*నాన్నంటే*
*నాన్న అంటే*
*పేగుబంధం లేని వాడు*
*కడుపుతీపి తెలియని వాడు*
*అమ్మలాగ వివరించగ*
*గొప్పేమీ లేని వాడు*
*అందుకే..........!*
*నాన్న అంటే అంతే....!*
*నా అన్న కథలేని వాడు*
*నాదీ అన్న స్వార్థం లేని వాడు*
*కుటుంబమనే వ్యామోహంలో*
*ఆశల్ని వదులుకునే వాడు*
*ఆశయాల్ని విస్మరించే వాడు*
*సుతుల భవితవ్యపు బాధ్యత*
*జన్మ పరమార్థంగా* *భావించే*
*వట్టి* *అమాయకుడు.....!*
*అందుకే........!*
*నాన్నంటే అంతే.......!*
*జోలపాడ లేని గంభీర స్వరంతో*
*ప్రేమ చూపలేని మూగ గాయకుడు*
*లాలిస్తూ బుజ్జగిస్తూ*
*పొగడ్తల ముంచలేని నిర్లక్షపు* *ప్రేమికుడు......!*
*అందుకే......!*
*నాన్నంటే అంతే.......!*
*వీపున మోసేవాడు*
*వేలు పట్టి* *నడుపువాడు*
*ముద్దుల* *మురిపించువాడు*
*దారి తెన్ను చూపు* *వాడు*
*కానీ......*
*నడక నేర్చిన కౌమరం*
*పరుగులు* *లంకించునాడు*
*వద్దని ఆపేవాడు*
*హద్దులు గీసేవాడు*
*వెన్నంటే ఉంటూనే*
*నమ్మించి మోసం* *చేసేవాడు....!*
*అందుకే.........!*
*నాన్నంటే అంతే.......!*
*పదవులు లేని వాడు*
*పట్టాలు పొందని వాడు*
*మట్టి మరకల అంగీ ఒంటి మీదున్నా*
*భయమేమి లేదు అని భరోసా ఇచ్చేవాడు*
*తన బ్రతుకున లేని రాజసం*
*మన బ్రతుకున నింపేందుకు*
*గానుగెద్దు వలె మెడన ఖాని మోస్తూ*
*నేనున్నానని బాతఖానీ చెప్పేవాడు*
*వట్టి మాయలోడు.....!*
*అందుకే.........!*
*నాన్నంటే అంతే...!*
*కష్టాలన కడగండ్లన*
*నిత్యం ములిగేవాడు*
*ఆటల పాటల కలవక*
*తప్పించుకు తిరుగువాడు*
*మెలకువ వేళ చిక్కనివాడు*
*పడుకునే వేళ* *దక్కనివాడు*
*అర్థం కాని ఆరాటాలతో*
*ఉరుకుల పరుగుల బాటలలో*
*గమ్యంకై వెతికే వాడు*
*ఎప్పటికీ అర్థంకాని పిచ్చివాడు*
*అందుకే.........!*
*నాన్నంటే అంతే...!*
*గుమ్మమున్న ప్రతి* *ఇంట్లో*
*గుండెలేని* *మొండివాడు*
*నాదీ అన్న ప్రతీవారి* *కథలో*
*అప్రమేయపు తొలి* *ఆక్రమణదారు*
*స్వేచ్ఛకి సంకెళ్ళు వేస్తూ*
*నియంత్రణలో* *కఠినాత్ముడు*
*కుటుంబమే* *విమర్శించ*
*తొలి శత్రువు అతనే మరి*
*అందుకే.........!*
*నాన్నంటే అంతే...!*
*కానీ.....!*
*రెక్కలు వచ్చిన నాడు*
*సంసార వలయాన చిక్కిన నాడు*
*బంధాలు బాధ్యత తెలిసొచ్చిననాడు*
*కుటుంబ భారం శిరమున మోసేనాడూ*
*మనలో మనకే తెలియక*
*నాన్నే కనిపించునాడు*
*నిజమే* *గ్రహించుననాడు*
*అర్థం తెలియక* *ధూషించబడిన ఆ నాన్న*
*పొరబడిన ప్రతీక్షణపు పరమార్థం* *తెలియవచ్చి*
*పశ్చాత్తాపం కళ్ళన* *చెమ్మలయ్యి* *మసకబార*
*పూలమాల మెడన వేసుకు*
*పరిహాసపు* *చిరునవ్వుతో*
*గోడన వేలాడుతాడు* *స్వర్గీయ* *బిరుదాంకితుడు*
*క్షమించగా రాడు* *చూడు నాన్నెంత* *కఠినాత్ముడు*
*అందుకే.........!*
*నాన్నంటే అంతే...!*
*చనుబాలను రుచిమరిగిన*
*కౌగిట లాలించబడిన*
*బాహువులతో* *మోయబడిన*
*అమ్మకూచీ అయిన ఈ ప్రపంచానికి*
*మితిమీరిన *మాతృత్వపు* *వర్ణణలో*
*అతనొక మసిబారిన* *చవకదారు*
*వర్ణించే కలానికి* *కమ్మని వస్తువూ కాదు*
*స్త్రీ అంటే క్షేత్రమని* *పురుషుడంటే బీజమని*
*సమభాగమే*, *సంభోగమే నీ,నా పుట్టుక అని*
*సమన్యాయం పాటించని సామాజిక ధర్మంలో*
*నాన్నంటే అంతే మరి...!*
*అందుకే.....!*
*చెప్పకోదగింత* *గొప్పవాడేమి కాదు*
*రాసి కొలిచేంత ఘనకిర్తి కలవాడేమి కాదు*
*నాన్న అంటే నాన్న అంతే...!*
*✍️ మీ ప్రజా కళాకారుడు భాస్కర్ యాదవ్ ✍️*
No comments:
Post a Comment