తండ్రి తల్లి గర్భంలో ఊపిరినిచ్చి
ఆహారం అందించి
ఏ నెలలో ఎలా ఎంత పెరగాలో ఏర్పాటు చేసి.
ఈ లోకములోకి పంపించిన నీకు
మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో
ఏది ఎప్పుడు ఇవ్వకూడదు నీకు తెలియదా
తెలుసు తండ్రి తెలుసు
నీకు తెలుసు అని మాకు తెలుసు.
అయినా మనుషులం కదా
చెంబుడు నీళ్లు పోసి
లంకెబిందెలు అశించే వ్యాపారులం
గులాబీల దండవేసి కోరికల జాబితాను
సమర్పించే స్వార్ధపరులం
ఎప్పుడో హుండిలో వేసిన రూపాయికి
ప్రతి ఫలం ఇంకా రాలేదని
ఎదురుచూసే ఆశాజీవులయ్య శివయ్య
టేంకాయఒకటి సమర్పించి
అనుకున్నవి జరగనందుకు గద్ధిమ్చి
ఈసారైనా జరిగేలా చేయమని అర్దించే
అమాయకపు బిడ్డలమయ్యా శంకరయ్యా
జ్ఞాన నిధివి నీవు ఎదురుగా ఉన్న
ఆజ్ఞానంతో మాయలో మునిగి క్షణక్షణం
కోర్కెలతో వేధించే బిడ్డలమయ్యా శివయ్య..
మాకు తోసింది మాట్లాడతాం..
నచ్చినట్లు ప్రవర్తిస్తాం..
అదే మంచిది అంటాం..
కాదంటే అడ్డంగా వాదిస్తాం...
అన్నీ తెలుసు అయినా ఇలాగే ఉంటాం..
కలికాలం కదయ్య.. దాని ప్రభావమేమో..
లేక మా అజ్ఞానమేమోనయ్యా..
తండ్రి నమ్మి నిన్ను గుండెల్లో పెట్టుకున్నాం..
మా తప్పులను క్షమించి..
మా అజ్ఞానాన్ని మన్నించి..
దానిని తొలగించి..
నీ పాదాల చెంత చేరువరకు
చేయి పట్టి నడిపించు పరమేశ్వర!!!
సేకరణ
ఆహారం అందించి
ఏ నెలలో ఎలా ఎంత పెరగాలో ఏర్పాటు చేసి.
ఈ లోకములోకి పంపించిన నీకు
మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో
ఏది ఎప్పుడు ఇవ్వకూడదు నీకు తెలియదా
తెలుసు తండ్రి తెలుసు
నీకు తెలుసు అని మాకు తెలుసు.
అయినా మనుషులం కదా
చెంబుడు నీళ్లు పోసి
లంకెబిందెలు అశించే వ్యాపారులం
గులాబీల దండవేసి కోరికల జాబితాను
సమర్పించే స్వార్ధపరులం
ఎప్పుడో హుండిలో వేసిన రూపాయికి
ప్రతి ఫలం ఇంకా రాలేదని
ఎదురుచూసే ఆశాజీవులయ్య శివయ్య
టేంకాయఒకటి సమర్పించి
అనుకున్నవి జరగనందుకు గద్ధిమ్చి
ఈసారైనా జరిగేలా చేయమని అర్దించే
అమాయకపు బిడ్డలమయ్యా శంకరయ్యా
జ్ఞాన నిధివి నీవు ఎదురుగా ఉన్న
ఆజ్ఞానంతో మాయలో మునిగి క్షణక్షణం
కోర్కెలతో వేధించే బిడ్డలమయ్యా శివయ్య..
మాకు తోసింది మాట్లాడతాం..
నచ్చినట్లు ప్రవర్తిస్తాం..
అదే మంచిది అంటాం..
కాదంటే అడ్డంగా వాదిస్తాం...
అన్నీ తెలుసు అయినా ఇలాగే ఉంటాం..
కలికాలం కదయ్య.. దాని ప్రభావమేమో..
లేక మా అజ్ఞానమేమోనయ్యా..
తండ్రి నమ్మి నిన్ను గుండెల్లో పెట్టుకున్నాం..
మా తప్పులను క్షమించి..
మా అజ్ఞానాన్ని మన్నించి..
దానిని తొలగించి..
నీ పాదాల చెంత చేరువరకు
చేయి పట్టి నడిపించు పరమేశ్వర!!!
సేకరణ
No comments:
Post a Comment