Friday, October 27, 2023

సోషల్ మీడియా స్టోరీ

 *సోషల్ మీడియా స్టోరీ* 
💐💐💐💐💐💐💐
*రాత్రి మూడు గంటల సమయంలో అలికిడికి నిద్ర లేచింది పంకజం. ఆమె చుట్టు నలుగురు దొంగలు చేతిలో కత్తులతో నిలుచుని ఉన్నారు. భయంతో పతి దేవుడు కుటుంబరావు కోసం చూస్తే అతనిని అప్పటికే మంచానికి తాళ్లతో కట్టి వేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉంచారు. పిల్లలను వేరే రూములో బంధించి గడియ పెట్టారు. దొంగలు బీరువా, కప్ బోర్డు, అన్నీ వెతుకుతున్నారు. ఇది అంతా చూసి పంకజం గజగజ వణికిపోతూ "మా ఇంట్లో ఏమి ఉంచుకోము అన్నీ బ్యాంకు లాకరులోనే ఉంటాయి" అంది. దానికి ఆ దొంగల నాయకుడు "ఆ విషయం మాకు తెలుసు కాని, మొన్న మీ తమ్ముడు అమెరికా నుండి పంపిన 1.5 లాక్స్ ఆపిల్ ఫోను, నిన్న మీ పెళ్ళిరోజుకి మీ భర్త గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ నెక్లెసూ, పట్టుచీర ఎక్కడా? అవి ఇవ్వు చాలు" అన్నాడు. పంకజం అవి అన్నీ తీసి అతనికి ఇస్తూ "ఇవ్వన్నీ నా దగ్గర ఉన్నట్టు అంత ఖచ్చితంగా మీకు ఎలా తెలుసు అండి?" అంది. దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ "నేను నీ పేస్ బుక్ ఫ్రెండుని మీ ప్రతి పోస్టుకి లైక్ కొడుతూ మిమల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీరేగా మొన్నా, నిన్నా ఈ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేసారు. సరే కానీ పొద్దుట నెయ్యి వేసి ఘమ ఘమలాడుతున్న రవ్వ కేసరి చేసా అని పోస్ట్ పెట్టారు. చూస్తేనే నోరుఊరిపోయింది. అదేమైనా కొంచం మిగిలి ఉంటే తీసుకురండి తినేసి వెళ్ళిపోతాం."అన్నాడు.😛*

No comments:

Post a Comment