Wednesday, March 23, 2022

నేటి మాటల ముత్యాలు.

నేటి మాటల ముత్యాలు.

🌷సుఖపడటం మోజులో పడి భవిష్యత్తు పాడుచేసుకోవడం తప్పు.

🌷భక్తిలేక పోవడం తప్పు కాదు, ఇతరుల మనోబావాలు దెబ్బతీయడం తప్పు.

🌷బతకడం కోసం తినాలి ,తిండి కోసం బతకకూడదు.

🌷జన్మ నిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్యం చేయడం తప్పు, నమ్మివచ్చిన భార్యను వదలడం తప్పు.

🌷ఇతరులు మెప్పు కోసం నీకోసం కష్టపడే వారిని,నిన్ను అభిమానించే వారిని బాధపెట్టడం తప్పు

🌷సంతోషాలకు ,అయిన వాళ్లకు దూరం చేసే సంపాదన వృధా,

🌷అన్నిటికన్నా దారుణం నమ్ముకొన్న వారికి ద్రోహం చేయుట , దీనికి పరిహారం లేదు

🌷స్నేహం చేయడం గొప్పనా ,సహాయం చేయడం గొప్పనా అంటే సహాయం చేయడమే గొప్ప,

🌷ఎన్ని ఏండ్లు స్నేహం చేసినా గుణం తెలుసుకోలేము గుడ్డి ప్రేమతో ఉంటారు, డబ్బు ఇచ్చి తిరిగి తీసుకునే టప్పుడే మనిషి గుణం తెలుస్తుంది

🌷బలహీనులు పైన బలం చూపించకూడదు , మనది కానీ చోట అధికారం చూపకూడదు.

🌷అన్నిటా అధికులైనవారిని చూసి అసూయపడటం కన్నా లేనివారికి సహాయపడి గొప్పవారు కావడం మిన్న..

🌷ఆకలికి చేసిన దొంగతనం, ప్రణాపాయంలో చెప్పే అబద్దం, ఒక బంధాన్ని నిలపడం కోసం చేసే మోసం తప్పు కాదు..

🌷చదువుకు తగ్గ సంస్కారం లేకపోవడం దండగ

🌷ఆశపడటం తప్పు కాదు.అత్యాశ పడటం తప్పు

🌷అహంకారి ఇంట్లో పరమాన్నంకన్నా, ఆప్యాయత గల ఇంట్లో గంజినీళ్లు మిన్న..

🌷ఉపయోగించడానికి పనికిరాని బురదనీరు మంటలు ఆర్పడానికి పనికి వస్తుంది కనుక ఉపయోగా పడని వ్యక్తి ఉండరు.

🌷సీత వంటి భార్య, లక్ష్మణుడు వంటి తమ్ముడు ఉంటే వనాలు కూడా రాజ భావనాలే

🌷భక్తిని రోడ్డు పైకి తెచ్చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంటే, పాలను ఇంటింటికి వచ్చి ఇస్తారు ,సారాయి వెతుక్కుని వెళ్తారు, భక్తిని పెంచడం కోసం తప్పు లేదు, కానీ భక్తితో వ్యాపారం చేయడం తప్పు.

🌷మన్నించమని అడగటం తక్కువ కాదు ,అది బంధం నిలుపు కోవడం.

🌷మౌనంగా ఉండటం అంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేదని అర్థం.

🌷 మంచి వాళ్ళు అజ్ఞాతం లో ఉంటే చెడు రాజ్యం ఎలుతుంది

🌷కంటికి దగ్గరగా దైవం ఉన్నా కనిపించదు, దూరపు కొండలు నునుపు.

🌷ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం లేని వాడు పేద వాడే.

🌷 అప్పు లేని వాడు ఎక్కడైనా మహారాజే..

🌷రాలిని ఆకులు చూసి కృంగి పోకూడదు, రాబోయే చిగురులు కోసం ఎదురు చూడాలి.

🌷 మనిషి భయాన్ని ఎప్పుడు జయించ గలడు, మృత్యువును సత్యం అని అంగీకరించినప్పుడు.

🌷 మనిషి ఊపిరి రక్తంలో ఉంటుంది, భగవంతుడు మనిషి ఆకలిలో ఉంటాడు. రక్త దానం చేస్తే ప్రాణ దానం చేసి నట్టు , అన్న దానం చేస్తే దైవాన్ని తృప్తి పరచినట్టు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment