Sunday, March 27, 2022

కోపం ఎందుకు వస్తుంది, దాని దుష్పరినామాలు, కోపం వచ్చినపుడు మనిషి ఏం చేస్తాడు...

ఫ్రెండ్స్. మనకు నచ్చనిది మనసు మెచ్చనిది
మెదడు ఒప్పనిది వ్యతిరేక క్రియా జరిగినచో శరీరంలో తాపం, శ్వాసలో వేగం,
కనులలో కంపనం,మాటలలో గతులు తప్పిదం దాని పేరే కోపం. ప్రదర్శించటానికి వేదిక దొరికితే చాలు ప్రళయ తాండవం చేసే నర్తకి ఈ కోపం

అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే
అంతా మంచే జరుగుతుంది. కాని కోరికలు
అన్నీ తీరవు కదా! మనకు తీరని కోరికలే ఎక్కువ.
ఎలాటి కోరికలు అంటే ఇతరుల జీవితంలో జరిగేవి మనకు జరగాలి అని విపరీతంగా ఊహించుకుంటాం ఊహించుకున్న కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం వస్తుంది.

పోనిలే ఒక వేళ తేగా కోరుకుంటున్నాడు
నా బిడ్డ అని ఆ భగవంతుడు కోరిక తీర్చాడు అనుకుందాం అక్కడితో ఆగుతామా
అయ్యో ఆగం. అగం కాకా అగం.దాని వెంటనే
మరొక కోరిక పుట్టుకొస్తుంది .

ఎందుకంటే దొరికినదానితో తృప్తి చెందడం మానవ లక్షణం కాదు. ఉన్నదానిని పక్కన బెట్టి లేనిదాని కోసం పాకులాడటం మనకు పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవి తీరకపోతే కోపం రావడం సహజం. ఆ కోపం మనమీద కాదు. ఎవరిమీదనో కోపం.
వాళ్ల వల్ల నాకు ఇలా జరిగింది.వీళ్ల వల్ల నాకు ఇలా జరిగింది. అని వాళ్ల మీదా వీళ్ల మీద కోపం వస్తుంది.
అప్పుడు ఏమవుతుంది అనుబంధాలను విడగొడుతుంది ఆప్యాయతను చెడగొడుతుంది మనిషిగా మనలను పడకొడుతుంది.

కొంతమంది అయితే మరి విచిత్రం
అకారణ కోపం. దానికి ఒక కారణం ఉండదు. చిరుబురులాడుతుంటారు.ఎప్పుడు చూడు అసహనంగా ఉంటారు పలకరిస్తే కస్సుమంటారు చేతిలో ఏది ఉంటే అది విసిరికోడతాడు.

అసలు ఈ కోపం అంటే ఏమిటి ఎందుకు వస్తుంది కోపం అంటూ వేరే ఏమీ లేదు. అనుకున్న కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, తాను అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరిగితే,
తనకు నచ్చని వాడిని చూస్తే కలిగే స్థితి కోపము.
ఒక ప్రవాహం పోతూ ఉంటుంది. అది ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏదైనా అడ్డుతగిలితే ఎగిసిపడుతుంది. అలాగే అనుకున్నది నెరవేరకపోతే, మనకు నచ్చనిది జరిగితే, కోపం వస్తుంది.

క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నాడో
ఏం తిడుతున్నాడో చూడడు .
నోటికి ఎంతవస్తే అంత అనేస్తాడు.
దానినే మోహము అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు. ఆవేశానికి లోను అవుతాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు.

శంకరుల వారు కోపం వచ్చినవాడి గురించి చెబుతూ అటువంటి వాడు గురువునుకూడా ఆక్షేపిస్తాడు
నీకేం తెలుసు అంటాడు. తల్లిని కూడా కొట్టడానికి పోతాడు.

ఇటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒకవిధమైన ట్రాన్స్ ఉంటాడు ఊగి పోతుంటాడు. అంటే మంచి చెడు తెలుసుకొనే స్మృతి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మరిచిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని వాడు నా తండ్రి, నా అన్న నా బంధువు, నా భార్య అనే స్పృహ (జ్ఞాపకం) కూడా ఉండదు. ఎవరినీ లెక్కచేయడు. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పని చేయదు . పక్కకు తొలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో ఉండగా .

ఫ్రెండ్స్ కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.


నేనైతే నాకు కోపం వచ్చినప్పుడు
నా కళ్ళనుండి కన్నీరు రానివ్వని. కానీ
నా నోటి నుండి మాట మాత్రం రానివ్వను.
కన్నీటితో నా కోపం పోతుంది.
అదే నేను మాట జారితే
ఎదుటివారికి బాధ కలుగుతుంది ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి.

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment