చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం 🟦సంగీతానికి మైమరచి అప్పుడప్పుడూ నృత్యం చేయగలగడమే మహాభాగ్యం
🟦 రోజుకో ఆట, అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం
🟧మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం
🟧రోజుకో గంటసేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం
🟧 రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం
🟦 రోజుకో గంటసేపు మౌనంగా ఉండటమే మహాభాగ్యం
🟦మనకు తెలిసినవి ఇతరులకు నేర్పించటమే మహాభాగ్యం
🟦 కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఏకాంతంగా వుండగలగడమే మహాభాగ్యం
🟦నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా వుంచుకోగలగటమే మహాభాగ్యం
🟧 ప్రతి సూర్యోదయాన్నీ, ప్రతి సూర్యాస్తమయాన్నీ, పున్నమి ప్రశాంతతనూ .. ప్రకృతి అందాలను కనులవిందుగా అనుభవించగలగటమే మహాభాగ్యం
🟦నదీస్నానాలు, సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం
🟧 చిన్నపిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం
🟧 కళ్ళు మూసుకుని ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టడమే మహాభాగ్యం!


లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍
VicTorY oF LiGhT🎇

💚🔆
Light Workers---- 🔄♻🔁 Connected with Universe*💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment