Tuesday, February 25, 2020

ఇతరులపైనా చులకన భావం రాకూడదు

🌹. అహంకరించ వద్దు. ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. 🌹

ఒక రోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని ఇక నేను ఎవరిపైన ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరము లేదు అని చాల గొప్పగా చెప్పుకున్నాడు.

ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ బాబు నాతో కాస్త దూరం నడవగలవా అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేసాడు.

అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి ఏదైనా చెట్టు కనిపిస్తుందా ఆ నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడాఏ చెట్టు కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ఏంటి బాబు వెతుకుతున్నావు అని అడిగాడు. అయ్యా చాల దూరం వచ్చాము కాసేపు చెట్టు నీడలోకి వెళదాం అని చెప్పాడు.

చెట్టు నీడ నీకెందుకు బాబు నీ నీడ లో నువ్వు సేద తీర్చుకో అన్నాడు. నా నీడలో నేను ఎలా అయ్యా అని ఆశ్చర్యంగా అడిగాడు.

నువ్వే కదా బాబు నాదగ్గర అన్ని ఉన్నాయి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూసావా ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు అని చెప్పారు.

ఇప్పుడు ఆయనకు నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకు వెళ్లకుండానే.

మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి ఇతరులపైనా చులకన భావం రాకూడదు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment