Wednesday, August 24, 2022

ఏ ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి.

భగవద్గీత -237

మూలాధార చక్ర జాగరణకు వాసనలు ఉపయోగించుకోవాలి. స్వాధిష్ఠాన చక్రం జాగృతం కావటానికి రుచులను ఉపయోగించుకోవాలి. కొంతమంది అసలు రుచులు వద్దంటారు. ఆస్వాదు వ్రతం చేయండి, తప్పేమీ కాదు. కానీ ఆస్వాదు వ్రతం ఎందుకు చేస్తున్నారు? బాగా తింటున్నాడు, అజీర్తి చేసింది. ఉపవాసం చేస్తారు. ఉపవాసం ఎందుకంటే రేపు బాగా తినగలగటానికి. తిన్నది జీర్ణం కావటం లేదు కనుక జీర్ణించుకోవటానికి కడుపుకు రెస్ట్ ఇవ్వాలి. కడుపుకు రెస్ట్ ఇస్తే మళ్ళా బాగా తినగలుగుతాం.

 ఏ ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. స్వాధిష్ఠాన చక్రంలో నాలుక యొక్క రుచిని మీరు ఉపయోగించుకోగలిగితే, ఆ రుచి ద్వారా మనుష్యులు సైకాలజీ ని గెలవవచ్చు, మని‌షి యొక్క ఆలోచనా విధానాన్ని మార్చివేయచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నాము. ఇంకొక మనిషి ని కంట్రోల్ చేయాలంటే వాడి రుచి ఏదో కనుక్కుంటాము. దానినే మనం లంచాలు అంటాం, ఇంకొకటి అంటాం. కానీ ఈ పని ఎందుకు అయింది, స్వాధిష్ఠాన చక్రాన్ని పట్టుకున్నారు. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. అలా చేయకండి. మరి యోగి ఏ విధంగా నాలుకను ఉపయోగించుకోవాలి?  అది వేరే సైన్స్.
                   (సశేషం)

డా. మారెళ్ళ శ్రీరామకృష్ణ మాష్టరు గారు ఇచ్చిన ప్రవచనాల నుండి

No comments:

Post a Comment