Thursday, August 25, 2022

"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైనది కాదు...!

*జీవిత సత్యం*
                   
*తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది.. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది.

*కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.

*అయ్యో నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది..

*అయితే  మహా మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం                          ఆ తామర రేకులను తొలచలేదా..?                         ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...!

*కానీ ...
అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...
*లేక 
నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది..                                         ఆ భావనను నమ్మడమే దాని బలహీనత..!

*’నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది’... అనే దాన్ని నమ్మింది...! అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...!

*మన జీవితంలో  సమస్యలూ అంతే, సమస్య బలమైనది కాదు..!
మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం...!
మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం...!

*"మాయ" అనేది   నీ ఆత్మశక్తి కంటే బలమైనది కాదు...!

*దాని బలం తామర రేకు అంత..!
నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత!

*తెలుసుకో అదే..జీవిత సత్యం..!
                                    (భగవద్గీత)

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.

No comments:

Post a Comment