Saturday, October 28, 2023

నీరా ఆర్య

 *నీరా ఆర్య* 
*ఈమె గొప్ప దేశభక్తురాలు, ధైర్యవంతురాలు మరియు స్వావలంబన కలిగిన మహిళ, ఈమెను గర్వంగా మరియు గౌరవంగా గుర్తుంచుకుంటారు.* 
*నీరా ఆర్య 5 మార్చి 1902*
*ఖేక్రా, యునైటెడ్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియాప్రస్తుతం, ఖేక్రా  (భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో ఉన్న ఒక నగరం ఖేక్రా ). జన్మించింది.*
*నీరా ఆర్య భారతీయ విప్లవకారురాలు మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ)INA  లో సైనికురాలు , రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో పనిచేసారు.* *ఆమె సర్వీసులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను గూఢచారి అని ఆరోపించింది .ఆమె తండ్రి, సేథ్ ఛజ్జుమల్,  ప్రముఖ వ్యాపారవేత్త దేశమంతా వ్యాపారంతో కలకత్తాలో వ్యవహారాలు చేసేవారు.*
*ఆమె విద్యాభ్యాసం కోల్‌కతా నగరంలో కొనసాగింది. నీరా ఆర్య హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ మరియు అనేక ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. బ్రిటిష్ ఇండియాలో బ్రిటీష్ అనుకూల అధికారి అయిన శ్రీకాంత్ జయరంజన్ దాస్‌ను ఆమె వివాహం చేసుకుంది.  నీరాఆర్యభర్త కు బ్రిటిష్ ప్రభుత్వం  సుభాష్ చంద్రబోస్ పై గూఢచర్యం మరియు అతనిని చంపే బాధ్యత అప్పగించారు.*  
*శ్రీకాంత్ జయరంజన్ దాస్‌ నేతాజీ ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో  నీరాఆర్య  అజాద్ హింద్ ఫౌజ్ యెక్కNIA లో  మొట్టమొదటి మహిళా గూడాఛారి అనే బాధ్యతను సుబాస్ చంద్రబోస్ అప్పగించారు.* 
*ఆమె తన భర్తనుకూడా లెక్కచేయకుండా నేతాజీని కాపాడాలనే సంకల్పంతో దేశభక్తితో తన భర్తను చంపింది. తర్వాత ఈమె మరియు ఈమె సహచరరాలు సరస్వతి రాజమణి ఇద్దరూ మారువేషంలో బ్రిటిష్ అధికారుల గూఢచర్యం  చేపట్టారు.*
*ఆజాద్ హింద్ ఫౌజ్ లొంగిపోయిన తరువాత, ఆమె భర్తను హత్య చేసినందుకు ఆమెకి జీవిత ఖైదు విధించబడింది మరియు తీవ్రమైన హింసకు గురయ్యంది.అరెస్టు చేసిన తర్వాత నీరాఆర్యను మొదట కోల్‌కతా జైలుకు పంపారు. తర్వాత అండమాన్ జైలులో ఆమె కాళ్ళు చేతులకు సంకెళ్లుతో బంధించి ఉన్నాయి.కమ్మరి తన సంకెళ్లును విడదీసే సమయంలో సుత్తితో కొట్టగా కాళ్ళు విరిగినంత పనై ఆకమ్మరిని తిట్టడం జరిగింది. అతనిపై ఉమ్మి స్తీలను గౌరవించడం నేర్చుకో అంటూ అక్కడ ఉన్న జైలర్కు చెప్పింది.* *ఆ జైలర్ ఆమెను  మీ నాయకుడు సుభాష్ చంద్రభోస్ ఎక్కడ ఉన్నాడో చెబితే నిన్ను వదిలి పెట్టేస్తాము అని చెప్పగా...* *ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడని  ప్రపంచానికి అంతా తెలుసు అని చెప్పింది.*
*నేతాజీ బ్రతికే ఉన్నారు. మీరు చనిపోయారంటే మేము నమ్మం అని జైలర్ గట్టిగా గర్జించారు. వెంటనే  నీరాఆర్య కోపంగా అవును బ్రతికే ఉన్నారు. నాగుండెల్లో ఉన్నారు అని పలికింది. జైలర్ కోపంతో మీ గుండెల్లో నుంచి నేతాజీని విడుదల చేయాలి అంటూ కమ్మరి తెచ్చిన కట్టర్ లతో తన చనులను గట్టిగా నలిపేస్తూ   తన చనులను  కట్టర్ తో నొక్కి పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఈ కట్టర్ నిప్పులో పెట్టి ఉండాల్సింది నీ స్థనాలు మొత్తం కాలిపోయేవి అంటూ హింసించడం చేశారు.* 
*స్వాతంత్ర్య పోరాటానికి ఆమె చేసిన కృషిని వివరించింది. ది ఫస్ట్ ఫిమేల్ స్పై ఆఫ్ ఫ్రీ ఇండియా.సుభాష్ చంద్రబోస్ నాగిని అన్నారు.నేతాజీ ఈమె ధైర్య సాహసాలు చూసి భారత జాతీయ సైన్యం యొక్క రాణి ఝాన్సీ బ్రిగేడ్‌లో కెప్టెన్ గా నియమించారు.*
*తన చివరి రోజుల్లో, ఆమె తన సమయాన్ని హైదరాబాద్ లో పూలు అమ్ముతూ గడిపింది మరియు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఒక గుడిసెలో నివసించింది . ఆమె గుడిసెను ప్రభుత్వ భూమిలో నిర్మించడం వల్ల చివరకు కూల్చివేయబడింది. వృద్ధాప్యంలో, ఆరోగ్యం బాగోలేక 1998, జూలై 26న ఆదివారం నాడు చార్మినార్ సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రిలో నిస్సహాయంగా  వృద్ధురాలిగా కన్నుమూసింది.*
*ఇలాంటి ఎంతోమంది దేశభక్తులు ముందు మనం ఏమిచేశామో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మనం చేసింది ఏమీ ఉండదు. ఇప్పటికైనా పర్వాలేదు మనం మన దేశ గొప్పతనాన్ని తెలుసుకుని దేశ సేవలో ప్రతీఒక్కరూ మమేకం అవుదాం.*

*భారత్ మాతాకీ జై*🙏

No comments:

Post a Comment