Monday, March 29, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధు మిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలతో శ్రీ గాయత్రి సరస్వతి లక్ష్మీ దుర్గ అమ్మవార్ల అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.. మీ AVB 💐🤝🙏
శుక్రవారం --: 26-03-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం .

స్నేహం మనం కోనుకుంటే వచ్చేది కాదు ! అడుక్కంటే వచ్చేది కాదు , స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలిపరిచయంతో ఏర్పడుతుంది ఆ సమయంలో రెండు గుర్తుండే విషయాలు తెలుస్తాయి ఒకటి జీవితాంతము తోడుండే స్నేహితులు , రెండు జీవితాంతము గుర్తుండే గుణపాఠాలు .

చూడడానికి చిక్కులుగా కనిపించిన ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది , జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్నా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది .

సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు , కాష్టానికి వంగకు , కన్నీలకు కరగకు , భయానికి బెదరకు , బంధాలను మరువకు , అందరిని నమ్మకు , ఎవరికి లొంగకు , చివరికి విజయం నీదే .

అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది . తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది , కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది .

మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment