Monday, March 2, 2026

ఈ 20 విషయాలు పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి! | Lord Krishna Motivational Speech Telugu

ఈ 20 విషయాలు పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి! | Lord Krishna Motivational Speech Telugu

Author Name:Telugu Box Stories

Youtube Channel Url:https://www.youtube.com/@telugubox_stories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x1qsD9oxgJ8



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ మిత్రులారా స్వాగతం జీవితంలో మనం గెలవాలంటే శ్రమ ఒక్కటే సరిపోదు కొన్ని రహస్యాలను దాచడం కూడా తెలియాలి. అందులో మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది మౌనం సాధారణంగా మనం అనుకుంటాం రహస్యం అంటే ఏదో తప్పు చేసి దాచడం కదా అని కానీ మన శాస్త్రం ప్రకారం రహస్యం అంటే దాచడం కాదు శక్తిని కూడగట్టడం.
(00:29) మీరు గమనించారా ఒక డ్ామ్ నీళ్ళను ఆపి ఉంచినప్పుడే దాని నుండి కరెంట్ పుడుతుంది. గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలేస్తే శక్తి రాదు. మనిషి కూడా అంతే నోరు తెరిచి వాగుతూ ఉంటే శక్తి పోతుంది. మౌనంగా ఉంటే ఆ శక్తి లోపలే నిల్వ ఉండి మీ మాటకి వాక్ శుద్ధి వస్తుంది. శివుడు విషాన్ని ఎందుకు దాచుకున్నాడు? మౌనం గురించి చెప్పాలంటే పరమశివుడిని మించిన గురువ లేడు.
(00:56) క్షీరసాగర మధనం జరిగినప్పుడు హాలాహలం అంటే విషం పుట్టింది. లోకాలను కాపాడటానికి శివుడు దాన్ని తాగాడు కానీ మింగలేదు. అలా అని బయటకు ఊయలేదు. తన గొంతులోనే బంధించాడు. అందుకే ఆయన నీలకంటుడుఅయ్యాడు. దీని వెనుక ఉన్న గొప్ప లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా చాలాసార్లు విషన్ లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు అకారణంగా నిందించవచ్చు మీ మనసును గాయపరచవచ్చు.
(01:23) అప్పుడు ఆ విషాన్ని అంటే కోపాన్ని లోపలికి మింగకండి. అది మిమ్మల్ని డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. అలా అని బయటకు కక్కకండి అంటే రియాక్ట్ అవ్వకండి. అది బంధాలను నాశనం చేస్తుంది. శివుడిలా మౌనంగా ఉండండి. ఆ విషాన్ని అక్కడే ఆపేయండి. ఆ మౌనమే మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి గట్టెక్కిస్తుంది. మిమ్మల్ని దేవుడిని చేస్తుంది.
(01:49) శాస్త్రం ఏం చెబుతోందంటే ఆచరణే వాచాలం అంటే చేసే పని మాట్లాడాలి కానీ నోరు కాదు. మీరు గమనించండి సింహం వేటాడేటప్పుడు గర్జించదు నిశశబ్దంగా ఉంటుంది. పని పూర్తయ్యాకే గర్జిస్తుంది. మీరు ఏదైనా గొప్ప పని మొదలు పెట్టినప్పుడు నేను అది చేస్తా ఇది పొడి చేస్తా అని అందరికీ చెప్పుకుంటూ పోతే మీ మెదడులో ఉండే డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ పని చేసేసాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
(02:14) దాంతో ఆ పని చేయాలన్న కసి చచ్చిపోతుంది. అందుకే పనులు విజయవంతం కావాలంటే ఫలితం వచ్చేవరకు పెదవి విప్పకూడదు. యద్భావం తద్భవతి అంటే మనం ఏది బలంగా అనుకుంటే అది జరుగుతుంది. కానీ మనం అనుకున్నది జరగాలంటే మన సంకల్పానికి బలం ఉండాలి. మీరు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే మీ ప్రాణశక్తి మాటల రూపంలో ఖర్చయపోతుంది. మీ మాటలకు విలువ ఉండదు.
(02:39) అదే మీరు మౌనాన్ని పాటిస్తే మీ మాటలకు మంత్ర శక్తి వస్తుంది. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండి మీ లక్ష్యం గురించి ఆలోచిస్తారో విశ్వం మీ మాట వినడం మొదలు పెడుతుంది. ఋషులు మునులు అడవుల్లో మౌన వ్రతం చేసేది ఇందుకే. అనవసరమైన వాదనలు వద్దు. మీ గురించి గొప్పలు చెప్పుకోవడం వద్దు. ఎవరైనా విమర్శిస్తే చిరునవ్వుతో మౌనంగా ఉండండి. ఆ మౌనం వారిని భయపెడుతుంది.
(03:04) మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకల్ప బలం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మిత్రులారా మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటారు లేదా ఒక ఇల్లు కొనాలనుకుంటారు. ఆ ఆనందాన్ని ఆపుకోలేక మీ స్నేహితులకు బంధువులకు నేను అది చేయబోతున్నా ఇది కొనబోతున్నా అని ఉత్సాహంగా చెప్పేస్తారు. కట్ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ పని ఆగిపోతుంది.
(03:37) లేదా ఏదో ఒక అవాంతరం వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు మీరు అనుకుంటారు అరే మొన్నటిదాకా అంతా బాగానే ఉందే సడన్ గా ఏమైంది అని ఏమైందంటే మీ సంకల్ప బలం లీక్ అయిపోయింది. మన రెండవ రహస్యం ఇదే నీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరికీ చెప్పకు కృష్ణ నీతి దీనికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే పెద్ద ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
(04:08) కానీ ఏ రోజు ఏం జరగబోతుందో కృష్ణుడు పాండవులకు కూడా ముందుగా చెప్పలేదు. ఉదాహరణకు సైంధవవ వధ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుడిని చంపకపోతే నేను అగ్నిలో దూకుతాను అని కౌరవులందరూ సైంధవుడిని దాచేస్తారు. సూర్యాస్తమయం అయిపోతుంది. పాండవులు భయపడిపోతారు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుని కాసేపు దాచాడు.
(04:36) చీకటి పడిందని సైంధవుడు బయటకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. చూశారా నేను సూర్యుని దాస్తాను అని కృష్ణుడు ముందే చెప్పాడా లేదు ఎందుకంటే వ్యూహం అనేది మనసులోనే ఉండాలి. అది బయట పడితే శత్రువు అలర్ట్ అయిపోతుంది. దిష్టి దోషం మన పెద్దలు ఒక సామెత చెబుతారు నరుడి దిష్టి సోకితే నా పరాయి కూడా పగులుతుంది అని ఇది మూఢ నమ్మకం కాదు ఒక నెగిటివ్ ఎనర్జీ మీరు నలుగురితో మీ ప్లాన్ చెప్పినప్పుడు వినేవారందరూ మీ శ్రేయోభిలాషులు కాదు.
(05:11) పైకి అబ్బో కంగ్రాాట్స్ అని నవ్వుతారు కానీ లోపల వీడికి అప్పుడే ఇల్లు వచ్చేసిందా? వీడింత బాగుపడిపోయాడా అనే అసూయ మొదలవుతుంది. ఆ అసూయతో కూడిన చూపు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ పని మీద పడుతుంది. దాంతో జరగాల్సిన పని కూడా చెడిపోతుంది. అందుకే గర్భం ధరించిన స్త్రీ కడుపు కనిపించకుండా ఎలా జాగ్రత్త పడుతుందో మీ సంకల్పం నెరవేరే వరకు దాన్ని అలాగే దాచుకోవాలి అని శాస్త్రం చెబుతోంది.
(05:40) సైకలాజికల్ రీజన్ సైకాలజీ ప్రకారం మనం చేయబోయే పని గురించి గొప్పగా చెప్పేసుకున్నప్పుడు మన మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ పని ఇంకా చేయకముందే చేసినంత కిక్కు వచ్చేస్తుంది. దాంతో ఇక ఆ పని చేయడానికి కావాల్సిన కసి పట్టుదల తగ్గిపోతాయి. నీరు ఆవిరి కాకుండా ఉండాలంటే పాత్ర మీద మూత పెట్టాలి. అలాగే సంకల్పం సిద్ధించాలంటే నోరు మూసి ఉంచాలి.
(06:09) మీ ఇల్లు పూర్తై గృహప్రవేశం చేసేదాకా ఎవ్వరికీ చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చి ఆఫర్ లెటర్ చేతికి వచ్చాక చెప్పండి. పని జరగకముందే డప్పు కొట్టకండి. వర్క్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్ గుప్తదానం ఓం అన్నపూర్ణాయై నమః మిత్రులారా ఈ రోజుల్లో దానం చేయడం అంటే ఒక చేత్తో పండిస్తూ మరో చేతితో సెల్ఫీ తీసుకోవడం అయిపోయింది.
(06:38) సోషల్ మీడియాలో లైకుల కోసం చేసే ఈ సహాయాన్ని దేవుడు స్వీకరిస్తాడా? కచ్చితంగా స్వీకరించడు. మన మూడవ రహస్యం ఇదే గుప్తదానం మన పెద్దలు [సంగీతం] బైబిల్ ఖురాన్ గీత అన్ని ఒకే మాట చెబుతాయి. నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎందుకంటే దానం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం అది రహస్యంగా ఉన్నంతవరకే దానికి శక్తి ఉంటుంది. ఒక్కసారి అది [సంగీతం] 10 మందికి తెలిస్తే ఆ శక్తి ఆవిరైపోతుంది.
(07:08) దానం ఎందుకు వ్యాపారం కాకూడదు మీరు గుడిలో ఒక ఫ్యాన్ చేయించారు అనుకుందాం. వెంటనే దాని రెక్కల మీద ఫలానా వారి జ్ఞాపకార్థం అని మీ పేరు రాసేస్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ ఆ పేరు చదువుతారు. అబ్బో వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని మెచ్చుకుంటారు. అక్కడితో ఆ లెక్క సరిపోయింది. మీరు డబ్బు ఇచ్చారు సమాజం మీకు కీర్తిని ఇచ్చింది.
(07:31) ఇది కేవలం ఒక వ్యాపారం ఇందులో మీకు మిగిలే పుణ్యం ఏమీ [సంగీతం] లేదు. ఎప్పుడైతే మీరు పేరు ఆశించకుండా సహాయం చేస్తారో సమాజం మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు కానీ దేవుడు తన చిట్టాలో మీ పేరు రాసుకుంటాడు. మనకు కావాల్సింది మనుషుల లైకులు కాదు దేవుడి ఆశీర్వాదం కర్ణుడు దానగుణం మహాభారతంలో దానవీర సూర కర్ణ అని ఎందుకు అంటారు కర్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చి యాచకులం అని అడిగితే రేపురా ఎల్లుండి రా అని చెప్పేవాడు కాదు.
(08:05) ఆ క్షణంలో తన దగ్గర ఏమ ఉంటే అది ఇచ్చేసేవాడు. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని పరీక్షిస్తాడు. దానం చేసేటప్పుడు కర్ణుడు తన ఎడమ చేతితో బంగారం తీసి ఇచ్చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు కర్ణ శుభకార్యం కుడి చేతితో కదా చేయాలి అని దానికి కర్ణుడు అద్భుతమైన సమాధానం ఇస్తాడు. మాధవా మనిషి మనసు చంచలమైనది. కుడి చేతిలోకి తీసుకునే లోపు నా మనసు మారిపోవచ్చు లేదా నా మీద నాకు లోభం పుట్టవచ్చు.
(08:33) అందుకే ధర్మం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. అది దానం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా చేసేదే సాత్విక దానం. పుణ్యం దక్కాలంటే ఎలా చేయాలి? పుణ్యం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. మీరు దానం చేశాక ఆ విషయాన్ని రహస్యంగా ఉంచితే దానికి వడ్డీ పెరిగి మీ కష్టకాలంలో ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అదే మీరు అందరికీ డప్పు కొట్టుకుంటే ఆ బ్యాలెన్స్ ని మీరే విత్డ్రా చేసుకున్నట్లు మీ కీర్తి కండూతి తీరిపోతుంది. కానీ పుణ్యం మిగలదు.
(09:04) గుడి హుండీలో డబ్బు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా వేయండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి. కానీ ఫోటోలు తీయకండి. ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తే ఆ విషయం మూడో వ్యక్తికి చెప్పకండి. మీ దానం గుప్తంగా ఉంటే దేవుడి అనుగ్రహం వ్యక్తమవుతుంది. మంత్ర వీర్యం ఓం శ్రీ గురుభ్యో నమః మిత్రులారా ఈ రోజుల్లో స్నేహితులు కలుసుకున్నప్పుడు నేను ఆ మంత్రం జపిస్తున్నాను నువ్వు ఏ మంత్రం చదువుతున్నావు అని క్యాజువల్ గా అడిగేస్తుంటారు.
(09:36) మీరు కూడా అమాయకంగా మీ గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని వాళ్ళకి చెప్పేస్తుంటారు. అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మన నాలుగవ రహస్యం మంత్ర వీర్యం శాస్త్రం ప్రకారం గుప్త పారాయణం అంటే రహస్య జపం మాత్రమే ఫలితాన్ని [సంగీతం] ఇస్తుంది. మంత్రం అనేది ఒక పబ్లిక్ న్యూస్ కాదు. అది మీ ఆత్మకు సంబంధించిన పాస్వర్డ్. విత్తనం సూత్రం. మంత్రాన్ని ఒక విత్తనంతో పోలుస్తారు.
(10:02) ఒక విత్తనం మొలకెత్తి మహా వృక్షం కావాలంటే ఏం చేయాలి? దాన్ని మట్టిలో పాతి పెట్టి కప్పేయాలి. అప్పుడే దానికి శక్తి వచ్చి మొలకెత్తుతుంది. అలా కాకుండా నా విత్తనం ఎంత బాగుందో చూడండి అని దాన్ని మట్టిలోనుంచి బయటకు తీసి అందరికీ చూపిస్తూ ఉంటే అది మొలకెత్తుతుందా చచ్చిపోతుంది. మంత్రం కూడా అంతే మీరు దాన్ని మీ మనసు అని మట్టి పొరల్లో ఎంత రహస్యంగా దాచుకుంటే అంత త్వరగా అది సిద్ధిస్తుంది.
(10:32) బయట పెడితే అది నిష్ఫులం అవుతుంది. గురువు ఎందుకు చెవిలో చెబుతారు మంత్రోపదేశం చేసేటప్పుడు గురువుగారు పైన గుడ్డ కప్పి శిష్యుడి కుడి చెవిలో మాత్రమే మంత్రాన్ని ఉచ్చరిస్తారు ఎందుకు అది కేవలం శబ్దం కాదు అది ఒక శక్తి ప్రవాహం గురువు తన తపోశక్తిని ఆ మంత్రం ద్వారా శిష్యుడికి అందిస్తారు. ఆ శక్తి బయటకు పోకుండా ఉండాలంటే గోప్యత చాలా ముఖ్యం.
(10:58) మీరు ఆ మంత్రాన్ని భార్యకు గాని మిత్రులకు గాని చెబితే ఆ గురు పరంపరతో ఉన్న లింక్ కట్ అయిపోతుంది. బ్యాటరీ డిస్చార్జ్ అయిపోయినట్లు ఆ మంత్రానికి ఉన్న వీర్యం తగ్గిపోతుంది. బీజాక్షరాల శక్తి సాధారణ నామాలకు బీజాక్షరాలకు తేడా ఉంది. క్లీం హ్రీం శ్రీం వంటి బీజాక్షరాలు అణుశక్తి లాంటివి. మీరు గట్టిగా పైకి అరిచి జపం చేస్తే ఆ శబ్ద తరంగాలు గాలిలో కలిసిపోతాయి.
(11:28) అదే మీరు పెదవి కదల్చకుండా మనసులో జపిస్తే ఆ శబ్ద శక్తి మీ నాడులలో ప్రవహించి మీ కుండలిని శక్తిని మేలుకొలుపుతుంది. ప్రెజర్ కుక్కర్లో ఆవిరిని బంధిస్తేనే కదా లోపల అన్నం ఉడికేది. విజిల్ తీసేస్తే ఉడకదు కదా అలాగే మంత్రాన్ని లోపల బంధిస్తేనే మీ కర్మలు కాలిపోతాయి. హరే రామ ఓం నమఃశివాయ వంటి నామ సంకీర్తనను అందరూ పైకి పాడుకోవచ్చు తప్పులేదు.
(11:56) కానీ గురువు ప్రత్యేకంగా మీకోసం ఇచ్చిన దీక్షా మంత్రాన్ని బయట పెట్టకూడదు. ఎవరైనా మీ మంత్రం ఏంటి అని అడిగితే చిరునవ్వుతో అది గురు రహస్యం చెప్పకూడదు అని చెప్పండి. అది అహంకారం కాదు అది మంత్ర గౌరవం గృహ చిద్రాలు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి మిత్రులారా మన పెద్దలు ఒక సామెత చెబుతారు. ఇంటి గుట్టు లంకకు చేటు అని నీ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కవాడికి తెలిస్తే వాడు నీ ఇంటిని లంకలా తగలబెట్టేస్తాడు.
(12:31) ఈ రోజుల్లో చిన్న గొడవ రాగానేవాట్సాప్ స్టేటస్ లో పెట్టడం ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి భర్త భార్య మీద చాడీలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ గుర్తుంచుకోండి మన ఐదవ రహస్యం గృహ చిద్రాలు ఇంటి గొడవలు గడప దాటకూడదు. దాటితే ఆ ఇంటి పతనం మొదలైనట్లే. మహాభారత గుణపాఠం. మాట జారితే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పడానికి మహాభారతంలోని మయసభ ఘటనే సాక్ష్యం.
(13:03) పాండవుల రాజభవనంలో దుర్యోధనుడు నడుస్తూ నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయని భ్రమపడి బట్టలు పైకెత్తుతాడు. అది చూసి ద్రౌపది పకపకా నవ్వుతారు. ఆ నవ్వు ఆ చిన్న అవమానం దుర్యోధనుడి గుండెలో ముల్లులా దిగింది. ఒక ఆడది నన్ను చూసి నవ్విందా అనే అహంకారం రగిలిపోయింది. ఆ ఒక్క నవ్వే ఆ తరువాత ద్రౌపది వస్త్రాపహరణానికి చివరికి మహాభారత యుద్ధానికి కోట్లాది మంది మరణానికి కారణమైంది.
(13:34) ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే కుటుంబ సభ్యుల లోపాలను నలుగురిలో ఎత్తి చూపకూడదు అవమానించకూడదు అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. మూడో వ్యక్తి ప్రమాదకరం. భార్యా భర్తల మధ్య గొడవలు సహజం అవి నీటి మీద రాతలాంటివి. ఈరోజు గొడవ పడతారు. రాత్రికి కలిసిపోతారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ గొడవను మీ స్నేహితుడికో లేదా పుట్టింటి వారికో చెబుతారో అప్పుడది రాతి మీద రాతలా మారుతుంది.
(14:06) ఎందుకంటే వినోదం వినేవాడికి మీ బాధ వినోదం మాత్రమే మీ గొడవ విని వాళ్ళు లోలోపల ఆనందిస్తారు. ఆద్యం వాళ్ళు మంటను ఆర్పరు ఇంకాస్త పెట్రోలు పోస్తారు. అవును నీ భర్త చేసింది తప్పు అసలు తగ్గకు అని ఎగదోస్తారు. శాశ్వత పగ రేపు మీ భార్యా భర్తలు కలిసిపోతారేమో కానీ మీ మధ్యలో దూరడానికి ప్రయత్నించిన ఆ మూడో వ్యక్తి మీ స్పౌజ ని ఎప్పటికీ గౌరవించడు. మీ పరువు బజార్లో ఉంటుంది.
(14:37) చాణక్య నీతి చాణక్యుడు ఏమంటాడంటే మీ భార్య గుణగణాల గురించి ఇంటి గొడవల గురించి మూర్ఖుడితో ఎప్పుడూ చర్చించకు గోడలకు చెవులు ఉంటాయి అంటారు. కానీ ఈ రోజుల్లో గోడలకు ఫోన్లు స్క్రీన్ షాట్లు ఉంటున్నాయి. మీరు ఆవేశంలో చెప్పే ప్రతి మాట రేపు మీకే వ్యతిరేకంగా మారుతుంది. మీ ఇంట్లో గొడవ జరిగిందా తలుపులు వేసేయండి. గట్టిగా అరుచుకోండి ఏడ్ చేయండి.
(15:04) కానీ తలుపు తీసి బయటకు వచ్చేసరికి ఏమీ జరగనట్లే చిరునవ్వుతో ఉండాలి. ప్రపంచానికి మీరు బెస్ట్ కపుల్ గానే కనిపించాలి. సమస్య మరీ పెద్దదైతే నిపుణులతో మాట్లాడండి తప్ప పక్కింటి వారితో కాదు దాంపత్య రహస్యం ఓం ఉమామహేశ్వరాయ నమః మిత్రులారా ఈ రోజుల్లో స్నేహితులు కలిసినప్పుడు మాటల మధ్యలో ఎరా లైఫ్ ఎలా ఉంది వైఫ్ తో ఎలా ఉంది అని అడిగేస్తుంటారు.
(15:31) దానికి సమాధానంగా చాలామంది తమ పడక గదిలో జరిగిన విషయాలను తమ భాగస్వామి ఇష్టాఇష్టాలను విషయాలను పూసగుచ్చినట్లు స్నేహితులకు చెప్పేస్తుంటారు నవ్వేస్తుంటారు కానీ హెచ్చరిక ఇది కేవలం తప్పు కాదు మహా పాపం మన ఆరవ రహస్యం దాంపత్య రహస్యం మన సనాతన ధర్మం ప్రకారం భార్యా భర్తల కలయక అనేది కేవలం శరీరాశ కాదు అది సృష్టికి మూలమైన ఒక పవిత్ర యజ్ఞం యజ్ఞాన్ని ఎంత నిష్టగా చేస్తామో దాంపత్యాన్ని కూడా అంతే రహస్యంగా పవిత్రంగా ఉంచాలి.
(16:08) అగస్త్యుడు లోపాముద్ర కథ. దీనికి గొప్ప ఉదాహరణ అగస్త్య మహర్షి మరియు లోపాముద్రల కథ. అగస్త్యుడు గొప్ప తపస్వి లోపాముద్ర రాజకుమార్తె. పెళ్లి తర్వాత అగస్త్యులు ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు లోపాముద్ర ఒక శరతు పెడుతుంది. స్వామి మనం కలిసే ఈ సమయం పవిత్రమైనది. నేను ఆశ్రమంలో నారచీరలతో ఉన్నప్పుడు కాదు ఒక రాజభవనంలో సుగంధ పరిమళాల మధ్య దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నప్పుడే నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అంటుంది.
(16:39) ఇది ఆమె అత్యాశ కాదు అది దాంపత్య గౌరవం. కలయిక అనేది జంతువుల్లా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా జరగకూడదు. దానికి ఒక స్థానం ఒక మానసిక స్థితి ఒక గౌరవం ఉండాలి అని ఆమె నేర్పింది. అగస్త్యుడు దాన్ని గౌరవించాడు కాబట్టే వారికి దృఢస్యుడు అనే గొప్ప తేజస్సు గల కొడుకు పుట్టాడు. స్నేహితులకు ఎందుకు చెప్పకూడదు మీరు మీ భార్య లేదా భర్తతో గడిపిన ఏకాంత క్షణాలను మీ ఫ్రెండ్ కు చెప్పారనుకోండి.
(17:06) ఆ క్షణం నుండి మీ ఫ్రెండ్ మీ భార్యను లేదా భర్తను చూసినప్పుడల్లా మీరు చెప్పిన విషయాలే వాడికి గుర్తొస్తాయి. అంటే పరోక్షంగా మీ భాగస్వామిని వాడి ఊహల్లో బట్టలు లేకుండా చేస్తున్నది మీరే ఇది మీ భాగస్వామికి మీరు చేస్తున్న ద్రోహం కాదా దీనివల్ల దృష్టి దోషం తగులుతుంది. మీ బంధం పలచబడుతుంది. రేపు గొడవలు వచ్చినప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసులే అని వాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం మీరే ఇచ్చినట్లు అవుతుంది.
(17:36) పవిత్రత శాస్త్రం ప్రకారం రతి రహస్యం బయటపడితే ఆయుష్యు క్షీణిస్తుంది. ఆ నాలుగు గోడల మధ్య జరిగేది మీ ఇద్దరి ఆత్మల సంభాషణ. అది మూడో కంటికి తెలియకూడదు. మీ బెడ్రూమ్ ని ఒక గుడిలా చూడండి. అక్కడ జరిగే విషయాలు అక్కడే వదిలేయండి. తప్ప టీ కొట్టు దగ్గర చర్చించకండి. ఎవరైనా స్నేహితుడు అతి చనువు తీసుకొని నిన్న రాత్రి ఏమైంది అని అడిగితే గట్టిగా సీరియస్ గా అది మా వ్యక్తిగతం అని చెప్పండి.
(18:05) మీ భార్య పరువు తీయకండి మీ పరువు పోగొట్టుకోకండి. వంశ లోపాలు ఓం శ్రీ గురుభ్యోం నమః మిత్రులారా కొంతమంది మాటల సందర్భంలో మా తాతగారు ఆస్తి మొత్తం తాగేసి [సంగీతం] తగలేశరండి లేదా మా పెద్దనాన్నగారు ఆ రోజుల్లో ఒక తప్పు చేసి జైలుకు వెళ్ళారు అని తమ వంశ చరిత్రలోని మాయని మచ్చలను బయట వారికి కథలుగా చెబుతుంటారు. మీరు నిజాయితీగా చెబుతున్నారని అనుకుంటున్నారు.
(18:31) కానీ చాణక్య నీతి ప్రకారం మీరు మీ గోతిని మీరే తీసుకుంటున్నారు. మన ఏడవ రహస్యం వంశలోపాలు కులాచారం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. అర్ధనాశం మనస్తాపం గృహమచ్చిద్రాణిచ వంచనం చాపమానంచ మతీమాన్ న ప్రకాశయేత్ అంటే బుద్ధిమంతుడైనవాడు తన వంశానికి జరిగిన అవమానాన్ని లేదా తన కుటుంబంలో ఉన్న లోపాలను ఎప్పుడూ బయట పెట్టకూడదు.
(19:02) ఎందుకంటే సమాజం ఎప్పుడూ గతాన్ని బట్టే వర్తమానాన్ని అంచనా వేస్తుంది. సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? సమాజం దృష్టిలో మీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక వంశ వృక్షానికి కాసిన పండు. మీరు అందరి దగ్గర మీ పూర్వీకుల చెడు అలవాట్ల గురించి చెబితే ఓహో వీళ్ళ రక్తంలోనే ఆ లోపం ఉంది అని జనం ఫిక్స్ అయిపోతారు. ఉదాహరణకు మీ వంశంలో ఎవరికైనా మోసం చేసే గుణం ఉంటే అది మీరు బయట పెడితే మీరు ఎంత నిజాయితీగా బతికినా వీడు కూడా వాళ్ళ తాతలాగే మోసం చేస్తాడేమో అని మిమ్మల్ని అనుమానిస్తారు.
(19:36) మీ పూర్వీకులు చేసిన తప్పుకు మీరు ఈ రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ చెడు చరిత్రను అక్కడితో సమాధి చేయండి. దాన్ని తవ్వి బయట పెట్టకండి. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇది చాలా సీరియస్ విషయం. మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈ విషయం బయట పడితే ఏమవుతుంది? అమ్మో వాళ్ళ వంశమా వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొడవలు ఉన్నాయి.
(20:00) వాళ్ళ కుటుంబ చరిత్ర మంచిది కాదు అని సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు నోరుజారి [సంగీతం] చెప్పిన ఒక్క మాట వల్ల ఏ పాపం తెలియని మీ పిల్లల భవిష్యత్తు వారి పెళ్లిళ్లుు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ వంశంలో ఏదైనా జెనెటిక్ లేదా ప్రవర్తన లోపం ఉన్నా దాన్ని వైద్యుల దగ్గర చర్చించాలి తప్ప రచ్చబండ దగ్గర కాదు. వంశ గౌరవాన్ని ఎలా పెంచాలి? మరి ఏం చేయాలి? అబద్ధం చెప్పాలా? అవసరం లేదు మౌనంగా ఉండండి లేదా మీ వంశంలోని మంచి విషయాలను మాత్రమే హైలైట్ చేయండి.
(20:34) మా తాతగారు పేదలకు అన్నదానం చేసేవారు [సంగీతం] మా నాన్నగారు చాలా కష్టజీవి అని పాజిటివ్ విషయాలు చెప్పండి. చెడు దాచి మంచిని పెంచడమే సంస్కారం. మీరు ఇప్పుడు నిలబడితేనే మీ వంశానికి ఉన్న పాత మచ్చ చెరిగిపోయి మీ పిల్లలకు ఒక కొత్త గౌరవప్రదమైన దారి ఏర్పడుతుంది. మీరే ఆ చెడును ప్రచారం [సంగీతం] చేస్తే అది తరతరాలు వెంటాడుతుంది.
(20:59) మీ ఇంటి పాత గోడలకు బీటలు వారితే సిమెంట్ వేసి పూర్చాలి కానీ చూడండి మా గోడలు పగిలిపోతున్నాయి అని అందరికీ చూపిస్తే దొంగలు పడతారు లేదా ఇల్లు కూలిపోతుంది. వంశం కూడా అంతే. ఆహార నియమం ఓం అన్నపూర్ణాయై నమః మిత్రులారా ఈ రోజుల్లో మనం పార్టీలని రెస్టారెంట్లని నలుగురిలో కలిసి భోజనం చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా ఘోరం ఏమిటంటే తినే ముందు ఆ ప్లేట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ మన పెద్దలు ఋషులు ఏం చెప్పారో తెలుసా? అన్నం తినేటప్పుడు ఎంత రహస్యంగా తింటే అంత మంచిది.
(21:38) మన ఎనిమిదవ రహస్యం ఆహార నియమం అదేంటి తినడం కూడా దాచాలా ఇదేమైనా స్వార్థమా అని మీకు సందేహం రావచ్చు. ఇది స్వార్థం కాదు ఇది ఆత్మ రక్షణ అన్నం పరబ్రహ్మ స్వరూపం మన సంస్కృతిలో భోజనం చేయడం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు అదొక యజ్ఞం మన కడుపులో ఉండే ఆకలిని జటరాగ్ని అంటారు. మనం తినే అన్నం ఆ అగ్నిలో వేసే హవిస్సు దీనిని ప్రాణాగ్నిహోత్రం అంటారు.
(22:10) ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నప్పుడు దాన్ని బహిరంగంగా అందరూ చూస్తుండగా నవ్వుతూ మాట్లాడుతూ ఎలా చేయకూడదో భోజనం కూడా అలాగే చేయాలి. అందుకే పూర్వం రోజుల్లో వంటింట్లో లేదా ఎవరూ చూడని చోట కూర్చుని తినేవారు. దృష్టి దోషం సైన్స్ ఎవరెవరు మన భోజనాన్ని చూడకూడదు. బాగా ఆకలితో ఉన్నవారు మీరు బాగా పక్ష పరమాణాలు తింటున్నప్పుడు పక్కన ఎవరైనా ఆకలితో ఉండి మీ ప్లేటు వంక దీనంగా చూస్తే వారి కళ్ళ నుండి వచ్చే ఆ వైబ్రేషన్ మీ ఆహారంలోకి ప్రవేశిస్తుంది.
(22:46) శత్రువులు లేదా గిట్టని వారు మీరంటే పడని వారు మిమ్మల్ని చూస్తూ వీడు దర్జాగా తింటున్నాడు అని అసూయ పడితే ఆ నెగటివ్ ఎనర్జీ ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది. దీన్నే విష అన్నం అంటారు. ఇలాంటి ఆహారం తింటే అది జీర్ణం కాదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, రక్తం చెడిపోతుంది, లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే ఎదుటివాడి ఆకలి తీర్చకుండా నువ్వు తినకూడదు [సంగీతం] అని మన ధర్మం చెప్తోంది.
(23:15) పక్కన ఎవరైనా ఉంటే వారికి పెట్టి తినండి లేదా ఎవరూ చూడకుండా తినండి. సోషల్ మీడియా రోగం. దయచేసి WhatsApp స్టేటస్ లలో Instagram లో ఫుడ్ ఫోటోలు పెట్టకండి. ఆ ఫోటోను వందలాది మంది చూస్తారు. అందులో ఎవరి కడుపు మండిందో ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. మరుసటి రోజే మీకు కడుపు నొప్పి రావచ్చు లేదా ఆ రోజు తిన్నది వంటపట్టకపోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
(23:42) మౌనం ఏకాంతం తినేటప్పుడు టీవీలు చూడటం ఫోన్లు మాట్లాడడం మానేయండి. మౌనంగా తినడం వల్ల లాలాజలం బాగా ఊరి ఆహారం అద్భుతంగా జీర్ణం అవుతుంది. మీ ఏకాగ్రత ఆహారం మీద ఉంటే అది నేరుగా సప్తధాతువులుగా మారుతుంది. వీలైనంతవరకు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి తినండి. బయట తినాల్సి వస్తే నిర్మానుష్యంగా ఉన్న మూల సీటును ఎంచుకోండి.
(24:10) అందరికీ కనిపించేలా మధ్యలో కూర్చోకండి. తినే ముందు కనీసం ఒక్క ముద్ద కాకికి గాని ఆవుకు గాని కుక్కకు గాని పెట్టండి. ఆ తరువాతే మీరు తినండి ఆ దోషం పోతుంది. ధన రహస్యం ఓం శ్రీ మహాలక్ష్మియే నమః మిత్రులారా ఈ రోజుల్లో మనిషి విలువను మనీతో కొలుస్తున్నారు. అందుకే మన తొమ్మిదవ రహస్యం చాలా కీలకమైనది. ధన రహస్యం ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పారు అర్ధనాశం మనస్తాపం అంటే ధన నష్టం జరిగినా లేదా మీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఆ విషయాన్ని బుద్ధిమంతుడు ఎప్పుడూ బయట పెట్టకూడదు ఎందుకంటే డబ్బు లేదని చెబితే చులకనవుతావు డబ్బు ఉందని చెబితే దోపిడీకి గురవుతావు
(24:57) డబ్బు ఉందని చెబితే ఏమవుతుంది తేనె ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ చేరుతాయి బెల్లం చుట్టూ చీమలు చేరుతాయి. అలాగే నా దగ్గర చాలా డబ్బు ఉంది. మొన్నే ఆస్తి అమ్మితే కోటి రూపాయలు వచ్చాయి అని మీరు గొప్పలకు పోయి చెప్పారనుకోండి ఏమవుతుంది? అప్పుల బెడద అప్పటిదాకా పలకరించని బంధువులు కూడా అవునా మా అమ్మాయి పెళ్లి ఉంది ఒకఐదు లక్షలు సర్దు అంటూ మీ ఇంటి ముందు క్యూ కడతారు.
(25:23) ఇవ్వకపోతే శత్రువులు అవుతారు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు. మోసగాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి కొత్త కొత్త స్కీములు తీసుకొని వస్తారు. భద్రత దొంగల భయం లేదా ప్రభుత్వం లేదా ఐటీ కళ్ళల్లో పడే ప్రమాదం ఉంది. డబ్బు లేదని చెబితే ఏమవుతుంది? పోనీ నా దగ్గర చిల్లిగవ్వలేదు నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని నిజం చెప్పేద్దామా? అస్సలు చెప్పకూడదు.
(25:51) ఈ సమాజం చాలా విచిత్రమైనది. మీరు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే జాలి చూపించరు చులకన చేస్తారు. రేపు పొద్దున్న మీకు నిజంగా సహాయం అవసరమైనప్పుడు మీ ఫోన్ ఎత్తడం మానేస్తారు. వీడు డబ్బు అడగడానికే చేస్తున్నాడేమో అని ముఖం చాటేస్తారు. వ్యాపారంలో మీకు రావలసిన అవకాశాలు రావు. వాడి దగ్గర డబ్బే లేదు వాడు ఆ పని ఏం చేస్తాడు అని నమ్మకం కోల్పోతారు.
(26:17) సింహం ఆకలితో ఉన్న గడ్డి తినదు. అలాగే మీ జేబులో రూపాయి లేకపోయినా మీ ముఖంలో రాజసం తగ్గకూడదు అప్పుడే లక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి స్వభావం లక్ష్మీదేవిని చంచల అంటారు. ఆమె ఒక దగ్గర నిలకడగా ఉండదు. ఎవరైతే తన ఐశ్వర్యాన్ని ప్రదర్శన వస్తువుగా మారుస్తారో వారి దగ్గర నుండి ఆమె త్వరగా వెళ్ళిపోతుంది. ఎవరైతే తనను గుప్తంగా గౌరవంగా చూసుకుంటారో వారి ఇంట స్థిరపడుతుంది.
(26:47) మరి ఏం చేయాలి? ఎవరైనా మీ ఆస్తి ఎంత మీ జీతం ఎంత అని అడిగితే ఎప్పుడూ ఖచ్చితమైన సమాధానం చెప్పకండి. దేవుడి దయ వల్ల అంతా బాగుంది లేదా పప్పుకూడుకు లోటు లేదు అని చెప్పి దాటవేయండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ భార్యకు లేదా భర్తకు మీ వారసులకు మాత్రమే తెలియాలి. పక్కింటి వారికి కాదు ఔషధ రహస్యం ఓం శ్రీ ధన్వంతరయే నమః మిత్రులారా మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది.
(27:17) చిన్న జ్వరం వచ్చినా లేదా ఏదైనా పెద్ద సమస్య వచ్చినా కలిసిన ప్రతి ఒక్కరికీ నాకు షుగర్ ఉంది నాకు బీపీ ఉంది నేను ఆ డాక్టర్ గారి మందులు వాడుతున్నాను అని చెప్పుకుంటూ పోతారు. కానీ హెచ్చరిక మన 10వ రహస్యం ఔషధ రహస్యం మన పెద్దలు ఒక మాట అంటారు మందు మంత్రం పని చేయాలంటే నమ్మకం ఉండాలి అని ఔషధాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచాలి అది ఎంత రహస్యంగా ఉంటే దానికి అంత శక్తి ఉంటుంది.
(27:47) దీని వెనక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని ఇప్పుడు చూద్దాం. నమ్మకం అనే వారది. మీరు ఒక మందు వేసుకుంటున్నప్పుడు అది కేవలం కెమికల్ మాత్రమే కాదు ఈ మందు నన్ను తగ్గిస్తుంది అనే మీ గట్టి నమ్మకమే ఆ మందుని మీ శరీరానికి పట్టిస్తుంది. దీన్నే సైన్స్ లో ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ మందు గురించి నలుగురికి చెబుతారో అప్పుడు వారి మాటలు మీ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.
(28:15) ఉదాహరణకు మీరు ఒక మందు వాడుతున్నారు. మీ స్నేహితుడికి చెప్పారు. వాడు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఎరా ఇంకా తగ్గలేదా నువ్వు డల్లుగా కనిపిస్తున్నావు ఆ మందు పని చేస్తున్నట్టు లేదు అని అన్నాడనుకోండి. ఆ మాట మీ మనసులో ఒక విషపు విత్తనాన్ని నాటుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ వెంటనే అవును కదా నాకు తగ్గట్లేదు ఈ మందు వేస్ట్ ఏమో అని అనుకోవటం మొదలు పెడుతుంది.
(28:38) ఎప్పుడైతే మనసులో సందేహం వచ్చిందో ఎంత ఖరీదైన మందు వేసుకున్నా అది శరీరానికి వంటబట్టదు. ఔషధ శక్తిని ఆ సందేహం చంపేస్తుంది. డాక్టర్ల మీద నెగిటివ్ కామెంట్స్ మీరు ఫలానా డాక్టర్ దగ్గర మందు తీసుకుంటున్నాను అనగానే అవతలి వ్యక్తి అయ్యో ఆ డాక్టరా ఆయన చేతివాటం అస్సలు మంచిది కాదు ఆయన మందులు వాడితే కిడ్నీలు పోతాయంట అని ఒక ఉచిత సలహా పడేస్తాడు.
(29:04) నిజానికి ఆ డాక్టర్ మంచివాడే కావచ్చు కానీ ఈ మాట విన్నాక మీరు వేసుకునే ప్రతి మాత్ర విషంలా అనిపిస్తుంది. ఫలితం శూన్యం అవుతుంది. పురాతన పద్ధతి అందుకే పూర్వం ఆయుర్వేద వైద్యులు మందుని ఒక ప్యాకెట్ కట్టి ఇచ్చేవారు. దీన్ని ఎవరికీ చూపించకుండా దేవుణని తలచుకొని వేసుకో అని చెప్పేవారు. దాని అర్థం ఆ ఫార్ములాను దాచడం అని కాదు ఆ రోగి యొక్క ఏకాగ్రతను కాపాడటం మొక్క ఎదగాలంటే విత్తనం మట్టి లోపల చీకటిలో ఎలా ఉండాలో ఆరోగ్యం కుదుటపడాలంటే మీరు వాడే ఔషధం కూడా గోప్యంగా ఉండాలి.
(29:40) మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే దాన్ని మీ డాక్టర్ కి మీ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పండి. WhatsApp గ్రూపుల్లో మెడికల్ [సంగీతం] రిపోర్ట్స్ పెట్టకండి. ఎవరైనా ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగితే చాలా బాగుంది కోలుకుంటున్నాను అని పాజిటివ్ గా చెప్పండి. ఆ మాటే మిమ్మల్ని బ్రతికించుకుంటుంది. నష్టపోయిన పరువు ఓం శ్రీ గురుభ్యో నమః మిత్రులారా జీవితం అన్నాక ఒడిదుడుకులు సహజం ఈరోజు కోట్లు సంపాదించినవాడు రేపు రోడ్డు మీదకు రావచ్చు.
(30:10) ఈరోజు సమ్మానం పొందినవాడు రేపు అవమానం పొందవచ్చు. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది చేసే పెద్ద తప్పు సానుభూతి కోసం ఆశపడటం మన 11వ రహస్యం నష్టపోయిన పరువు మరియు ధన నష్టం చాణక్య నీతిలో ఒక అద్భుతమైన మాట ఉంది. నీకు జరిగిన ధన నష్టాన్ని గాని 10 మందిలో జరిగిన అవమానాన్ని గాని బుద్ధిమంతుడు ఎప్పుడూ బయట పెట్టకూడదు. ఎందుకు సింహం లాంటి రాజసం అడవిలో సింహం ఎలా బతుకుతుందో చూడండి.
(30:42) సింహానికి వేట దరక్క వారం రోజులు పస్తులు ఉండొచ్చు ఆకలితో కడుపు మండిపోవచ్చు అంతమాత్రాన అది వెళ్లి గడ్డి తింటుందా కుక్కలాగా బిస్కెట్ల కోసం తోక ఊపుతుందా అస్సలు చేయదు. అది ఆకలితో చావడానికైనా సిద్ధపడుతుంది కానీ తన రాజసాన్ని వదులుకోదు మనిషి కూడా అంతే నీకు వ్యాపారంలో నష్టం వచ్చి ఉండొచ్చు చేతిలో చిల్లిగవ్వ లేకపోవచ్చు కానీ ఆ ధైన్యాన్ని నీ ముఖంలో చూపించకూడదు.
(31:09) నీ నడకలో నీ చూపులో ఆ కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. నువ్వు ఎప్పుడైతే అయ్యో నా బతుకు ఇలా అయిపోయింది అని ఏడుస్తూ నలుగురికి చెబుతావో అప్పుడు నువ్వు సింహంలా కాదు వేటగాడి వలలో చిక్కుకున్న జింకలా కనిపిస్తావు. లోకం నిన్ను చూసి జాలిపడదు వేర్న పురుగును చూసినట్లు చూస్తుంది. చెప్పితే వచ్చే అనర్థాలు మీరు నష్టపోయారని తెలిస్తే ఏమవుతుంది? వ్యాపారం వీడి పని అయిపోయింది అని మార్కెట్లో టాక్ వస్తుంది.
(31:36) మీకు సరుకు ఇచ్చేవాడు ఇవ్వడు అప్పు ఇచ్చేవాడి ఇవ్వడు ఉన్న అవకాశాలు కూడా చేయజారిపోతాయి. స్నేహం వీడు డబ్బు అడుగుతాడేమో అని స్నేహితులు ఫోన్ ఎత్తడం మానేస్తారు. అవమానం మీకు జరిగిన అవమానాన్ని చెబితే వీడికి జరగాల్సిందేలే అని వెటకారం చేస్తారు. గుర్తుంచుకోండి ప్రపంచం గెలిచిన వాడిని గౌరవిస్తుంది. పోరాడే వాడిని ఆరాధిస్తుంది.
(31:59) కానీ ఏడ్చే వాడిని ఏడిపిస్తుంది. మౌనమే ఆయుధం నష్టం వచ్చినప్పుడు అరవకండి ఏడవకండి ఆ నిజాన్ని గుండెలో దాచుకోండి. ఆ బాధను [సంగీతం] కసిగా మార్చుకోండి. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎక్కడైతే మీరు నష్టపోయారో అక్కడే మళ్ళీ తలెత్తుకునేలా గెలవాలి. మీ విజయమే ఆ అవమానానికి అసలైన సమాధానం. అప్పటివరకు మీ పరిస్థితి గురించి ఎవ్వరికీ వివరణ ఇవ్వకండి.
(32:26) బాగున్నాను అద్భుతంగా ఉన్నాను అనే చెప్పండి. ఆ పాజిటివ్ మాటే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుంది. కష్టాలు వస్తాయి పోతాయి కానీ ఒక్కసారి పోగొట్టుకున్న ఆత్మగౌరవం మళ్ళీ రాదు. కాబట్టి సానుభూతి అనే బిచ్చం అడక్కండి పోరాడి గెలవండి. అప్పులు రుణాలు ఓం రుణ విమోచకాయ నమః మిత్రులారా ప్రస్తుత సమాజంలో అప్పులేని మనిషిని వెతకడం కష్టం. ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువులకో వ్యాపారానికో ఎంతో కొంత అప్పు చేస్తాం.
(32:55) అయితే ఇక్కడ మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే మనకున్న అప్పుల గురించి మన ఆర్థిక ఇబ్బందుల గురించి అనవసరమైన వ్యక్తులతో చర్చించడం మన 12వ రహస్యం అప్పులు రుణాలు చాణక్య నీటి ప్రకారం మీ అప్పుల చిట్ట మీ శత్రువులకు ఎప్పుడూ తెలియకూడదు ఎందుకు శత్రువుకి ఆయుధం మీరు ఎవరి దగ్గర ఎంత అప్పు చేసారో మీ గిట్టని [సంగీతం] వాడికి తెలిస్తే వాడికి చేతిలో కత్తి అవసరం లేదు మీ అప్పులే వాడికి ఆయుధాలు వాడు ఏం చేస్తాడంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీస కున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్లి వాడి పరిస్థితి బాగోలేదు దివాళ తీస్తున్నాడు.
(33:30) మీ డబ్బులు వెంటనే అడగండి లేకపోతే మునిగిపోతాయి అని భయాన్ని పుట్టిస్తాడు. దాంతో అప్పటిదాకా మిమ్మల్ని నమ్మిన అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా ఒక్కసారిగా ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తాడు. సమాజంలో మీ పరువు పోతుంది. మీరు మానసికంగా కుంగిపోతారు. ఒక మనిషిని యుద్ధంలో ఓడించడం కష్టం కానీ అప్పుల వాళ్ళతో అవమానింపజేస్తే వాడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాడు.
(33:53) అందుకే మీ అప్పుల గురించి బయట ఎక్కడా మాట్లాడకండి సమాజం నమ్మదు. నాకు చాలా అప్పులు ఉన్నాయి. వడ్డీలు కట్టలేకపోతున్నాను అని మీరు దీనంగా అందరికీ చెప్పుకుంటే ఎవ్వర మీకు సహాయం చేయరు సరి కదా ఉన్నదారులు కూడా మూసుకుపోతాయి. వ్యాపారంలో మీకు సరుకు ఇచ్చేవాడు ఆపేస్తాడు. చేతి బదులు ఇచ్చేవాడు కూడా ముఖం చాటేస్తాడు. మీరు అప్పు తీర్చాలంటే మీరు సంపాదించాలి.
(34:14) మీరు సంపాదించాలంటే సమాజం మిమ్మల్ని నమ్మాలి. మీరు మీ కష్టాలు చెప్పుకుంటే ఆ నమ్మకం పోతుంది. చాణక్య నీతి మీరు అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి బయటకు చాలా హుందాగా ధైర్యంగా రాజసంగా ఉండాలి. మీ ముఖంలో అప్పుల బాధ కనిపించకూడదు. అప్పుడే లక్ష్మీ మీ దగ్గరకు వస్తుంది. లోపల ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మాత్రం పొదుపు పాటించాలి.
(34:36) అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ప్రతి రూపాయిని అప్పు తీర్చడానికే వాడాలి. కానీ చాలా మంది రివర్స్ లో చేస్తారు. బయట ఏడుస్తూ తిరుగుతారు. ఇంట్లో మాత్రం జలసాలు చేస్తారు. అందుకే అప్పులు తీరవు. అప్పు ఇచ్చిన వ్యక్తితో మాత్రమే మీ కష్టాలు చెప్పండి. గడువు అడగండి నిజాయితీగా ఉండండి కానీ మూడో వ్యక్తికి పక్కింటి వాడికి ఆఫీసులో కొలీగ్స్ కి మీ ఈఎంఐ ల గురించి అప్పుల గురించి చెప్పకండి.
(35:00) రుణ విముక్తి అయ్యేదాకా ఆర్థిక పరిస్థితిని దాచడమే తెలివైన వాడి లక్షణం. శత్రు రహస్యం ఓం శ్రీరామచంద్రాయ నమః మిత్రులారా ప్రపంచంలో అత్యంత బలవంతుడు కూడా ఒక్కోసారి చిన్న దెబ్బకు [సంగీతం] కుప్పకూలిపోతాడు కారణం వాడి బలహీనత శత్రువుకి తెలియడమే మన 13వ రహస్యం శత్రు రహస్యం చాణక్య నీటిలో ఒక కఠినమైన సత్యం ఉంది.
(35:28) నీ ప్రాణ స్నేహితుడికి కూడా నీ రహస్యాలను చెప్పకు ఎందుకంటే రేపు వాడు నీకు శత్రువుగా మారితే నీ గుట్టు మొత్తం రట్టు చేస్తాడు. దీనికి సాక్షాత్తు రామాయణమే సాక్ష్యం రావణ వధ అసలు రహస్యం రావణుడు సామాన్యుడు కాదు ముక్కోటి దేవతలు భయపడే మహా బలవంతుడు. రామ రావణ యుద్ధంలో రాముడు ఎన్ని బాణాలు వేసినా రావణుడు చనిపోవడం లేదు. ఒక తల నరికితే మరో తల పుట్టుకొస్తుంది.
(35:57) రాముడు ఆశ్చర్య పోయాడు అలసిపోయాడు ఆ సమయంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతాడు రామ రావణుడి గుండెలో గాని తల మీద గాని కొడితే వాడు చావడు వాడి ప్రాణశక్తి అమృతం వాడి నాభిలో దాచబడి ఉంది. అక్కడ కొట్టు అని చెబుతాడు. అప్పుడు రాముడు ఆగ్నేయాస్త్రాన్ని నాభికి గురిపెట్టి కొట్టగానే ఆ మహావీరుడు కుప్పకూలిపోయాడు. ఇక్కడ ఆలోచించండి రావణుని చంపింది ఎవరు రాముడి బాణమా కాదు రావణుని చంపింది అతని సొంత తమ్ముడు చెప్పిన రహస్యం రావణుడి నాభిలో అమృతం ఉందన్న విషయం విభీషణుడికి తెలియకపోయి ఉంటే ఆ యుద్ధం ఫలితం వేరేలా ఉండేదేమో నమ్మకమే మృత్యువు మన జీవితంలో
(36:45) కూడా అంతే మనం చాలాసార్లు భావోద్వేగంలో స్నేహితులతో బంధువులతో మన బలహీనతలను పంచుకుంటాం. నాకు ఫలానా విషయం అంటే భయం నా వ్యాపారంలో ఈ లొసుగు ఉంది నాకు ఫలానా తప్పు చేసిన చరిత్ర ఉంది అని చెప్పేస్తాం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ప్రాణ స్నేహితుడు రేపు బద్ధ శత్రువు కావచ్చు వాడు శత్రువుగా మారినప్పుడు కత్తి పట్టుకొని రాడు మీకు ఎక్కడ కొడితే నొప్పి తెలుస్తుందో ఎక్కడ కొడితే మీరు నాశనం అవుతారో వాడికి తెలుసు కాబట్టి సరిగ్గా అక్కడే కొడతాడు.
(37:22) అందుకే నీ మర్మస్థానం ఎప్పుడూ కవచంతో కప్పబడి ఉండాలి తప్ప ఎవరికీ కనిపించకూడదు. ఎలా జాగ్రత్త పడాలి? బ్లైండ్ ట్రస్ట్ వద్దు ఎవరినైనా నమ్మండి కానీ గుడ్డిగా నమ్మకండి. మీ అత్యంత రహస్యమైన విషయాలు మీ మనసులోనే ఉండాలి. బలహీనతను కప్పి పుచ్చుకోండి. మీకు ఒక బలహీనత ఉంటే దాన్ని ఎలా కప్పి పుచ్చుకోవాలో నేర్చుకోండి. లోకం ముందు మీరు బలవంతుడిగానే కనిపించాలి.
(37:50) నాభి రహస్యం బయట పడితే రావణుడే కూలిపోయాడు. ఇక సామాన్యులమైన మనమెంత గోడలకు చెవులు ఉంటాయి మిత్రులకు మరో ముఖం ఉంటుంది. జాగ్రత్త అవమానం ఓం శ్రీమాత్రే నమః మిత్రులారా జీవితంలో అవమానం అనేది ఒక అగ్ని లాంటిది అది తగిలినప్పుడు మనసు కాలిపోతుంది. గుండె రగిలిపోతుంది నిద్ర పట్టదు. చాలామంది ఆ అవమానాన్ని తట్టుకోలేక కుంగిపోతారు లేదా వెంటనే గొడవకు దిగుతారు కానీ విజేతలు మాత్రమే ఆ అవమానాన్ని ఇంధనంగా మార్చుకుంటారు.
(38:31) మన 14వ రహస్యం అవమానమే ఆయుధం ద్రౌపది సపథం మహాభారతంలో కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం అంతా ఇంతా కాదు రాజస్వలుగా ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చాడు దుశాసనుడు. భర్తలు పెద్దలు అందరూ చూస్తుండగానే ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో ద్రౌపది ఏడ్చి ఊరుకోలేదు. ఆమె ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసింది. నా జుట్టు పట్టుకొని ఈడ్చిన ఈ దుశాసనుడి రక్తాన్ని నా జుట్టుకి రాసుకునే వరకు నేను నా జుట్టు ముడివేయను.
(39:08) ఆమె తన జుట్టును అలాగే వదిలేసింది. ఎందుకు అది ఆమెకు ప్రతిరోజు ప్రతిక్షణం ఆ అవమానాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి. ఆ కసి చల్లారిపోకూడదు. ఆమె తన పగను 13 ఏళ్ల పాటు గుండెలో దాచుకుంది. ఆ అవమాన భారమే పాండవులను యుద్ధానికి సన్నద్ధం చేసింది. చివరికి ఆమె గెలిచింది. కురువంశం కూలిపోయింది. అవమానాన్ని ఎలా వాడుకోవాలి? మిమ్మల్ని ఎవరైనా నలుగురిలో అవమానించారా? నువ్వు పనికి రాని వాడివి నీ బతుకింతే నీకు చేత కాదు అని హేళన చేశారా? అప్పుడు మీరు చేయాల్సింది రెండు పనులు.
(39:48) మొదటిది మౌనంగా ఉండండి వాడితో గొడవపడి మీ శక్తిని వృధా చేసుకోకండి. రెండవది ఆ మాటలు గుండె లోతుల్లో దాచుకోండి. అవమానం అనేది బాణానికి ఉండే విల్లు లాంటిది. అది మిమ్మల్ని ఎంత వెనక్కి లాగితే మీరు అంత వేగంగా ముందుకు దూసుకెళ్ళాలి. అవమానం జరిగినప్పుడు వచ్చే కోపాన్ని మాటల రూపంలో ఖర్చు చేయకండి. దాన్ని పని రూపంలోకి మార్చండి.
(40:15) సమాధానం ఎప్పుడు చెప్పాలి మీరు ఇప్పుడు సమాధానం చెబితే అది శబ్దం అవుతుంది. మీరు గెలిచాక సమాధానం చెబితే అది చరిత్ర అవుతుంది. మిమ్మల్ని ఎవరైతే వేస్ట్ అన్నారో రేపు మీ ఆటోగ్రాఫ్ కోసం వాళ్లే క్యూ లో నిలబడాలి. మీ సక్సెస్ చూసి వాళ్ళ తల దించుకోవాలి. అదే అసలైన ప్రతీకారం. సింహం పడుకుంది కదా అని జూలుతో ఆటలాడకు అది నిద్ర లేస్తే వేట మామూలుగా ఉండదు అని మీ విజయంతో నిరూపించండి.
(40:46) సలహ మీకు జరిగిన అవమానాన్ని ఎవరితోనూ పంచుకోకండి సానుభూతి కోరకోకండి ఆ గాయాన్ని పచ్చిగానే ఉంచండి. అది మానిపోతే కసి తగ్గిపోతుంది. ప్రతిరోజు అద్దంలో చూసుకుని నన్ను అన్నవాడికి నా విజయమే సమాధానం చెప్పాలి అని శపధం చేయండి. వ్యూహ రచన ఓం శ్రీ చాణక్య గురవే నమః మిత్రులారా ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం పని మొదలు పెట్టకముందే గట్టిగా అరుస్తారు. చివరికి ఓడిపోతారు.
(41:23) రెండవ రకం పని పూర్తయ్యేదాకా ఊపిరి శబ్దం కూడా వినిపించనివ్వరు. కానీ గెలిచాక ప్రపంచం మొత్తం వారి వైపు చూసేలా చేస్తారు. మన 15వ రహస్యం వ్యూహ రచన. రాజనీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. వేట దొరికేదాకా పాములా ఉండాలి. వేటపై పడేటప్పుడు పులిలా విరుచుకు పడాలి. దీని అర్థం ఏమిటి? పాములా ఎందుకు ఉండాలి? పాము గడ్డిలో వెళ్తున్నప్పుడు కనీసం గడ్డి పరక కూడా కదలదు.
(41:57) అది ఎక్కడ ఉందో ఎటు వెళుతుందో ఎవరికీ తెలియదు. తన ఉనికిని పూర్తిగా దాచుకుంటుంది. మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అలాగే [సంగీతం] ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగు శత్రువుకి గాని పోటీదారులకు గాని తెలియకూడదు. మీరు ఐఏఎస్ కి చదువుతున్నారా? పక్కింటి వాడికి కూడా తెలియకూడదు. మీరు కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా? మీ పార్ట్నర్ కి తప్ప ఎవరికీ చెప్పకూడదు.
(42:22) ఎందుకంటే మీ వ్యూహం బయట పడితే శత్రువు అలెర్ట్ అయిపోతాడు. మిమ్మల్ని అడ్డుకోవడానికి వలలు రాస్తాడు. చాణక్యుడి వ్యూహం చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు చాణక్యుడు ఒక పెద్ద తప్పు చేశాడు. నేరుగా వెళ్లి నందరాజు రాజధాని మీద దాడి చేశాడు. అది పెద్ద సైన్యం చంద్రగుప్తుడు ఓడిపోయాడు. అప్పుడు చాణక్యుడు ఒక పాఠం నేర్చుకున్నాడు.
(42:48) ఒకరోజు ఒక ముసలమ్మ తన మనవడికి వేడి వేడి అన్నం పెట్టింది. ఆ పిల్లాడు ఆకలితో చెయ్యి నేరుగా అన్నం మధ్యలో పెట్టాడు. చెయ్యి కాలిపోయింది. అప్పుడు ఆ ముసలమ్మ అంటుంది ఒరేయ్ నువ్వు కూడా చాణక్యుడిలా చేస్తున్నావఏంటి వేడి అన్నాన్ని మధ్యలో తినకూడదు చల్లగా ఉండే చివర్ల నుండి తింటూ మధ్యలోకి రావాలి అని. ఆ మాటతో చాణక్యుడికి అసలైన వ్యూహం అర్థమయింది.
(43:14) మధ్యలో అంటే రాజధాని బలం ఎక్కువ ఉంటుంది. అందుకే ముందు బయట ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఓడించుకుంటూ తన బలాన్ని పెంచుకుంటూ చివరికి పాము తన పడగ విప్పినట్లు పులిలా రాజధాని మీద విరుచుకుపడ్డాడు. విజయం సాధించాడు. పులిలా ఎప్పుడు విరుచుకు పడాలి? అప్పటిదాకా మౌనంగా ఉన్నాం కదా అని చివరివరకు మౌనంగా ఉండకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ దెబ్బరి ఎలా ఉండాలంటే శత్రువుకి కోలుకునే అవకాశం ఉండకూడదు.
(43:44) పులి వేటాడేటప్పుడు గమనించండి. అది పొంచి ఉన్నంతసేపు విగ్రహంలా ఉంటుంది. కానీ ఒక్కసారి జంప్ చేశాక ఇక వెనక్కి తగ్గదు. మీరు కూడా అంతే ప్రిపరేషన్ టైంలో సైలెంట్ గా ఉండండి. ఎగ్జామ్ హాల్ లో లేదా బిజినెస్ లాంచ్ రోజున మీ రిజల్ట్ తో ప్రపంచం అదిరిపోవాలి. గుర్తుంచుకోండి బలవంతుడిని బలంతో కొట్టలేం కేవలం యుక్తితోనే కొట్టగలం.
(44:10) నీ ప్లాన్ నీ మనసులో ఉండాలి. నీ విజయం నీ చేతల్లో కనిపించాలి. యజమాని రహస్యాలు ఓం శ్రీ రాజరాజేశ్వరాయ నమః మిత్రులారా మనం బతుకు తెరువు కోసం ఒక సంస్థలో పని చేస్తాం. లేదా ఒక యజమాని దగ్గర పని చేస్తాం. ఆ సమయంలో మనకు ఆ సంస్థకు సంబంధించిన లాభ నష్టాలు బలహీనతలు భవిష్యత్ ప్రణాళికలు తెలుస్తాయి. అయితే కొంతమంది ఉద్యోగం మారగానే లేదా ఆ యజమాని మీద కోపంతో ఆ రహస్యాలను బయట పెట్టేస్తుంటారు.
(44:42) పోటీదారులకు సమాచారం ఇస్తుంటారు. ఇది తెలివైన పని అని మీరు అనుకోవచ్చు. కానీ ధర్మం దృష్టిలో ఇది నమ్మక ద్రోహం. మన 16వ రహస్యం యజమాని రహస్యాలు. ఉప్పు ఋణం. మన భారతీయ సంస్కృతిలో ఉప్పు తిన్న విశ్వాసం అనే మాటకు చాలా విలువ ఉంది. ఎవరి దగ్గరైతే మనం జీతం తీసుకుంటున్నామో వారి అన్నం మన కడుపులో ఉన్నంతవరకు వారి రహస్యాలను కాపాడటం మన ధర్మం.
(45:07) మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు అధర్మం వైపు ఉన్న కౌరవుల తరపున ఎందుకు పోరాడారు అని అడిగితే వారు చెప్పిన ఒకే ఒక్క మాట నేను ఆ రాజు ఉప్పు తిన్నాను. ఆ శరీరానికి ద్రోహం చేయలేను. యజమాని మంచివాడా చెడ్డవాడా అనేది తర్వాతి విషయం కానీ నువ్వు అతని దగ్గర పని చేస్తున్నంతసేపు అతని రహస్యం నీ గొంతులోనే ఉండాలి. ఈ రోజుల్లో కార్పొరేట్ ప్రపంచంలో ఒక మాట ఉంది.
(45:32) స్కిల్స్ కెన్ బి టాట్ బట్ లాయల్టీ కెనాట్ అంటే నైపుణ్యాలు నేర్పించవచ్చు కానీ నిజాయితీని నేర్పలేము. మీరు పని చేస్తున్న కంపెనీ సీక్రెట్స్ ని వేరే కంపెనీకి చెప్పారనుకోండి. ఆ కొత్త కంపెనీ వారు ఆ సమాచారం తీసుకొని మీకు ప్రమోషన్ ఇవ్వచ్చు కానీ వారి మనసులో మీ మీద ఒక ముద్ర పడిపోతుంది. వీడు పాత బాస్ కే ద్రోహం చేశాడు. రేపు ఎక్కువ డబ్బు ఇస్తే మన రహస్యాలు కూడా అమ్మేస్తాడు.
(45:56) ఫలితం వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. కీలకమైన బాధ్యతలు మీకు ఇవ్వరు. ఏ చిన్న అనుమానం వచ్చినా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఒక నమ్మక ద్రోహిని శత్రువులు వాడుకుంటారే తప్ప గౌరవించరు. విశ్వాసం అంటే బానిసత్వం కాదు మరి బాస్ తప్పు చేస్తే మౌనంగా ఉండాలా అది బానిసత్వం కదా కాదు యజమాని తప్పు చేస్తే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు మాట్లాడండి.
(46:26) కానీ ఆ కుర్చీలో కూర్చొని ఆ జీతం తీసుకుంటూ సంస్థ గుట్టుని రచ్చబండ మీద పెట్టడం వృత్తి ధర్మం కాదు. చాణక్య నీటి ప్రకారం మనం ఆశ్రయించిన చెట్టుని మనమే నరకకూడదు. నీడనిచ్చి చెట్టుని నరికితే ఎండ దెబ్బ తగిలేది మనకే మీరు కంపెనీ మారొచ్చు కానీ మీ క్యారెక్టర్ మారకూడదు. మీ నోరు ఎంత అదుపులో ఉంటే మీ బాస్ కి మీ మీడ అంత నమ్మకం కలుగుతుంది.
(46:51) ఆ నమ్మకమే మిమ్మల్ని సామాన్య ఉద్యోగి నుండి సఈఓ స్థాయికి తీసుకెళ్తుంది. వయస్సు జాతకం ఓం ఆయుష్యకారకాయ నమః మిత్రులారా ఈ రోజుల్లో పుట్టిన రోజు రాగానే Facebook లోవాట్ప్ లో ఈ రోజుతో నాకు 25 ఏళ్ళు వచ్చాయి. నేను ఫలానా టైం కి పుట్టాను అని బయోడేటా మొత్తం పెట్టేస్తుంటారు. కానీ మన పూర్వీకులు ఋషులు తమ వయస్సుని గాని తమ జన్మ నక్షత్రాన్ని గాని ఎవ్వరికీ చెప్పేవారు కాదు అడిగినా దాటవేసేవారు.
(47:24) ఎందుకంటే మన 17వ రహస్యం వయస్సు జాతక గోప్యత ఆయుర్ధాయ రహస్యం శాస్త్రం ప్రకారం ఆయుష్యు అనేది కరిగిపోయే మంచు లాంటిది. దీన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత కాలం నిలుస్తుంది. మీరు గమనించారా పాత రోజుల్లో ఎవరైనా నీ వయసుఎంత అని అడిగితే ఏమో బాబు ఒక 60 ఉండొచ్చు అని అంచనాగా చెప్పేవారు తప్ప ఖచ్చితమైన సంఖ్య చెప్పేవారు కాదు. ఎందుకంటే మీ వయస్సుని మీరు పదే పదే లెక్క పెట్టుకుంటూ నలుగురికి చెబుతూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ సంఖ్యను స్వీకరించి ఓహో నేను ముసలివాడిని అయిపోతున్నాను అని శరీరాన్ని తొందరగా క్షీణింపజేస్తుంది.
(48:12) అందుకే యోగులు తమ వయస్సుని ఎప్పుడూ చెప్పరు. కాలానికి అతీతంగా జీవిస్తారు. జాతకం మీ జన్మ నక్షత్రం రాశి, లగ్నం ఇవన్నీ మీ ఆత్మకు సంబంధించిన పాస్వర్డ్స్ మీరు ఏ గ్రహం ప్రభావంలో ఉన్నారు? మీ బలహీనత ఏంటి? మీకు గండం ఎప్పుడు అనే విషయాలు మీ జాతక చక్రంలో ఉంటాయి. మీరు ఈ వివరాలను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు లేదా గిట్టని వారికి చెప్పినప్పుడు మీరు మీ ఇంటి తాళం చెవిని దొంగ చేతికి [సంగీతం] ఇచ్చినట్లే శత్రువులకు మీ మారక దశ ఎప్పుడుందో తెలిస్తే సరిగ్గా ఆ సమయంలో మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. గ్రహాలు బలహీనంగా
(48:56) ఉన్నప్పుడు శత్రువు దాడి చేస్తే మనం తట్టుకోలేము. క్షుద్ర ప్రయోగాలు అండ్ నెగిటివ్ ఎనర్జీ ఇది కొంచెం భయంగా అనిపించవచ్చు కానీ చేదు నిజం మన అధర్వణ వేదంలో తంత్ర శాస్త్రంలో ఒక మనిషి మీద ప్రయోగం చేయాలంటే వాడి అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ ఏంటి ఇంటి నెంబర్ కాదు పేరు గోత్రం నక్షత్రం ఈ మూడు తెలిస్తే చాలు ఎక్కడో కూర్చుని మీ మీద నెగిటివ్ ఎనర్జీని అంటే దృష్టి దోషం వశీకరణం వంటివి ప్రయోగించవచ్చు అని శాస్త్రం చెబుతోంది.
(49:34) పూర్వం రాజులు యుద్ధానికి వెళ్లే ముందు తమ అసలు జాతకాన్ని నక్షత్రాన్ని రాజగురువుకి తప్ప ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఎందుకంటే శత్రు రాజులు తాంత్రిక పూజలు చేసి ఈ రాజుని బలహీనపరిచే ప్రమాదం ఉండేది. ఈ రోజుల్లో చేతబడి చేస్తారో లేదో పక్కన పెడితే మీ జాతక లోపాలు తెలిసి మిమ్మల్ని భయపెట్టి డబ్బులు గుంజే మోసగాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు.
(50:04) ఏం చేయాలి? మీ బర్త్డే జరుపుకోండి కానీ నాకు ఇన్నేళ్ళు వచ్చాయి అని డప్పు కొట్టకండి. మీ నక్షత్రం రాశి వివరాలు కేవలం గుడిలో అర్చకుడికి లేదా నమ్మకమైన జ్యోతిష్కుడికి మాత్రమే చెప్పండి. సోషల్ మీడియాలో పబ్లిక్ గా మీ డేట్ అఫ్ బర్త్ పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. మీ జాతకం మీ చేతుల్లో ఉండాలి కానీ పక్కవాడి నోటిలో కాదు దైవ దర్శనం స్వప్నాలు ఓం నమో నారాయణాయ మిత్రులారా ఎప్పుడైనా మీకు కలలో దేవుడు కనిపించాడా లేదా మీరు ఏదో గుడికి వెళ్ళినట్లు స్వామి వారు మీకు ప్రసాదం ఇచ్చినట్లు అద్భుతమైన కల వచ్చిందా నిద్ర లేవగానే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఇంట్లో
(50:50) వాళ్ళకి స్నేహితులకి అరేయ్ ఈరోజు నా కలలో ఆ వెంకటేశ్వర స్వామి కనిపించాడురా అని చెప్పేస్తుంటారు. ఆగిపోండి అక్కడే ఆగిపోండి. మన 18 వ రహస్యం దైవ దర్శనం స్వప్న గోప్యత శాస్త్రం ప్రకారం దైవానుభూతిని బయట పెడితే అది నిర్వీర్యం అయపోతుంది. ఎందుకు శక్తి సూత్రం దేవుడు లేదా గురువు కలలో కనిపించడం అనేది సామాన్య విషయం కాదు.
(51:21) అది మీ మీద కురిపించిన ఒక అనుగ్రహ వర్షం. ఆ దర్శనం ద్వారా మీ ఆత్మకు ఒక ప్రత్యేకమైన దైవ శక్తి లభిస్తుంది. దాన్ని ఒక బ్యాటరీ ఛార్జింగ్ లాగా ఊహించుకోండి. మీరు మౌనంగా ఉండి ఆ అనుభూతిని మీ లోపలే దాచుకుంటే ఆ శక్తి మీ నరాల్లోకి మీ రక్తంలోకి ప్రవహించి మీ మనసుని శుద్ధి చేస్తుంది. మీలో తేజస్సు పెరుగుతుంది. అలా కాకుండా మీరు వెంటనే నోరు తెరిచి అందరికీ చెప్పేసారనుకోండి.
(51:52) మాట అనేది శక్తిని ఖర్చు చేసే ప్రక్రియ. మీ నోటి ద్వారా ఆ శక్తి మొత్తం డిస్చార్జ్ అయిపోతుంది. చివరికి మీకు మిగిలేది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే తప్ప ఆ శక్తి కాదు. ప్రెజర్ కుక్కర్ ఉదాహరణ మనం అన్నం వండేటప్పుడు కుక్కర్ లో ఆవిరిని లోపల బంధిస్తేనే బియ్యం అన్నంలా మారుతుంది. విజిల్ తీసేస్తే ఆవిరి పోతుంది అన్నం ఉడకదు.
(52:23) అలాగే ఈ దైవ దర్శనం అనే ఆవిరిని మీ హృదయం అనే కుక్కర్లో బంధించాలి. అప్పుడే మీ జన్మ అనే [సంగీతం] బియ్యం పక్వానికి వచ్చి మోక్షం అనే అన్నం తయారవుతుంది. బయట పెడితే ఆవిరి గాలిలో కలిసిపోతుంది. మీ బతుకు అలాగే ఉండిపోతుంది. ఆధ్యాత్మిక అహంకారం మరో ప్రమాదం ఏమిటంటే మీరు పది మందికి చెప్పినప్పుడు వారు అబ్బో నువ్వు గొప్ప భక్తుడివి దేవుడు నీకు కనిపించాడు అని పొగుడుతారు.
(52:53) ఆ పొగడ్తలతో మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక అహంకారం తలకెక్కుతుంది. దేవుడికి నచ్చనిది అహంకారం ఒక్కటే ఎప్పుడైతే అహంకారం వచ్చిందో ఇక ఆ దర్శనాలు ఆగిపోతాయి. దేవుడు దూరమవుతాడు. ఎవరికి చెప్పాలి? మరి ఈ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకూడదా? కేవలం మీ గురువుకి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఆ కలకు అర్థం ఏమిటి? అది నిజమైన దర్శనమా లేక భ్రమణ ఆ శక్తిని ఎలా వాడుకోవాలి అనేది గురువుకి మాత్రమే తెలుసు ఆయన ఆ శక్తిని స్థిరపరుస్తారు.
(53:32) సామాన్యులకు చెబితే వారు నమ్మకపోవచ్చు లేదా ఎగతాళి చేయవచ్చు అది మీ భక్తిని దెబ్బతీస్తుంది. సలహ మీకు ఏదైనా మంచి కల వస్తే కళ్ళు మూసుకొని ఆ దేవుడికి నమస్కరించి స్వామి ఈ దర్శన భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యున్నని అని మనసులోనే అనుకోండి ఆ రహస్యం మీకు ఆ పరమాత్మకు మధ్య మాత్రమే ఉండాలి. అప్పుడే అది పెరుగుతుంది. పాప పశ్చాత్తాపం ఓం శ్రీ కర్మ సాక్షినే నమః మిత్రులారా తప్పు చేయడం మానవ సహజం మనలో ఎవరూ పునీతులు కాదు ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటాం.
(54:13) ఆ తప్పు మనసును తొలిచేస్తున్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక కొంతమంది వెళ్లి తమ స్నేహితుడితోనో దగ్గరి వారితోనో నేను ఆ రోజు ఆ తప్పు చేశాను నాకు చాలా గిల్టీగా ఉంది అని చెప్పేస్తుంటారు. వినడానికి ఇది నిజాయితీగా అనిపించవచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది ఆత్మహత్యతో సమానం. మన 19 వ రహస్యం పాప పశ్చాత్తాపం. చాణక్య నీతి మరియు మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
(54:40) నీ పాపాన్ని ఎప్పుడూ మనిషి ముందు ఒప్పుకోకూడదు. కేవలం ఆ పరమాత్మ ముందు మాత్రమే ఒప్పుకోవాలి. మనిషి స్వభావం మీరు ఎవరి దగ్గరైతే మీ తప్పును ఒప్పుకున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు మీతో బాగానే ఉండొచ్చు. పర్లేదులే మర్చిపో అని ఓదార్చవచ్చు కానీ కాలం మారుతుంది. రేపు మీ ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా [సంగీతం] వాడు వాడే మొదటి ఆయుధం మీరు చెప్పిన ఆ రహస్యం నువ్వు ఎంత మంచోడివో నాకు తెలుసులే అప్పుడు ఆ తప్పు చేశవు కదా అని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు.
(55:12) సమాజం దృష్టిలో మీ పరువు తీస్తానని బెదిరిస్తాడు. అప్పుడు మీకు అనిపిస్తుంది నా గొయ్యి నేనే తీసుకున్నాను అని మనిషికి క్షమించే గుణం తక్కువ గుర్తుపెట్టుకొని దెబ్బ కొట్టే గుణం ఎక్కువ. దేవుడి స్వభావం అదే ఆ తప్పును దేవుడి ముందు ఒప్పుకుంటే దేవుడు బ్లాక్ మెయిల్ చేయడు దేవుడు శిక్షించడు సంస్కరిస్తాడు. మీరు పూజ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఆ దేవుడి పాదాల ముందు ఏడ్చి స్వామి తెలియక తప్పు చేశాను ఇంకెప్పుడూ చేయను అని మనస్ఫూర్తిగా అడిగితే ఆ క్షణమే మీ పాపం కాలిపోతుంది. మీ మనసు తేలిక పడుతుంది.
(55:47) దీన్నే హిందూ ధర్మంలో ప్రాయశ్చిత్తం [సంగీతం] అని అంటారు. ఇది రహస్యంగా జరగాలి. గౌరవం పోతుంది. మీరు నిజాయితీగా తప్పు ఒప్పుకుంటే లోకం మిమ్మల్ని హరిశ్చంద్రుడు అని పొగడదు. వీడు దొంగ వీడు మోసగాడు అని ముద్ర వేస్తుంది. మీరు తరువాత మారిపోయి ఎంత మంచిగా బ్రతికినా సమాజం ఆ పాత తప్పునే ఎత్తి చూపిస్తుంది. వాల్మీకి మహర్షిగా మారిన తర్వాత కూడా జనం ఆయన్ని దొంగగానే చూశారు.
(56:15) ఒక్క నారదుడు తప్ప సామాన్య మనుషులు మీ మార్పును అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకు వివరణ ఇవ్వకండి. ఏం చేయాలి? మీకు పాపభీతి ఉందా? ఏదైనా ఆశ్రమానికి వెళ్లి సేవ చేయండి. పేదవారికి సహాయం చేయండి. గుడిలో ప్రార్థించండి. మీ ప్రవర్తన మారాలి తప్ప మీ నోరు జారకూడదు. మానసిక ప్రశాంతత కోసం సైకాలజిస్ట్ల దగ్గర లేదా గురువుల దగ్గర చెప్పడం వేరు కానీ సామాజిక సంబంధాల్లో మాత్రం తప్పును ఎప్పుడూ దాచి ఉంచాలి.
(56:46) తప్పును ఒప్పుకోవడం అంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడమే. ఆ రహస్యం మీకు ఆ దేవుడికి మధ్యనే ఉండనివ్వండి. అంతిమ విజయం ఓం నమో భగవతే వాసుదేవాయ మిత్రులారా మనం ఇప్పటిదాకా డబ్బుని కుటుంబ గొడవల్ని దానధర్మాల్ని అవమానాల్ని ఎందుకు దాచాలి అని చెప్పుకున్నాం. కేవలం సమాజంలో పరువు కోసమేనా [సంగీతం] కాదు దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది.
(57:19) అదే ప్రశాంతమైన మరణం అండ్ మోక్షం శక్తి నిల్వ. మనిషికి ఉండే పరిమితమైన ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చైపోయేది మాటల ద్వారానే జీవితాంతం అనవసరమైన విషయాలు వాగుతూ తన సీక్రెట్స్ చెప్పుకుంటూ పక్కవాడి గురించి మాట్లాడుతూ ఉండేవాడి శక్తి మొత్తం గాలిలో కలిసిపోతుంది. వాడి ఆత్మ బలహీనంగా మారుతుంది. కానీ మనం చెప్పుకున్న ఈ 19 రహస్యాలను ఎవరైతే పాటించి మౌనంగా ఉంటారో వారి శక్తి వృధా కాదు అది లోపలే కేంద్రీకృతం అవుతుంది.
(57:54) దాన్ని తపోశక్తి అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక పరమ రహస్యం చెప్పాడు. అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేబరం అంటే చనిపోయే చివరి క్షణంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నా ధామాన్ని పొందుతారు. తిరిగి జన్మ ఉండదు. కానీ ఆ చివరి క్షణంలో దేవుడు గుర్తుకు రావాలంటే జీవితాంతం ప్రాక్టీస్ ఉండాలి. మీరు జీవితాంతం మీ ఆస్తుల గురించి గొడవల గురించి పగ గురించి అందరితో మాట్లాడుతూ గడిపితే చనిపోయేటప్పుడు అవే గుర్తొస్తాయి.
(58:29) మీ ప్రాణం గొంతులో చిక్కుకుంటుంది. నరకయాతన పడతారు. అదే మీరు ఈ విషయాలను గోప్యంగా ఉంచి వాటిని పట్టించుకోకుండా ఉంటే చివరి క్షణంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి మీద లగ్నం అవుతుంది. పండిన పండు ఒక చెట్టు నుండి పచ్చికాయను తెంచానంటే కష్టం. జిగురు కారులుతుంది. కానీ బాగా పండిన పండు గాలికి దానంతట అదే రాలిపోతుంది. చెట్టుకి నొప్పి ఉండదు. పండుకి నొప్పి ఉండదు.
(58:58) ఈ రహస్యాలను పాటించిన వ్యక్తి మరణం కూడా అలాగే ఉంటుంది. ఆసుపత్రిలో పైపులతో భయంతో చావడు అనాయాసైన మరణం పొందుతాడు. చిరునవ్వుతో శరీరాన్ని వదిలేస్తాడు. అది సామాన్య మరణం కాదు అది మహా ప్రస్థానం. మిత్రులారా ఈ 20 రహస్యాలు కేవలం వీడియోలు కాదు ఇవి జీవిత పాఠాలు. నోరు మూసి ఉంచండి ఆత్మను తరిచి ఉంచండి. ప్రపంచానికి చెవిటివాడిలా ఉండండి దేవుడికి దగ్గరివాడిలా ఉండండి.
(59:29) రహస్యం అనేది దాచడం కాదు అది మీ శక్తిని పెంచుకోవడం. ఈ వీడియోని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు. ఇందులో ఒక్క విషయం పాటించినా మీ జీవితం మారుతుంది. మీ అందరికీ ఆ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment