Wednesday, August 24, 2022

కాలాన్ని ఎలా లెక్కించాలి ? కలలోని కాలం, మెలకువలోని కాలానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది !?

 💖💖💖
       💖💖 *"308"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖


*"కాలాన్ని ఎలా లెక్కించాలి ? కలలోని కాలం, మెలకువలోని కాలానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది !?"*
**************************

*"మన ఉనికే కాలం ! మన మనసుకు నిరంతరం అనేక ఫలాలను ఆశించటం అలవాటైంది. అందువల్ల భూత, భవిష్యత్ కాలాలంటే అవి ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి భూత, భవిష్యత్ కాలాలు వర్తమానం నుండి విడిగాలేవు. మన ఉనికినే మనం వర్తమానం అనుకుంటున్నాం. అందుకే భగవాన్ శ్రీరమణమహర్షి నువ్వు లేని కాలం ఒకటి ఉన్నదా ? అని ప్రశ్నించారు. మనం లేని కాలం మన అనుభవంలో లేదని దీని భావం. కాలం యొక్క నిడివి ఒక లిప్తకాలం కన్నా సూక్ష్మం. కాగితం అనగానే రాసేందుకు వీలున్న రెండు తలాలు మాత్రమే మనకు స్ఫురణకు వస్తాయి. కానీ అక్షరం రాసేందుకు వీలు లేని దాని అంచును పరిగణలోకి తీసుకోము. ఆ అంచులేనిదే ఆ కాగితానికి రెండు తలాలు ఉండవు. అలాగే వర్తమాన కాలంగా ఉన్న మన ఉనికి లేకుండా భూత, భవిష్యత్ కాలాలు రెండూ లేవు. ఇప్పుడు అనుభవంలో ఉన్న వర్తమానం, క్షణం క్రితం భవిష్యత్తుగాను, క్షణం తర్వాత గతంగానూ మారిపోయింది. ఇదంతా మన పరిగణలో లేకపోవటానికి కారణం, మనసు ఎప్పుడూ ఏదో ఫలాన్ని కోరుతూ ఉండటమే ! సంవత్సరమన్నా, రోజన్నా, గంటన్నా, నిమిషమన్నా అంతా క్షణాల సమూహమే. ఇది అవగాహన అయిన రోజు మన ఉనికే కాలంగా నిలుస్తుంది. అప్పుడు నీవు కాలాన్ని ఊహించగలవా అన్న భగవాన్ శ్రీరమణమహర్షి మాటల్లోని అంతర్యం అర్థమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           🌼💖🌼💖🌼
                 🌼🕉🌼
        

No comments:

Post a Comment