Monday, March 29, 2021

అంతటా 'అతి' విడిచిపెట్టాలి

'అతి' అనేక అనర్థాలకు దారితీస్తుందని మనందరికి తెలుసు. అసలు ఏదైనా మితంగా ఉంటేనే ముద్దు. కాని ఈ అతిని తప్పించుకోవడం అంత సులభం కాదు. ఏంటీ ఈ ‘అతి’ రాతలు అనుకోకుండా ఒక లుక్కెయ్యండి మాస్టారూ...

ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి కదా అని అతిగా తింటే అజీర్తి కొలెస్టరాల్ ఒబేసిటీ ఒకటేమిటి రకరకాల అనారోగ్యాలు....

అవకాశం దొరికింది కదా అని అతిగా మాట్లాడితే మనకి ఆయాసం విన్న వాళ్ళకి విసుగు....

అదేంటో గాని ఈ రోజుల్లో ఏది చూసినా అతిగానే అనిపిస్తుంది. టీ.వీ లో హాస్యం ( డబల్ మీనింగ్ డైలాగ్ నే హాస్యం అనుకోవడం ) అతిగా ఉండడం, సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు, హింసాత్మక ఘటనలు ఇంకా అతిగా ఉండడం...

మనందరం అవసరానికి మించి వాట్సాప్, ఫేస్బుక్ చాట్ పేరిట సెల్ ఫోన్ లోనే అతిగా కాలాన్ని వ్యర్ధం చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడప లేకపోవడం....

ఉద్యోగాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అతిగా పనిచేయడంవల్ల కూడా అనేక శారీరిక, మానసిక ఒత్తిడులకు గురికావడం, దాంతో
స్ట్రెస్ లు, బ్రేకుప్పులు ,కౌన్సిలింగులు,
లేనిపోని జబ్బులు డబ్బులు వదిలిస్తున్నాయి...

వ్యాక్సిన్ తీసుకొని కరోనా కట్టడికి సహాయపడాలని వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్నా అతి భయంతో చాలామంది ముందుకు రావటంలేదు. అలాగని కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా కరోనా విజృంభణ కి శాయశక్తులా ‘అతి’ గా కృషి చేసి సెకండ్ వేవ్ ని జయప్రదంగా ఆహ్వానించారు...
కరోనా కట్టడి కాకుండా విజయం సాధించారు...

అన్నిటికన్నా చాలా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ‘ అతి’గా ఒకదాన్ని మించి ఒకటి ప్రజలకు అన్నీ ఉచితంగా (ఫ్రీ ఫ్రీ ఫ్రీ ..) యిస్తామని, అసాధ్యమైన, అనాలోచితమైన అసంబద్ధమైన, ఆచరణ యోగ్యం కాని వాగ్దానాలతో, సంక్షేమ పథకాల పేరిట దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, కష్టపడి పనిచేసే వాళ్ళను సోమరులుగా తయారు చేస్తున్నాయి....

అందుకే ఏ మనిషి అతిగా ఆరాటపడకుండా విజ్ఞతతో తన పరిమితులను తెలుసుకొని జీవించిన నాడే జీవనం సుఖమయం అవుతుంది...

దేనిలోనూ అతి పనికిరాదు...
ఓవరాక్షన్ ఎప్పుడూ వికటిస్తుంది....
అందుకే మన పెద్దలు ఏనాడో ఇలా చెప్పారు..

అతి దానాత్ హతః కర్ణః
అతి లోభాత్ సుయోధనః
అతి కామత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్.

తా !! : విచ్చలవిడిగా దానం చేయడంవల్ల కర్ణుడు చెడ్డాడు...
మితిమీరిన స్వార్థ గుణంచేత దుర్యోధనుడు చెడ్డాడు...
అతి కామం చేత రావణుడు వంశ నాశనం
చేసుకున్నాడు....
కనుక అంతటా 'అతి' విడిచిపెట్టాలి.
ఇదండి ఈ ‘అతి’ పురాణం😎😎

Source - Whatsapp Message

No comments:

Post a Comment