Friday, February 4, 2022

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నిరంకుశ యోగి గారిని ఈ ఎన్నికలలో ఓడించి గొప్ప ప్రజాస్వామ్య వాదీ, సెక్యులరిస్టు అయిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

 ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నిరంకుశ యోగి గారిని ఈ ఎన్నికలలో ఓడించి గొప్ప ప్రజాస్వామ్య వాదీ, సెక్యులరిస్టు అయిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.


అలాగే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా సెక్యులర్ మేధావులు, ప్రజాస్వామ్య వాదులు కూడా యోగి గారిని ఈ ఎన్నికలలో ఒడించమని ముక్త కంఠంతో ప్రజలను కోరుతున్నారు.


ఇంతకీ బీజేపీ లేదా యోగి గారు వీరికి ఇంత నిరంకుశంగా ఎందుకు అనిపించింది అంటే...చదవండి...


ఢిల్లీ లో ములాయం సింగ్ గారూ, మాయావతి గారూ,అజిత్ సింగ్ గారూ(చరణ్ సింగ్ కొడుకు) ఇలా చాలా మంది ప్రభుత్వ బంగాళాలు అతి చవక అద్దెకు దశాబ్దాల తరబడి అర్హత లేకపోయినా అనుభవిస్తున్నారు.  కాంగ్రెస్ ఎప్పుడూ వీళ్ళని ఖాళీ చెయ్యమని కోరలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా UPA ప్రభుత్వం ఖాతరు చెయ్యలేదు. మోడీ ప్రభుత్వం రాగానే వీళ్ళందరి చేతా బలవంతంగా ఖాళీ చేయించింది.


అందుకే మోడీ అంటే మంట. మరి యోగి అంటే ఎందుకు మంట?


ఎందుకంటే...


మాజీ ముఖ్యమంత్రులు అందరకు వారు చనిపోయే వరకు ఉండడానికి  ప్రభుత్వ బంగాళాలు ఉచితంగా కేటాయించడం రూల్స్ కి వ్యతిరేకం అని ఎవరో సుప్రీమ్ కోర్టులో పిల్ వేస్తే అలా కేటాయించడం రూల్స్ కి విరుద్ధం అందుచేత తక్షణమే ఖాళీ చేయించమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు 2016 లో ఆదేశించింది. ఇలా అతి విశాలమైన బంగాళాలు ఉన్నవాళ్ళలో మాజీ ముఖ్యమంత్రులు ములాయం, మాయావతి, రాజ్ నాధ్ సింగ్, కళ్యాణ్ సింగ్, తివారి, అఖిలేష్ యాదవ్ వున్నారు. ఇందులోకళ్యాన్ సింగ్, రాజనాధ్, తివారి వారికి ఇచ్చిన బంగాళాలు యే మార్పులు చేయకుండా అలాగే వాడుకుంటున్నారు. 


కానీ మాయావతి తాను అధికారంలో ఉండగా 2 ఎకరాల స్థలంలో ₹103 కోట్లు ఖర్చు పెట్టి బంగ్లా కట్టించుకుంది.


ములాయం తాను సీఎం గా వుండగా   అప్పుడు ఉంటున్న 25,000Sft ఒక చిన్న బంగాళా లో ఓ 40 కోట్లు ఖర్చు చేసి కొంచం  మరమ్మత్తులు చేసుకున్నారు.


అఖిలేష్ సీఎం అయినా తన తండ్రి ములాయం బంగ్లాలోనే వుండేవారు.  కానీ అందరూ ప్రభుత్వ డబ్బు నొక్కేస్తూ ఉంటే మనం ఎందుకు వెనక బడాలి అని అఖిలేష్ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీని అతనికి ప్రభుత్వం ఇచ్చిన బంగ్లా (వాళ్ళ నాన్న ములాయం గారి ఇంటికి ఇది దగ్గర అందుకని సుమారు 20,000sft) ని ఖాళీ చేయించి అతనికి వేరే చోట కేటాయించి అఖిలేష్ ఈ బంగ్లా తీసుకున్నారు. 


సీఎం గారు తలుచుకుంటే ఇంకా తిరుగు ఏముంది. ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసీ చేయించి ఫారెన్ నుండి తెప్పించిన టైల్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ పెట్టించారు. స్విమ్మింగ్ పూల్ చూడ్డానికి బాగోలేదని దాన్ని కూడా ఫారెన్ టైల్స్ తెప్పించి చిన్న రిపేర్లు చేశారు.  ఈ రిపేర్లు కి జస్ట్ ₹70 కోట్లు అయింది అని స్టేట్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు.  


మాయావతి సీఎం గా తనకి ఇచ్చిన బంగ్లా కి చిన్న మేకులు కొట్టి రిపేర్ చేయడానికి ప్రజల టాక్స్ సొమ్ము 103 కోట్లు తగలేసిందని అఖిలేష్, ములాయం అపొజిషన్ లో ఉన్నప్పుడు ఏడ్చి ఏడ్చి బీదవారి కండువాలకి తమ ముక్కులు తుడిచేసుకున్నారు. అది వేరే సంగతి.


ఇప్పుడు కథలోకి వస్తే 2016 లో సుప్రీం ఆదేశాలు ఇచ్చినా సీఎం అఖిలేష్ గారు పట్టించుకోలేదు. 


కానీ సత్రం తిండి మఠం నిద్ర మనిషి యోగి వీళ్ల ఖర్మ కాలి సీఎం గా వచ్చారు. ఈయన సుప్రీమ్ ఆదేశాలు అమలు చేయమని అధికారులకు చెప్పడంతో మాజీ ముఖ్యమంత్రులకు  నోటీస్ లు ఇచ్చారు. రాజనాధ్, కళ్యాణ్ సింగ్, తివారి ఖాళీ చేశారు. మహారాజు ములాయం, యువరాజు అఖిలేష్, యుపి రాణి మాయావతి గారు లక్ష్యపెట్టలేదు. 


ఎందుకుపెడతారు? ప్రభుత్వ ఖర్చుతో  నిర్వహించే అన్నికోట్ల ఖరీదు చేసే బంగాళాలు చచ్చే దాకా మావే అనుకున్నవి, తమ తరువాత తమ కుటుంబాలలో దేశ సేవ చేయడానికి వొచ్చే మనవలు , ముని మనవలు ఆడుకోడానికి ఉంటాయి అనుకున్నవి ఇలా హటార్తుగా ఖాళీచేయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని ఎంత చెప్పినా వినకుండా యోగి ప్రభుత్వం చివరి నోటీస్ లు ఇచ్చి ఖాళీ చెయ్యకపోతే మేమే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది అని చెప్పింది.


కుటుంబాలు, బంధాలు వాటి బాధ్యతలు, బరువులు వంటివి లేని మోడీ, యోగి వారికి కుటుంబ కష్టాలు,  ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుస్తాయి. వీళ్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని ఎంత గొడవ చేసినా యోగి మెట్టు దిగక పోవడం తో ముందుగా ములాయం, ఆ తరువాత అఖిలేష్ చివరిగా మాయావతి ఖాళీ చేశారు.


పాపం ములాయం, మాయావతి బంగాళాలు ఉన్నవి ఉన్నట్లు అలాగే ఖాళీ చేస్తే  యువనేత,  ఉడుకురక్తం,  రాబోయే రోజుల్లో మళ్లీ యుపి ముఖ్యమంత్రి కుదిరితే  దేశ ప్రధాని కావాలని ఆశ ఉన్న అఖిలేష్ మాత్రం మా చేత బలవంతంగా ఖాళీ చేయిస్తావా అని తను పెంచి పోషించిన యుపి డాన్ లాగా బంగ్లా మొత్తం సర్వ నాశనం చేసి ప్రభుత్వానికి అప్పగించేశారు.


సర్వ నాశనం అంటే...


1. స్విమ్మింగ్ పూల్ లో వేసిన టర్కిష్ టైల్స్ అన్ని పీకేసి దాన్నీ ఇసుకతో నింపేశారు.

2. ఇంట్లో అంతా వేసిన ఇటాలియన్ మార్బల్ పలకలు పీకేసి పట్టుకుపోయారు.

3. సీలింగ్ లోనూ గార్డెన్ లోనూ పెట్టిన ఇంపోర్టెడ్ లైట్లు పీకేసి పట్టుకుపోయారు.

4. ఇంట్లో పెట్టిన ఏసీ లు అన్ని పీకేసి పట్టుకుపోయారూం

5. బాత్ రూమ్స్ లో పెట్టిన నల్లాలు ఇతర ఇంపోర్టెడ్ ఫిట్టింగ్స్ అన్ని ఎత్తుకుపోయారు.

6. గార్డెన్ లో పెంచడం కోసం విదేశాల నుండి తెప్పించిన డెకరేటివ్ మొక్కలు పట్టుకుపోయారు.

7. పాపం అఖిలేష్ యాదవ్ గారు ఫిట్ గా ఉండడానికి ఏసీ జిమ్ కట్టుంచుకున్నారట ప్రభుత్వ ఖర్చుతో. ఏసీలతో సహా ఆ జిమ్ లో ఏవీ ఉంచలేదు.


కనీసం ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇంత అసహ్యకరంగా, చీప్ గా, కక్కుర్తిగా ప్రవర్తించడు.

ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే ఇంత కక్కుర్తి పడ్డాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు, శరం లజ్జ, మానం, అభిమానం వదిలేసి ఎంత దోచుకుని ఉండి వుంటాడో ఊహించండి.


విషయం ఏమిటంటే వాడు తిన్నందుకు కానీ అలా ప్రవర్తించి నందుకు గానీ నాకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిన రాచరిక కుటుంబాల సంస్కారం అది. 


కానీ సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే బాగా చదువుకున్నాం, మేధావులం అని చెప్పుకుంటున్న కొందరు పెద్దమనుషులు కూడా నిస్సిగ్గుగా యోగీ ని దించేసి ఈ కుటుంబ దోపిడీ వారసుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకోవడం. దానికి వాళ్ళు చెప్పే కారణం సెక్యులరిజం రక్షించడం.


ఇదిగో  కాబోయే ముఖ్యమంత్రి మరియు ప్రధాని రేస్ లో ఉన్న బాగా చదువుకున్న(విదేశాల్లో) శ్రీమాన్ అఖిలేష్ గారు ధ్వంసం చేయించిన ప్రభుత్వ భవనం ఫోటోలు.


చూసి తరించండి.  


అలాగే పనిలో పనిగా అఖిలేష్ ఆ మధ్య కట్టుకున్న స్వంత రాజ భవనం ఫోటోలు, వారి.కుటుంబం విహరించే ప్రైవేట్ జెట్, ఎన్నికల ప్రచార రథం, ములాయం కుటుంబంలో ప్రజాసేవ చేస్తున్న.కుటుంబ సభ్యుల లిస్ట్  కూడా చూడండి.


....చాడా శాస్త్రి పోస్ట్ నుండి....

No comments:

Post a Comment