సంసారంలో ఉంటూనే ప్రశాంతంగా ఉండొచ్చు | Secrets to Peace in Family Life | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sVNfE3BVXWk
Transcript:
(00:00) చాలామంది ఏంటంటే ఈ సంసార సాగరం ఏద లేక సన్యాసం తీసుకుంటే బాగుండు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్లందరికీ తెలియని విషయం ఏంటంటే సంసారంలో ఉంటూనే ఒక సన్యాసిలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇది వినటానికి కొంచెం విడ్డూరంగా అనిపించిన ఇది వాస్తవం కానీ మహనీయులు యోగిరాజు లహరి మహేశీలు ఆయన మనలాగే ఉద్యోగం చేశారు పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని పెంచారు కానీ ఆయన మనసు ఎప్పుడు ఆ పరమాత్మలోనే ఉండేది మరి మనమెందుకు రోజు ఆఫీస్ టెన్షన్లు ఇంట్లో గొడవలు పిల్లల ఫ్యూచర్ గురించి భయాలతో నరకం అనిపిస్తున్నాం.
(00:34) పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పరుగు చేతిలో డబ్బులు లేకపోయినా బాధపడతాం. ఒకవేళ డబ్బులు ఉన్నా సరే ఈ డబ్బులు రేపు ఉంటాయో లేదో అని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచించి భయపడుతూ ఉంటాం. బయట ప్రపంచానికి మనం చాలా హ్యాపీగా కనిపిస్తున్నామేమో కానీ లో లోపల ఒక తెలియని మనశశాంతిని కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలోన ఏదో ఒక లోటు ఈ గందరగోలంలో పడి మనల్ని మనం మర్చిపోతున్నాం.
(00:57) లాహిరి మహసీయులు ఒక మాట అనేవారు మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీ మనసు ప్రశాంతంగా లేకపోతే మీరు అక్కడికి వెళ్లి కూడా ఉపయోగం లేదని చెప్పేసి అంటూ ఉండేవారు. సో సమస్య అనేది బయట ఎక్కడో లేదు అది మన మనసు లోపలే ఉంది. సరే ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనుకుంటే మాత్రం మనం ఎందుకు ఇంతలా సఫర్ అవుతున్నాం.
(01:16) దీనికి మెయిన్ రీజన్ అతిగా ఆశపడటం మరియు మన బంధాలే మనల్ని మానసికంగా బానిసలుగా మార్చేయటం. సో లాహరి మహసేయుల దగ్గర ఒకసారి ఒక శిష్యుడు వచ్చి స్వామి నాకు ఈ సంసారం ఒక బంధనంలా ఉంది నేను అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. బంధం నీ భార్యలోనూ నీ పిల్లల్లోనూ లేదు నీ మనసు దేనినైతే గట్టిగా పట్టుకుంటుందో అక్కడే నీ బంధం ఉందన్నారు. సో మనం మన పిల్లల మీద ఆస్తిపాస్తుల మీద ఒక రకమైన హక్కును కోరుకుంటాం.
(01:41) ఇది నాది వీళ్ళు నా మాట వినాలి అనే అహంకారం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడైతే అవతల వ్యక్తి మన అంచనాలని అందుకోలేరో అప్పుడు మనకి కోపము నిరాశ కలుగుతాయి. ఈ ఎమోషన్స్ అన్నీ కలిసి మనల్ని డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి. మరో డేంజర్ విషయం ఏంటంటే మనం మన సంతోషాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం. బంధాల మీద అతిగా ఆధారపడటం వల్ల అలాగే ఆ బంధాల్లో చిన్న తేడా వచ్చినా సరే మన జీవితమే ఆగిపోయినట్లు ఫీల్ అవుతూ ఉంటాం.
(02:07) మనం చేసే ప్రతి పని వెనుక ఒక ప్రతిఫలం ఆశిస్తాం. అందుకే ఆశించిన గుర్తింపు రానప్పుడు మన సంసారం మనక ఒక భారం అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా మీకే తలకాయ నెప్పి అవతల వాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళు మీ మీద కోపపడినా సరే మీకే తలకాయ నెప్పి అది భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు.
(02:28) సో ఏది ఏమైనా సరే అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. అది ప్రేమ. సో ప్రేమ ఉన్నప్పుడు మనం అవతల వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు అవతల వాళ్ళు ఏది చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేకపోతే చిన్న చిన్న కరెక్షన్స్ ని ఇంకా ప్రేమగా వాళ్ళకి చెప్పి చేయించుకోవటం సో దీన్ని అప్లై చేయాలి అలా కాకుండా వాళ్ళు నాకు నచ్చినట్లు ఉండాలి అందులో నేను చెప్పినట్లు చేయాలనుకుంటే మాత్రం అక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
(02:51) సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని మనం ఎలా అధిగమించాలి అనుకుంటే మాత్రం దీనికో పరిష్కారం ఉంది చాలా సింపుల్ అండి. నేను ఎవరిని అనే స్పృహ కలిగి ఉండటం మన సంసారాన్ని ఒక సినిమాలో చూడటం నేర్చుకోవాలి. ఫస్ట్ నేను ఎవరు అనే స్పృహ కచ్చితంగా ఉండాలి. అందులోని మీ సంసారాన్ని సినిమాలా చూడాలి. లహరీ మహాసేయులు చెప్పిన అత్యంత గొప్ప రహస్యం ఇదే. మీరు ఒక నటుడు మాత్రమే యజమాని కాదు.
(03:14) ఒక సినిమాలో హీరో తన పాత్ర ఎంత అద్భుతంగా పోషిస్తాడో చూడండి. తండ్రిగా ఏడుస్తాడు, కొడుక్గా పోరాడతాడు. కానీ షూటింగ్ అయిపోగానే మేకప్ తీసేసి ప్రశాంతంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. మన జీవితం కూడా అంతేనండి. మీరు ఒక తండ్రిగా లేదా భర్తగా అది కూడా కాకపోతే భార్యగా మీ బాధ్యతలన్నీ 100% నెరవేర్చండి. ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీ పని మీరు చేయండి.
(03:35) కానీ ఆ పాత్రలో లీనమైపోయి మీ ఒరిజినాలిటీని మర్చిపోమాకండి. ఫలానా వ్యక్తి నా మాట వినలేదు అని బాధపడటం మానేయండి. మీరు మీ ధర్మాన్ని పాటించండి. ఫలితాన్ని ఆ దేవుడు వదిలేయండి. అడవిలో ఉన్న సన్యాసి ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు కానీ సంసారంలో ఉంటూ అన్ని ఉన్నా కూడా దేనికి అతుక్కుపోకుండా ఉండటమే అసలైన యోగం.
(03:57) తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం అంటే ఇదే మరి. సో ఈ విషయం తెలియక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు అందరిలాగే ఉండాలి. కాకపోతే అందరి మధ్యలో ఉంటూ అందరిని పట్టించుకోకుండా ఉండాలి. ఇదే యోగి తత్వం అంటారు. అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ లో వెళ్తున్నామ అనుకోండి సడన్ గా సిగ్నల్ పడింది.
(04:16) అలా వెళ్తున్నప్పుడు సడన్ గా మన ముందు ఎవడో వచ్చేసి కట్టుకొట్టి వెళ్ళిపోతాడు. మనకి వెంటనే కోపం వస్తుంది. కానీ కోపపడకుండా ఆడ అంతేలే అని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి అసలు ఏ గోలా ఉండదు. ఇలా ఉండగలిగితేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. అందరి మధ్యలో ఉంటూ కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ వాడిని పట్టించుకున్నారా కచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాడి గురించి ఆలోచిస్తారు.
(04:38) వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడి పనిలో వాడు బిజీ అయిపోతాడు వాడు హ్యాపీగా ఉంటారు. కానీ వాడి గురించి ఆలోచిస్తున్న మీరు మాత్రం మీ జీవితంలో ఉన్న మనశశాంతిని పోగొట్టుకుంటారు. కాబట్టి అందరి మధ్యలో ఉండండి. అది భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఈ ప్రపంచం కూడా అవ్వచ్చు కానీ వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోమాకండి వాళ్ళు నేను చెప్పినట్లు ఉండాలని చెప్పేసి అసలు అనుకోమాకండి వాళ్ళని ప్రేమించండి ఒకవేళ వాళ్ళు దూరమైనా కూడా మీ ప్రశాంత చెక్కు చెదరకూడదు అలా ఉండాలి మీరు అంతేగాని వాళ్ళు పోతే నా జీవితం ఆగిపోద్ది అనుకుంటేనే తలకాయ నెప్పి
(05:09) కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీరు కొంచెం అవగాహనతో ఉండండి. అసలు అదంతా కాదండి నేను ఎవరిని అనే ఒక క్లారిటీ అనేది మనిషికి ఉండాలి. సరే ఇదంతా బాగానే ఉంది అంతా బాగానే చెప్పారు. ఇలాంటివన్నీ నా జీవితంలో అప్లై చేయాలంటే ఏం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మార్పుని మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే లాహిరి మహాసయలు తన శిష్యులకి ఒక ప్రాక్టీస్ చెప్పేవారు.
(05:31) ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ మనసుకు ఒక మాట చెప్పుకోండి. ఈరోజు నేను నా పాత్రని అద్భుతంగా పోషించాను. తండ్రిగా ఉద్యోగిగా నా బాధ్యతలు పూర్తి చేశాను. ఇక ఇప్పుడు నా పాత్రతో నాకు సంబంధం లేదు. ఈ ప్రపంచానికి నేను ఏమి తీసుకురాలేదు అలా అని చెప్పేసి ఏమి తీసుకెళ్ళేది కూడా ఏమ లేదు.
(05:53) ఇలా అనుకోవడం వల్ల మీ మనసు మీద ఉన్న భారం ఒక్కసారిగా తగ్గిపోతుంది. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు ఒక క్షణం ఆగి ఇది నా జీవితం అనే సినిమాలో ఒక సీన్ మాత్రమే ఇది శాశ్వతం కాదు అని మీకు మీరు గుర్తు చేసుకోవాలి. అలా కాకుండా మీ అస్తిత్వాన్ని కోల్పోయి అంటే మీ ఒరిజినాలిటీని కోల్పోయి మీరు ఓవర్ గా సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి దగ్గర ఉండి మీ సినిమాని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు.
(06:15) కాబట్టి ఏం జరిగినా సరే ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మనం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి. మీ ప్రశాంతతని వేరే ఎవరికో ఇచ్చేయకండి. బాధ్యతని నిర్వహించడం మీ ధర్మం. కానీ దాని వల్ల వచ్చే స్ట్రెస్ ని నెతికించుకోవడం మీ తప్పే అవుతుంది.
(06:34) లాహరి మాసేలు అన్నట్లు నిశశబ్దంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ అంతరంగంలో ఎప్పుడూ ఆ పరమాత్మ నామస్మరాన్ని స్మరించు అంటే ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు మనుషులతో తిరుగుతూ కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉంటే మనం ప్రశాంతంగా బతుకుతాం అని చెప్పేసి చాలా మందికి ఏంటంటే నండి ఆధ్యాత్మికంగా కొంచెం దూరమైపోతారండి. సో మనం కొంచెం దేవుడికి దగ్గరగా ఉండాలి.
(06:57) అలా ఉన్నప్పుడే మనలో ప్రశాంతత అనేది పుడుతుంది. ఆ ప్రశాంతతకి ఒక అర్థం అనేది వస్తుంది. ఈ క్షణం నుంచి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఓ కొత్త మనిషిగా ప్రశాంతమైన మనసుతో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. అలా మొదలుపెట్టాలంటే మీరు ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే ఏం జరిగినా సరే, ప్రశాంతంగా చూస్తూ, ఇది శాశ్వతం కాదు.
(07:19) ఖచ్చితంగా దీనికో ఫుల్ స్టాప్ పడిద్ది అని చెప్పేసి మీరు అనుకొని ప్రశాంతంగా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అలా కాదు అందరూ నా మాట వినాలి అందులో నేను చెప్పినట్లు చేయాలి. అంతేకాకుండా అవతల వాళ్ళు నాతో మాట్లాడటం మానేసి వెళ్ళిపోతే మాత్రం నేను కూర్చొని బాధపడతాను ఏడుస్తాను అని మీరు ఇంకా అలాగే ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి అవతల వాళ్ళు మీ మాట వినాల్సిన అవసరం లేదు.
(07:43) ఒకవేళ వినాల్సి వస్తే మాత్రం వాళ్ళని ప్రేమతో గెలుచుకోండి. అందులోనూ ఎవరు మీతో ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండడం నేర్చుకోండి. అలా కనుక మీరు ఉండకపోతే ఎంత సంపాదించినా ఎంత సక్సెస్ అయినా సరే దానికి మీనింగ్ ఉండదు కదా మీరు ఎవరి కోసం సక్సెస్ అవుతున్నారు మీకోసం అవుతున్నారు అంతేగాని అందరి కోసం కాదు కదా మీరు ఎవరి కోసం ఆనందంగా ఉండాలి మీకోసం ఉండాలి.
(08:03) అంతేగానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు అని చెప్పేసి మీరు నవ్వడం కాదు కదా కాబట్టి మీరు ఎవరు అనే క్లారిటీ మీకు రావాలి. అలా వచ్చిన రోజే మీ జీవితంలో ప్రశాంత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంతేనండి అంతకు మించి ఏమి లేదు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని సంసారం అనేది మనల్ని బంధించే గొలుసా లేక మనల్ని మనం తెలుసుకోవడానికి దేవుడి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశమా? సో ఈ రెండిటిలో ఏదే ఉంటుందో కింద కామెంట్స్ లో చెప్పండి.
(08:27) ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం
No comments:
Post a Comment