Friday, March 31, 2023

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉవాచ:*
💥 "ఈ జాగృతావస్ధ ఒక కల అని  ఆస్థితిని వదిలించుకోవడానికి  ప్రయత్నం చేయాలి అనే మీ ఆలోచన మరియు జ్ఞానాన్ని లేదా నిజమైన అవగాహనను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఆ కలలోని భాగాలు మాత్రమే. మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు 
నిద్ర సమయంలో కానీ, లేదా మేల్కొనే స్థితిలో కాని కల అనేది లేదని,  మీరు మరియు మీ వాస్తవ స్థితి మాత్రమే ఉన్నట్లు గమనిస్తారు"💥
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

వేల్పూరు మౌన స్వామి / వేల్పూరు మౌన రమణ స్వామి

 *వేల్పూరు మౌన స్వామి / వేల్పూరు మౌన రమణ స్వామి* 

భగవాన్ రమణుల భాష మౌనం. ఒకసారి ఆల్ ఇండియా రేడియో వారు భగవాన్ మాటలు రికార్డు చెయ్యటానికి వస్తాము అన్నారని ఒక గాలి వార్త ఆశ్రమం లో వచ్చింది .అప్పుడు భగవాన్ నవ్వుతూ " ఓహో ! అట్లాగా నా మాట మౌనమే కదా . యెట్లా రికార్డు చేస్తారు ,వున్నది మౌనమాయె దాని రికార్డు చెయ్యటం ఎవరి తరం " అన్నారు . ఈ విషయాన్ని సూరి నాగమ్మ గారు శ్రీ రమణాశ్రమ లేఖలు (శ్రీ రమణాశ్రమ లేఖలు-మౌనముద్ర) లో చాలా అద్భుతము గా వర్ణించారు.

భగవాన్ ఉపదేశం కూడా మౌనవాక్యమే ఎందుకంటే అయన అపర దక్షిణ మూర్తి కదా .
మరి భగవాన్ ఉపదేశము అయిన మౌనం మరియు నిరాడంబరత్వాన్ని ఆచరిస్తున్న మహా మౌనయోగి ఇక్కడే మన మధ్యనే ఆంధ్రప్రదేశ్ లోనే వున్నారు . రమణతత్వము లో పూర్తిగా మునిగి భగవాన్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మనలాంటి వారికీ మార్గం చూపే మహానుభావుడు వేల్పూరు రమణ స్వామి.

రమణ మార్గమే తన మార్గంగా చేసుకొని భగవాన్ కి సంబదించిన ఎన్నో పుస్తకాలను తెలుగు లో ప్రింట్ చేయించి రమణ భక్తులకు ప్రసాదము గా ఇచ్ఛే మౌన స్వామి గురించి ఆయన ఆశ్రమం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీతో పంచుకుంటాను.

వేల్పూరు మౌన స్వామి ఆంధ్రప్రదేశ్ ,పశ్చిమ గోదావరి జిల్లా ,తణుకు కి సుమారుగా 8Km దూరంగా వేల్పూరు లో వుంటారు .స్వామి బాల రమణ స్వామి గా మరియు ఆశ్రమము శ్రీ రమణ నిలయ ఆశ్రమము గా అక్కడ అందరికి బాగా సుపరిచితం.

స్వామి మౌన స్వామి కదా భక్తుల సందేహాలకి సమాధానం పలక మీద వ్రాసి ఇస్తారు. స్వామి ని దర్శించిన వారికీ ప్రసాదం గా భగవాన్ పుస్తకము మరియు చాకోలెట్స్ ఇస్తారు. కానీ ప్రశ్నలు మాత్రమూ ఆధ్యాత్మిక సంబధమైనవి మాత్రమే అడగాలి .
స్వామి దిన చర్య ఉదయం రెండు గంటలకి ప్రారంభమవుతుంది .స్వామి ఉదయం రెండుగంటలకే లేచి ధ్యాన మందిరం కి వచ్చి ధ్యానం లో మునిగిపోతారు .స్వామి తో పాటు వుండే ఆశ్రమవాసులు కూడా లేచి ధ్యానం చేస్తుంటారు.

ఉదయం నాలుగు ఐదు గంటల మధ్య ఆశ్రమవాసులు ధ్యానం నుండి లేచి గోశాల కి సంబదించిన పనులు మరియు ఆశ్రమ వాసులకి , అతిదులకి టీ మరియు అల్పాహారం తయారు చెయ్యటానికి ఉపక్రమిస్తారు . స్వామి మాత్రం ఈ ప్రపంచము తో సంబంధం లేకుండ ధ్యానంలో మునిగివుంటారు . అ సమయం లో అక్కడ ఎలాంటి వారికైనా ధ్యానం అద్భుతం కుదురుతుంది .స్వామి సమక్షం లో మనస్సు శూన్యము అయి మనం కూడా ఆ ధ్యానం లో మునిగిపోవటం తథ్యం.

ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్యన సీతమ్మ అనే అవ్వ హారతి ఇచ్చి ఇంకా స్వామిని కొబ్బరి నూని మరియు కర్పూరముతో రుద్ది ధ్యానం నుండి భౌతిక స్థితికి తీసుకు వస్తారు.
సీతమ్మఅవ్వ గత ముప్పై సంవత్సరాల గా స్వామి ని సేవించుకుంటున్నారు.

స్వామి పదకొండు గంటల నుండి భక్తులను మరియు సందర్శకులు అడిగే ప్రశ్నలకు సమాదానాలు పలక మీద వ్రాసి ఇస్తారు .వచ్చిన వారికి ప్రసాదంగా స్వామి స్వయం గా ప్రింట్ చేయించిన పుస్తకాలూ ఇస్తారు .స్వామి మోము ఎల్లవేళలా ప్రశాంతముగా చేరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది .వచ్చిన వాళ్ళు పిల్లలు అయితే స్వామి మోము మహా సంతోషం తో వెలిగిపోతూ వాళ్ళని నవ్వుతోనే పలకిరించి వారికి ఇష్టమైన చాకోలెట్స్ చేతి నిండుగా తీసి ప్రసాదం గా ఇస్తారు.

మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటిగంట మధ్యలో స్వామి సుఖాసనమ్ నుండి లేచి భోజనము చేస్తారు .భగవాన్ ఏ విధముగా అయితే భోజనం లో అన్ని కలిపి ఒక ముద్దగా చేసుకుని తినేవారో అదేవిధముగా స్వామి కూడా అన్నము,రసం,చపాతీ మజ్జిగ అన్ని కలిపి ముద్దలా చేసి మధ్యాహన భోజనం ముగిస్తారు . కొంచెం విరామము తరువాత స్వామి అక్కడ వుండే పొలం లో పని చేస్తారు లేదా అక్కడ జరిగే నిర్మాణ పనుల లో కానీ గోశాల లో వుండే ఆవులకు గడ్డి కోయటం లాంటి పనులు చేస్తారు.

సాయంత్రము ఆరు ఏడూ గంటల మధ్య కాలంలో ఆశ్రమ వాసులు మరియు అతిధులు అందరు రాత్రి భోజనం ముగించి పుస్తక ప్రింటింగ్ మరియు బైండింగు మొదలైన పనులు రాత్రి తొమ్మిది వరకు చేస్తారు. ఆ తరువాత కొంత సేపు ధ్యానం చేసి ఆ రోజు ముగిస్తారు .మరల ఉదయం రెండుగంటలికి లేచి సన్నపానాదులు ముగుంచి స్వామి మరియు ఆశ్రమవాసులు ధ్యానం లో కూర్చుంటారు.

ఆశ్రమ దర్శనానికి ఎటువంటి బేధాలు లేవు ఎవరన్నా ఎప్పుడన్నా ఆశ్రమము ని దర్శించవచ్చు .ఆశ్రమం పచ్చటి పొలాల మధ్యన ప్రశాంతం వాతావరణం లో పట్టణ హడావిడి కి దూరంగా ఉంటుంది. ఆశ్రమము ప్రవేశ ద్వారం భగవాన్ ఫోటో తో రమణ నిలయ ఆశ్రమం బోర్డు తో ఉంటుంది .మనం ఆశ్రమం లోకి వెళ్ళగానే ఒక ప్రక్కన కొన్ని గదులతో కూడిన ఒక భవనము ఉంటుంది.

ఈ బిల్డింగ్ స్వామి ని చూడటానికి దూరం నుండి వచ్ఛే భక్తుల కోసం కొందరు భక్తులు కట్టించారు .ఆ భవనం నుండి పక్కగా ఒక అందమైన మట్టి రోడ్డు దానికి ఇరుపక్కల అందమైన వరి పొలాలు ఉంటాయి. ఆ త్రోవ వెంబటి వెళ్తూ వుంటే మట్టి రోడ్ పక్కన ఒక ఆసుపత్రి ఉంటుంది.

ఆ మట్టి త్రోవ వెంబటి ముందు కి వెళితే స్వామి వుండే ఆశ్రమం .ఇక్కడ పెద్ద ధ్యానం మందిరం ,వెనుకగా గోశాల, స్వామి గది మొదలైనివి ఉంటాయి. ధ్యాన మందిరం కి కొంచెం ముందు న వంట గది ఉంటుంది. ధ్యాన మందిరం కి ముందు అరుణాచలం కొండ నమూనాని ఏర్పాటు చేసారు.
కొందరు భక్తులు ఈ నమూనా చుట్టూ ప్రదక్షిణలు చేస్తువుంటారు . ఆశ్రమ భవనం చుట్టూ పూల చెట్లు ఇంకా రక రకాల మొక్కలతో చాల ఆహ్లదం గా ఉంటుంది . కొందరు భక్తులు ధ్యానమందిరం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు . ఆశ్రమం లో మంచి మాటలతో కూడిన సూక్తులు రాసిన బోర్డు లు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి .
రమణ భగవాన్ భక్తులు ఒక్కసారైనా చూడలిసిన స్థలం వేల్పూరు రమణాశ్రమము. ఎందుకంటే ఈ వేల్పూరు ఆశ్రమం మరియు మౌనస్వామి మనకి రమణుల వున్నప్పుడు వున్న రమణాఆశ్రమము ను గుర్తు చేస్తుంది . ఒకవిధంగా చెప్పాలంటే మనము సూరి నాగమ్మ గారు,కృష్ణ భిక్షు గారు వాళ్ళ రచనలలో చెప్పిన రమణా ఆశ్రమము కి వెళ్లినట్టు ఉంటుంది .

ఆశ్రమము కి వెళ్ళటానికి తణుకు లో దిగి షేర్ ఆటో లో గాని APRTC బస్సు లో గాని వెళ్ళవచ్చు.తణుకు కి వెళ్ళటానికి ట్రైన్ మరియు బస్సు సౌకర్యము కలదు .ఆశ్రమం లో ఉండాలి అనుకుంటే అక్కడ వసతి సౌకర్యం కూడా కలదు.

ఈ కర్మ యోగికి తన జీవిత చరిత్ర గురుంచి రాయటం ఇష్టంలేదు అందుకని వారి జీవితచరిత్ర వ్రాయటానికి ఎవరికీ అనుమతికూడా ఇవ్వలేదు.

 *ఓం నమో నారాయణాయ* 

అంతర్యామి

 🪔🪔అంతర్యామి🪔🪔

🌹సృష్టిక్రమంలో మనిషిగా పుట్టడం, పెరగడం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం, సంతానాన్ని పొందడం, ఈతి బాధలు అనుభవించడం, చివరికి మరణించడంతో జీవనచక్రం ముగుస్తుంది. క్షణికమైన ఈ కాలంలో నేను, నాది అనే స్వార్ధభావన పెచ్చు పెరిగి, మానవుడు దానవుడిగామారిపోతున్నాడు.

🌹 సంసార లంపటంలో చిక్కుపడి తన గురించి తాను ఆలోచించలేకపోతున్నాడు. | ప్రకృతి పురుషుల స్వరూపాన్ని తెలుసుకోలేక, పాశాలను తెంచుకోలేక కూపంలో మండూకంలా బతుకుతున్నాడు. జన్మ వైశిష్ట్యాన్ని, జీవిత పరమార్థాన్ని, మోక్షమార్గాన్ని అన్వేషించక కాలం కోరల్లో నలిగి వ్యర్థ జీవితం గడుపుతున్నాడు. వీటిని గమనించిన మనుపుత్రిక దేవహూతి- సంసార దుఃఖం నుంచి పరమాత్మను చేరే మార్గాన్ని బోధించేవాడు సాక్షాత్తు వైకుంఠవాసుడే అని తెలుసుకొన్నది. స్వామిని పుత్రుడిగా పొంది ఆయన ముఖతః లోకానికి సందేశమివ్వాలని భావించింది.

🌹 తల్లిదండ్రులైన స్వాయంభువ మనువు, శతరూపలతో కలిసి సరస్వతీ నదీతీరంలోని బిందుసరోవర తీర్థంలో నివసిస్తున్న కర్దమ మహామునిని సందర్శించింది. వివాహేచ్ఛతో ఉన్న మునిని ఆ అతిలోకసుందరి కోరిమరీ పెండ్లాడింది. సంతానానంతరం సన్యసిస్తానని ముని ఆమెకు ముందే చెప్పాడు. ఆమె అంగీకరించింది.

🌹 తొమ్మిదిమంది కుమార్తెలకు ఆమె జన్మనిచ్చింది. వారిని ఉత్తమ ప్రజాపతులకిచ్చి వివాహాలు జరిపించింది. సన్యాసానికి సంసిద్ధుడైన భర్తతో తనకొక పుత్రుడిని అనుగ్రహించమని కోరింది. వరప్రభావంతో శ్రీమహావిష్ణువును పుత్రుడిగా ప్రసాదించాడు కర్దముడు. ఆయనే కపిలుడు.

🌹 కాలాంతరంలో ఆమెకు వైరాగ్య భావన పెరిగింది. జ్ఞానభిక్షతో మానవజాతిని సముద్ధరించమని అర్థించింది. మానవులకు ఆత్మ తత్త్వాన్ని బోధించేందుకే అవతరించిన కపిలుడు మాయాశక్తితో తానే స్వయంగా సాంఖ్యశాస్త్రాన్ని తల్లికి వివరించి పరోక్షంగా మానవజాతికి సందేశాన్నిచ్చాడు.

🌹మనిషి మనసే బంధమోక్షాలకు మూలకారణం. భోగాలపై ఆసక్తిగల మనసు బంధాన్ని, పరమేశ్వరుడిపై నిలిచే మనసు మోక్షాన్ని కోరుతుంది. ఇది నేను, ఇది నాది అనే అభిమానం వల్ల కామ క్రోధ లోభాది దోషాలు పెరుగుతాయి. మనసు నుంచి ఇవి ఏనాడు తొలగిపోతాయో ఆనాడు సుఖాలపై విరక్తి కలిగి భక్తి వైరాగ్యాలు ఉదయిస్తాయి. జ్ఞానానికి వైరాగ్యాన్ని జోడించి యోగసాధన చేస్తూ భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటే ఈ జన్మలోనే అంతరాత్మ రూపుడైన పరమాత్మను చేరుకోగలం. 

🌹భక్తివిస్తారాన్ని, తత్త్వాల ఉత్పత్తిని, మోక్ష ప్రాప్తిని, అష్టాంగయోగ విధానాన్ని, భాగవత ధర్మాలను తల్లికి బోధించాడు కపిలుడు. 

🌹నిష్కామంగా భగవంతుడిని ప్రార్థించడమే నిజమైన భగవద్భక్తి. 

🌹మనసును స్థిరంగా నిలిపి భగవానుడికి సమర్పిస్తే అంతకన్నా గొప్ప కల్యాణమే లేదు. త్రికరణశుద్ధిగా దీన్ని నమ్మినవారికి ఏ కాలంలోనైనా శాంతియుత జీవనం లభిస్తుంది. 

🌹సంసారం సాగరంలోంచి బయట పడాలనుకునేవారు చైతన్య రూపమైన బ్రహ్మను దర్శించాలంటే మౌనాన్ని పాటించాలి.

🌹 శత్రుభావాన్ని దూరం చేసుకుని కర్తవ్యాన్ని శ్రద్ధగా పాటించాలి. లభించినదానితో తృప్తి పొంది రాగద్వేషాలకు అతీతంగా ప్రేమ, దయను ప్రదర్శించాలి. 

🌹స్వధర్మాన్ని పాటిస్తూ మితాహారంతో ధ్యానాన్ని అభ్యసించాలి. ఈశ్వరుడికంటే ఏదీ భిన్నం లేదన్న చింతన చెయ్యాలి. 

🌹ప్రాణుల్లో అంతర్యామిగా వ్యాపించి ఉన్న పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి అని తెలుసుకోవాలి. ఆ జ్ఞానమూర్తిని ప్రేమించేవారే పరమపదాన్ని అధిరోహించేందుకు అర్హులు అని తల్లీతనయులైన కపిల దేవహూతులు భాగవత కథ ద్వారా సందేశాన్ని అందించారు.

-✍️ మాడుగుల రామకృష్ణ. 
 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* చెప్పారు:
💥"అత్యున్నత శక్తిని గుర్తించినప్పుడు మాత్రమే అహం లొంగిపోతుంది. అలాంటి గుర్తింపే *శరణాగతి* ; మరియు అదే ఆత్మ-నియంత్రణ"💥
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

సదాచారమే సకల శుభాలను కలిగిస్తుందా ?

 *సదాచారమే సకల శుభాలను కలిగిస్తుందా ?*
🌹💧🪷💧🌹💧🪷💧🌹💧🪷

💧 దేవుడి నుంచి అనుగ్రహాన్ని ... ప్రకృతి నుంచి ఆరోగ్యాన్ని ... తోటివారి నుంచి సహకారాన్ని స్వీకరిస్తూ మానవ జీవితం కొనసాగుతుంటుంది. మానవుల జీవితం సంతోషంగా... సంతృప్తికరంగా కొనసాగడంలో కుటుంబవ్యవస్థ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కుటుంబ వ్యవస్థ సజావుగా సాగడానికి కొన్ని పద్ధతులను, కట్టుబాట్లను ఆచారాల పేరుతో పూర్వీకులు ప్రవేశపెట్టారు.

💧 అందరూ ఆచరించదగినదే ఆచారం. అయితే, అందరూ వాటిని ఆచరించాలంటే అందుకు ఆధ్యాత్మిక పరమైన భావాలు బలపడాలని పూర్వీకులు భావించారు. 

💧 *ఆధ్యాత్మికపరమైన భావాలే మానవుడిని ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తాయి. ధర్మాన్ని ఆచరించే వాళ్లు సంప్రదాయాలను గౌరవిస్తారు. సంప్రదాయాలు సదాచారంగా మారినప్పుడు మానవుల జీవితం నీతిబద్ధంగా, నియమబద్ధంగా, సమైక్యంగా కొనసాగుతుంది.*

💧 *సత్యం, న్యాయం, దానం, ధర్మం, పెద్దలను గౌరవించడం, దైవాన్ని ఆరాధించడం ఇవన్నీ సదాచారంలో భాగంగానే కనిపిస్తుంటాయి. వీటిని ఆచరించినవారి జీవితం సంతోషమయమవుతుంది. ఆచరించనివారి జీవితం దుఃఖమయమవుతుంది.*

💧 *సదాచారం నుంచి దూరమైన వ్యక్తి తన జీవితంపై తానే నియంత్రణ కోల్పోతాడు. తాత్కాలికమైన ఆనందాన్నిచ్చే ఆశలవెంట పరుగులుతీస్తాడు.*

💧 ఆచారాలను గౌరవించని వారు ఎవరినుండీ గౌరవాన్ని, సహకారాన్ని పొందలేరు. ఫలితంగా నిరాశకులోనై ఆ బాధనుంచి బయటపడటానికి వ్యసనాలకు బానిసలు అవుతుంటారు. అలా ఆకాశాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నంలో అగాధంలోకి జారిపోతుంటారు. ఇందుకు ఉదాహరణగా ఎంతోమంది రాజుల జీవితాలు చరిత్రలో కనిపిస్తుంటాయి. 

💧 సదాచారమనే సన్మార్గంలో ప్రయాణించడం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే, ఆ దారి తప్పి దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని పొందినవాళ్లు ఉన్నారు.

💧 అందువల్లనే,  సన్మార్గంలో నడిపించే సదాచారాలను పాటించాలని అంపశయ్యపైనున్న భీష్ముడు, తనని చూడటానికి వచ్చిన ధర్మరాజుతో చెబుతాడు. *సదాచారమే ప్రశాంతత ... పవిత్రత ప్రసాదిస్తుందనీ, అలాంటి సదాచారాన్ని పాటించడం వలన సకలశుభాలు చేకూరతాయి అని అంటాడు. సదాచారం వ్యక్తులకు రక్షణ కవచంగా ఉంటుందనీ, భగవంతుడి అనుగ్రహాన్ని కూడా అది సాధించి పెడుతుందని స్పష్టం చేస్తాడు.*


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:* 
🪷💧🌹💧🪷💧🌹💧🪷💧🌹

అమృతవాహిని

 🌹 *"అమృతవాహిని"* 🌹
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🪷 *కలియుగం  చీకటి  యుగం.  మంచి  చెడుగాను,  చెడు  మంచిగాను  కనబడుతుంది.  అందుకే  భగవంతుణ్ణి  స్మరించడం  మంచిది.*

🪷 *ధ్యానమూర్తి  నీ  మనస్సును ఆక్రమించినప్పుడు,  నీ మనస్సును ఆయన  పట్టుకొని  వాసనాక్షయం చేస్తాడు.*

🪷 *సాధన  అనేది  ఒక్కరోజులో  చేసేది  కాదు. ఆరోజుకారోజు అభివృద్ధిలోకి  రావాలి.*
 
🪷 *మంచి  తలంపులను,  మంచి  భావాలను  వ్యాప్తి  చేస్తూ  ఉంటే,  హృదయంలో ఆ మంచి  ఒక్కటైనా  నాటుకుంటుంది.*

🪷 *ఇతరులకు  నీవు  రకరకాలుగా  ఉపకారాలు  చెయ్యవచ్చు.  కానీ  నీవు  ఆత్మజ్ఞానం  సంపాదిస్తే,  నీ ద్వారా  ఇతరులకు  ఎక్కువ  ఉపకారం  జరుగుతుంది.*

🪷 *బాహ్యంగా  పెట్టిన  అన్నం సాయంత్రానికి  అరిగిపోతుంది.  బట్టలు ఇస్తే అవి కొంతకాలానికి చిరిగిపోతాయి. నీవు  ఆత్మజ్ఞానాన్ని  సంపాదిస్తే  శాశ్వత శాంతి  నీ  ద్వారా ఇతరులకు అందుతుంది.*

*సేకరణ:* 

భక్తి కలిగి ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది కదా ?

 💖💖💖
       💖💖 *"508"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"భక్తి కలిగి ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది కదా ?"*

*"ఆధ్యాత్మికం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు. ఆధ్యాత్మికంలో భక్తి ఒక భాగం మాత్రమే. అంతర్ముఖం కావటమంటే ముందు మనలోని లోపాలు వెతుక్కొని సవరించుకోవటం. సద్గురు మన బుద్ధిరూపంలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. "కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే గురువు కావాలి, నేర్చుకున్నది తీసేయ్యటానికి గురువెందుకు ?" అని శ్రీరమణమహర్షి అన్నారు. చిన్నపిల్లవాడికి ఏదైనా పెట్టుకోవటం ఎలానో మనం నేర్పాలి. ఎలా వదిలివేయాలో నేర్పనక్కర్లేదు. పట్టుకున్నది మంచిది కాదని తెలిస్తే వాడే వదిలివేస్తాడు. ఆధ్యాత్మికత అంటే సంపూర్ణ మనశ్శాంతి. అది మనలో ఉంది. మనం చేయవలసిందల్లా అడ్డుగావున్న బేధభావాలను తొలగించుకోవటమే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           
 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ🙏💥🙏*
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
💥కొమ్మలు నరికిన చెట్టు మళ్లీ పెరుగుతుంది. చెట్టు యొక్క వేర్లు చెడిపోకుండా ఉన్నంత కాలం, చెట్టు పెరుగుతూనే ఉంటుంది. 
అదేవిధంగా, మరణాంతరం  కేవలం హృదయంలో మునిగిపోయిన సంస్కారాలు, కానీ ఆ కారణంగా నశించనివి, సరైన సమయంలో పునర్జన్మను పొందుతాయి; 
అలాగే జీవులు పునర్జన్మను పొందటం జరుగుతుంది.💥
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

చక్రాంకితులు కావటం, లింగధారులు కావటంలలోని ఆంతర్యం ఏమిటి ?

 💖💖💖
      💖💖 *"507"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"చక్రాంకితులు కావటం, లింగధారులు కావటంలలోని ఆంతర్యం ఏమిటి ?"*

*"భక్తులు చక్రాంకితులు, లింగధారులు కావటం కేవలం తమతమ ఇష్టాన్ని బయటికి ప్రకటించుకునేందుకు కాదు. చక్రాంకితాలు కావటం అంటే చక్ర్యాంకితుడు కావడం. అంటే ఆ 'చక్రి ' (విష్ణువు) అందించిన సందేశానికి అంకితం కావటం. లింగధారణ అంటే సర్వవ్యాపకమైన శివతత్వాన్ని ధరించటం. నేను ఏ దీక్షలో ఉన్నాను, దైవాన్ని ఏ రూపంలో కొలుస్తున్నాను అనేది ఎవరికి వారికి పూర్తిగా వ్యక్తిగత విషయం. దాని కంటే ముందుగా తాను ఆచరించాల్సిన మానవ ధర్మాలను, చూపాల్సిన మానవత్వాన్ని విస్మరిస్తే ఏ దీక్ష అయినా కేవలం నాటికలో వేషధారణే అవుతుంది. ముందు తాను మనిషి కానివాడు భక్తుడు ఎలా అవుతాడు ? తల్లిదండ్రులను పోషించని వాడు, కుటుంబ బాధ్యతలు చేపట్టని వాడు, సాటి ప్రాణులను ఆదరించని వాడు.. దైవం దృష్టిలో భక్తుడిగానే కాదు కనీసం మానవుడిగా కూడా చలామణి కాలేడు. అందరూ హీనంగా చూసే గజ్జికుక్కలో కూడా దీక్షలు తీసుకున్న వారికి దీక్షామూర్తులే కనిపించాలి. అలాకాకుండా ఆదరించాల్సిన సాటి మానవులను హీనంగా చూసేవాడు ఏ దీక్ష తీసుకున్నా అది నటనే అవుతుంది కానీ శరణాగతి కాదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

దేహాలయం

 🥀 *దేహాలయం* 🥀
               ✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

మనిషి ఎల్లప్పుడూ మూడు ‘ద’ కారాలను దృష్టిలో పెట్టుకుని జీవించాలంటారు ప్రవచనకర్తలు.  

*మొదటి ‘ద’ దేహభక్తిని సూచిస్తుంది.*
*రెండో ‘ద’ దైవభక్తికి సంకేతం.*
*మూడో ‘ద’ దేశభక్తికి ప్రతీక.*

ఈ మూడింటిలోనూ మొదటిది దేహభక్తి. అంటే శరీరారోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం. ఏ ధర్మకార్యం నిర్వర్తించాలన్నా మొదట శరీరం స్వస్థతగా ఉండాలి కదా! ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసూ ఉంటుంది. జపానికైనా, తపానికైనా, ప్రాణాయామం, యోగ, వ్యాయామం, వ్రతం, ఉద్యోగం... ఏది చేయాలన్నా ముందు దేహం చురుగ్గా పరిశుద్ధంగా ఉండాలి.

అతి నిద్ర, అతి ఆహారం, అతిగా మాట్లాడటం, అవసరాన్ని మించి సంచరించడం... ఇవన్నీ శరీరారోగ్యానికి హాని చేకూర్చేవే! మనసుకే కాదు, దేహానికీ క్రమశిక్షణ అవసరం. స్వచ్ఛమైన, విశుద్ధమైన దేహం మాత్రమే దైవానికి మందిర మవుతుంది. కలుషిత శరీరంలో పరమాత్మ క్షణమైనా నిలవడు. 

ఆరోగ్యవంతమైన శరీరం కలవాడి మనసులోనే, మెదడులోనే పరమాత్మ నిశ్చలంగా ఉంటాడు. ఈ శరీరమే ‘నేను’ అనే వ్యామోహం దరికి రానంతవరకు- దేహం పట్ల మనిషి మంచి ఎరుక కలిగి ఉంటాడు.శరీరంలోని ప్రతి అవయవమూ తన ధర్మాన్ని పవిత్రంగా నిర్వర్తించినంత కాలం మనిషి చిత్తం, మస్తిష్కం అధీనంలోనే ఉంటాయి. మంచిని ఆలోచించడం, మంచిని మాట్లాడటం, మంచి చేయడం... స్వస్థ శరీరుడి లక్షణాలు. మంచి మాటలనే వింటూంటే చెవులు అనారోగ్యంపాలు కావు. మంచి ప్రదేశాల్లోనే సంచరించే పాదాలు అపరిశుభ్రం కావు. అశాశ్వతమైన దేహపోషణకు అవసరాన్ని మించి సమయాన్ని వెచ్చించడమూ వాంఛనీయం కాదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించడమంటే ఆడంబర సూచక వస్త్రాలను, ఆభరణాలను ధరించి కృత్రిమాలంకరణ చేసుకోవడం కాదు. *శరీరానికి జలస్నానం, ఆత్మకు జపస్నానం- రెండూ ప్రధానమైనవే.* సంధ్యావందనంలో చేసే ప్రతి మంత్ర పఠనానికీ ముద్రలంటూ ఉన్నాయి. ఆ ముద్రలన్నీ, ఆ భంగిమలన్నీ శరీరంలోని నాడులను స్పందింపజేసేవే. మంచి రక్తప్రసరణ కలిగించేవే. సూర్యనమస్కారాలూ సంధ్యావందనంలోని భాగం. సర్వరోగాలను నిర్మూలించి, దేహాన్ని చైతన్యవంతం చేస్తాయి బాలభానుడి లేతకిరణాలు.

శ్రవణం కన్న బోధన గొప్పది. బోధన కన్న సాధన గొప్పది. ఆ సాధనకు ఉండవలసిందే ఆరోగ్యవంతమైన శరీరం. హితంగా, మితంగా మాట్లాడటం, మౌనవ్రతం ఆచరించడం వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. అష్టాంగం, పంచాంగం, త్రయ్యంగం, ఏకాంగం అనే నాలుగు రకాలైన నమస్కారాలు కూడా మనిషి ఆరోగ్యం కోసమే నిర్దేశితమైనాయి. రుషులు, మునులు, సిద్ధులు అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు మంచి పోషకవిలువలున్న కందమూలాలే భుజించేవారు. నిర్మలంగా గలగలా పారే సెలయేళ్ల నీరు తాగేవారు. ధ్యానం శరీరానికి ఎంతో దృఢత్వం కలగజేస్తుంది. 

పాండవులు అరణ్యవాసంలో కందమూలాలు, సాత్విక ఆహారమే స్వీకరించి, శక్తిని పుంజుకోగలిగారు. తపస్సులన్నింటిలోనూ ‘ఏకాగ్రత’ అనేది గొప్ప తపస్సు. ఇది శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం స్వార్థం కాదు. పైగా పరోపకారం కూడా. కోరికలతో కూడిన దేహం దుఃఖాలయం, జ్ఞానాన్ని నింపుకొన్న దేహం దేవాలయం. తనది కాని దేహాన్ని తనది అనుకోవడం అహంకారం. *‘దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, సనాతనుడు’ అంటుంది అద్వైత ధర్మం!*



*Courtesy* : *ఈనాడు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

ఆవేశాన్ని జయించాలి..

 ఆవేశాన్ని జయించాలి..

🧘🏻‍♀️🧘🏻‍♀️🌱🌱🧘🏻‍♀️🧘🏻‍♀️🌱🌱🧘🏻‍♀️🧘🏻‍♀️

మానవజన్మ ఎత్తిన వాడు ఈ శరీరం ఉండగానే కామక్రోధోద్భవమైన వేగాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత అవసరమో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఐదవ అధ్యాయంలో ఇరవై మూడో శ్లోకంలో చెప్పాడు. 



శక్నో తీహైవ యస్సోఢుంప్రాక్ఛరీర విమోక్షణాత్‌

కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః

‘‘సరైనటువంటి కర్మయోగ సారం తెలిసిన వాడెవడంటే, అర్జునా! ఈ జన్మలోనే ఇక్కడే ఈ కోరికల వేగాన్ని, క్రోధం వేగాన్ని నిగ్రహించుకున్నవాడు.

కాబట్టి నవ్వు కూడా ఆ ప్రయత్నం చేయి. 

కోపంతో యుద్ధం చేయవద్దు.

ప్రశాంతంగా యుద్ధం చేయి. 

నీ ధర్మం నువ్వు చేయి. 

ఆవేశం తెచ్చి పెట్టుకోవద్దు.

ఆవేశంలో ఏం మాట్లాడవద్దు’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. 

ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్‌ తన క్రోధాన్ని జయించలేకపోయాడు.

ప్రపంచాన్ని జయించాలనే పిచ్చి కోరికను జయించలేకపోయాడు. 

కానీ ఆ విషయాన్ని మరణపు అంచుల మీద ఉన్నప్పుడు గ్రహించాడు. ‘

‘ప్రపంచాన్ని జయించిన నేను ఏమీ తీసుకెళ్లడం లేదనే విషయం అందరికీ తెలియాలి’’ అని, చనిపోయిన తరువాత తన రెండు చేతులను శవపేటిక బయటకు కనిపించేలా పెట్టమని చెప్పాడు.

ఇది అందరూ గ్రహించాలి. 

ఎన్ని కోట్లు సంపాదించినా, ఎవరైనా వట్టి చేతులతో వెళ్లిపోవాల్సిందే!
🧘🏻‍♀️🧘🏻‍♀️🌱🌱🧘🏻‍♀️🧘🏻‍♀️🌱🌱🧘🏻‍♀️🧘🏻‍♀️

నిర్మలచిత్తం కావాలి

 🥀 *నిర్మలచిత్తం కావాలి* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

రావణాసురుడు సామాన్యుడు కాడు. అతని వంశం బ్రహ్మదేవుని వంశం. అతని అన్న కుబేరుడు. కాబట్టి అతనికి డబ్బుకు ఏ లోటూ లేదు. తమ్ముడు కుంభకర్ణుడు మహాబలశాలి. కావున ఇక శత్రుభయం లేదు. కుమారుడు ఇంద్రజిత్తు, ఇంద్రుడినే జయించిన సాహసోపేతుడు. ఈ ప్రకారంగా అతని వంశం, అతని పరిసరం చాలా గొప్పవిగానే యున్నాయి.

ఇక అతని ఆకారం చూతమా... ఎవరికీ లేని ఆశ్చర్యకరమైన రూపం అతనికి ఉంది. అందరికీ ఒక తల ఉంటే అతనికి 10 తలలు ఉన్నాయి. అందరికీ రెండు చేతులుంటే అతనికి 20 చేతులున్నాయి. కాబట్టి శారీరక బలానికి ఏ లోటూ లేదు.ఈ విధంగా వంశం గొప్పదైనా, బలం గొప్పదైనా, పరిసరం గొప్పదైనా, అతడు ఎన్నో సిద్ధులు కలిగియున్నా ఇష్టం వచ్చిన రూపం పొందటానికి తగిన శక్తి కలిగియున్నా, ఆకాశంలో సంచరించటానికి తగిన స్తోమత కలిగి యున్నా, చిత్తశుద్ధి లేనందువల్ల అవన్నీ నిష్ఫలములైపోయాయి. కామక్రోధాదులకు తన హృదయంలో చోటిచ్చినందువల్ల అతని జీవితం నిరుపయోగమై పోయింది. తుదకు దుర్గతిని పొంది జీవితాన్ని వృథా చేసుకొన్నాడు.

మనుజుడు ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, శక్తివంతుడైనా, అధికారవంతుడైనా అతని చిత్తము నిర్మలముగా లేకున్నచో శాంతికి నోచుకోలేడు. నిర్మలచిత్తమే శాంతికి, పరమానందానికి ఏకైక ఉపాయం.

కాబట్టి విజ్ఞుడైనవాడు ఇతర శక్తులున్నా లేక పోయినా తన మనస్సు యొక్క పవిత్రతను ముఖ్యంగా కాపాడుకోవాలి.

హృదయాన్ని కామక్రోధాది దుర్గుణ రహితంగా ఒనర్చుకోవాలి. నిర్మల చిత్తంలో అధిష్ఠానమైన ఆత్మ - తుడిచిన అద్దంలో ముఖం బాగా కనుపించునట్లు - చక్కగా గోచరించును.

విశుద్ధ సత్త్వగుణోపేతమైన మనస్సు అధిష్ఠానమైన ఆత్మ యందు లయించిపోవును. అపుడు జీవునకు కలుగు ఆనందం వర్ణనాతీతం. అట్టి ఆనందాన్ని అనుభవించటమే జీవుని పరమలక్ష్యం. 

కావున మానవుడా! అన్నిటి కన్నా ప్రధానమైన చిత్తనైర్మల్యాన్ని కాపాడుకో. మనస్సులో ఏ ఒక్క అవగుణమైనా లేకుండా చూచుకో. బియ్యంలో రాళ్ళను ఏరివేయునట్లు, పొలంలో కలుపు మొక్కలను తీసివేయునట్లు, ఇంటిలో మురికినీటిని సాగనంపునట్లు, నీ హృదయాన్ని బాగా పరీక్షించుకొని ఏవైనా చెడ్డగుణాలుంటే బైటకు గెంటివెయ్. పవిత్ర జీవితాన్ని గడుపు. అపుడే నీ జీవితం ఆనందమయమౌతుంది. భగవదనుగ్రహాన్ని పొందగల్గుతావు. మహా ధైర్యంతో జీవితాన్ని గడపగల్గుతావు. 

కాబట్టి ప్రయత్నపూర్వకంగా పవిత్రతను కాపాడుకో. దుర్గుణరూప శత్రువులకు ఏ మాత్రం తావీయవద్దు. హృదయ పవిత్రతనే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. తత్ఫలితంగా బ్రహ్మానందాన్ని అనుభవించు. 

*జాతో బ్రహ్మకులే౬గ్రజో ధనపతిర్య: కుంభకర్ణానుజః* 
*పుత్రః శక్రజితస్స్వయం దశశిరా పూర్ణాభుజా వింశతిః* 
*స్వేచ్ఛః కామచరో రథాశ్వ విజయీ మధ్యే సముద్రం గృహం*
*సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవేబలే దుర్బలే*


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

అజ్ఞానంతోనే అనర్థాలు

 *అజ్ఞానంతోనే అనర్థాలు*

అజ్ఞానం వల్లనే సర్వ అనర్థాలు కలుగుతాయి. అజ్ఞానం నశిస్తే జ్ఞానం ఉదయిస్తుంది. అపుడు ఇబ్బందులేవీ ఉండవు.దేనినైనా పూర్తిగా తెలుసుకొంటే దానిగురించిన అవగాహన వస్తుంది. పూర్తిగా తెలిసినదే కనుక ఏమీ అనుమానం ఉండదు. కాని ఏ వస్తువు గురించి యైనా పూర్తిగా తెలియకుండానే తెలుసు అనే భ్రమ కలిగితే అపుడు అజ్ఞానం ఆవరిస్తుంది. చీకటిలో పొడవుగా ఉన్న దానిని చూసి దానే్న పాము అనుకొంటే అది అజ్ఞానమవుతుంది.
కేవలం పొడవుగా ఉండడమనేది మాత్రమే తెలుసుకోవడం అనేది సగం మాత్రమే తెలుసుకొన్నట్టు అయినందువల్ల అజ్ఞానమావరించి అసలు విషయాన్ని తెలియనివ్వదు. ఆ అజ్ఞానంతోనే ఎదురుగా ఉన్నదాన్ని గురించి అపోహ తో అది పాము అని ఇక దాని గురించి ఎక్కడో విన్న జ్ఞానాన్ని అంతా దానిపైనే అపాదిస్తాము. దానితో అసలు విషయమే తప్పుకనుక చెప్పేవన్నీ తప్పులే అవుతాయి. అక్కడ ఉన్నది తాడు. చెప్తున్నది పాము గురించి అది బుస కొడుతుంది. అది కాటు వేస్తుంది. ప్రాణం తీయనూ శక్తిగలది అని చెప్పుకుంటూ పోతే వినేవాడు ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతాడు. వాడు తాడు ను చూసికూడా ఎదుటిమనిషి చెప్తున్నది విని చూసిన దానికి విలువనివ్వకుండా అనుభవంతో చెప్తున్నాడని విన్నదానికి విలువనిచ్చి మరిన్ని అపోహలకు అవకాశాన్ని ఇస్తాడు. ఇట్లా వీళ్లిద్దరూ అర్థజ్ఞానంతో అజ్ఞానంలో కూరుకుపోతారు. ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతారో వారు చిదానందంతో ఉంటారు.చలించని చిత్తం కలవాడుగా ధీరుడుగా ఉంటాడు. నిర్మల మనస్సు గలవాడుగా ఉంటాడు.
ఏకాగ్రతా నిరోధోవా మూఢై రభ్యస్యతే భృశమ్
ధీరాః కృత్యం నపశ్యంతి సుప్తవత్స్వపదేస్థితా
అంటే లక్ష్యం గురించి మాత్రమే ధ్యానం చేస్తూ ఏకాగ్రతను సాధిస్తారు. యేకాగ్రత గాని చిత్తమును శాసించుట గాని ఆత్మసాక్షాత్కారము గని పొందని అజ్ఞానులు విరుద్ధ భావమును కలుగకుండా శ్రద్ధతో అభ్యసిస్తారు. నేనే దేహమను విపరీత భావన లేని జ్ఞానులు సచ్చిదానంత స్వరూపులై ఉంటారు. వారెప్పుడూ చిద్రూపునకు అసంభావన, విపరీత భావన కలుగదు.వారికి స్వస్వరూపజ్ఞానమే స్ఫురిస్తుంటుంది.

🌷🌷🌷🌷 

శాంతము లేకుంటే...సౌఖ్యము లేదు...

 శాంతము లేకుంటే...సౌఖ్యము లేదు...


🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴


అక్రోధేన జయేత్ క్రోధ మసాధుం సాధునా జయేత్ |
జయేత్కదర్యం దానేన జయేత్సత్యేన చా నృతం ||


శాంత స్వభావంతో కోపావేశాలని, మంచితనంతో దుర్మార్గాన్ని, దానంచేయడం ద్వారా పిసినారి మనస్తత్వాన్ని నిజం చెప్పడం ద్వారా అబద్ధాలు చెప్పే గుణాన్ని జయించాలి.

🪴కష్టాలు పరీక్షిస్తుంటే ఓర్పుతో ఎదురీదేవారు, చిన్న కష్టానికే  ఆవేశంతో ఊగిపోయేవారు జీవిస్తున్న లోకమిది.

🪴మానవుల్లోని శాంతం, క్రోధ స్వభావాలే ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. 

🪴కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలన్నీ వినాశ కారకాలే. ప్రవర్తనా తీరును దిగజార్చి పతనం అంచుకు చేర్చేవే.  


‘🪴విషయాసక్తి ఉన్నవారే కోరికలు పెంచుకుంటారని, కోరికలు తీరక  క్రోధము కలుగుతుందన్న’  గీతాకారుడి భాష్యాలను మరచి, జీవితంపై వ్యామోహంతో ఆశలు పెంచుకుని  అరిషడ్వార్గాల గూడులో చిక్కుకుని విలవిల లాడుతున్నారు మానవులు.

🪴అగ్ని అంటిన గృహం దహించుకు పోయినట్టే క్రోధం ఉన్న శరీరం దహించబడుతుందని గుర్తించలేక కష్టాలు అనుభవిస్తున్నారు.  


  🪴క్రోధానికి ఋషులు, పురాణ పురుషులూ బానిసలయ్యారని, తపస్సంపన్నులైన  దుర్వాసుడు, విశ్వామిత్రుడూ  క్రోధంలో మునిగి శాపమిచ్చిన వృత్తాంతాలను  పురాణాలు తెలిపాయి. 


🪴 క్రోధాన్ని నిగ్రహించుకుంటే ధీమంతులు కాగలరని, లేనివారు గురుహత్య, సాధుహింస లాంటి అఘాయిత్యానికైనా పూనుకుంటారన్న  పెద్దల మాటలకు నిదర్శనాలు కనిపిస్తాయి పురాణాల్లో. 
తోకకు నిప్పు పెట్టించారన్న కోపంతో  లంకా దహనం చేసిన హనుమంతుడు, అశోకవనంలో సీతాదేవికి హాని జరిగిందేమోనని వ్యాకులపడినట్టు సుందరకాండ  వివరించింది.  

🪴వృత్రాసురుడు దాగాడన్న కోపంతో సముద్రాన్ని అగస్త్యుడు త్రాగేసినట్టు స్కాంద పురాణం, కోపించిన భృగువు సాక్షాత్తూ విష్ణు వక్షస్థలాన్ని పాదంతో తాకినట్టు వేంకటాచల మహత్యం తెలిపాయి. 


🪴మనుషుల్లోని ఆలోచన, విచక్షణలను నశింపజేసి రాక్షసుల్లా మార్చే శక్తి క్రోధానికి ఉందన్న స్పృహతోనే   కోపిష్టులను పక్షుల్లో కాకితో, జంతువుల్లో కుక్కతో పోల్చాడు చాణక్యుడు. క్రోధంలో ప్రవర్తనా నియమాలు, ఉచితానుచితాలు గాలికి వదిలే అవకాశమివ్వకుండా  ధీమంతులు ‘పాము కుబుసం విడిచినట్టు కోపాన్ని విడనాడాలని’ గ్రంథాలు బోధించాయి.  


🪴‘క్రోధమే మృత్యువని, పేరాశయే వైతరణీ నదియని, తృప్తితో, సంతోషంతో జీవించడంలో సుఖముందన్న చాణక్య నీతిని ఆచరిస్తూ శాంత చిత్తులై దయర్ద్రహృదయంతో ప్రవర్తించాలి మానవులు. కోపమనే గుణానికి దహించబడని హృదయం గలవారే ధీరులన్నది భర్తృహరి సుభాషితం ..

🪴కాగా  ‘తన కోపమే తన శత్రువని, తన శాంతమే తనకు రక్షయన్న’ సుమతీకారుడి మాటలు మననం చేసుకుంటూ  ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ప్రవర్తిస్తే అనర్ధాలు దూరమౌతాయి. 


🪴“కోపం పట్టుపురుగు లాంటిదని, పట్టిన వారిని ఆకులా తినేసి, ఆవేశమనే దారాన్ని బయటకు కక్కుతుందన్న”  కవి వాక్యం ఆలోచనాత్మకం. 

🪴కోపంలో జారిన మాట శాపంగా మారి శత్రువులను పెంచుతుందన్న వివేకం కలిగితే సాధనతో క్రోధాన్ని దూరం చేసుకోగలరు. 

🪴శాంతం, పరోపకార తత్వంతో వ్యవహరిస్తే మిత్రులు పెరగడమే కాదు మనశ్శాంతి దక్కుతుంది.
🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴

జీవితమంటే ఏమిటి..?

 *జీవితమంటే ఏమిటి..?*
                ➖➖➖


*ఎంత ఆలోచించినప్పటికీ జీవితమంటే ఎమిటో తెలియక సతమతమవుతున్న ఒక జీవితపు ప్రయాణ బాటసారి  గురువు వద్దకి  వెళ్ళి …*

*"స్వామీ ...! ఎంత ఆలోచించినా జీవితం అంటే ఏమిటో తెలియట్లేదు ఇక మీరే నాకు జ్ఞాన ప్రదాత” అని శరణు వేడాడు .*
         
*అది చూసిన గురువు గారు ఆ శిష్యుడిని  పోస్టు మాస్టర్ వద్దకి తీసుకెళ్ళి,  ఈరోజు ‘ఉత్తరాల సంచి’ని శిష్యుడికి ఇప్పించి ఆ సంచిలో ఉన్న ఉత్తరాలను అడ్రసుల వారీగా పంచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు.*

*అది చూసిన ఆ బాటసారి కొంత ప్రశ్నార్థకంగా చుస్తూ ......*

*సరే గురువు గారు చెప్పారు కదా....అని ముందుకి సాగుతాడు . *

*అలా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి  వచ్చిన ఉత్తరంలో, ఆ ఇంటి బిడ్డకు ఉద్యోగం వచ్చిందని లేఖ ఉంటుంది , అది చూసి  సంతోష పడతాడు.*

*మరో ఇంటికి వచ్చిన లేఖలో వారి బంధువొకరు మరణించారన్న వార్త చూసి బాధపడతాడు.*

*ఇంకో పేద వృద్ధురాలికి పించను డబ్బులు మనీ ఆర్డర్ ద్వరా ఇచ్చి సంబరపతాడు.*

*ఇంకొకరి బంధువుల ఇల్లు మంటలలో కాలిపోయిందన్న  ఉత్తరమిచ్చి విలపిస్తాడు.*

*అలా తిరుగుతూ సాయంకాలానికి గురువుగారి ఆశ్రమానికి  చేరుకొని విచారంగా కూర్చుంటాడు.*

*గురుదేవుల రాకను గమనించి గబుక్కున లేచి కొంత అలసటతో కొంత విచారంతో కొంత తెలుసుకోగలిగానన్న సంతోషంతో గురువుగారి పాదాలకు మనస్కరించి వెళ్ళిపోతాడు.*

*ఏంటీ .......!!! కథ ను మధ్యలో ఆపాననుకుంటున్నారా ....... నిజమేనండి  కథ అయిపోయింది,*

*!!!...ఆలోచించండి ఆ శిష్యుడికి  ఏమి అర్థమయ్యుంటుంది .....?????*
 
 *"....జీవితమంటే పోస్టు మ్యాన్ భుజానికున్న ఉత్తరాల సంచి లాంటిది. అందులో  సంతోషం, బాధల కలబోతల ఉత్తరాలున్నట్టు, జీవితం కూడా సుఖ దుఃఖాల కలబోత.  అన్నిటినీ భరిస్తూ ముందుకి సాగడమే జీవితం .... "

గుణ దోషాలు

 🪔🪔🪔🪔

            🎈🎈గుణ దోషాలు🎈🎈

🌹మనిషి మనసు నిరంతరం మంచి-చెడుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది. ఒక్కొక్కప్పుడు మంచివైపు మొగ్గుతుంది. మరొకప్పుడు చెడువైపు మొగ్గుతుంది. స్వార్ధానికి దాసుడైనవాడు తన చెడును కూడా మంచిగా సమర్థించుకుంటాడు. విద్యావంతుడు, సంస్కారి, వివేకశీలి, జ్ఞాని ఎక్కడ మంచిని గ్రహించినా స్వీకరిస్తాడు. చెడును దూరంగా ఉంచేస్తాడు.

🌹పిడికిలి ఎంత పరిమాణంలో ఉంటుందో దాదాపు అంతే పరిమాణంలో ఉంటుంది. పుట్టిన పసిబిడ్డ పిడికిలి మూసుకునే ఉంటుంది. ఏదైనా పట్టుకోవడానికే ఈ ప్రపంచంలోకి వచ్చానని దాని సంకేతం. ఆ పిడికిలి తెరిచి మంచినే పట్టుకోవడమన్నది తల్లిదండ్రులిచ్చే శిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాగే గుండె తలుపులు తెరుచుకుంటేనే జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. గుణాలు అంటే సద్గుణాలనే అర్ధం. గుండె వీటినే ఆహ్వానించాలి. అవగుణాలంటే దోషాలు. ఆ దోషాలను విసర్జించాలి.

🌹మనిషి సద్గుణాలని తెలిసినా జీవితంలోకి తేలిగ్గా వాటిని ఆహ్వానించలేడు. నీరు పల్లంవైపే ప్రవహించినట్లు మనసు చెడు వైపే లాగుతుంటుంది.

🌹 మనిషిని సప్త వ్యసనాల్లో ఏదో ఒకటి ప్రలోభపెడుతుంది. పరస్త్రీ వ్యామోహం, జూదం, వేట, మద్యపానం, వదరుబోతుతనం, నేరాన్ని మించి శిక్షించడం, పూర్వీ కులు సంపాదించి ఇచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపర చడం- ఈ సప్త వ్యసనాల్లో ఏదో ఒకదానికి బానిసలై కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్లెందరో ఉన్నారు. రావణుడు, కీచకుడు, దక్షప్రజాపతి, దుర్వాసుడు, శిశుపాలుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, దుర్యో ధనుడు, బలి, కంసుడు... ఇలా ఎందరో ఏదో ఒక దుర్లక్షణానికి దాసులై అనేక కష్టనష్టాలకు బలైపోయినవారే!

🌹మనిషి మూడు ‘దకారాలను ఎప్పుడూ
గుర్తుచేసుకుంటే చాలు- దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి. ధర్మసాధన చేయాలంటే శారీరక స్వస్థత ముఖ్యం. దేహం ఆత్మకు గేహం(ఇల్లు). పరమాత్మలో కలిసిపోయేందుకు తపించేది ఆత్మ. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఏదైనా పుణ్యకార్యం చేయగలిగేది. తరవాత దేశభక్తి. సమాజహితం, పరోపకారం, లోకకల్యాణం, మానవతా దృక్పథం, పారమార్థిక చింతన- ఇవన్నీ దేశభక్తికి సంబంధించినవి. మూడోది దైవభక్తి. చిత్తశుద్ధి ఏకాగ్రత, శ్రద్ధ, అపేక్షారాహిత్యం- ఇవి భక్తికి ఉండవలసిన లక్షణాలు. 

🌹ఆరొంతులు మానవ ప్రయత్నం జరగాలి. ఏడోవంతే దైవభక్తి.

🌹 ఈ కలియుగంలో 'నామస్మరణ'ను మించిన ఆధ్యాత్మిక యాగం లేదు. అది కూడా చేయలేని దౌర్భాగ్యస్థితికి మనిషి దిగజారకూడదు. పాపభీతి లేని ప్రవర్తన దుర్మార్గానికి తెరతీస్తుంది. 

🌹సద్ధంథ పఠనం, సత్సాంగత్యం, ప్రవచన శ్రవణం, మంచి స్నేహం, ధర్మబద్ధమైన సంపాదన- ఈ సులక్షణాల వల్ల లోకంలో దుర్మార్గాల సంఖ్య తగ్గుతుంది.
🌹 'పరులను పీడించడం మహాపాపం, పరోపకారంపుణ్యప్రదమైనది' అని మహాభారతం చెబుతోంది.

🌹 క్షీరనీరాలను వేరు చేయగల హంస నుంచి పాఠం నేర్చుకుంటే- మనిషి ఆదర్శవంతమైన జీవితం గడపగలుగుతాడు. 
🌹ధర్మం నిర్వచనం గ్రహించగలిగితే గుణదోషాలు సులభంగా అవగతమవుతాయి.🙏

- ✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శరణాగతి అంటే.. ?

 💖💖💖
       💖💖 *"505"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"శరణాగతి అంటే.. ?"*

*"దైవనిర్ణయాన్ని, గురూపదేశాన్ని త్రికర్ణశుద్ధిగా శిరసావహించటం 'శరణాగతి'. మనవైపు నుండి రెండో ఆలోచన లేకపోవటం. ప్రతిప్రాణిపైనా దైవానుగ్రహం, ప్రతి సాధకుడికి గురువు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. మనలో శరణాగతి పెరిగేకొద్దీ ఇది అర్ధం అవుతుంది. గురువునైనా, దైవాన్నైనా వారి విశ్వవ్యాపకత్వాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా నడుచుకోవటమే నిజమైన శరణాగతి అవుతుంది. అంటే కేవలం వారిని నమ్మి ఊరుకోవటం కాదు. వారి బోధనలను అక్షరాలా పాటించటం. సర్వకాలసర్వావస్థల్లోనూ ఆ మార్గాన్ని అనుసరించటమే అసలైన శరణాగతి ! అలాంటి శరణాగతే ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని, ప్రతి సాధకునికి మోక్షాన్ని ఇస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

సహాయపడే హృదయం

 *సహాయపడే హృదయం*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

✳️ మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది• తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది• తన ఉనికి తనకు స్పష్టంగా తెలుస్తుంది•♪

✳️ నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని 'నేను' ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది.

🪷 'నేేను' అనేది శిఖరంలా, 'నాది' అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు. అది అతడి మనసు చేసే మాయాజాలం.

✳️ ఎక్కడా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తనకు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కోసారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ.

🪷 నిజానికి మనిషి ఎందరిమీదో ఆధారపడి బతుకుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం సాగదు.

✳️ *తల్లిగర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడుతుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు అంటారు.*

🪷 పుట్టి భూమ్మీద పడిన శిశువు గాలితో, నీటితో, పాలతో, తల్లి ప్రేమతో బతుకుతాడు. పెరుగుతున్నకొద్దీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో సహాయాల మూలాన మనిషి శరీరాన్ని నిలబెట్టుకుని ఒక వ్యక్తిత్వం సంపాదించుకుంటాడు.

✳️ అన్ని వనరులున్నా, అందరూ ఉన్నా- మనిషి మీద మనిషి ఆధారపడి బతకాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా మానవ జీవనం ముందుకు సాగదు.

🪷 గొప్ప మనుషులు, మహానుభావులు- లోకం తమకు చేసిన సహాయం వల్లనే ఇంతటి స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు.

✳️ శ్రీకృష్ణుడి సహాయం లేకుండా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యగలిగేవారా?

🪷 శ్రీరాముణ్ని కలిసిన హనుమ చేసిన సహాయం సీతమ్మను చూపించడానికే కదా. దివ్య సహాయాలు దైవ కార్యాల్లో ఎన్నో ఉన్నాయి.

✳️ యోగికి యోగంలో సహాయం కావాలి. జ్ఞానికి జ్ఞానంలో సహాయం అవసరం. భక్తుడికి నిరంతరం భగవంతుడి సహాయం తప్పనిసరి.

🪷 సహాయం ఒక దివ్యమైన, శక్తిమంతమైన ఆపన్న హస్తం. ఆ చెయ్యి వెనక ఉండి నడిపించకపోతే మహాకార్యాలెన్నో ఆగిపోతాయి.

✳️ అవసరమైనప్పుడు సహాయాన్ని కోరాలి. సహాయం కోసం పోరాడాలి. సహాయం కోసం ప్రార్థించాలి. సహాయం కోసం శరణాగతి చెందాలి.

🪷 మనుషులు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ ప్రేమతో సహాయం చెయ్యాలి.

✳️ మనకు మనం అవసరాలకు, ఆపదలకు ఆదుకుంటున్న తీరు చూసినప్పుడు ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగల దేవుడు అని నిరూపించుకుంటాడు.

🪷 మన కోసం మనం బతుకుతూ ఇతరుల కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే మనిషి. సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే మనిషిదే గొప్ప హృదయం.

✳️ యోగక్షేమాలు చూసేవాడు భగవంతుడు. మనుషుల ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆయన. అది ఆయన ప్రణాళిక. తనకు కావలసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొలగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం.

🪷✅ *సహాయం పొందాలంటే, సహాయం చెయ్యాలి. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయమే ఇప్పుడు మనల్ని సుఖంగా ఉంచుతోంది*


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు

*సేకరణ:* 

కర్మసిద్ధాంతం- 16

 కర్మసిద్ధాంతం- 16
సంస్కారాల మీద సంయమం

సంస్కారాన్ని నిద్రావ్స్థలో ఉన్న శక్తి అని కూడా అంటారు. ఎప్పుడైతే వృత్తులు లేదా ఆలోచనలన్నీ సమసిపోతాయి, అప్పుడు మనస్సు అనే రూపం సంస్కారాలతో కలిసి ఉంటుంది. దీన్నే వేదాంత పరిభాషలో 'అంతఃకరణ మాత్రము' అంటారు.

అన్ని సంస్కారాలు మనసులో కలిసే ఉంటాయి. వృత్తులు క్రమంగా అణిగి, వాటి యొక్క జాడలలను మనసులో నిలిపుతాయి. ఈ జాడలే సంస్కారాలు. ఈ సంస్కారాల నుంచే జ్ఞాపకాలని పుడతాయి. మీకు యోగదృష్టి ఉంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిలో ఈ వృత్తులు మనసు అనే సరస్సు నుంచి ఎలా పైకి లేస్తున్నాయి, అవి తిరిగి ఎలా కిందకి అణిగిపోతున్నాయి, సంస్కారం ఎలా ఏర్పడుతోంది అనేది మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. అది మీరు చూసి ఆశ్చర్యచకితులవుతారు. సంస్కారాల మీద సమ్యమము అనేది నిద్రాణమై ఉన్న శక్తుల గురిన్చి ప్రత్యక్ష జ్ఞానం కలిగిస్తుంది. అతని సంస్కారాల యొక్క ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఒక యోగి తన గత జన్మ గురించి తెలుసుకుంటాడు. అలాంటి జ్ఞానాన్ని పంచడం ఏ విశ్వవిద్యాలయాలకు కూడా సాధ్యం కాదు. యోగి మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని అర్హత కలిగిన శిష్యులకు ఇవ్వగలడు.

మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు
ఏ విధంగానైతే చెడు సంస్కారాలు ఉంటాయో అలాగే మంచి సంస్కారాలూ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతూ కనిపిస్తే, మీ హృదయంలో దయ అనేది ఉద్భవిస్తుంది. గత జన్మలో మీరు చేసిన దయతో చేసిన ప్రతి పని సంస్కారంగా మారి ఉంటుది. అవన్నీ మనస్సులో పైకి వచ్చి, ఆ శక్తి ద్వారా మీరు అతనికి సేవ చేస్తారు, సాయం చేస్తారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నా లేదా అలమటిస్తునా, ఇంతకముందు మీరు సేవా దృక్పథంతో చేసిన ప్రతి కర్మ నీ మనస్సు యొక్క చేతనలోకి ప్రవేశించి మీరు అతనికి సహాయం చేసేలా చేస్తుంది, తద్వారా మీరు సాయం చేస్తారు. ఒక మంచి సంస్కారం లేదా పుణ్య కర్మ మీరు చేస్తున్నప్పుడు, దానికి తద్విరుద్ధమైన వేరొక కూడా చెడు సంస్కారం కూడా బయలుదేరుతుంది. అది కూడా దాని పని చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు మీ మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయాలని అనుకున్నప్పుడు, అంతఃశుద్ధి గురించి ఆలోచించినప్పుడు, ఆ క్షణంలోనే చెడు ఆలోచనలు, సంస్కారాలన్నీ ఒక్క ఉదుటన మీ మీదకు దాడి చేస్తాయి. మంచి సంస్కారాలు కూడా ఏకమై చెడు సంస్కారాలను పారద్రోలేందుకు మీకు సహాయ పడతాయి. స్వామి అద్వైతానందజీ వారి తండ్రి చండీమాతకు గొప్ప భక్తుడు. ఆయన అంతిమ సమయంలో సుప్తచేతనావస్థలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన బాల్యంలో నేర్చుకున్న చండి స్తోత్రాలు మనస్సులోకి ప్రవేశించాయి. వేంటనే వాటిని చదవడం మొదలు పెట్టారు. ఇది సత్సంకారాలు ఏకమై సరైన సమయంలో బయటకు రావడానికి నిదర్శనం.

మీరు జన్మించినప్పుడు మీ మనస్సు అనేది పూలబాట లాంటిది కాదు. అందులో ఎన్నో సంస్కారాలు, ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు మొదలైనవి ఉన్నాయి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అతని గత జన్మ అనుభవాలన్నీ మానసికమైన సంస్కారాలుగా, ఆలోచనలుగా, మానసిక శక్తిగా రూపాంతరం చెంది ఉంటాయి. అనుభవాల ద్వారా మనిషి వాటిని గ్రహిస్తాడు. భౌతిక ప్రపంచంలో కలిగే అనుభవాలను అతని బుద్ధి లోకి నిక్షిప్తమైపోయాయి. ఇంద్రియాల ద్వారా ఈ విశ్వం నుంచి తీసుకున్న సంస్కారాల ద్వారా మనసు ఏర్పడుతుంది. ఈ ప్రపంచం యొక్క సంపూర్ణమైన అనుభూతి పొందేవరకు, అది ఎన్నో శరీరాలను తీసుకుంటుంది. అంటే ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించే వరకు/ తెలుసుకునేవరకు, దాని గురించి జ్ఞానం పొందేవరకు, మనస్సు ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని సంస్కారాలు సహజసిద్ధంగా ఉంటాయి, అనగా పుట్టుకతో వస్తాయి. ఇవన్నీ అతని చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. చిత్తమే ప్రారబ్దానికి కేంద్ర స్థానము. భౌతిక ప్రపంచంలో అతను మరిన్నో సంస్కారాలను లేదా అనుభవాలను తన కర్మల ద్వారా పోగు చేసుకుంటాడు. ఇవి ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలకు తోడై భవిష్యత్తులో తనకు సంచిత కర్మలుగా మారుతాయి.ఇంకా ఉంది...

కర్మసిద్ధాంతం- 15

 కర్మసిద్ధాంతం- 15
స్వామి శివానంద గారి మాటల్లో;
అసలు సంస్కారం అంటే ఏమిటి?
మనోసముద్రంలో వృత్తులు (ఆలోచనా తరంగాలు - సుడిగుండాలు) ఏర్పడతాయి. అవి కొంతసేపు ఉండి, తర్వాత సాధారణ చేతనా స్థాయి క్రిందకు వెళ్ళిపోతాయి. అవి అప్పటి వరకు ఉన్న చేతనావస్థ మనస్సు నుంచి, లోతుగా ఉండే ఉపచేతన మనస్సు (చిత్తం) లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి సూక్ష్మంగా, మహత్తరంగా పని చేస్తూ, సంస్కారంగా మారుతాయి. జాగురూక స్థితిలో చేసిన కర్మ - అది స్మృతిలో ఉన్నదైనా, ఉద్వేగపూరితమైనదైనా లేదా సంకల్పమైనా- చేతనావస్థకు క్రిందనే అది సూక్ష్మమైన, అవ్యక్తమైన రూపం తీసుకుంటుంది. దాన్నే సంస్కారం అంటాము.

స్మృతి - సంస్కారం తిరిగి వ్యక్తమవుట.
సంస్కారాలు ఉపచేతన మనస్సు లేదా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉపచేతన మనస్సునే అచేతనా మనస్సు అని పిలుస్తారు. ఈ చిత్తం ఉండేది చిన్నమెదడులో. చాలా సూక్ష్మ విషయంతో సహా అన్నీ ఇందులో రక్షించబడుతుంటాయి. కొద్దిగా కూడా ఎన్నటికీ నష్టపోవు. చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి పెద్ద తరంగంలా వచ్చే సూక్ష్మమైన సంస్కారాలు, లేదా జ్ఞాపకము వలన పురాతన వృత్తి చేతనామనస్సు ఉపరితలానికి వచ్చినప్పుడు, దాన్ని స్మృతి అంటారు. సంస్కారం లేకుండా స్మృతి/జ్ఞప్తి అసాధ్యం.

సంస్కారం ఎలా ఏర్పడుతుంది?
ఇంద్రియ భూమికలో కలిగిన అనుభవం చిత్తం యొక్క లోతుల్లోకి ప్రవేశించి సంస్కారంగా మారుతుంది. మనస్సు దేన్నైనా అనుభూతి చెందిన క్షణమే, ఆ అనుభూతి యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న అనుభూతికి, సుప్తచేతనలో ఏర్పడే సంస్కారానికి మధ్య సమయ బేధం ఉండదు. ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన సంస్కారాన్ని కల్పిస్తుంది. ఈ అనుభూతి యొక్క స్మృతి/జ్ఞప్తి అనేది ఆ ప్రత్యేకమైన సంస్కారం నుంచే కలుగుతుంది.

మీరు మొదటి సారి బెల్లం రుచి చూసినప్పుడు, మీకు బెల్లం గురించి తెలుస్తుంది. దాని రుచి తెలుస్తుంది. అది బెల్లమనే వస్తువని తెలుస్తుంది. అప్పుడు సుప్తచేతన మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఏ సమయంలోనైనా, ఈ సంస్కారం ఆ వస్తువు యొక్క స్మృతిని, దాని గురించి అవగాహనను మీకు కలిగిస్తుంది. వస్తువు, దాని గురించి అవగాహన వేర్వేరు చేయచ్చు గానీ, ఆ రెండు విడదీయరానివి.

బాహ్యమైన స్పందనల ద్వారా ఏ వస్తువైనా మనస్సులొని సంస్కారాన్ని తట్టిలేపుతుంది. అందువలన సంకల్పం అనేది బయట నుంచి ఏ స్పందన లేకున్నా లోపల నుంచి ఉద్భవిస్తుంది. మీరు ఇంతకముందు చూసిన ఆవు గురించి ఆలోచించినప్పుడు, మీరు మానసికంగా అవు అనే పదాన్ని స్మరిస్తారు. అప్పుడు దాని రూపం మనస్సులో ఏర్పడుతుంది. అప్పుడు ఆలోచన ఏర్పడుతుంది. ఎలాగైతే విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం వస్తుందో, అలానే సంస్కారం సంకల్పాన్ని కలిస్తుంది, సంకల్పం సంస్కారానికి కారణమవుతుంది. ఈ చక్రం బీజ-వృక్ష న్యాయమును తలపిస్తుంది. మనస్సులోని వృత్తి సంస్కారాన్ని కల్పిస్తే, ఆ సంస్కారం ఇంకో వృత్తికి కారకమవుతుంది. బాహ్యం లేదా లోపల నుంచి కలిగే స్పందనలు, ప్రేరణల వలన విత్తనాల వంటి సంస్కారాలు పెరిగి, అనేక కర్మలకు కారణమవుతాయి. వృత్తులు మరియు సంస్కారాల ఈ చక్రం అనాది, కానీ దివ్యజ్ఞానం పొందడంతోనే ఇది అంతమవుతుంది. అప్పుడతి ప్రకృతిలో లయిస్తుంది. అవి జీవన్ముక్తుని మీద ఏ ప్రభావం చూపలేవు. నిరంతర సమాధి వలన సంస్కారాలు కాలిపోతాయి. అప్పుడు మాత్రమే జీవుడు జనన మరణాదుల నుంచి విముక్తుడవుతాడు. ఇంకా ఉంది ...

కర్మసిద్ధాంతం- 14

 కర్మసిద్ధాంతం- 14
మాయ చేత తాను కర్తననే భావమే జీవుడిని, ఈశ్వరుడి నుంచి వేరు చేస్తోంది. ఆ భావనే అహం. అహం నశిస్తే, సర్వం నశిస్తుంది, అప్పుడు మిగిలేది తానే అంటారు రమణులు.
జ్ఞానం అంటే మరేదో కాదు, అహం నాశనం అని కూడా అంటారు. జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో, ఆ క్షణం నుంచి అతనికి కర్తృత్వం ఏర్పడుతుంది. అప్పుడు అతనికి కర్మ అంటుకుంటుంది. కర్మ ఏర్పడినప్పుడు, దానికి కర్మఫలం కూడా ఉంటుంది. అది జీవుడు అనుభవించవలసి వస్తుంది. అది పుణ్యకర్మ అయినా సరే, పాప కర్మ అయినా సరే. అందుకే పాపం జీవుడిని బంధించడానికి ఇనుపసంకెళ్ళు అయితే, పుణ్యం బంగారు సంకెళ్ళు అంటారు జ్ఞానులు. ఏదైనా బంధిస్తుంది.

నిజానికి అంతా మనమే చేస్తున్నామనే భావనకు కారణం అన్నిటికి తానే కారణం అనుకోవడం, ఇది మాయ నుంచి వస్తుందని చెప్పుకున్నాము కదా. దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉపమానం చెబుతారు. రాత్రి ఒళ్ళు మరిచి నిద్రపోతాడు. అప్పుడు నేను అనే భావన ఉండదు. అసలు మనస్సులో ఏ ఆలోచన కలుగదు. నేను ఉన్నాను అన్న భావన కూడా ఉండదు. ఆ భావన లేనప్పటికి తాను లేడని అర్ధం కాదు. రాత్రి నిద్రలో మనస్సు హృదయంలో లయించి ఉంటుంది. ఉదయం లేస్తూనే, మనస్సు లేస్తుంది. మెల్లిగా అన్నీ గుర్తుకు వస్తాయి. నేను అన్న భావన కూడా పుడుతుంది. ఇలా పుట్టే నేను అన్న భావన మనస్సుకు చెందినది. అది నిద్రలో లేదు. ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా. అనగా ఉదయం లేచింది, మనస్సు, అహంకారము. జ్ఞానోదయం అయినప్పుడు ఈ మనస్సు, అహంకారాలు రెండు ఉండవు. ఉన్నా, అవి హృదయం యొక్క ఆధీనంలో ఉంటాయి. కనుక అప్పుడు జీవునకు కర్మలు అంటవు.

జీవుడు చేసే కర్మలు కేవలం భౌతికమైన దేహానికే పరిమితం కావు. భౌతిక దేహంతో చేసిన కర్మలు, జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు, వినే మాటలు, చూసే విషయాలు, తిరిగే వాతావరణం సూక్ష్మదేహం మీద అనగా మనస్సు మీద చెరగని ముద్రలు వేస్తాయి. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా, ఆ ప్రదేశం తనకు ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు, వారు ఎప్పటి నుంచో తెలిసినవారనిపిస్తుంది, లేదా బాగా దగ్గరివారని తోస్తుంది. మనస్సులో ఒక అలజడి లాంటిది కలుగుతుంది. దాన్నే వేదాంతశాస్త్రంలో 'వాసన' అంటారు. అనగా పూర్వజన్మ జ్ఞాపకం. చేతిలో కాసేపు కర్పూరం పట్టుకుంటే, చేయి అంతా కర్పూరం వాసనే వస్తుంది, అలానే మనస్సు దేన్ని పట్టుకుంటే, దానికి ఆ వాసన అలవడుతుంది. అది అంత తొందరగా వదలదు.

ఒకే పనిని పదే పదే చేస్తే, అది 'సంస్కారం'గా ఏర్పడిపోతుంది. అది తర్వాత జన్మలో కూడా ఆ జీవునిపై ప్రభావితమవుతుంది. మనకు గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు, చెడ్డ అలవాట్లు/ దుసంస్కారాలు మనస్సులో వాసనలుగా నిక్షిప్తమవుతాయి. మరణం స్థూల (భౌతిక) దేహానికి కానీ సూక్ష్మ, కారణ శరీరాలకు, ఆత్మకు కాదు. కనుక మరణించిన తర్వాత, ఒక జీవుడు తాను ఆ జన్మలో చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు, కోరికలు, అతడిని వాసనల రూపంలో వెంటాడుతాయి. మరణం తర్వాత దేహం నుంచి ఆత్మ విడువడగానే, ఆ ఆత్మను పట్టుకుని, సూక్ష్మ, కారణ దేహాలు, వాటిల్లో ఉండే వాసనలు తదుపరి ఉపాధిని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాయి. ఉపాధి అంటే శరీరం. ఇంకా ఉంది....

కర్మసిద్ధాంతం- 13

 కర్మసిద్ధాంతం- 13
ప్రకృతి త్రిగుణాత్మకం. జీవుడు భగవంతుని అంశ. కనుక అతడు త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడైన జీవుడు, తానే మనస్సు అనుకుని, త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడుతున్నాడు. ఆ కారణంగానే తాను దైవాంశ అనే విషయాన్ని తెలుసుకొనలేకపోతున్నాడు. ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి సంబంధించి, ఒకానొక సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారు ఇలా చెప్పారు (దీనిని వి.వి.యస్. శర్మగారు భద్రపరిచి మనకు అందించారు) - ఒక సమయంలో ఒక శిష్యుడు గురువుగారితో మాట్లాడుతూ "నేను సాధన వలన మీస్థితికికి చేరగల వరాన్ని ప్రసాదించండి." అని కోరాడు. అప్పుడు గురువుగారు "ఈ జన్మలో పరిణామం పొందిన జీవులు, ఊర్ధ్వలోకములనుండి అవతరించిన జీవుల స్థితికి చేరవు" అని చెప్పారు. ఈ సంభాషణలో ప్రప్రథమంగా అక్కడ ఉన్న వారికి ఆయన ప్రస్తుత స్థితి తెలిసింది. అలా చెప్పగల ఈయన ఎవరు? ఆయన ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? ఆయన అవతరణ వెనుక కారణ మేమిటి? ప్రథమమున అవతరించిన వారికి ఈయనకు సంబంధమేమిటి? సృష్టి ఆదినుండి ఆయన ప్రయాణమేమిటి? ఈ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెబుతూ వచ్చారు.
సృష్టి ప్రారంభం
ఆరంభం అంటే శూన్య స్థితి. ఏదీ లేదు, ఎవరూ లేరు అనుకోవచ్చు. ఆస్థితిలో ఎవరో ఒక్కరికి తానొక్కరే ఉన్నాననే భావన కలిగినది. ఆయన స్థితి అవధులు లేని ఆనందం ఆయనకు ఈయబడిన నామం సదాశివుడు. సృష్టికి మూలం. సృష్టి అంటే ఒకరికి మరొకరు. ఒకటి అయిన సదాశివం రెండు అయినది. తనే అయిన పరమ శివుడు, తన శక్తి పరాశక్తి. తన శక్తియే తన ప్రకృతి. ఆ సమయంలో తన నుండి కోట్లాది తేజోరేణువులు వెలికి వచ్చాయి. ప్రతి రేణువు పరమ శివుని ప్రతిరూపమే. క్రమముగా ప్రతి రేణువుకు, రేణువుకు, ప్రకృతికి పరస్పర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాల ఫలితంగా ప్రత్యణువు తాను ప్రత్యేకమనే భావనలోనికి వచ్చి పరమ శివునితో సంబంధమును కూడా విస్మరించినది. అప్పుడు ఈ రేణువులు జీవులు అనబడినవి. మూలాన్ని విస్మరించడమే వానిలో వ్యాపించిన అవిద్య, అజ్ఞానం. దానితో శివుడు, జీవుడు అనే ద్వంద్వ ప్రవృత్తి ఏర్పడింది. జీవుల మధ్య పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ఏర్పడినవి. జీవుల మధ్య హానికరమైన సంస్కారాలు కల జీవులు ఉత్పన్నమైనారు. పరాశక్తికి వాటిని నిర్మూలింపవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఇది సృష్టి ఆరంభంలో జరిగినది. దీనితో జీవులకు పరిమితులు ఏర్పడినవి.
పరమశివుని అనుగ్రహము వలన జీవులకు తమ ఆరంభస్థితిని తిరిగిపొందే అవకాశ మీయబడినది.. దీనికై తిరిగి తిరిగి సృష్టిచేసే సంకల్పము పరమేశ్వరునికి కలిగింది. ఇది జీవుల పరిణామానికి ఏర్పడిన మార్గము. ఇదియే తమసోమా జ్యోతిర్గమయ (అవిద్యనుండి జ్ఞానానికి ప్రయాణము) అనే ప్రార్థన. ఈ సంకల్పమునకు స్థిరత్వమునిచ్చి సృష్టి స్థితి లయాల వ్యవస్థ చేయునది మహావిష్ణువు. ఆయన నాభికమలం నుండి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ప్రతి సృష్టిలోనూ జీవులకు భౌతిక శరీరాలు, భౌతిక జీవనానికి అవసరమైన సామగ్రి సృష్టిస్తాడు. జీవులు వేర్వేరు పరిణామ దశలలో ఉంటారు. సమయము ఆసన్నమైనప్పుడు బ్రహ్మ నుండి పుట్టిన రుద్రుడు తిరోధాన కార్యము చేబడతాడు. ఈ రుద్రుడు సృష్టిని సంకల్పించిన సదాశివుడే. లోకాలు, జీవులు యథాస్థితిలో విష్ణుగర్భంలోనికి తీసికొన బడి తరువాత ప్రతిసర్గ మొదలయేవరకు, నూతన బ్రహ్మకల్పారంభము వరకు, ఆస్థితిలోనే నిలిచి ఉంటారు. ఇది మహావిష్ణువు యోగనిద్రా సమయము.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్ ||
ఈ సృష్టి విజ్ఞానం శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్న మనకు ఎలా తెలిసింది? అనంత కాల చక్రంలో ఈ ప్రతి సృష్టి కార్యక్రమం నేటివరకూ జరుగుతూనే ఉన్నది. సదాశివ పరమశివులతోబాటుగా మరియొకరు ఈ సృష్టికి సాక్షిగా అనేక బ్రహ్మకల్పాలను చూస్తూ ఉన్నారని అర్థమౌతున్నది. అర్హత గల కొన్ని ముముక్షువులైన జీవులకు, జిజ్ఞాసువులకు, సామాన్య మార్గమునకు మారుగా వేగముగా పరిణామము చెందే విధానమును బోధించుటకు ఆ సాక్షి సృష్టి చక్రములో ప్రవేశించాడు.. ఈ సనాతనుడైన ప్రత్యక్ష సాక్షియే మూర్తీభవించిన గురుతత్త్వము." ఆ గురుస్వరూపమే దక్షిణామూర్తి, హయగ్రీవుడు. ఇంకా ఉంది ..

కర్మసిద్ధాంతం- 12

 


కర్మసిద్ధాంతం- 12
మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు.
ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ ముడు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.

ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాసం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.

3 గుణాలు ఇవి.
సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.

రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెల్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.

తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.

పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.

ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.

విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు. ఇంకా ఉంది .!

కర్మసిద్ధాంతం- 11

 కర్మసిద్ధాంతం- 11
సూక్ష్మ శరీరంలో ఇంకో రెండు కరణాలు (instruments) కూడా ఉన్నాయి. అందులో ఒకటి మనస్సు, రెండవది బుద్ధి. వీటిని అంతఃకరణాలు అంటారు. ఇవి లోపల కనిపించకుండా ఉంటూ, జీవుడు ఆలోచించనకు, సంకల్ప, వికల్పాలకు కారణమవుతాయి.
నిజానికి జీవుడు విషయప్రపంచంలో చరించడానికి వీటిని వాడుకుంటాడు. మనస్సు, బుద్ధి అనేవి రెండూ ఒకటే ఉపకరణం, కానీ అవి చేసే పనిని బట్టి విభజించారు. సందేహం, అనుమానం, అస్థిరత, చాంచల్యం అనేవి కలిగినది మనస్సు, అందుకే దాన్ని 'సంకల్ప-వికల్పాత్మకం మనః' అన్నారు శంకరులు.

అదే ఉపకరణం అస్థిరతకు లోనుకాకుండా నిశ్చితంగా ఉంటే, అదే బుద్ధి. 'నిశ్చయాత్మకా బుద్ధిః' అన్నారు ఆదిశంకరులు. అంటే ఒక పని చేయమని నిశ్చయంగా చెప్పే శక్తి బుద్ధికి ఉంది.

మనస్సుకు అధిదేవత చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ. ఇవే కాకుండా అహంకారం, చిత్తం అని కూడా రెండు ఉన్నాయి. అవి కూడా అంతఃకరణం యొక్క భాగాలు.

అహంకారం - తానే కర్త అనే భావన, నేను, నాది అనే భావన కలిగించేది అహంకారం. అహంకారానికి అధిష్ఠాన దేవత రుద్రుడు.

చిత్తం - గత జన్మల్లో ఏర్పడిన అనుభవాలు, కోట్ల వృత్తులు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని ఇంద్రియాలను చంలిపజేస్తుంది. మహావిష్ణువు దీని అధిష్ఠాన దేవత.

ఈ నాలుగింటికి పంచభూతాలకు సంబంధం ఉంది. అంతఃకరణం అనేది ఆకాశతత్త్వం. ఇందులో ఉన్న మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్నితత్త్వం, చిత్తము అగ్ని తత్త్వము, అహంకారం పృధ్వీతత్త్వానికి చెందినది.

ఇక్కడకి వరకు పఞ్చజ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాలు, పఞ్చప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి, అహంకార, చిత్తాల గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ సూక్ష్మ శరీరానికి చెందినవి.

జీవునకు ఉన్న మూడవ శరీరం కారణ శరీరం.

తత్త్వబోధలో శంకరులు ఇలా అంటారు.
ఏది కారణ శరీరం?
అనిర్వచనీయమైనది, అనాది (ఆది లేనిది), అవిద్యా (అజ్ఞానం) రూపంగా ఉన్నది; స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణమైనది; అజ్ఞానమే తన స్వతస్వరూపంగా కలిగినది; నిర్వికల్ప రూపం కలిగినది కారణ శరీరం.

మిగితా రెండు శరీరాలు కార్యం అయితే ఇది వాటికి కారణం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. విత్తనం కారణమైతే, చెట్టు కార్యము. విత్తనం అవ్యక్త/నిద్రాణ రూపమైతే, కార్యం వ్యక్తరూపం. కాబట్టి కారణం మరియు కార్యం రెండూ ఒకటే అయినా వాటి పరిస్థితులు వేరు. ఆలాగే కారణ శరీరమే స్థూల, సూక్ష్మ శరీరం, కాని నిద్రాణంగా ఉన్న రూపం. అయితే ఏది నిద్రాణంగా ఉన్నది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక విత్తనంలో, ఎన్నో రకాల కొమ్మలుం ఆకులు మొదలైనవి వేర్వేరుగా ఉండవు, మరియు ఇంద్రియాలకు కనిపించదు. ఎందుకంటే ఒక మామిడి విత్తనం నుంచి మామిడి చెట్టు మాత్రమే వచ్చినట్లు, నిమ్మ చెట్టు రానట్లు, బేధాలు కనిపించకున్నా, అవి ఉంటాయని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారణంలో కార్యం ఉంటుంది. కార్యంలో బేధాలు గమనించగలము కనుక దాన్ని సవికల్పం అంటారు మరియు కారణంలో, బేధాలు అనేవి ఇంద్రియాలకు అగోచరం కనుక, దాన్ని నిర్వికల్పం అన్నారు. కనుక కారణ శరీరం అనేది నిర్వికల్పం రూపం. గాఢ నిద్రను కారణశరీరానికి చెందినదిగా చెప్తారు, ఎందుకంటే ఆ స్థితిలో స్థూల, సూక్ష్మ శరీరాల ద్వార ఏర్పడిన బేధభావాలు జీవునకు తెలియవు. కారణ శరీరం గురించి చెబుతున్నప్పుడు, అజ్ఞానం అంటే మిథ్యా అని అర్ధం చేసుకోవాలి. ఆత్మ ఒక్కటే సత్యము. మిగితాది మిథ్య అంటుంది వేదాంతము. మిథ్యా వస్తువును గురించి చెప్పడం అసాధ్యం కనుక కారణ శరీరాన్ని అనిర్వాచ్యం అన్నారు. దాని ఆదిని (ప్రారంభాన్ని) అర్ధం చేసుకోలేరు కనుక అనాది అన్నారు కానీ అది ఆది నుంచి ఉన్నదని కాదు. కాలం అనే భావన సూక్ష్మ శరీరంలో భాగమైన బుద్ధి నుంచి తెలుసుకునేది. అదే కారణ శరీరం స్థాయిలో కాలం అనే భావన పనిచేయదు, ఎందుకంటే అక్కడ బుద్ధి నిద్రాణమై ఉంటుంది. బుద్ధి నిద్రాణంగా ఉండటమంటే, అది అజ్ఞానం అని అర్ధం. ఇది కారణ శరీరం. ఇక్కడితో శరీరత్రయం గురించి వివరణ ముగిసింది.
ఇంకా ఉంది ..

కర్మసిద్ధాంతం - 09

 కర్మసిద్ధాంతం - 09
శ్రోత్రే త్వక్ చక్షుః రసనా ఘ్రాణం ఇతి పఞ్చ జ్ఞానేంద్రియాణి
శ్రోత్రే - చెవులు 
త్వక్ - చర్మం 
చక్షుః - కళ్ళు 
రసనా - నాలుక 
ఘ్రాణం - ముక్కు 

ఏ వ్యక్తికైనా వినికిడి, రుచి మొదలైన సమర్థతలు/ సామర్ధ్యాలు పరిమితంగానే ఉంటాయి. అది గుణంలోనైనా, పరిమాణంలోనైనా. ఒకనికి పరిమితమైన శక్తి ఉన్నదంటే, అప్పుడు అతడు అపరిమితమైన శక్తి యొక్క అంశ అని, అపరిమితమైన శక్తి ఒకటుందని అతడు భావించవచ్చు.
కాబట్టి ప్రతి సామర్ధ్యానికి, దానికి సంబంధించిన సంపూర్ణ శక్తి ఉంది. శక్తిని శాసించువాడు ఉంటే తప్పించి దానికి స్వతంత్రమైన వృత్తి ఉండదు. ఉదాహరణకు, దృష్టి( చూచే) శక్తి అనేది జీవుడి ఆధీనంలో ఉంటుంది. అతడు చూడాలనుకుంటేనే చూడగలడు. అలాగే సంపూర్ణశక్తికి, మన గ్రంథాలు, వాటిని నిర్వహించే నిర్వాహకులను వివరించాయి. వారిని అధిష్ఠానదేవతలు అంటారు. ఈ అధిష్ఠానదేవతలందరిని కలిపి, వారి సంపూర్ణ శక్తిని శాసించే అధికారి వెరొకడు ఉన్నాడు. అతడిని పరమేశ్వరుడని, ఈశ్వరుడని అంటారు. ఇదంతా ఆదిశంకరులు తత్వబోధలో వివరించారు.
శ్రోత్రస్య దిగ్దేవతా | త్వచే వాయుః |
చక్షుషాః సూర్యః | రసనాయ వరుణః |
ఘ్రాణస్య అశ్వినౌ | ఇతి జ్ఞానేంద్రియ దేవతాః |
శ్రోత్రస్య దిగ్దేవతా - చెవికి (వినికిడి శక్తికి) అధిష్ఠానదేవతలు దిగ్దేవతలు
త్వచే వాయుః - చర్మానికి వాయువు
చక్షుషాః సూర్యః - కన్నులకు (చూపుకు) సూర్యుడు
రసనాయ వరుణః - నాలుకకు (రుచికి) వరుణుడు ఘ్రాణస్య అశ్వినౌ - ముక్కుకు (వాసనకు) అశ్విని దేవతలు
వాక్పాణిపాదపాయుపిపస్థాని పఞ్చకర్మేంద్రియాణి |
వాక్ - నోరు, పాణి - చేతులు, పాద -పాదాలు,పాయువు - విసర్జన అవయవాలు, పిపిస్థ - జననాంగాలు
అనేవి 5 కర్మేయంద్రియాలు.
ఈ 5 కర్మేంద్రియాలకు కూడా ఐదుగురు అధిష్ఠానదేవతలు ఉన్నారు.
వాచో దేవతా వహ్నిః - వాక్కునకు అగ్ని హస్తయోరింద్రహః - చేతులకు ఇంద్రుడు పాదయోర్విష్ణుః - పాదాలకు విష్ణువు పాయోర్మృత్యుః - పాయువునకు మృత్యువు
ఉపస్థస్య ప్రజాపతిః - జననాంగాలకు ప్రజాపతి

కర్మసిద్ధాంతం - 10

సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుంటూ గత భాగంలో పఞ్చ జ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పంచ ప్రాణాలు, అంతఃకరణం గురించి చెప్పుకుందాము. పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను పంచప్రాణాలు అంటారు. ఇవి ప్రాణమయ కోశంలో భాగం. ఈ 5 వాయువులు, వీటికి 5 ఉపవాయువులు ఉన్నాయి.
పంచ ప్రాణాలు - ప్రాణ వాయువు - ఊపిరి (ఉచ్ఛ్వాస, నిశ్వాస) ప్రక్రియలకు సంబంధించినది. మనం నిత్యం లోనికి తీసుకునే గాలి. మన ఆలోచనలు, భావావేశాలు, మనస్సు దీనితో గాఢంగా ముడిపడి ఉంటాయి.
అపానం - బొడ్డు నుంచి అరికాళ్ళ వరకు ప్రభావితం చేసే వాయువు. ఇది విసర్జన ప్రక్రియలను, కామోద్రేకాలను నియంత్రిస్తుంది. వ్యానం - శరీరమంతా వ్యాపిస్తూ, అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది. రక్త ప్రసరణ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. సమస్త శరిరాన్ని, ముఖ్యంగా నడులను ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలకు పని చేయుటకు అవసరమైన శక్తినిస్తుంది.
ఉదానం - తిరస్కరించడం, ఎగదన్నటం దీని పని. కన్నీళ్ళకు కారణమవుతుంది. ఇది కంఠంలో ఉంటూ, నోట్లో ఆహారాన్ని మిరింగటం అనే ప్రక్రియలో కీలకంగా వ్యావహరిస్తుంది. ఇది హృదయం నుంచి శిరస్సుకు, మెదడకు ప్రసరణ చేస్తుంది. మరణ సమయంలో ఉదాన వాయువు సహాయంతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడువడుతుంది.
సమానం - అరుగుదలకు (జీర్ణం చేసుకునేందుకు) కారకమవుతుంది. ఉదరంలో ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల్లో వాయుప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది. ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది.
ఉపవాయువులు -
1. నాగ - తేపులు (త్రేనుపులు), ఎక్కిళ్ళు, వాంతులను కలిగిస్తుంది. ప్రాణ, అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది. ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళే వాయువులను నియంత్రిస్తుంది.
2. కూర్మ - కంటి భాగంలో ఉంటూ, కంటి రెప్పలు తెరిచి, మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది.
3. కృకర - శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది. ఆకలి దప్పికలను కలిగిస్తుంది.
4. ధనంజయ - కండరాలు, ముఖ్యంగా హృదయ కవాటాల వ్యాకోచ సంకోచాలు నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి. మరణ సమయంలో శరీరాన్ని క్షీణింపజేసి, పంచభూతాల్లో కలిపేస్తుంది.
5. దేవదత్త - ఆవలింతలు కలిగిస్తుంది.
ఇవన్నీ శరీరంలో సక్ర్మంగా ఉన్నప్పుడే, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా, సదాలోచనలతో ఆనందంగా ఉంటాడు. ఈ వాయువుల(ప్రాణాలు) ప్రసారంలో ఏర్పడే ఇబ్బందులు అనేక ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. నిజానికి ఈ విజ్ఞానం మన రక్తంలో ఉంది. అందుకు ఉదాహరణ తెలంగాణ యాసలో స్పష్టంగా కంపిస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే, పానం (ప్రాణం) బాలేదు అంటారు. అంటే ఆయా శరీర భాగాలకు శక్తి ప్రసారం చేసే ప్రాణంలో అకస్మాత్తుగా దోషం ఏర్పడి, ప్రసారణ ఆగిపోయిందని, లేదా తక్కువగా ప్రసరణ చేస్తోందని చెబుతున్నారు. ఎంత అద్భుతం ఇది గమనిస్తే, మనం వాడే మాములు పదాల వెనుక సనాతన ధర్మానికి చెందిన సత్యాలు ఎన్నో ఉన్నాయి.

కర్మసిద్ధాంతం - 08

 కర్మసిద్ధాంతం - 08
జీవుడు కర్మలను మూడు శరీరాల ద్వారా చేస్తాడు. అవే
1. స్థూల శరీరం
2. సూక్ష్మ శరీరం
3. కారణ శరీరం
ఆత్మ వీటికి అతీతమైనది.

1. స్థూల శరీరం అంటే కంటికి కనిపించే ఈ భౌతిక దేహం. ఇది పృధ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల వలన ఏర్పడిన పాంచభౌతిక దేహం. ఇది కాలానికి లోబడి ఉంటుంది. ఒకనాడు మరణం పాలవుతుంది. అగ్నికి ఆహుతువ్వడమో, లేదా మట్టిలో కలిసిపోవడం జరిగి, పంచభూతాల్లో లయమవుతుంది. ఈ స్థూల శరీరం నిలబడటానికి ఆహరం అవసరం. ఇది అనేక రకాల వ్యాధులకు లోనవుతుంది. జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరిచి, అతడి పడాల్సిన వేదనను అతనికిచ్చే వాహకం ఈ స్థూల శరీరం.

గత జన్మల్లో జీవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచీకరణం జరిగి, అతడి కర్మఫలానికి తగిన విధంగా స్థూల శరీరం ఏర్పడుతుంది.

ఆదిశంకరులు తత్త్వబోధలో దీని గురించి ఈ విధంగా చెప్పారు. పంచభూతాల కారణంగా పాపపుణ్య కర్మఫలాల కారణంగా పంచీకరణం చెంది రూపుదిద్దుకుంటుంది స్థూలశరీరం. ఇది సుఖదుఃఖాలకు నివాసస్థానం. షడ్ (6) వికారాలకు లోబడి ఉంటుంది. అవే
అస్తి - తల్లి గర్భంలో అండరూపంలో ఉండటం.
జాయతే - పుట్టడం
వర్ధతే - పెరగుట
విపరిణమతే - మార్పు చెందుట
అపక్షీయతే - కృశించుట
వినశ్యతి - నశించుట

అంటే తల్లి గర్భంలో ఏర్పడటం (అస్తి), రూపం పొంది పుట్టడం (జాయతే), పెరిగి పెద్దవ్వడం (వర్ధతే), క్రమంగా రూపాంతరం చెందడం (శరీరంలో మార్పులు చెందడం), ఒక వయస్సు వచ్చాక ఎలా ఎదిగామో, అలా ఒక్కో ఇంద్రియం శక్తి క్షీనించడం, అనగా ముసలితనం రావడం (అపక్షీయతే), మరణించడం (వినశ్యతి). వికారం అంటే మార్పు. ఈ 6 మార్పులు లేదా వికారాలు అనేవి భౌతిక దేహం యొక్క లక్షణాలు.

2. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగశరీరం అని కూడా అంటారు.దీన్నే అంతఃకరణం అని కూడా అంటారు. ఇది కంటికి కనిపించకపోయినా, చేయాలసిన కర్మలను చేస్తుంది.

శంకరులు ఇలా అంటారు - ఇది పంచభూతాలతో పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడిన రూపం. సత్కర్మజన్యం అనగా ఇది సత్కర్మ వలన ఉద్భవిస్తుంది. సుఖదుఃఖాది భోగాలకు సాధనం. ఇందులో మొత్తం 17 తత్త్వాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ్యేంద్రియాలు, పంచ (5) ప్రాణాలు, మనస్సు మరియు బుద్ధి.

ఇవి సూక్ష్మంగా ఉన్నందువలన వీటిని ఇంద్రియాలు అంటారు. స్థూల దేహంలో ఉన్నవాటి ప్రతిరూపాలను గోలకాలు అంటారు. ఉదాహరణకు చెవితమ్మె స్థూలమైతే, వినికిడి శక్తి దాని సూక్ష్మరూపం). సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది, కాబట్టి ప్రతి జీవుడు ప్రత్యేకమైనవాడు. ఈ అన్నింటితో ఉండేది సూక్ష్మ శరీరం.

సూక్ష్మశరీరం అనేది పంచభూతాల పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడింది. కనుక వాటిని పంచ తన్మాత్రలు అంటారు.

ఈ సూక్ష్మశరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'సాధనం' (Instrument). స్థూలశరీరం అనేది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'ఆయతనం' (Locus) అంటే అందులో ఉండి, సూక్ష్మశరీరం ద్వారా అనుభవిస్తామన్నమాట. రకరకాల అనుభూతులు ఉంటాయి కనుక, వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల ఉపకరణాలు (సాధనాలు) కావాలి.
ఇంకా ఉంది..

కర్మసిద్ధాంతం - 07

 కర్మసిద్ధాంతం - 07
పుణ్యం సుఖం ఇస్తుందని, పాపం దుఃఖకారకమని పాపపుణ్యాల గురించి ప్రస్తావించుకున్నాం కదా. వ్యక్తికి మరణం సంభవించిన తర్వాత, అతడి ఖాతాలో జమ అయిన పాపపుణ్యాలను అనుసరించి అతడికి తదుపరి జన్మ ఉంటుంది.
పుణ్యం ఎక్కువగా చేసుకున్న జీవాత్మలు ఊర్ధ్వలోకాలకు అనగా స్వర్గం మొదలైన దేవతాలోకాలకు వెళ్ళి, దేవతాజన్మలు పొంది, అక్కడ సుఖాలు అనుభవిస్తారు. చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి బ్రహ్మ, ఇంద్ర, వరుణ, వాయు ఇత్యాది ఎన్నో పదవులు వస్తాయి. ఇంద్రుడు అంటాము కదా, ఇంద్ర అనేది పదవి. బాగా పుణ్యం చేసుకున్న జీవుడు ఇంద్రపదవిలో కూర్చుంటాడు. ఆ పదవి పొందిన ఎవరినైనా ఇంద్రుడనే అంటారు. అలా చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి, అతడికి దేవ, గంధర్వ, కింపురుష.... ఇలా చెప్పబడ్డ ఎన్నో రకాల ఊర్ధ్వలోక జీవులకు చెందిన ఒక పదవి అప్పజెప్పబడుతుంది. అక్కడ సుఖం అనుభవించిన తర్వాత, అనగా పుణ్యం క్షయం అవ్వగానే, ఇంకా కొంత పుణ్యం మిగిలి ఉండగానే అతడిని మరలా భూలోకానికి పంపిస్తారు. అదే భగవద్గీతలో 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి' అని శ్రీ కృష్ణపరమాత్మ వివరిస్తాడు. కొంత పుణ్యం అతని ఖాతాలో ఉంటుంది కనుక అతని సదాచార సంపన్నుల ఇంట, మానుష జన్మ పొందుతాడు.

మరణానంతరం జీవుని ఖాతాలో పాపం ఎక్కువగా ఉంటే, అతడు పశు, క్రిమి, కీటకాదులు, జంతువులు, పక్షులు, చెట్లు మొదలైన జన్మలు పొందుతాడు. మన ధర్మం ప్రకారం ఈ భూమి మీద మొత్తం 84 లక్షల 'రకాల' జీవరాశి ఉంది. అందులో మానవజన్మ తప్పించి, మిగితా వాటిలో అంటే, 83,99,999 రకాల జీవుల్లో ఏదో ఒక జన్మ పొంది, చేసిన పాపానికి తగిన శిక్షలు అనుభవిస్తాడు- బాధలు పడతాడు, హింసించబడతాడు, చీదరించబడతాడు.

పాపపుణ్యాలు సమానంగా ఉన్న జీవులు మాత్రమే మానుష జన్మ పొందుతారు. సమానం అంటే సరిగ్గా సమానమని కాదు, కాస్త అటుఇటుగా. అందులో కూడా అతడి పాపపుణ్యాలను అనుసరించి, ధనవంతుల ఇంట పుట్టడమా, లేక పేదవారి ఇంట పుట్టడమా అనేది ఉంటుంది. ఒక వైద్యశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు. అందులో కొందరు అత్యధిక సంపన్నులకు పుట్టి, పుట్టగానే భోగాల మధ్య పెరుగుతారు. కొందరు ఏమీలేని వారి ఇంట పుట్టి, చిన్నవయసు నుంచే పస్తులుంటారు. కొందరు డబ్బు లేనివారి ఇంట పుట్టినా, సదాచార సంపన్నుల ఇంట పుడతారు.

ఈ మూడు జన్మలకు మధ్య వ్యత్యాసం కూడా ఉంది. దేవతాదిలోకాలు భోగభూములు. అక్కడ కర్మ చేసే అధికారం లేదు. మనస్సు, బుద్ధి మొదలైన అంతఃకరణాలు ఉంటాయే గానీ, స్థూలశరీరం ఉండదు. కనుక కర్మ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి సంపాదించుకున్న పుణ్యం వ్యయం (ఖర్చు) చేయడానికి మాత్రమే ఆ జన్మ పనికివస్తుంది. జంతుజన్మలో మనస్సు ఉంటుంది, స్థూలశరీరం ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఉండదు. జంతువులు, పక్షులు, చెట్లు పని చేసినట్లు, స్పందించినట్లు కనిపిస్తాయి కాని అవి ప్రకృతి ప్రేరణతో పని చేస్తాయి. వాటికి స్వతంత్రేచ్ఛ ఉండదు (అంటే తమంతట తాము ఒకటి నిర్ణయించుకుని చేయడమన్నమాట). మానవజన్మలో జీవుడికి కావలసిన అన్ని సదుపాయాలను దైవం సమకూర్చారు. తాను తన భవిష్యత్తును, తదుపరి జన్మలను నిర్ణయించుకునే స్వేచ్ఛను అతనికి ప్రసాదించారు. అందుకే ఆదిశంకరాచార్యులు మొదలైనవారు 'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. మానవజన్మ పొందటం అత్యంత దుర్లభమైనది. దానికి దైవానుగ్రహం పుష్కలంగా ఉండాలి.

అయితే ఇక్కడొక విషయం గుర్తించుకోవాలి. జంతుజన్మలు తక్కువ అని చెప్పినంత మాత్రంచేత, కనిపించే ప్రతి జీవి పాపం కారణంగానే అలా పుట్టిందని, వాటికి జ్ఞానం లేదని నిర్ధారించకూడదు. ఒక మహాజ్ఞానిని, జీవన్ముక్తుడిని మనుష్యులకంటే ముందుగా గుర్తించేది ప్రకృతియే, పశుపక్ష్యాదులు, వృక్షాదులే. భగవాన్ రమణ మహర్షి, త్రైలింగ స్వామి, ఇంకా ఈ దేశంలో నడయాడిన ఎందరో మహానుభావుల చరిత్రలకు మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జంతువులుగా పుట్టిన ఏనుగు, సాలెపురుగు, పాము సైతం ఈశ్వరుడిని సేవించి, మోక్షం పొందిన క్షేత్రం శ్రీ కాళహస్తి. అనగా వాటిలో కూడా చైతన్యం మెండుగా ఉందని గుర్తించాలి. కానీ మనిషిగా పుట్టినవాడికి ఇది ఓ గొప్ప సువర్ణావకాశం అని చెప్పడమే గురువుల లక్ష్యం.

అలాగే ఋషులు మొదలైన తపస్సంపన్నులు సైతం కొన్ని సార్లు, లోకకల్యాణ నిమిత్తం, దైవాదేశానుసారం వృక్షాలుగా, పశుపక్ష్యాదులుగా జన్మలెత్తిన సందర్భాలు సనాతన ధర్మ వాజ్ఞమయంలో కోకొల్లలు. తిరుమల, అహోబిలం, శ్రీ శైలం, అరుణాచలం మొదలైన పవిత్ర క్షేత్రాల్లో, దేవతలు, ఋషులు రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పశుపక్ష్యాదుల రూపాలను స్వీకరించి, సంచరిస్తుంటారని, తపమాచరిస్తారని పురాణ వచనం.
To be continued ..

కర్మసిద్ధాంతం - 06

 కర్మసిద్ధాంతం - 06
నిత్య, నైమిత్తిక కర్మలను చేయడం వలన పుణ్యం, యశస్సు, ఆత్మబలం కలుగుతాయి, వాటిని విడిచిపెట్టడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మను చేయడం వలన పాపం కలుగుతుంది, దాన్ని విడిచిపెట్టడం వలన సద్గతి, ఆత్మబలం, తపశ్శక్తి పెరుగుతాయి.

చేసిన కర్మ మనకు ఇచ్చే ఫలితాన్ని అనుసరించి దాన్ని పాపకర్మ, లేదా పుణ్యకర్మ అంటాము. ఇతరులకు మేలు చేసేది; ఇతరులకు హానీ చేయకుండా తనకు మేలు చేసేవి అయిన కర్మలను సత్కర్మలుగా చెప్తారు. ఇతరులకు హానీ చేసే కర్మను పాపకర్మ అంటారు.

సులభంగా చెప్పాలంటే సుభాషితకారులు ఇలా అన్నారు.

అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం
పరోపకారం పుణ్యాయః పాపాయ పరపీడణం

అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి సారాన్ని ఈ విధంగా కీర్తించాడట. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడం పాపం అని. నిజానికి ఇతరులకే కాదు, తనకు హానీ చేసేది కూడా పాపమే.

ఎడ్ల బండి నడవడానికిబండి చక్రాలు ఎలాగో, అలాగే జీవ యాత్ర సాగాలంటే పాపపుణ్యాలు అలాంటివి. ఈ రోజు నీకున్న ఆరోగ్యం, ఆహారం, ఆహార్యం, సంతోషం, పదవి, హోదా మొదలైన అన్ని సుఖాలకు కారణం పుణ్యకర్మ లేదా పుణ్యఫలం. అలాగే నీవు అనుభవించే కష్టాలు, భయాలు, రోగాలు మొదలైన అన్ని రకాల దుఃఖాలకు కారణం పాపకర్మ లేదా పాప కర్మ యొక్క ఫలం. కర్మ సిద్ధాంతం ఇలా చెప్తుంది. నీవు చెడు చేస్తే, చెడును పొందుతావు; మంచి చేస్తే మంచి అనుభవిస్తావు; ఇతరులను అవమానిస్తే, అవమానించబడతావు; దూషిస్తే దూషించబడతావు; దోషాలు ఎంచితే, నీలోని దోషాలు ఎంచబడతాయి; ఆకలి తీరిస్తే, నీ ఆకలి తీర్చబడుతుంది; నీవు తిరస్కరిస్తే, తిరస్కరించబడతావు; ప్రేమిస్తే, ప్రేమించబడతావు; శంతిని పంచితే, శాంతిని పొందుతావు; అశాంతిని రగిలిస్తే, అశాంతితో కాలి బూడదవుతావు. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు (ఇతరులకు) ఏది ఇస్తావో, అదే నీకు తిరిగి లభిస్తుంది.

ఈ జన్మలో నీవు అనుభవించే సుఖాలకు కారణం నువ్వు గతంలో చేసిన పుణ్యమైతే, దుఃఖాలకు కారణం నీ గత జన్మ పాపం. అంటే జీవుడు, తాను చేసే కర్మ ద్వారా, పాపపుణ్యాలను మూటకట్టుకుని జన్మల పరంపరంలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ క్రమంలో మరణం తర్వాత పోగు చేసుకున్న సంపదలు గానీ, బంధువులు గానీ తన వెంట రారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన వారు అక్కడ కరెన్సీని ఇక్కడ నేరుగా ఉపయోగించలేరు. దాన్ని భారత కరెన్సీలోకి మార్పిడి చేసుకోవాలి. అప్పుడే వీలవుతుంది. అలానే పాపపుణ్యాలు. కూడబెట్టిన సంపదను దానం అనే ప్రక్రియ ద్వారా పుణ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడది జీవయాత్రలో జీవుడి వెంట ఉండి, అతడికి అవసరమైనప్పుడు, తగిన వసతిని సమకూర్చుతుంది. కాబట్టి తాను పోగు చేసుకున్న సంపదను పుణ్యంగా మార్చుకుంటాడు వివేకవంతుడు. అలా కాక, అన్నీ కట్టుకుపోతామనే భ్రమలో ఉండి, తాను తినక, ఇతరులకు పెట్టక, ఇతరుల నోటి దగ్గరి ముద్దను సైతం లాక్కునే వాడు అవివేకి, బుద్ధిహీనుడు.

అందుకే భగవాన్ రమణులు ఇలా అంటారు. "ఇతరులకు ఇచ్చిందేదో, అది మాత్రమే తనకు దక్కుతుంది. మిగితావన్నీ వెళ్ళిపోతాయి. ఈ రహస్యం తెలిసిన ఇతరులకు ఇవ్వకుండా ఎలా ఉండగలరు?"

అందుకే సనాతన ధర్మం దానం గురించి గొప్పగా చెప్తుంది. ఒక్కో దానానికి ఒక్కో ఫలం ఉంటుంది. ఉదాహరణకు కొందరికి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మసంతృప్తి ఉండదు. కొందరికి ఏమీ లేకున్నా, సంతృప్తిగా ఉంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంది? శాస్త్రం ఇలా చెప్తుంది. మామిడి పండును దానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది మామిడి పండు దానం వలన జీవుడు సంపాదించుకున్న పుణ్యఫలం. అది ఏ జన్మలో చేసినా, ఎప్పుడో ఒకప్పుడు, ఫలం లభిస్తుంది. అలా ప్రతి వస్తువు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మరింత విశేషం ఏమిటంటే ఇచ్చేవాడు అనగా దాత గొప్ప కాదు, దానం పుచ్చుకునేవాడు గొప్ప అంటుంది సనాతన హిందూ ధర్మం. అతడు దానం స్వీకరించి, పుణ్యఫలానికి నీకు పాత్రతను కలిగిస్తున్నాడు. కాబట్టి మన ధర్మంలో దానం తీసుకున్నవాడు దాతకు నమస్కరించడు, దాతయే దానం పుచ్చుకున్నవానికి నమస్కరిస్తాడు. తనకు అంతటి అమూల్యమైన భాగ్యాన్ని ఇచ్చినందుకు. అదేకాక దానం పుచ్చుకునేవాడిని శ్రీ మాహావిష్ణు స్వరూపంగా భావించమని శాస్త్రం చెబుతోంది. అతడికి పాదపూజ చేయమంటుంది.

ఇదే తైత్తరీయోపనిషత్తులో కనిపిస్తుంది.
శ్రద్ధయా దేయం | అశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భీయా దేయం | సంవిదా దేయం || 11.6

శ్రద్ధతో దానం ఇవ్వండి. ఉదాసీనతతో, అశ్రద్ధతో దానం ఇవ్వకండి. శక్తి మేరకు, సమృద్ధిగా దానం ఇవ్వండి. వినమ్రతతో, అణుకువ కలిగి దానం ఇవ్వండి. గౌరవపూర్వకంగా దానం ఇవ్వండి. సౌహార్దంతో దానం ఇవ్వండి.

కర్మసిద్ధాంతం - 05

 


కర్మసిద్ధాంతం - 05
శాస్త్రం మనకు కర్మల్ని రెండు రకాలుగా విభజించింది. ఒకటి విహిత కర్మ, రెండవది నిషిద్ధ కర్మ.

విహిత కర్మ అంటే ఆచరించించవలసిన కర్మ. 'సత్యంవద ధర్మంచర' అంటుంది తైత్తరీయోపనిషత్తు. సత్యమే మాట్లాడండి, ధర్మాన్ని పాటించండి. విధిగా పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టండి అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. ఇలా శాస్త్రం మనకు ఆచరించమని విధించిన కర్మలు విహిత కర్మలు.

నిషిద్ధ కర్మ అంటే చేయకూడని కర్మ. ఉదాహరణకు పరమశివుడు సూర్యభగవానుని స్తుతించిన సూర్యాష్టకంలో ఈ విధంగా ఉంది. ఆదివారం నాడు మద్యం తాగకూడదు, మాంసాహారం తినకూడదు. స్త్రీగమనం కూడదు అంటే శృంగారం కూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తైలాభ్యంగన స్నానం చేయరాదు అంటుంది, అంటే ఆదివారం నాడు పైవి చేయడం నిషిద్ధం. ఇలా ప్రత్యేక దినాల్లో కొన్ని నిషిద్ధమైతే, కొన్ని ఎల్లవేళలా నిషిద్ధం. ఎవరిని బాధించకూడదు, శారీరికంగా కానీ, మానసికంగా గానీ హింసించకూడదు. అలా హింసించడం నిషిద్ధ కర్మ.

మళ్ళీ విహిత కర్మలు మూడు రకాలు. అవి నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ.

నిత్యకర్మ అంటే నిత్యం ఆచరించవలసిన కర్మ - స్నానం, జపం, సంధ్యావందనం, దీపారాధన, దైవ ప్రార్థన మొదలైనవి. అంటే మన రోజూవారీ జీవితంలో అనునిత్యం ఆచరించాల్సిన కర్మలు.

నైమిత్తిక కర్మ - అంటే ప్రత్యేకమైన రోజుల్లో ఆచరించే కర్మ. ఉదాహరణకు వినాయక చవితి నాడు వరసిద్ధి వినాయకుడిని పూజించడం, అక్షయతృతీయ నాడు దానాలు చేయడం, పెద్దలు మరణించిన తిధుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మొదలైనవి. అంటే ఇవి ప్రత్యేకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆచరించేవి.

కామ్య కర్మ - అంటే కోరికతో చేసే కర్మ, లేదా మనకున్న కోరికలను సిద్ధింపజేసుకోవడానికి చేసే కర్మలు. ఉదాహరణకు మరణానంతరం స్వర్గాది లోకాలను పొందడానికి అగ్నిష్టోమం మొదలైన యగాలు చేస్తారు. అలాగే వివాహం ఆలస్యమవుతుంటే, దానికి ఏర్పడ్డ ఆటంకాలు తొలగడానికి కొన్ని ఆలయాలను దర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా మన కోరికలు తీరడానికి, అందుకు తగ్గ పుణ్యం ప్రాప్తించడానికి ఎన్నో పనులను మనం నిత్యం చేస్తుంటాము. వాటిని కామ్య కర్మలు అంటారు.

చేసే కర్మ యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని సత్కర్మ లేదా దుష్కర్మ అన్నారు. సత్కర్మ అంటే మంచి కర్మ, దుష్కర్మ అంటే చెడు కర్మ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. చేస్తున్న కర్మ యొక్క స్వభావానికంటే ముఖ్యమైనది, ఆ కర్మ వెనుకున్న కర్త యొక్క ఉదేశ్యం. ఒక పని చేస్తున్నప్పుడు, అది ఏ భావంతో, ఎందుకు చేస్తున్నామనే దాన్ని అనుసరించి కర్తకు ఫలం లభిస్తుంది. కాబట్టి ఆచరించబడుతున్న కర్మకంటే, దాని వెనుకనున్న భావాలు, ఉద్దేశాలు ముఖ్యం. భగవంతుడు చేసిన కర్మను చూడడు, దాని వెనుకనున్న ఉద్దేశాలను చూస్తాడు.

స్వామి వివేకానంద కర్మ యోగంలో ఒక మాట అంటారు. మనం ఉన్నది సాపేక్ష ప్రపంచంలో. ఇది మంచి, చెడు, సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఏ పని పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు. మంచి చేసే పని కూడా కొందరికి చెడు చేస్తుంది, చెడు కూడా కొందరికి మేలు కలిగిస్తుంది. కాకపోతే, ఒక కర్మ అత్యధికమందికి మేలు కలిగిస్తే అది మంచి కర్మగానూ, అత్యధికశాతం చెడు కలిగిస్తే, అది చెడ్డదిగానూ చెప్పాయి శాస్త్రాలు. To be continued ..

కర్మసిద్ధాంతం - 04

 కర్మసిద్ధాంతం - 04
మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.
ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది. దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు. అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది. అవే సంచితకర్మలు.

3. ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.

ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా, జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి. ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో
"పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం"
అని అన్నారు.

మళ్ళూ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.

ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.
ఇంకా ఉంది .....

కర్మసిద్ధాంతం- 03

 కర్మసిద్ధాంతం- 03
పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.

అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......
చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు

అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.

1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.
ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.
ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ.
ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.
ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు.

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. To be continued ..

కర్మసిద్ధాంతం - 02

 కర్మసిద్ధాంతం - 02
క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు.

నిరాలంబోపనిషత్ 22 వ శ్లోకం కర్మను ఇలా నిర్వచించింది. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.
అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వక్కు, కాయాలనే త్రికరణములు అంటారు.
త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అని అన్నమాచార్యుల కిర్తన కూడా ఉంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.
అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించడం.

న ఇ కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే వ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః
భగవద్గీత - 3వ అధ్యాయంలోని 5 వ శ్లోకం.

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.
To be continued ...

కర్మసిద్ధాంతం- ఉపోద్ఘాతం - 01

 కర్మసిద్ధాంతం- ఉపోద్ఘాతం - 01
ఇప్పుడు మనం సనాతన ధర్మానికి మూల సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాము. కర్మ- పునర్జన్మ అనేవి సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన సిద్ధాంతాలు. సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన ఇతర మతాలైన బౌద్ధం, జైనం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. నిజానికి భారతదేశంలో, ముఖ్యంగా ఈ తరంలో పుట్టిన హిందువులకు మాత్రమే కర్మసిద్ధాంతం గురించి ఏ కొద్ది అవగాహాన కూడా లేదు. ఇది హిందువులకు అర్ధమైతే, సనాతన ధర్మం కంటే గొప్ప హేతువాదం ఈ ప్రపంచంలో లేదని, అసలు ధర్మంలో మూఢనమ్మకమనేది లేనేలేదని అర్ధం చేసుకోవచ్చు. ఇతర దేశాల్లోని అన్యమతస్థులు సనాతన ధర్మాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపే ప్రధాన కారణాల్లో కర్మసిద్ధాంతం ఒకటి. మనకూ అన్యమతాలకు మధ్యనున్న బేధాల్లో ముఖ్యమైనది కర్మ - పునర్జన్మ సిద్ధాంతం. క్రైస్తవం, ఇస్లాం మొదలైన మతాలను కర్మను, పునర్జన్మను అంగీకరించవు.

అసలు మనకే ఎందుకీ కష్టాలు? ఈ ప్రపంచంలో కొందరికి డబ్బు బాగా ఉంటుంది, పెద్ద పెద్ద మేడల్లో, విందు భోజనాలతో, బంధుమిత్రులతో, వైభవోపేతంగా జీవిస్తారు. కొందరికి రోజూ అన్నం దొరకడమే గగనం. నా అన్నవారు ఉండరు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, తల దాచుకోవడానికి నీడ ఉండదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. కొందరికి సుఖం, కొందరికి దుఃఖం, కొందరికి ఆనందం, కొందరికి విచారం. అంతెందుకు ఒకరి జీవితంలోనే కలిమిలేములు. కొన్నాళ్ళు ఆనందం, కొన్నాళ్ళు విచారం. కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యం, ఇంకొన్నేళ్ళు అనారోగ్యం.
కొందరేమో ఉన్నదంతా దానం చేసే గుణం కలిగి ఉంటారు, ఇంకొందరు ఎంత ఉన్న, ఎంగిలి మెతుకులు కూడా విదల్చరు. ఎంత వ్యత్యాసం. కొందరు ఇతరుల మేలు కోసమే జీవిస్తే, ఇంకొందరు పక్కవాళ్ళకు హాని చేయడం కోసం జీవనం సాగిస్తున్నారు. ఎంత విభిన్నమైన మనస్తత్త్వాలు. అదీ ఒకే ప్రపంచంలో.

అసలు దేవుడే లేడనే నాస్తికులను పక్కన పెడితే ఈ సృష్టి అంతా భగవంతుడే చేశాడు, లేదా ఈ సృష్టి భగవంతుని నుంచే వచ్చింది అని నమ్మే ఆస్తికులు వీటిని చూసి ఏమనుకుంటారు? నిజంగా దేవుడనేవాడు ఉంటే కొందరికి ఇచ్చి, కొందరికి ఇవ్వక, కొందరికి పెట్టి, కొందరికి పెట్టక, కొందరిని అందంగా, కొందరిని అందవిహీనంగా ఎందుకు పుట్టించాడు? కొందరికి సద్బుద్ధి, కొందరికి దుర్భుద్ధి ఎందుకు ఇచ్చాడు? కొందరికి మాత్రమే సంపదలు ఎందుకిచ్చాడు? కొందరిని పేదరికంలో మగ్గేలా ఎందుకు చేశాడు? కొందరికెమో ధీర్గాయుష్షు, కొందరికేమో అల్పాయుష్షు? ఇదంతా పక్షపాతం కాదా? పక్షపాతం గలవాడు దేవుడౌతాడా?.... ఇలాంటి ప్రశ్నాలు అనేకం వస్తాయి. వీటికి సనాతన ధర్మంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతం తప్ప మరే ఇతర మతం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే అక్కడ సమాధానం లేదు.

ఇలా మనకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధనం చెప్పగల కర్మసిద్ధాంతాన్ని తెలుసుకుందాము. ఇంకా ఉంది..!.

::::::: బంక ::::::::

 *::::::::::   బంక  ::::::::::::::*

        రెండు కాగితాల మధ్య    బంక రాస్తే అంటు కుంటాయి.

        చెక్క ముక్కను మరొక చెక్క ముక్కను అంటించడానికి బంక ( ఫెవికాల్ ) రాస్తాము.


       మనస్సు ఒక విషయాన్ని, లేదా ఆలోచనను పట్టుకొని వ్రేలాడుతుంది అంటే, లేదా మనస్సు ఒకే ఆలోచనను పట్టుకొని అదే పనిగా ఆలోచిస్తుంది అంటే ఆ విషయానికి  రాగద్వేషమోహాలు అనే బంక వ్రాశామనే అర్ధం. అందుకే ఆ విషయం మనస్సుకి 
అతుక్కు పోయింది. 

       ధ్యానం చేయండి మనస్సు దేనికీ అతుక్కు పోదు.

*షణ్ముఖానంద 98666 99774*

:::::: దుస్తులు. :::::::

 *:::::::::  దుస్తులు. :::::::::::::*

  శరీరం తన నగ్న శరీరాన్ని,అంద విహీనతను, అంగ వైకల్యాన్ని, దాయడానికి దుస్తులు ధరిస్తుంది. 
 
  మనస్సు తన నగ్నత్వం అయిన తనలోని హింసాత్మకతను, ద్వేషాలను, కపటాన్ని, మోసాన్ని, ఈర్షను, స్వార్థాన్ని, వివక్షతను, కప్పి పెట్టడానికి,
ఆదర్శాలైన అహింస, ప్రేమ, నిస్వార్ధం మొదలగు దుస్తులు ధరిస్తుంది.
మేక తోలు కప్పుకున్న పులిలాగ.

*షణ్ముఖానంద 98666 99774*

****ఆధ్యాత్మిక సాధన

 [30/03, 2:48 am] pasupulapullarao@gmail.co: *ఆధ్యాత్మిక సాధన*
                 ➖➖➖

*ఆధ్యాత్మిక సాధన చాలా కష్టమని మహాత్ముల చెబుతారు.*

*కొన తేలిన కొండ మీద కొన తేలిన రాళ్లతో ఉన్న మార్గంలో చెప్పులు లేకుండా నడవడం సులభం కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కష్టం అని అన్నారు.*

*రెండు కర్రలమధ్య తీగ కట్టి ఆ తీగల మధ్య నడవడం ఆధ్యాత్మిక సాధన కంటే తేలిక అన్నారు.*

*ఎందుకని వీరు ఆధ్యాత్మిక సాధన అంత కష్టం అని అన్నారు. ఏముంది అందులోచూద్దాం ఇప్పుడు.*

*మనం అందరము వీటిలో అన్ని కానీ కొన్ని కానీ క్రమం తప్పకుండా చేస్తున్నాం కదా. ఇవే కదా ఆధ్యాత్మిక సాధనలు!*

*చూడండి!*
*1) రోజు కొంత సమయం పూజ చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*

*2) తీసుకున్న మంత్రం నిర్ణీత సంఖ్యలో జపం చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*

*3) ప్రతి రోజు గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*

*4) ప్రతిరోజు ఒక  గంట ధ్యానం చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*

*5) ప్రతిరోజు సత్ గ్రంధాలు, మహాత్ముల చరిత్ర క్రమము తప్పకుండా చదివితే అది  ఆధ్యాత్మిక సాధన కాదా?*

*6) ప్రత్రి రోజు ఇలా ముఖ పుస్తకంలో పోస్ట్లు పెడుతూ వారి స్పందనలకి పొంగిపోతూ, స్పందించపోతే రచ్చ రచ్చ చేస్తూ ఉంటే,  అది ఆధ్యాత్మిక సాధన కాదా?*

*ఇలా ప్రశ్నించుకుంటు పోతే ఈ లిస్ట్ పెరిగిపోతుంది కానీ,*

*దురదృష్టవశాత్తు ఇవేవీ ఆధ్యాత్మిక సాధనలు కావు.*

*మరేంటి? అని కన్నెర్ర చేస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి బాబు.*

*మీరు వృత్తి విద్యా కోర్సులలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాస్తారు కదూ, ఎందుకు అంటే మీకు ఆ విద్యార్జనకి అర్హత  ఉంది నిరూపించడానికి అంతే కదా,*
*అలానే పైవన్నీ ఆధ్యాత్మిక సాధన చేయడానికి మీకు కావాల్సిన అర్హతలు.*

*ఎంతో అహంకారం, మమకారం పేరుకుపోయిన మనకి, ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనపైకి జంప్ చేసే మనస్సుకు పైవన్ని వాటిని జయించే లేదా అధిగమించే సాధనలు.*

*అయితే వీటిలో నైపుణ్యం సంపాదించాక ఆధ్యాత్మిక సాధనలు మొదలు పెట్టాలా? *

*అంటే…*

*అక్కరలేదు అని జవాబు.*

*పై వాటికీ   మీఆధ్యాత్మిక సాధనకు సంబంధం లేదు.*

*అవి చేస్తూ,  ఇవి కూడా చెయ్యాలి.*

*ఇంతకీ ఆధ్యాత్మిక సాధనలు అంటే ఏమిటి అని అడుగుతారా?*

*సరే వినండి…*

*1) బహిర్ముఖంగా ఉన్న మనస్సును అంతర్ముఖం చేసి ఎఱుక కోల్పోకుండా ఉండే సాధన, ఆధ్యాత్మిక సాధన!*

*2) ఇంత వరకు మనని ఎవరో గమనిస్తున్నారు అన్న దృష్టి కోణం తో ఉన్నాము. అలా కాకుండా మనని మనం అనుక్షణం గమనిస్తూ ఉండడం ఆధ్యాత్మిక సాధన.*

*3) మనస్సుని ఏదైనా ఒక విషయం           పై కనీసం ఒక 20 నిముషాలు వేరే ఆలోచన రాకుండా చూడటం ఆధ్యాత్మిక సాధన.*

*4) రైతు కలుపు మొక్కలు పీకివేసినట్టు, మనలో వచ్చే పనికి రాని ఆలోచనలను పీకి వేయడం ఆధ్యాత్మిక సాధన.*
*అలానే పనికి రాని, ఉపయోగం లేని, మాటలు మాట్లాడకుండా, మౌనంగా ఉండడం కూడా ఆధ్యాత్మిక సాధన.*

*5) మన వాస్తవాలకి మన ఆలోచనలే కారణం అని గ్రహించి,*
*ఏ వాస్తవాన్ని సృష్టించాలో మనమే నిర్ణయం తీసుకొని,*
*ఆ వాస్తవానికి ఇతరులని  భాద్యులని చేయకపోవడం ఆధ్యాత్మిక సాధన.*

*6) నిరంతరం జిజ్ఞాసాపరులై, జ్ఞాన సముపార్జనకి, తేనెటీగ పువ్వుల నుంచి తేనె పువ్వులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రహించినట్టు, మనము కూడా మహాత్ముల దగ్గర నుండి అంత తేలికగా జ్ఞానం గ్రహించడం ఆధ్యాత్మిక సాధన.*

*7) 24x7 దైవ నామం ద్వారానో లేదా ఇంకేదైనా విధంగా అయినా, పరమాత్మని స్మరణ చేయడం ఆధ్యాత్మిక సాధన.*

*8) మనని మనం పరీక్ష చేసుకుంటూ, కావాల్సిన మార్పులు మన ఉన్నతి కోసం చేసుకుంటూ,*
*ఈ జన్మ తీసుకున్నందుకు మనము జన్మ తీసుకోక ముందు ఉన్న స్థితికి విలువ జోడించడం*
*(ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒక వస్తువుకి విలువ పెంచి దాని అమ్మకాలు పెంచి నట్టు, దీనిని ఆంగ్లంలో value added అంటారు)*
*ఆధ్యాత్మిక సాధన.*

*9) కావాల్సిన సాధన చేస్తూ, ఈ జన్మని ఆఖరిది చేసుకుంటూ, మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని రాకుండా, (ఎందుకంటే భూమిని పాఠశాల అంటారు కాబట్టి) చేసుకోవడం ఆధ్యాత్మిక సాధన.*

*10) అన్నిటికన్నా ముఖ్యంగా,  మనని మనం నిమిత్త మాత్రభావముతో ఆ పరమాత్మ చేతిలో పనిముట్టుగా మారి నిరంతరం, తరంతరం ఆయన సేవకే మన ఉనికిని సార్ధకం చేసుకోవడం ఆధ్యాత్మిక సాధన.
సరైన సాధన ద్వారా మాత్రమే అద్భుతమైన సత్ఫలితాలు పొందుతారు.
[30/03, 2:48 am] pasupulapullarao@gmail.co: 💖💖💖
       💖💖 *"509"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శరణాగతి చెంది ఉపదేశాలు అనుసరించాలా ?"*

*"గురువు పట్ల శరణాగతి ఏర్పడేకొద్దీ ఆయన మనలోనే ఉండి ఇదంతా ఎలా చేస్తున్నారనే విషయం అవగాహనలోకి వస్తుంది. "శరణాగతి పొందని వారికే ఉపదేశాలు" అని భగవాన్ శ్రీరమణమహర్షి నిర్ధ్వంధంగా చెప్పారు. నిజంగా మనం శరణాగతి చెందితే, సద్గురు మనలోనే ఉండి మనని ప్రతిక్షణం ఎలా నడిపిస్తున్నారో అర్ధం అవుతుంది. మనం గురువు నుండి ఉపదేశాన్ని, వారి కరస్పర్శను కోరుతుంటాం. అంటే మనమింకా పూర్తి శరణాగతి చెందలేదని అర్ధం. ఉపదేశ, కరస్పర్శలు నిజాయితీతో స్వీకరిస్తే శరణాగతికి సోపానాలు అవుతాయి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

:::::: శరీరము VS. మనస్సు ::::::

 *:::::: శరీరము  VS. మనస్సు ::::::::*
1)శరీరానికి నోటి ద్వారా ఆహారాన్ని అందిస్తాము.
మనస్సు కి విషయాలకు చెందిన విజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా అందిస్తాము.
2) శరీరానికి  బాక్టీరియాల వల్ల జబ్బు చేస్తుంది.
మనస్సు  రాగ ద్వేష మోహాల వల్ల దుఃఖం వస్తుంది.
3) వైద్యం శరీరాన్ని బాగు చేస్తుంది.
ధ్యానం మనస్సు ని బాగు చేస్తుంది.
4) శరీరానికి తగినంత ఆహారం, విశ్రాంతి, వ్యాయామం ఇస్తే సురక్షితంగా వుంటుంది
మనస్సు కి సజ్జన సాంగత్యం, అధ్యయనం, ధ్యానం ఇస్తే శాంతంగా వుంటుంది.
5) శరీరానికి మంచి ఆహారం, తగిన వాతావరణం, హాయి ని ఇస్తే
మనస్సు కి మంచి భావాలు, వాస్తవాలు హాయి ని ఇస్తాయి.
 6) శరీరాన్ని తల్లితండ్రులు ఇస్తారు.
మనస్సు ని సమాజం నింపుతుంది.
7) శరీరాన్ని మనస్సు నడిపిస్తుంది.
 మనస్సు కి ఆధారాన్ని శరీరం ఇస్తుంది.
8) శరీరం మరో శరీరాన్ని సృష్టిస్తుంది.
మనస్సు ఆత్మహత్య చేస్తుంది 
*షణ్ముఖానంద98666 99774*

Thursday, March 30, 2023

శ్రీ రమణీయం - 7 A🌹 👌మోక్షమైనా.. బంధమైనా... మనసే కారణం (1)

 🌹 శ్రీ రమణీయం - 7 A🌹
👌మోక్షమైనా.. బంధమైనా... మనసే కారణం (1)👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 7. మోక్షమైనా బంధమైనా మనసే కారణం 🌹

✳️ మన పుట్టుక అంటే అహంకరణ పుట్టుకే!  అంటే... 'నేను ఉన్నాను' అని తెలియడం. అది ఎవరూ నేర్పేదికాదు. తెచ్చుకునేదికాదు. అది జీవ లక్షణం. కాబట్టే, చంటి పిల్లలైనా చిటిక వేసినవైపు తిరిగి చూస్తారు. నొప్పిపుడితే ఏడుస్తారు. దీనికి కారణం 'స్పృహ' కలిగి ఉండటమే. అదే ఎంత పెద్దవాడైనా నిద్రపోతుండగా ఇవన్నీ చేయలేడు. దీనికి కారణం దేహస్పృహ లేకపోవడమే. ఈ స్పృహే, జీవుడు. ఎందుకంటే జీవుని ఉనికి ఈ స్పృహతోనే ఉంది. ఆ స్పృహే శుద్ధంగా ఉంటే అదే ఈశ్వరుడు. అంటే మనలో కేవల స్పృహగా ఉన్న ఈశ్వరుడు మనసుగా వ్యక్తం అవుతాడు. 

✳️ మనలోఉన్న స్పృహకి రెండు లక్షణాలు ఉన్నాయి. అవి *1. కేవల స్పృహ 2. ఆ స్పృహ కలిగి ఉన్నానని తెలియడం.* మొదటిది మనలో ఈశ్వరుడి కిరణం అయితే రెండవది దాని ఫలితంగా పుట్టిన మనసు. కేవల స్పృహే దేహంతో కలిసి అహంకరణగా ఒక ప్రత్యేక గుర్తింపుని ఆపాదించుకుంది. మనం నిద్రలో ఈ కేవలస్పృహగానే ఉంటాం కాని అది అచేతన స్థితిలో ఉంటుంది. మెలకువలో ఈ స్పృహ చైతన్యమై అహంకరణ వ్యక్తం అవుతుంది. ఈ చైతన్యమే మనకు కలిగే సుఖదుఃఖాది అనుభవాలకు కారణం. మనం 'జీవితం' అనుకుంటున్నది ఈ అహంకరణ తాలూకు అనుభవాలనే. నిద్రా స్థితిని జీవితం అని భావించలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ అహంకరణ అనుభవాలు లేవు (గనుక) కేవలస్పృహ దేవుడైతే అది చైతన్యంగా మారితే జీవుడు. ఆ చైతన్యం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని మరణంగా పిలుస్తాం.. స్పృహ తానుగా ఉన్నా, దేహం అన్న భావనతో ఉన్నా, రెండిటిలోనూ ఉన్నది ఒక్కటే. ఈ రెండిటికి భేదం కల్పించింది ఈ దేహమే. బావిలోమునిగిన బొక్కెన బావినీళ్ళను, బొక్కెనలో నీళ్ళను వేరుచేసినట్లే...ఈ దేహం అనంత స్పృహను పరిమిత స్పృహగా మారుస్తుంది. స్పృహనే ప్రజ్ఞ, ఎరుక, తెలివి, చైతన్యం అని పిలుస్తారు. అదే మన అసలు స్వరూపం కాని అది దేహం ద్వారా వ్యక్తమై ఈ దేహమే నేనన్న భావం కలిగిస్తుంది. అద్దంలో ప్రతిబింబం చూసేటప్పుడు కూడా అందులో ఉన్నది మనమే అని భ్రమిస్తూనే దువ్వుకుంటాం. అలాగే స్పృహ ప్రతిబింబించే ఈ దేహన్ని నేను అని అనుకుంటున్నాం. 

✳️ ఈ శరీర గతమైన విధిని అనుభవిస్తూ మనసును మాత్రం మనలోనే ఉన్న దైవంపై లక్ష్యం చేయడం మన సాధన కావాలి. అంటే కార్యకారణాల్లో తన కదలికలకు గల కారణాన్ని ‘వేదకటం' అనే ఆత్మాన్వేషణకు పూనుకోవాలి. పువ్వు నుండి వాసన వేరు చేయలేనట్లే ఈ దేహానికి ప్రారబ్దాన్ని వేరు చేయలేం. కాని మనసుకు దాని వికారాలు అంటకుండా సాధన చేయవచ్చు. 

✳️ శ్రీ రమణ భగవాన్‌ని వివాహం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే తన దేహప్రారబ్ధంలో లేదని సమాధానం ఇచ్చారు. జ్ఞానులకైనా దేహం నుండి విడదీయలేనిది కనుకనే అది 'విధి' అయ్యింది. మనసుని మన వివేకాన్ని బట్టి దైవంపైనో, వ్యామోహంతో దేహంపైనో నిమగ్నం చేయవచ్చు. దైవంపై నిమగ్నం అయిన మనసు మోక్షాన్ని, దేహంపై నిమగ్నమైన మనసు బంధాన్ని మిగుల్చుతుంది. దైవం మనలో ఉండి చేసే అనేక పనులను గుర్తిస్తే మనకి ఆయనపై కృతజ్ఞత కలుగుతుంది. 

                           ...ఇంకా ఉంది....

           ......మోక్షమైనా బంధమైనా మనసే కారణం........... సశేషం

🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

****🪔🪔అంతర్యామి🪔🪔 🎈🎈సుఖం🎈🎈

 🪔🪔అంతర్యామి🪔🪔
       🎈🎈సుఖం🎈🎈

🌹ప్రతి మనిషీ- జీవితంలో సుఖంగా ఉన్నాడా
అసలు సుఖం అంటే  మనసుకు శాంతి అన్నా, సుఖం అన్నా ఒక్కటేనాజీవితంలో డబ్బు ఉంటే సుఖం ఉన్నట్లేనా  డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక శాంతి అనుభవిస్తున్నారాజీవితం ఎంత  చిత్రం,   విచిత్రం ఏమి లేనపుడు కడుపుకు ఇంత కూడు చాలు  అనిపిస్తూ తరువాత కాస్త గొంగళి, తర్వాత ఉండేదానికి కాస్త గూడుఅనీ ఇంతవరకు వచ్చి తృప్తిగా ఉన్నామా,  లేదే.
  🌹 ఇంకా,ఇంకా ఎదగాలి!  
ఎదిగావు..! 
🌹ఇంకా డబ్బు సంపాదించాలి !! 

🌹సంపాదించావు ..! 
నా పిల్లలు లగ్జరీగా పెరగాలి !! పెరిగారు 
పెద్ద భవంతులు కావాలి! కొన్నావు !!
 నా పరపతి పెరగాలి ! పెరిగింది !! 

🌹అయినా ఇంకా ఏదోఏమిటి ఆ ఏదో ఏదో తెలియని అసంతృప్తి !      

🌹ఎందుకు అంటే ఏమో  
   ప్రతి మనిషికి , ప్రతి మనసుకు ఎన్ని కధలు మరెన్ని వ్యధలు కథలు కథ మాటున దాగిన  కన్నీటి చెలమలు ఎన్నో ఎన్నెన్నో ... !

🌹డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండక ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండక భార్యా భర్తల గొడవలు ,               పిల్లలు మాట వినటంలేదని వేదన, ఉధ్యోగం , వ్యాపారం, పెళ్లి , ఇల్లు , వాకిలి, ఇలా ఎన్నో ఎన్నెన్నో ...

🌹ఎన్నో కధలు విని .. కలత పడిన మనసు ప్రశ్నిస్తుంది .... 'అసలు సుఖంగా ఉన్నవారు ఉన్నారా, సుఖం అంటే ఏమిటి 
అవును సుఖం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి, శాంతి ఎక్కడ దొరుకుతుంది
నీకు నచ్చిన విధంగా నీ మనసు మెచ్చిన విధంగా జరిగిన   ఏ విషయమైనా నీకు సంతోషం అనిపిస్తే అదే సుఖం !

🌹నీకు నచ్చని ఏ సంఘటన జరిగినా , అది దుఃఖం అనుకుంటావు  !
అంటే సుఖం అయినా దుఃఖం అయినా నీ మనసులో కలిగే భావాలే ! 
ఆ భావనకు అతీతంగా స్థిమితంగా జీవించ గలిగితే, స్థిత ప్రజ్ఞతే  !!

🌹ఈ స్థితికి మనసును ఎలా తీసుకు వెళ్ళాలి,
నేనే.. ఈ మేను..!'అనుకున్నంతవరకు                         యెద చీకటేగా...!  ''

🌹నేను నేనే మేను నేనే అనే భావన కంటిలో నలుసులా కుదుట పడనీయదు 
ఇక్కడ నేను అతిధిని మాత్రమే,
నాలుగు రోజుల అతిధిని మాత్రమే
'ఇది నాది కాదు కాదు..కానే కాదు.!'

 🌹అనే స్పృహ పరుగులు తీస్తున్న అరిషడ్వర్గాలను 'సత్యం' అనే  అంకుశంతో నిత్యం ఒక్కమారు స్పృశిస్తే సత్యం బోధపడుతుంది  సాక్షిగా నీ చూపు నిలబడుతుంది, డబ్బు, సిరులు, సంపదలు మేనికి సుఖాన్ని ఇస్తాయి కానీ... 
మనసుకు శాంతిని, ప్రశాంతతని ఇవ్వలేవు, 
మనసుకు శాంతి మాత్రం మరణం లేని 'మీరు .... మీరేన'ని గ్రహించిన క్షణం మాత్రమే ... !

🌹శ్రీకృష్ణుని వైశిష్ట్యం!
శ్రీ కృష్ణుడు వసుదేవ నందనుడు. 'వాసుదేవ' అనే శబ్దం ఎంతో మధురమైనది. వాసుదేవ శబ్దాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునకు మహాభారత ఉద్యోగపర్వంలో ఇలా వివరిస్తాడు.

🌹శ్వాసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోనిః । 
వాసుదేవస్తతో వేద్యో బృహత్త్వాత్ విష్ణురుచ్యతే ॥

🌹ఆయన సమస్త ప్రాణులకు నివాస స్థానం అవడం వలన, దేవతలు అందరూ ఆయనలోనే  నివసించడం వలన "వాసుదేవ" అనే నామం సార్ధకమైనదని సంజయుడు వివరిస్తాడు.

🌹ఈయన సర్వవ్యాపకుడు కాబట్టి 'విష్ణువు' అనే పేరు కలిగిందని అంటాడు. క్రీ.పూ. 6వ శతాబ్ధం నుండి వాసుదేవ తత్త్వము భారత దేశములో ప్రచారానికి వచ్చింది.  పాణిని ని, పతంజలిని వాసుదేవుని భగవత్ స్వరూపులుగా పేర్కొనిరి. భగవంతుని చరిత్ర కాబట్టి భాగవతమని కొందరు భావిస్తే, "భగవతి రతాః భాగవతాః" భాగవతులన విష్ణుభక్తులని, వారి చరిత్ర భాగవతమని మరికొందరు భావించారు.

🌹దేవకీదేవి గర్భశుక్తి ముక్తాఫలమైన శ్రీ కృష్ణుని జీవిత ఘట్టాలను వివరించేది పై శ్లోకం. దానిని  శ్రీకృష్ణ లీలామృతం అని కూడా పేర్కొన్నారు. బాల్యంలోనే పూతన జీవితాపహరణం.

🌹 గోవర్ధనోద్ధరణం చేసిన ఉద్దండ పిండం మనం చిన్ని కృష్ణయ్యగా పిలుచుకునే కృష్ణ భగవానుడు. పెరిగి పెద్దయి, ధర్మ రక్షణకు దీక్షా కంకణుడై కంసాది రాక్షసులను సంహరించి కుంతీ కొడుకులను పాలించాడు. మధ్యలో ఎన్నో లీలలు. ఇవన్నీ కలిస్తే కృష్ణ తత్త్వమవుతుంది. 

🌹"కృష్ణ శబ్దం ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది. 
అది విష్ణుతత్త్వ వివరణము.
"ఇంద్రస్య యుజ్యస్తఖా" అని అంటారు. దాని అర్థం ఏమిటంటే అతడు ఇంద్రునకు యుద్ధమున సహాయపడ్డాడు అని, ఇంద్రునకు స్నేహితుడు అని భావము. ఋగ్వేద వర్ణనలను గమనిస్తే ఇంద్రునిది నీలదేహమని వివరించారు. దానిని అనుసరించే బహుశా విష్ణువు యొక్క అవతారములగు రామావతారము తరువాత కృష్ణావతారములలో కూడా స్వామిది నీలదేహముగా వాల్మీకి, వ్యాసులచే వర్ణింపబదిందేమో అనిపిస్తుంది. 

🌹విష్ణువు రక్షకుడుగా కీర్తింపబడే వేద మంత్రములలో అనేక చోట్ల 'గోప్త' 'గోప' శబ్దములు వాడబడటం గమనించవచ్చు. ఆ మంత్రాలే  భాగవతాది పురాణములలో "గోపాలకుడు" గా వర్ణించారు.

🌹ఛాందోగ్యము మొదలయిన ఉపనిషత్తులలో విష్ణువు దివ్య పురుషునిగా, సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వర స్వరూపముగా వర్ణింపబడెను. అది విష్ణుతత్త్వము. తరువాత పురాణేతి హాసములలో ప్రసిద్ధమైన కృష్ణ తత్త్వమునకు అదే మూలమని భావించవచ్చును.

🌹 ముండకోపనిషత్తులో  "అగ్నిర్మూర్గా చక్షుషీ చంద్ర సూర్యౌ, దిశ శ్రోత్రే" వంటి ఇతర వర్ణనలు శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శన వర్ణనకు దగ్గరగా ఉండటం గమనింపదగినది.

 ఇతిహాసములలో భారతమునందు, పురాణములలో భాగవతమునందు, తరువాత కావ్యములలో ఎఱ్ఱన రచించిన, హరివంశము, మొదలగు గ్రంథములందు శ్రీ కృష్ణుని గాధలు చాలా గొప్పగా వర్ణించబడ్డాయి. అయితే భాగవతము దశమ స్కంధములో శ్రీ కృష్ణ జన్మ వృత్తాంత శైశవ క్రీడలు విస్తారముగా వర్ణింపబడ్డాయి.
నిజానికి శ్రీకృష్ణుని శైశవ క్రీడలు, ఆయన బాల్యమే చాలామందికి నచ్చుతుంది. ఆ బాల్య క్రీడలలో తెలిసీ తెలియకుండానే ఆయన దుష్ట శిక్షణ చేసిన విధం అందరి మనసులూ కట్టిపడేస్తుంది. 

🌹మన్ను తిన్న చిన్నవాడిలా, వెన్న దొంగగా, గోకులాన్ని పావనం చేసే చిన్ని కృష్ణుడంటే అందరికీ చెప్పలేని తాదాత్మ్యం కలుగుతుంది. ఇదే కృష్ణుని బాల్యంలో ఉన్న అందం...

🌹అర్జునా! పరబ్రహ్మవస్తువును తెలుసుకోనుటే జ్ఞానము. దీనినే ఆత్మజ్ఞానమని అంటారు. ఈ జ్ఞానాన్ని అందించునదే ఆధ్యాత్మవిద్య. ఇది అన్ని విద్యల కంటే శ్రేష్ఠమైనది. జరామరణాది దుఃఖములనుండి విముక్తిపొందాలంటే ఆత్మజ్ఞానమును పొందితీరవలసినదే. ఇంకొక మార్గములేదు.

🌹ఆ మార్గమేమిటంటే, ఎచ్చటనుండి వచ్చామో, అక్కడికి చేరుకోవడమే. అంటే పరమాత్మనుండి విడిపడిన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవడమే. అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. 

🌹జీవాత్మ, పరమాత్మతో విలీనం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.

🌹జ్ఞానముతో చేయుకర్మను యజ్ఞమని అందురు. యజ్ఞము చేయువాడు, హోమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్నియు పరబ్రహ్మస్వరూపములే, యజ్ఞఫలితము కూడా బ్రహ్మార్పణమే. అటులనే శ్రాద్ధకాలమందు శ్రాద్ధము చేయువాడు, భోక్తలు, వారు భుజించు అన్నము పరబ్రహ్మస్వరూపమే. ఆ శ్రాద్ధక్రియ ఫలితమూ బ్రహ్మార్పణమే. ఇట్టి భావముతో జీవితమందలి సర్వకర్మలను యజ్ఞదృష్టితో చేయుటయే బ్రహ్మకర్మసమాధినిష్ఠ అనబడును. ఇట్టి నిష్ఠ గలవాడు పరబ్రహ్మస్థితిని పొందును. 

🌹అర్జునా! ద్రవ్యం, ధనం వలన సాధించబడే యజ్ఞంకంటే, జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఎందుకంటే సమస్తకర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి.

🌹కొంతమంది దానధర్మాలే యజ్ఞంగా, తపస్సే యజ్ఞంగా, యోగసాధనే యజ్ఞంగా, వేదాధ్యయనమే యజ్ఞంగా భావించి జ్ఞానయజ్ఞము చేస్తారు. కొందరు ప్రాణాయామపరులు వాయుగతులను నిరోధించి అపానంలో ప్రాణము, ప్రాణంలో అపానము హోమం చేస్తారు.

🌹యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానమును ఉపదేశిస్తారు. వారిని వినయవిధేయతలతో నమస్కరించి, సర్వస్యశరణాగతి నొంది, వారిని సేవిస్తూ, సమయం సందర్భం చూసి ప్రశ్నించి తెలుసుకోవాలి.

🌹అర్జునా! అటువంటి జ్ఞానమును తెలుసుకుంటే నీవు తిరిగి మొహాన్ని పొందకా, సమస్త ప్రాణులను నీలోనూ, నాలోనూ చూడగలవు. జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. 

🌹కావునా, అర్జునా! జ్ఞానమనే కత్తితో నీలోవున్న అజ్ఞానాన్ని నరికి నిష్కామ కర్మయోగం ఆచరించు, అని మానవులందరితరుపున ప్రతినిధియైన అర్జునునికి కృష్ణపరమాత్మ ఉపదేశించాడు.

🎈జీవుడికి ఇది ఏ నిజమైన సుఖం