Tuesday, September 7, 2021

ఆరోగ్యమే మహా భాగ్యం (5 అంశాలు)

🎯®️✳️®️🎯®️✳️®️🎯®️✳️

🌈మన ఆరోగ్యం🌈
-----------®️----------

♨️💁‍♂️ ఆరోగ్యమే మహా భాగ్యం (5 అంశాలు)♨️

💁🏻‍♂️ 1. విటమిన్ల లోపం-వ్యాధులు
〰〰〰〰®️〰〰〰〰
☛ రైబోప్లావిన్- నాలుకపై పూత
☛ నియాసిన్- చర్మం పొర పొలుసుల్లా ఊడుతుంది(పెల్లగ్రా)
☛ పాంటోథిన్ ఆమ్లం-కాళ్లు మండటం, కీళ్ల వాతం
☛ ఫైరిడాక్సిన్- పిల్లల్లో మూర్చ, నాడీ మండలంలో లోపాలు
☛ బయోటిన్-కండరాల నొప్పులు
☛ ఫోలిక్ ఆమ్లం- మానసిక రుగ్మతలు
☛ సైనకోబాలమిన్-హానికరమైన రక్తహీనత
☛ ఎస్కార్బిక్ ఆమ్లం-చిగుళ్ల నుంచి రక్తం కారుట(స్కర్వీ)

💁🏻‍♂️ 2. కొవ్వు కరిగించే స్పెషల్ డ్రింక్
〰〰〰〰®️〰〰〰〰
జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. జీరా నీరు జీవక్రియను మెరుగుపర్చడమే కాకుండా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే థైమోల్ జీర్ణ పైత్యరసం స్రవించేలా చేస్తుంది. మెరుగైన మెటబాలిజం, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. జీరా నీరు శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో బాగా పని చేస్తుంది.

💁🏻‍♂️ 3. ఆహారంతో గుండెను కాపాడుకుందాం!
〰〰〰〰®️〰〰〰〰
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సమయానికి అనుగుణంగా సరైన ఆహారం తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత పండ్లు తినాలి. మధ్యాహ్న భోజనంలో ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మానేయాలి. ఆల్రెడీ గుండె సమస్యలు ఉన్నట్లైతే మాంసం, చక్కెరలు, పాలిష్‌ల్డ్ ధాన్యం తగ్గించాలి. బదులుగా పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌గా వాల్‌నట్స్‌, తాజా బెర్రీలు తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో వీలైనన్ని కూరగాయలు, పప్పుదినుసులు తీసుకోవాలి.

💁🏻‍♂️ 4. HEALTH: మర్దనతో ఎంతో మేలు
〰〰〰〰®️〰〰〰〰
శరీరానికి అవసరమైన ఆక్సిజన్​, పోషకాలు రక్తం ద్వారానే లభిస్తాయి. బ్లడ్ సరిగ్గా సరఫరా కాకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయవు. అందుకే రక్త ప్రసరణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి మర్దన అవసరం. ఇది హాయిని, విశ్రాంతిని ఇవ్వడంతో పాటు రక్త సరఫరానూ పెంచుతుంది. మర్దన టైంలో కండరాల్లోంచి ల్యాక్టిక్‌ యాసిడ్‌ వెలువడి లింఫ్‌ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీంతో జీవవ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లి, రక్తపోటు కంట్రోల్ అవుతుంది.

💁🏻‍♂️ 5. పైనాపిల్ లో ఆరోగ్య ప్రయోజనాలు
〰〰〰〰®️〰〰〰〰
➤ జుట్టు రాలడం తగ్గించడంలో సాయపడుతుంది.
➤ నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
➤ పళ్ళ నుంచి రక్తం కారే స్కర్వీ వ్యాధి నుంచి రక్షణ కలిగిస్తుంది .
➤ పైనాపిల్ రసం ముఖంపై నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
➤ మలబద్ధకం తగ్గిస్తుంది.
➤ రోగనిరోధక శక్తి పెంచుతుంది.

🎯®️✳️®️🎯®️✳️®️🎯®️✳️

👉 కరోనా మహమ్మారి ప్రభావంతో గత ఏడాది కాలంగా ఎంతో మంది ఇంటి నుంచే పనిచేయడం ప్రారంభించారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇచ్చాయి. అయితే ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.

🎯అంతేకాకుండా కంపెనీలు కూడా వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఇస్తుండటంతో గంటల తరబడి కూర్చొనే పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా సరైన సిట్టింగ్ పొజిషన్‌ లేక కొన్ని చెడు ప్రభావాలు పడుతున్నాయి.

🎯ఎక్కువ సేపు కదలకుండా.. అదే పనిగా కూర్చోవడం వల్ల భుజాలు.. తలను ముందుకు నెడతాయట. ఇంటర్వల్ టెబ్రల్ డిస్క్ లపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది చివరకి కణజాలాలపై ఒత్తిడిని పెంచి స్పాండిలైటిస్ సహా దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

♨️ "స్పాండిలైటిస్ ( SPONDYLITIS )అంటే ఏంటి"?♨️

స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పిగా చెప్పవచ్చు. మెడనొప్పి తీవ్రంగా ఉండటంతో పాటు తల తిరగడం, తూలి పడిపోతున్నామనే భావన ఉంటుంది. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ పదాల విషయంలో చాలా మంది అయోమయం చెందుతారు. ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి. కానీ లక్షణాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. స్పాండిలైటిస్ అనేది కీళ్లు, ఇతర మృదు కణజాలాలకు వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ వల్ల కలిగే వికార(Inflammatory) పరిస్థితి. స్పాండిలోసిస్ లేదా స్పైనల్ ఆర్థరైటిస్ అనేది వయస్సుతో పాటు వచ్చే అనారోగ్యం. పాత గాయాలు, సిట్టింగ్ పొజిషన్ లాంటివి ఈ వ్యాధి తీవ్రతను పెంచుతుంది.

"లక్షణాలు"..

ఈ వ్యాధిలో అత్యంత సాధారణ లక్షణం నొప్పి, దృఢత్వం. ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు, బలహీనత వేధిస్తాయి. స్పాండిలైటిస్ లక్షణాలు, తీవ్రత.. వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఉండే నాడీ వ్యవస్థల నిర్మాణాలపై ఒత్తిడి పడటం, తిమ్మిరి, చేయి లేదా కాలు నొప్పి, కండరాల బలహీనత లాంటి లక్షణాలతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

"నివారణ"..

స్పాండిలైటిస్‌కు నిర్దిష్టమైన మందు లేదు. దీన్ని నివారించాలంటే మీరు కూర్చున్న ప్రదేశం సరిగ్గా ఉండాలి. సౌకర్యవంతమైన సిట్టింగ్ పొజిషన్ ఉండటం వల్ల సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. మీ పాదాలు నేలకు ఆనుకుని ఉండాలి. కుర్చీకి వెనుక ఆనుకుని విశ్రాంత స్థితిలో కూర్చోవాలి. చిన్న టవల్ లేదా దిండును బ్యాక్ సపోర్టుగా పెట్టుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ ఎగువ భాగం కంటికి 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉంచాలి. మోచేతులకు ఏదైనా సపోర్ట్ ఉండాలి. ప్రతి 60 నిమిషాలకు ఓ సారి 2 నుంచి 5 నిమిషాల పాటు విరామం తీసుకోండి. మీరు ఉన్న స్థానం నుంచి లేచి చుట్టూ నడవాలి. విశ్రాంతి తీసుకునే సమయంలో చేతులు, కాళ్లు సాగదీయడం, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి.

"మీ సిట్టింగ్ పొజిషన్‌ను మెరుగుపరచుకోవాలి"..

వర్క్ చేస్తున్నప్పుడు సిట్టింగ్ పొజిషన్‌ను మెరుగుపరచడానికి తెలివిగా వ్యవహరించాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. భుజం, చెవులు, తుంటిని ఓ వరుసలో ఉంచండి. ఒకే చోట ఉండకుండా కదలుతూ ఉండాలి. ఇది మీ కండరాలను సడలిస్తుంది. కీళ్లకు లూబ్రికెంట్లను అందిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.

కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, చికిత్స చేయడానికి ఫిట్నెస్ సహాయపడుతుంది. ఇది మీలో శక్తి, ఓర్పు, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం కోసం వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలి. ఇది బరువు పెరగడాన్ని అదుపులో చేస్తుంది. ఫిట్‌గా ఉండాలంటే ఏరోబిక్స్, జుంబా, సైక్లింగ్, ఈత, సింపుల్ వాకింగ్ లాంటివి చేయాలి. నిరంతరం నొప్పి, తిమ్మిరి, బలహీనత, దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే సమస్యలను ఎదుర్కొంటుంటే వైద్యుడిని సంప్రదించాలి. నొప్పి తీవ్రంగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలి.

🎯®️✳️®️🎯®️✳️®️🎯®️✳️

Source - Whatsapp Message

No comments:

Post a Comment