Wednesday, September 15, 2021

ఈ వ్యాసంలో మనం....., ♦️వినాయక చవితి సార్వజనిక ఉత్సవాల నేపథ్యం.... ♦️వినాయకచవితి సామాజిక కార్యక్రమంగా ఉద్దేశం ♦️ సార్వజనిక ఉత్సవం - ప్రస్తుత పరిస్థితులు ♦️ హైందవ ధర్మ సంరక్షణ కోసం వినాయక చవితి సార్వజనిక ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా మన ఆలోచనలు రావాల్సిన మార్పులు

జాగృత భారత్🚩
ముందుగా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో......🚩🚩🚩✊🕉️

ఈ వ్యాసంలో మనం.....,
♦️వినాయక చవితి సార్వజనిక ఉత్సవాల నేపథ్యం....
♦️వినాయకచవితి సామాజిక కార్యక్రమంగా ఉద్దేశం
♦️ సార్వజనిక ఉత్సవం - ప్రస్తుత పరిస్థితులు
♦️ హైందవ ధర్మ సంరక్షణ కోసం వినాయక చవితి సార్వజనిక ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా మన ఆలోచనలు రావాల్సిన మార్పులు

ఈ విషయాలను తెలుసుకుంటాం..

దయచేసి కొంచెం పెద్ద సందేశమే అయినప్పటికీ ఓపికతో చదివే ప్రయత్నం చేద్దాం....🙏🙏🙏🙏

“ హిందువుల అజ్ఞాన స్వార్ధ చింతన వలన పక్కదారి పట్టి వృధాగా మారిన వినాయక చవితి సార్వజనిక ఉత్సవ సాంప్రదాయపు అసలు ఉద్దేశము.”

“తంబోల, తొక్కుడు బిల్లా, అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్స్ ఆటల కోసమా?

లడ్డూ వేలంపాట కోసమా?

నిసిగ్గుగా విగ్రహ మండపాలలో సినిమా పాటలు డిస్కో పాటలు మైకు సెట్లలో పెట్టి గెంతడానికా?

అన్నదానాల పేరుతో గొప్ప పేరు కోసమా?

లేక చిట్ట చివరికి ఉచ్చ నీచాలు లేకుండా నిమజ్జన సమయంలో మందు తప్పతాగి చిందులేయడానికా?” దేనికి ?

అసలు ఎంత మంది ఏమి తెలిసి ఉత్సవాలు జరుపుతున్నారు ఎంత తెలిసి ఏనాడు సరిగా జరిపారు ???"

(దయచేసి ఈ సందేశం ద్వారా కొద్ది మందిలో మార్పు వచ్చినా అనేకమందిలో రావలసి ఉన్నది, అందరూ తప్పక చదివి ఎలాంటి మార్పులు చేయకుండా Facebook Whatsappలలో మన ధర్మము కోసం Share చేయగలరు)

అవును ఇది నిజము, 99% హిందువులు ఇంకా గుర్తించని నిజము... వినాయక చవితి పెద్ద విగ్రహాలు మండపాలలో నెలకొల్పి ఉత్సవముగా చేసుకొనే సాంప్రదాయము అసలు ఎప్పుడు ఎందుకు మొదలైనది??

ఇప్పుడు ఏమి జరుగుతున్నది?? అని తెలుసుకోలేకపోతున్న
“హిందువుల అజ్ఞాన దయనీయ స్థితి, మహాత్ములు మరియు ధర్మము పట్ల నిర్లక్ష్యము”.

అసలు వినాయక చవితి నాడు ఎవరికివారు వారి ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి చిన్ని విగ్రహము పెట్టుకుని పురాణాంతర్గతంగా శాస్త్రోక్తముగా చెప్పిన విధముగా వినాయక చవితి పూజ, వ్రత కధ చదువుకొనడమే ద్వాపరయుగము నుంచి దాదాపు 5120 ఏళ్ళకు ముందు నుంచి ఉన్నఅసలు సాంప్రదాయము.. ఇంతకు మించి మన శాస్త్రములో కానీ మన పురాణ వాగ్మయములో కానీ ఇంకొక విధముగా ఉత్సవముగా జరుపుకొమ్మని ఎక్కడా లేదు. ఇదే విధముగా వేల ఏళ్ల నుంచి జరుపుకుంటున్న వాళ్ళము,.

“మరి ఎటువంటి పరిస్థితులలో మహోన్నత ఉద్దేశముతో మహాత్ములచే మొదలు అయినది ఈ పెద్ద విగ్రహాల సార్వజనిక మండప ఉత్సవ సంప్రదాయము? దేని కొరకు ?”

మొట్ట మొదట ఈ సాంప్రదాయము భరత మాత ముద్దుబిడ్డ హిందువుల అస్తిత్వము నిలిపిన మహారాజు అయిన “ఛత్రపతి శివాజీ మహరాజ్” గారు దాదాపు 360 ఏళ్ల ముందు మొదలు పెట్టారు.

తద్వారా ప్రజాలైన హిందువులందరినీ ఉత్సవములో భక్తితో అందరూ ఒక చోటికి చేరి ఒకతాటి మీదకు తెచ్చి దేశ ఔన్నత్యం దేశ సంస్కృతీ సాంప్రదాయముల పట్ల దేశభక్తి పట్ల ధర్మ నిర్వహణ పట్ల ప్రజలందరికీ పూనిక కలిగేలా చేసి ఈ వినాయక చవితి పండుగను ఉత్సవముగా రూపకల్పన చేశారు.

తరువాత దాదాపు “220 ఏళ్ల తరువాత స్వాతంత్ర్య పోరాట సమయములో మళ్ళీ 1893లో” స్వాతంత్ర్య సమరయోధులు భారతజాతీయోద్యమ పిత అయిన “శ్రీ బాల గంగాధర్ తిలక్” గారు మొదలు పెట్టారు ఈ సార్వజనిక వినాయక చవితి ఉత్సవములు,. స్వాతంత్ర పోరాట సమయములో భారతీయులు ఎక్కువ మంది ఒక చోటికి చేరడము నిషిద్ధము చేసినది బ్రిటీష్ ప్రభుత్వము,. ఒకచోటికి అందరూ చేరితే ఉద్యమము చేపడతారు అని కఠినాత్మకంగా వ్యవహరిస్తూ నలుగురిని ఒక చోటికి చేరనిచ్చేది కాదు..

అటువంటి పరిస్థితులలో “నలుగురు ఒకచోటికి చేర చర్చలు చేస్తే కానీ జాతీయ భావము అందరిలోనూ రాదని, ధర్మము పట్ల దేశ భక్తి పట్ల అందరికీ పూనిక కోసం అందరూ ఒక చోటికి చేరాలని సంకల్పించి భక్తి వలన ధర్మము కొరకు అందరూ ఒక చోట చేరవచ్చు అని, ఆ విధంగా ఆ మహానుభావుడు ప్రజలను “భక్తి పేరుతో ఒకచోటికి చేర్చి ధర్మము జాతీయ భావములు ప్రజలలో నిండేలా అందరూ వాటి గూర్చి చర్చలు జరిపే విధముగా” వినాయక చవితి విగ్రహ మండప సార్వజనిక ఉత్సవమును విజయవంతము చేసి స్వాతంత్ర్యము వైపు ధర్మము వైపు ప్రజలు నిడిచేలా, ఈ ఉత్సవము ప్రతియేటా మన హిందూ ధర్మము కోసము భారత జాతి కోసమూ జరిగేలా ఛత్రపతి శివాజీ మహరాజ్ మొదలు పెట్టిన సార్వజనిక వినాయక చవితి ఉత్సవము తిరిగి దేశములో సాంప్రదాయముగా నిలిపారు...🚩🚩🙏

“కానీ నేడు జరుగుతున్నది ఏమిటి???” ఎవరికి వారు అదొక గుర్తింపుగా భావిస్తూ వీధికొకటి కుదిరితే వీధికి పది విగ్రహాలైనా పెడుతూ పేరు గొప్ప కోసం లేక దేవుడు నాకు ఏవో ఇచ్చేస్తాడు అనే కోరికలతో, లేక అదొక కోలాహలం అదొక సంబరం అదొక ఆనందము అనుకుంటూ అలా రకరకాల స్వార్ధాల కోసమూ అలాగేఎక్కడో ఒకరు మితిమీరిన భక్తితో చేస్తున్నారే కానీ, “ఏది ఆ ఇద్దరు మహానుభావుల ఆశ ఆశయాలలోంచి పుట్టిన ఉత్సవంలో వారి ఉద్దేశం? ఏది దేశం గూర్చి ధర్మం గూర్చి ఆలోచించడం? ఏది అసలు నలుగురు ఒకచోటికి చేరడం? ”” వీధికొక నాలుగు విగ్రహాలు పెట్టుకుంటూ విడిపోయి ఉన్నారే కానీ ధర్మము కోసము కలిసినవారేరి? ?? “”

అందరూ ఒకచోటికి చేరి ధర్మము గూర్చి దేశము గూర్చి ఆలోచించవలసిన ఆ మహానుభావుల ఉద్దేశము ఏమయినది? సర్వ నాశనమై వృధాగా మారి బూడిదలో పోసిన పన్నీరు అయినది....

పైగా ఈ బూడిదలో పొసే పన్నీరు కోసం ఇంటి ఇంటికి తిరిగి చందాలు మాత్రం అడుగుతారు ఫోన్లు చేసి మరీ అడుగుతారు కొన్ని చోట్ల తప్పక ఇవ్వాలి అన్నట్టు బెదిరింపులు ఒకటి.. అసలు ధర్మం కోసం ఏర్పడిన ఈ ఆనవాయితీ విషయం లో ఇదే పండగకి చందా అడిగే వీళ్ళే ఎంత మందిని ధర్మం కోసం ఒక చోటికి రమ్మని ఎంత మంది ఇళ్ళకి వెళ్లి అడిగారు?? సిగ్గుచేటు..

అసలు విషయం తెలుసుకోకుండా అజ్ఞానంతో ఉన్న మన ఆలోచన చర్యలలో ప్రస్తుత సమాజ స్థితిని బట్టి మార్పు ఎంతో అవసరము.””

మనం ఈ ఉద్దేశానికి విరుద్ధ సాంప్రదాయ విరుద్ధ ధర్మ విరుద్ధ ఉత్సవాలలో భక్తి ఉన్నా “ఆ భగవంతుడు ఎన్నటికీ ఆమోదింపడు”...

అసలు ఆ ఇద్దరి మహానుభావుల ఆశయము నేరవేరడము ఇప్పుడే అత్యవసరము, ధర్మానికి ఆపద ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వస్తుంది, కనుక ఎప్పుడూ అవసరమే... దేశములో ఎక్కడ చూసినా ధర్మ ద్రోహుల ఆగడాలే, “సాధారణ జనాలు (Common Public) కు ఇవి పట్టవు”, ఆ మనకెందుకు అని వదిలేస్తారు, కానీ ఆ ధర్మద్రోహుల వికృత చేష్టలకు “భాధితులు అవుతోంది ఎవరు? కేవలం Common Public మాత్రమే”,. ముందు నుంచే ధర్మం పట్ల దేశం పట్ల పూర్తి నిభద్ధత కలిగిన హిందూ సంస్థలలో ఉన్న వారు అటువంటి ధర్మద్రోహుల విషయంలో నిరంతరం జాగ్రత్తగానే ఉంటారు,. వారి నుంచి Common Public ను కాపాడుతూనే ఉంటారు, మత మార్పిడులు, Love Jihad వంటివి ఏళ్ల నుంచి జరుగుతుంటే కాపాడుతున్నది ఎవరు? చట్టమే పూర్తిగా చేస్తున్నది అనుకోవడం భ్రమే అవుతుంది. అటువంటివి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి, ఏ ఆ సమస్యల వికృత చేష్టలకు ఇప్పుడు ఏ మాత్రం పట్టింపు లేని “మీ కుటుంబ సభ్యులలో ఒకరు లేదా మీరే బలి అవరు అనుకుంటున్నారా? లేదా మన జాతి పట్ల మన ధర్మం పట్ల మీకు నిభద్ధత లేదా?” ఎందుకు అటువంటి నిరర్ధక స్వార్ధ చింతనా జీవితాలు? ఇందుకు కాదు కదా ఈ పుట్టుక పుట్టినది? “ప్రతి ఒక్కరూ సనాతన ధర్మము పట్ల నిభాద్ధత పొందాలి, అప్పటికే ప్రాణాళికతో అడుగులు వేస్తున్న మీ మీ ప్రాంతాలలో ఉన్న హిందూ సంస్థలతో తోడై చేయి కలపాలి,.”

మేల్కొనండి, ప్రతి భారతీయ పౌరుడు ప్రతి హిందువు ఇప్పటికైనా మేల్కొని అసలు వినాయక చవితి సార్వజనిక ఉత్సవాల వెనుక అసలు ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఈ ఉత్సవాలలో ఆ ఆట-పాట మందు-చిందులను ఇకనైనా దూరం చేద్దాం.. ఒకవేళ ఉద్దేశం సరిగా తెలియక ఈ ఏడాదికి ఎక్కువ విగ్రహ మండపాలు పెట్టుకున్నా రోజుకొక మండపానికి అందరూ ఒకచోటికి చేరి, “వచ్చే ఏడాది నుంచి పేరు గొప్ప కోసం కాకుండా అందరూ కలిసి Colony/పేట కు ఒక మండపము పెట్టుకుని అయినా ఒక చోటికి చేరి, మన ధర్మం కోసం మన దేశం కోసం ప్రజలందరిలో జాతీయ భావము ధర్మము పట్ల అనురక్తి కలిగేలా కార్యక్రమాలు, చర్చలు జరిపి మన ధర్మాన్ని మన దేశాన్ని ధర్మద్రోహుల నుంచి కాపాడుకునే ఈ పవిత్రమైన పరమ ధార్మికమైన సార్వజనిక వినాయక చవితి ఉత్సవ సాంప్రదాయాన్ని జయప్రదం చేద్దాం.”

అప్పుడు ఆ విఘ్న వినాయకుడు అడుగకున్నా మన ధార్మిక కోరికలను నిర్విగ్నముగా నెరవేర్చుతాడు..

“ ఇప్పటికైనా ఈ ఏడాది నుంచి అయినా జనాలలో మార్పు వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజు, బాల గంగాధర్ తిలక్ లు స్థాపించిన ఈ సార్వజనిక మండప వినాయక చవితి ఉత్సవాలను “ధర్మము కోసము దేశము కోసము సరైన విధముగా జరుపుతూ ఆ విఘ్న వినాయకుడి కృపకు అర్హత పొంది పాత్రులు” కాగలరని భావిస్తూ...

వక్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
🙏🙏🙏

వినాయక చవితి శుభాకాంక్షలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జైబోలో గణేశ్ మహరాజ్ కి జై
🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

ఛత్రపతి శివాజీమహరాజ్ కీ జై ✊ బాలగంగాధర్ తిలక్ కీ జై ✊ భారత్ మాతాకీ జై ✊
జై హింద్ ✊🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment