Sunday, March 21, 2021

పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులారా ! మీకు ఒక చిన్న కథ చెపుతాను వినండి...!

🧒 పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులారా ! మీకు ఒక చిన్న కథ చెపుతాను వినండి...!🧒

✍️మురళీమోహన్

👌అనగనగా... పూర్వం కొంతమంది యువకులు గుఱ్ఱాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు ."ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే, మీరు ఓ మహాద్భుతంను చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు" అని అన్నాడు.

ఋషి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్ళకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్ళు తప్ప మరేమీ కన్పించలేదు. అయినా ఋషి చెప్పాడు కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్ళి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు…

మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు.

ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్ళను మూటగట్టక రాలేక పోయామే అని. చదువు కూడా అంతే... చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు.

A great man shows his greatness by the way he treats little men..!

శ్రీ రాముడుని రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారే సరికి వనవాసం వెళ్ళవలసి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి... ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడవద్దు... శ్రీ రాముడంతవాడికే తప్పలేదు ...మనమెంత..!
🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment