Sunday, February 23, 2020

మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?

మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?

భోజనం... శరీరం అనే వాహనం నడవడానికి కావాల్సిన ఇంధనం. పేర్లు వేరైనా ? టైమింగ్స్ వేరైనా? ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లేస్ లో ఒక్కో విధమైన ఆహారాన్ని తింటుంటారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆహారాన్ని ఎలా తినాలి.. నేల మీద కూర్చోనా? కుర్చీమీద కూర్చోనా ( డైనింగ్ టేబుల్ సిస్టమ్)?, నిలబడా ( బఫే సిస్టమ్)? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? ...అయితే ఈ విషయంలో మనకు రెండు విధాల బెస్ట్ ఈటింగ్ పొజీషన్స్ ఉన్నాయి. 1) పూర్తిగా నేల మీద కూర్చొని తినడం. 2) పాలు పితికే భంగిమలో కూర్చొని తినడం.

పూర్తిగా నేల మీద కూర్చొని తినడం:
ఇలా తినడం వల్ల జఠరరసం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అయ్యి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్య, శరీరానికి త్వరితగతిన శక్తి అందుతుంది. ఇలా కింద కూర్చొని తినే సమయంలో మన ప్లేట్ కాస్త ఎత్తులో ఉండాలి. మనం కింద కూర్చొని మన ప్లేట్ ను పీట/ చిన్న స్టూల్ మీద పెట్టుకొని తినడం ఉత్తమం.

పాలు పితికే భంగిమలో కూర్చొని తినడం.
ఈ భంగిమ.. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లకు ఉత్తమమైనది. పొట్ట ఉన్నవారు ఈ పొజీషన్ లో తినడం స్టార్ట్ చేస్తే... నెల రోజుల్లో వారి పొట్ట కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఇలా తినడం అలవాటు చేసుకుంటే శరీరం, మనస్సు నిత్య యవ్వనంగా ఉంటాయి.

పాశ్చాత్య దేశాల్లో డైనింగ్ టేబుల్ & బఫే సిస్టమ్స్ ను ఉపయోగిస్తారెందుకు?:
యూరోపియన్ దేశాల్లో చలితీవ్రత ఎక్కువ కాబట్టి... వారి కండరాలు, బోన్స్ ప్రీజ్ అయ్యి ఉంటాయి. వాళ్లకు నేలమీద కూర్చోవడానికి వారి కండరాలు వెంటనే సపోర్ట్ చేయవు. అందుకోసం వారు ఇలా డైనింగ్ టేబుల్ మీదనో, నిలబడో తింటారు.

నిలబడి అన్నం తినడం వల్ల..మన శరీరంలో కొవ్వు పేరుకపోయే ప్రమాదంతో పాటు.. అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీ ఇండ్లలో చేసే ఫంక్షన్లకు.. బఫే సిస్టమ్ ను ఎంకరేజ్ చేయకండి.

No comments:

Post a Comment