Friday, February 4, 2022

కొన్ని కోట్ల మనుషులు ఇలానే జీవిస్తున్నారు

కొన్ని కోట్ల మనుషులు ఇలానే జీవిస్తున్నారు

తరతరాలుగా మేమింతే
మా తాత ఇంతే
మా నాన్న ఇంతే
నేను ఇంతే
మా పిల్లలు ఇంతే
మీకు తెలుసా
మా మనుమడు కూడా ఇంతే వుంటారు

మేమందరం డబ్బులు సంపాదించేందుకే పుట్టాం
కష్ట సుఖాలు అనుభవించడానికే పుట్టాము
మాకు ఇంతే తెలుసు
ఇంతకు మించి ఏమీ తెలియదు

అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు
అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి
అందరూ ఆస్తులు ఆస్తులు వస్తు సామాగ్రి కూడబెట్టుకుంటున్నారు
మేము అందరి కంటే ఎక్కువ ఆస్తులు కూడా పెట్టుకుంటాం

అవి మా వెంట వస్తాయా రావా మాకు అనవసరం
మా వారసులు తింటారో లేదో మాకు అనవసరం
అందరి కంటే గొప్పవారుగా గుర్తింపు పొందాలి
మాకు మాత్రము ఇంతే తెలుసు ఇంతే తెలుసు ఇంతకుమించి ఏమి తెలియదు
మాకు
డబ్బే లోకము డబ్బే సర్వస్వం డబ్బే ఊపిరి
.
ఈ ప్రపంచంలో అందరూ బిజీ బిజీ గజిబిజి
నడిచి వెళ్లే వాడికి తొందరే
బైకుపై వెళ్లేవారికి తొందరే
కారులో వెళ్లేవారికి తొందరే
చివరికి విమానంలో వెళ్లే వారికి కూడా తొందరే
ఈ తొందర దేనికొరకు డబ్బు కొరకే కదా
చివరికి అన్ని వదిలేసి వల్లకాటికి పోతారు
.

ఇది సంగతి
.

సేకరణ

No comments:

Post a Comment