Tuesday, February 8, 2022

నేటి మంచిమాట. ముక్తి మోక్షం.

నేటి మంచిమాట. ముక్తి మోక్షం.

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకరోజు ఒకే ఒక్క క్షణం మనసు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది .. అందరిలా వచ్చి వెళ్లిపోవడమేనా జీవితం ? తెలిసినది ఎంత ? తెలుసుకోవలసినది ఎంత ?
ఏది ముక్తి ? ఏది మోక్షం ?
అది హిమాలయాల్లో దొరుకుతుందా ?
గుడిలో మసీదులో చర్చిలో దొరుకుతుందా ?? ఎక్కడ ?

ధ్యానులకే దొరుకుతుందా , యోగులకే దొరుకుతుందా ,
సిద్దులకే దొరుకుతుందా ? మరి గృహస్తునికో ??????
ఈ ఆలోచన క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు !!"

ఒక గురువుగారిని వీటికి సమాధానం చెప్పమని అభ్యర్దించాను ..
" వారు నువ్వు తెలుసుకోవడానికి ఎంతో సమయం ఉంది అన్నప్రాశనలోనే నీకు ఆవకాయ ఎందుకు "
అన్నారు ..

ఆ సమాధానంతో మనసుకు సంతృప్తి కలగ లేదు ..
ఎందరో ధ్యానులను , యోగులను , భిన్న ఆధ్యాత్మిక సంఘాలలో ఎందరో గురువులు చెప్పినది వింటూనే ఉన్నా ..

ఇంతలో ఓ మహానుభావుడితో పరిచయం జరిగింది .. వారికి సిద్దులు లేవు మహిమలు లేవు ,, కాషాయము లేదు ,, ఆశ్రమాము లేదు .. వారు గృహస్తులు. కర్మయోగులు , జ్నానయోగులు. వారెవరో మీ అందరికీ అర్థం అయిందనుకుంటా?.
వారి ధ్యారా నేను తెలుసుకున్న సత్యాలు
మీతో పంచుకుంటాను .....

ముక్తి " మోక్షం " అంటే అందరూ భగవంతునిలో ఐక్యం అవ్వడం లేదా మరో జన్మ లేకుండా ఉండటం అంటారు"
' స్దూల ' సూక్ష్మ ., కారణ , మహాకారణ తో తయారు కాబడిన ఈ పదార్దములో "ఆత్మకు మరణం లేదు " మరి ఐక్యత ఎక్కడ .. ??? ఎవరిలో ఐక్యత ??

ఈ అనంతకోటి జీవరాశిలో ,, ఎన్నెన్నో లోకాలలో ఎక్కడో ఒక్క చోట నీవు ఉండవలసినదే ...
అది ఎక్కడ అనేది నీవు చేసే కర్మలపై
ఆధారపడి ఉంటుంది ..
అంటే ఎక్కడో ఒకచోట ఆత్మ ఉండే తీరుతుంది ..

ఇక ముక్తి అంటే విడుదల ""
మోక్షం అంటే దుఃఖ రహిత స్దితి ""

విడుదల '' అంటే భార్య బిడ్డలు ఇల్లు సంసారం వదిలేసి స్వేచ్ఛగా ఎగిరి పొమ్మని కాదు .. నీకున్న దేహ ధర్మాలు నిర్వహించకుండా ఆశబోతుగా పరుగులు తీయమని కాదు ...

కార్యా కారణ సంభంధాలతో ఏ పని (కర్మ ) పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చోవో , అది పూర్తిచేయకుండా పరుగులు తీస్తే
నువ్వు ఎందుకు వస్తున్నావు .. ఎందుకు వెళుతున్నావు .. ?????
ఒకవేళ నువ్వు ఎక్కడికో పరుగులు తీసినా దుఃఖము లేని స్దితిలో ఆశ , మొహం , కోరిక లేని స్దితిలో జీవించగలవా ? లేదు ..
ఒకవేళ జీవించగలను అనుకుంటే నిన్ను నీవు మభ్యపెట్టుకున్నట్లే ..

మరి గృహస్తునికి ముక్తి ' మోక్షం ఎలా ?

"చేసే ప్రతి పని నిష్కామముగా చేయడం " ఫలితం ఆశించకుండా చేయడం " సమర్పణా భావంతో చేయడం " కష్టం అయినా కన్నీళ్లు అయినా వాటిని ప్రసాదంగా
భావించడం ... " ఎప్పుడయితే నీవు కర్మయోగిగా కదలిపోతూ ఉంటావో '' మెలమెల్లగా జ్ఞానమనేది నీకు జత చేరుతుంది. అప్పుడు
ఈ జ్ఞానాగ్నిలో నీ కర్మలు అన్నీ దగ్దం అయిపోతాయి ...
నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు సాక్షిగా మాత్రమే ఉంటావు ".. ఆనందమయునా ఆశ్రువులయినా ...
దేహం తన ధర్మం తాను చేస్తూ ( ఇంటి వాచ్ మెన్ లా )
ఇదేది నాది కాదన్న భావనతో మనస్సు , బుద్ది , వాక్కు ఏకమై సమస్దితిలో "" నేను అన్న అహం వదలి ""
దుఃఖ.. రహితమయున సమస్దితి (సమాధి స్దితి అంటే అన్నిటికి అతీతమయున స్దితి) అదే నీకు నువ్వు విడుదల " అదే నువ్వు కోరుకున్న ముక్తి "

మరి ఈ స్డితికి మనం చెరాలంటే " సాధన " సాధన" సాధన " అహం నుండి తుహుం వరకు ...... ( నేను నేను కాదు అంతా నువ్వే నువ్వే) అన్న స్తితికి చేరటమే ముక్తి మోక్షం.

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment