🍃🥀అనుమానంతోనో, అపార్ధంతోనో
అవమానంతోనో, ఆధిపత్యంతోనో
బంధాల్ని, అనుబంధాల్ని కోల్పోతుంటాం !
🍃🥀చిరాకుగానో, పరాకుగానో
ఈర్ష్యతోనో, ద్వేషంతోనో
స్నేహితుల్ని, సహచరుల్ని కోల్పోతుంటాం !
🍃🥀తెలిసిగానో, తెలియకగానో
మాయగానో, అమాయకంగానో
వస్తువుల్ని, విలువల్ని కోల్పోతుంటాం !
🍃🥀పొరపాటుగానో, ఏమరుపాటుగానో
ఆవేశంలోనో, ఆవేదనగానో
భద్రతల్ని, బాధ్యతల్ని కోల్పోతుంటాం !
🍃🥀పంతాల్తోనో, పట్టింపుల్తోనో
పౌరుషంగానో, పగతోనో
రాగాల్ని, అనురాగాల్ని కోల్పోతుంటాం !
🍃🥀మూర్ఖంగానో, మొండిగానో
ఉదాసీనంగానో, ఉద్రేకంగానో
ఉపాధిని, ఉద్యోగాల్ని కోల్పోతుంటాం !
🍃🥀కోల్పోవడం తప్పేమీకాదు
తిరిగిపొందలేకపోవడం పెద్ద ముప్పు !
🍃🥀పశ్చాత్తాపం, ఆత్మపరిశీలన
అవగాహన, ఆత్మావలోకనం
క్షమాపణ, ఆదరణ, శరణం
కోల్పోయింది తిరిగిపొందడానికి
అనువైన మార్గాలు
పోగొట్టుకున్నది మరలా అందుకోడానికి
అసలైన సూత్రాలు !!
సేకరణ
అవమానంతోనో, ఆధిపత్యంతోనో
బంధాల్ని, అనుబంధాల్ని కోల్పోతుంటాం !
🍃🥀చిరాకుగానో, పరాకుగానో
ఈర్ష్యతోనో, ద్వేషంతోనో
స్నేహితుల్ని, సహచరుల్ని కోల్పోతుంటాం !
🍃🥀తెలిసిగానో, తెలియకగానో
మాయగానో, అమాయకంగానో
వస్తువుల్ని, విలువల్ని కోల్పోతుంటాం !
🍃🥀పొరపాటుగానో, ఏమరుపాటుగానో
ఆవేశంలోనో, ఆవేదనగానో
భద్రతల్ని, బాధ్యతల్ని కోల్పోతుంటాం !
🍃🥀పంతాల్తోనో, పట్టింపుల్తోనో
పౌరుషంగానో, పగతోనో
రాగాల్ని, అనురాగాల్ని కోల్పోతుంటాం !
🍃🥀మూర్ఖంగానో, మొండిగానో
ఉదాసీనంగానో, ఉద్రేకంగానో
ఉపాధిని, ఉద్యోగాల్ని కోల్పోతుంటాం !
🍃🥀కోల్పోవడం తప్పేమీకాదు
తిరిగిపొందలేకపోవడం పెద్ద ముప్పు !
🍃🥀పశ్చాత్తాపం, ఆత్మపరిశీలన
అవగాహన, ఆత్మావలోకనం
క్షమాపణ, ఆదరణ, శరణం
కోల్పోయింది తిరిగిపొందడానికి
అనువైన మార్గాలు
పోగొట్టుకున్నది మరలా అందుకోడానికి
అసలైన సూత్రాలు !!
సేకరణ
No comments:
Post a Comment