Wednesday, October 25, 2023

ఆ భగవంతుడే దిగివచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు....

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీకృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తియో అయ్యుండాలి కదా…!*
💕*అవును నిజం… కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు శ్రీకృష్ణుడు.*
💞 *యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుడినిచూసి కన్నీళ్లుపెట్టాడు కిట్టయ్య*
❤️ *కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువుదరికి చేరకుండా ఉంచడంతో శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకువెళ్ళి ఒక కోరిక అడిగాడు*
💖 *”కర్ణా! నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా” అని అడిగాడు. కృష్ణుడలా అడగగానే కర్ణుడు దానం చేసేసాడు*

💓 *అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తనచేతులతో పట్టుకుని “నీకో వరమిస్తాను ఏమికావాలో అడుగు” అన్నాడు*
💕 *అందుకు కర్ణుడు “నాకు ఇంకో జన్మవద్దు. ఒకవేళ అలా ఉంది అంటే… అప్పుడు కూడా ఎవరు ఏమిఅడిగినా “లేదు” అని నేను చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు” అని అడిగాడు .*
💞 *ఆ మాట  వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటిధారలై పొంగాయి . “ ఇంతమంచి వాడివేంటయ్యా కర్ణా నువ్వు” అని గట్టిగా కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు .*

❤️ *మనం మంచిమనసున్న వాళ్లమైతే  చాలు.*
💕 *మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరమే లేదు.*
💞 *జీవితంలో ముక్తిపొందడం కోసం దైవదర్శనాలని అంటూ గుళ్లూ గోపురాలూ, చెట్టూ పుట్టా పట్టుకు తిరగక్కరలేదు.*
❤️ *మంచిమనసుంటే చాలు. మహాభారతంలోని పద్యం “ఒరులేయవి యొనరించిన నరవర ! యప్రియము తన మనంబునకగు తానొరులకవి సేయకునికియె పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్” అని జ్ఞాపకంపెట్టుకుని  ఆ తత్వాన్ని ఒంటబట్టించుకుని జీవనవిధానాన్నలా మార్చుకుంటే చాలు.*
💞 *ఆ భగవంతుడే దిగివచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు. కర్ణుడంతటి కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికినవేలంత మంచిగానైనా బతికేద్దాం.*
💖 *కృష్ణుడు మనకోసం రాకపోయినా ఆయన నెమలిపింఛాన్నైనా  రప్పించేసుకుందాం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment