Monday, March 29, 2021

నామస్మరణ ఒక్కటే మార్గము...

నామస్మరణ ఒక్కటే మార్గము...

🍁🍁🍁🍁

హృదయాంధకార, భావదోషాలు, నకారాలు, (నాది, నాకు, నావి, నావల్లే నేనే, నాకు అంతా తెలుసు, నాకుమాత్రమే తెలుసు.... నావాళ్లు ) మకారాలు, మమకారాలు, మావాళ్లు, మాకు, మేము, మాకుమాత్రమే, మేము మాత్రమే,, ) ఇటువంటివి మరియూ, రాగ -- ద్వేషాలు,, అహంకార మలినాలు, లక్షణాలు,,, మనలను,,మన ప్రవర్తనలను నియంత్రిస్తూ ఉంటాయి.


వాటి నియంత్రణలో ప్రతి జన్మ లోను, మన జీవితములో, మరెన్నో కొత్తగా కర్మలు చేసుకుంటా సంచితాన్ని మళ్ళీ నింపుకుంటూ ఉంటాము,,,

ప్రతి జన్మలోనూ,సంచిత కర్మలనుండి,కొంత కొంత, ప్రారబ్దముగా నిత్యం అనుభవిస్తూ వున్నాము. మరికొంత కర్మ పండిన,, అది ఆగామి కర్మ గా అనుభవానికి వస్తుంది....మరి వీటిని దాటేదెలా ?

మన ప్రతిబంధక, ( జన్మ కారణహేతువు ) కర్మలకు ముఖ్య కారణాలు అయిన, నకార, మమకారాలు, అహంకారాలు, మరియు మనసులోని మలినాలు, తొలగించుకొనుట ఎలా??

దానికి ఒకే ఒక మార్గం భక్తి మార్గం 'నిరంతర భగవన్నామ స్మరణ '


బాహ్యా దేహ శుద్ధికి మనము, సబ్బులు ఇతర లేపనాలు, స్నానాలు,, చేస్తూ ఉంటాము,, అలాగే అంతర్ శుద్ధికి నిరంతరమూ తైలధార వలే భగవన్నామ స్మరణ చేయవలెను...యిట్టి స్మరణచే సంపూర్ణ మానసిక శుద్ధి చేయబడి, అంధకారము మానసిక మలినము అనబడే నల్లని దట్టమైన అజ్ఞాన పొర తొలిగిపోయి,హృదయములో ఙ్ఞాన జ్యోతి తేజోవంతమువుతుంది.

కొంతమేర, నకారాలు, మమకారాలు,మనము సత్ సాంగత్యము, సత్ గ్రంథ పఠనము, స్వాధ్యయనముతో ప్రయత్న పూర్వకముగా జయించవచ్చు,

, ఇంకా ద్వేషాన్ని కూడా జయించవచ్చు.కానీ రాగాన్ని,అంటే అనురాగ బంధాల్ని జయించడం చాలా కష్టమే. జన్మ, జన్మల నుండి కర్మానుసారము ఏర్పడేవి కొన్ని.ఆయా కర్మలను అనుభవించితే గానీ తీరని బంధాలు మరికొన్ని. ఈ జన్మలో కోరి ఏర్పరుచుకున్నవి, అనురాగ బంధాలు. వీడలేని స్వార్థం వదిలించుకోవడం కఠినమే.ఎంతో కష్టపడి వీటిని దాటినా అహంకారం ( తామస , రాజస సాత్విక అహంకారములు)వీడితే గానీ సంపూర్ణ జ్ఞానము, అద్వైతానుభూతి అవగతము కాదు.

తామస, రాజస అహంకారాలు,వీటిని ప్రయత్నంచేసి, సద్గురుసేవ,శుశ్రూషలతో, వారి వాత్సల్యానుగ్రహము వలన జయించవచ్చు.

కానీ నాకు సర్వము తెలుసు , నేను జ్ఞానిని,అనే అహంకారము సాత్వికత తో కూడిన అహంకారం, ఆది మనంతట మనమే వదలలేము, భగవత్ అనుగ్రహముతో మాత్రమే తొలుగుతుంది.

మనస్సు లోని మలినాలు,హృదయ మలినాలు నిరంతర భగవన్నామ స్మరణ తో తొలుగుతాయి.

దానికి ఒక మంచి ఉదాహరణ ,..


ఒక స్వచ్ఛమైన గాజు గ్లాసులో బురదమట్టి వేసి కొద్దిగా నీరు పోసిన..ఆ స్వచ్ఛమైన గాజుగ్లాసు మురికిగా బురద నీటితో మలినమై వున్నది. యిప్పుడు మంచినీటిని ఆ మురికినీరు గల గాజుగ్లాసులో పోస్తూ, పోస్తూ ఉంటే కొద్దికొద్దిగా గ్లాసులో నీరు స్వచ్ఛ పడును.అటులనే మంచి నీరు పోస్తూ వుండిన కొద్ది సేపటికి,నీరు పొంగి పొర్లిపోయి గ్లాసులోని మురికి కూడా బయటకి పోతుంది.యిదేవిధముగా ఇంకా ఆపకుండా మంచినీరు పోస్తూనేఉంటే ఆ గాజు గ్లాసులోని మురికినీరు, పూర్తిగా తొలగిపోయి, అందుండు నీరు పూర్తి స్వచ్ఛముగా మారి, త్రాగుటకు కూడా పనికి వచ్చు నంతటిగా స్వచ్ఛమవును.

అదేవిధముగా మన హృదయము, మనస్సు, బుద్ది ఎన్నో దోషాలతో నిండి మలినమైవున్నది.

కేవలం భాగవన్నామస్మరణ తోనే దానిని శుభ్రపరచుకోగలం..

🌸జై శ్రీమన్నారాయణ🌸

🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment