Monday, March 2, 2026

చిన్న పని.. కొండంత ఫలితం! | Jaisimha | Square Talks

చిన్న పని.. కొండంత ఫలితం! | Jaisimha | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Zog_hQUyaCs



Transcript:
(00:10) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనం ఈ మధ్య వేమన పద్యాల్ని వ్యాఖ్యానించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేమన పద్యాలలో నుంచి ఎటువంటి జీవిత సత్యాలు గ్రహించవచ్చు అనేది ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు పద్యం ఏంటంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు పొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబు నవవుకు చెంత విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం చాలామంది చాలాసార్లు ఆ విన్న పద్యమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వేమన శతకంలో చాలా పాపులర్ పద్యాల్లో
(00:58) బాగా ప్రచారంలో లో ఉన్న పద్యాల్లో ఇది కూడా ఒకటి అయితే దీన్ని మనం పైపైన చదువుతాము వింటాము అవసరమైతే చిన్నప్పుడు ఎప్పుడైనా బట్టి పట్టి మగ్గప్ చేసి పోయి పరీక్ష కూడా రాసవచ్చి ఉంటాం కానీ దీని వెనుకున్న జీవిత సత్యం వేమన ఏం చెప్తున్నారు కచ్చితంగా వేమన తన పద్యాలు ఏవి కూడా స్కూల్ పుస్తకాల్లో రెండో తరగతి మూడో తరగతిలో అచ్చేసి వదిలేయడానికి అయితే రాయలేదు.
(01:26) ఆయన ఈ పద్యాలన్నీ చెప్పింది ఎందుకు అంటే ఏదో ఒక లైఫ్ ఫిలాసఫీని జీవిత సత్యాన్ని ఒక ప్రిన్సిపల్ ని చెప్పడం కోసం ఒక సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆయన చెప్తాడు అయితే మరి దీంట్లో ఏముంది అంటే ఈ చిత్తశుద్ధి పద్యంలో క్వాలిటీ ముఖ్యం క్వాంటిటీ కాదు అనేది ఇక్కడ వేమన చెప్తున్నారు మనకి మనం చేసే పని ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు అది ఎంత ఎంత నిజాయితిగా చేశమ అనేది ముఖ్యం ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో ఆధునిక కాలంలో ప్రతివారు కూడా ఒక గొప్ప పని చేయాలి గ్లామరస్ గ్లామరస్ వర్క్ చేయాలి అని అనుకోవడం మొదలైపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్స్ తీసుకున్నా సరే ఒక
(02:12) ఐటీ రంగంలో ఉన్న ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేదంటే సినిమా స్టార్స్ స్పోర్ట్స్ క్రికెటర్స్ వీళ్ళకి గ్లామర్ ఉన్నంతగా మిగతా రంగాల్లో ఉన్నవాళ్ళ ఉండట్లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఆ పనులు మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ వస్తాయి పనులని కొన్ని ఒక ఐదు లేదా ఆరు ప్రొఫెషన్స్ మాత్రమే గొప్పవి అని చెప్పేసి అందరూ భావించడం మొదలైపోయింది అన్నమాట అట్లా కాకుండా మనం చేసేది ఏదైనా సరే చిత్తశుద్ధితో చేస్తే సిన్సియారిటీతో ఆ నిజాయితీగా చేస్తే అప్పుడు మనం చేసే పని ఏంటి అని కాకుండా మనం ఆ పనిని ఎలా చేస్తున్నామ అనేది ముఖ్యము అని చెప్పి మేమ అని చెప్తున్నారు
(02:53) అన్నమాట అసలు ఇంతకీ చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తశుద్ధి అంటే నిర్మలమైన మనసు ఎటువంటి స్వార్థం వేరే ఆలోచన లేకుండా చేసే పని ఇక్కడ ఎటువంటి స్వార్థం అంటే మనం ఏ ఉద్యోగమో లేకపోతే ప్రొఫెషన్ లోనో ఉంటే అది డబ్బుల కోసం ఆదాయం కోసం చేస్తాం అంతవరకు స్వార్థం పర్లేదు కానీ పక్కవాడికి చెడు చేయకుండా ఉండడం అలాగే ఒక సోషల్ సర్వీస్ లో ఉంటే ప్రతిదీ మనం ఉద్యోగమో మన జాబ్ లేదా మన ప్రొఫెషన్ అని కాకుండా మనం ఉదాహరణకి ఏదైనా ఒక ఎన్జీఓ ద్వారానో స్వత వ్యక్తిగతంగానో ఒక 10 మందికి సహాయం చేస్తున్నాం అంటే ఆ సహాయాన్ని ప్రచారం చేసుకోవడం మీద దృష్టి పెట్టడం కాకుండా
(03:31) నిజాయితీగా మనం ఎవరికైతే సహాయపడుతున్నామో వారి జీవితంలో కచ్చితంగా ఒక మార్పు రావాలి అనే ఒక నిజాయితి ఏదైతే ఉంటుందో దాన్ని మరి ఇక్కడ వేమన చిత్తశుద్ధి అని చెప్తున్నారు అన్నమాట ఈ చిత్తశుద్ధి గురించి తో పాటు ఇక్కడ పద్యంలో పుణ్యం అనే పదం కూడా వాడుతున్నారు. సాధారణంగా మన మనక ఏమంటంటే పుణ్యము పాపము అంటే అదేదో మత సంబంధమైనది కర్మ సిద్ధాంతంలో భాగము దేవుడికి సంబంధించింది దైవానికి సంబంధించింది అని మనం భావిస్తుంటాం కానీ పుణ్య పాపాలు అనేవి భారతీయ తాత్వికతలో నిజ నిత్య జీవితానికి సంబంధించినవి అంటే మన జీవితం రోజు గడవడానికి కూడా కొన్ని పాప పుణ్యాలు చాలా
(04:12) ప్రధానం ఎలాగంటే పెద్ద ఫలితం మంచి మనసుతో మీరు చేసే చిన్న సహాయం కూడా కొండంత ంత ఫలితాన్ని ఇస్తుంది అది ఎప్పటికీ వృతాపోదు ఇక్కడ పుణ్యం అంటే పక్కవారికి సహాయపడడం సహాయపడితే మనకు పైలోకాల్లో స్వర్గం వస్తుంది అవన్నీ మత సంబంధమైన విశ్వాసాలు అవి నమ్మాల్సిన అవసరం లేదు అవి నిజం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా నమ్మితే అది వారి ఇష్టం కానీ పుణ్యం అనే దాంట్లో అర్థం ఏంటంటే మనం దేవుని నమ్ముతున్నామనో మతాన్ని విశ్వసిస్తున్నామనో కాదు పక్కవాడికి సహాయపడడమే ఇక్కడ వేమన దృష్టిలో పుణ్యం.
(04:46) ఆ సహాయపడటం వల్ల మనక ఏం లభిస్తుంది అనేది పక్కన పెడితే మనం పక్కవాడికి సహాయపడ్డప్పుడు వాడి జీవితంలో ఒక మార్పు వస్తే అది నిజమైన ఆ ఉపయోగం అన్నమాట మనం చేసే పుణ్యం చాలా చిన్నది అయినప్పటికీ ఆ పుణ్యము వాడి జీవితంలో చాలా పెద్ద మార్పుకు దారితీస్తుంది ఎప్పుడు మనం నిజాయతీగా నిస్వార్థంగా మనం ఏదో ఆశించి కాకుండా కేవలం పక్కవారికి సహాయపడడం కోసం మాత్రమే ఎప్పుడైతే చేస్తామో దాది పుణ్యం అనిపించుకోబడుతుంది అటువంటి పుణ్యం వల్ల చిన్న పుణ్యం చేసినా కూడా కొండంత మార్పు వస్తుందని వేమని చెప్తున్నారు.
(05:26) కొదువ కాదు అనే పదం కూడా మనకు ఈ పద్యంలో కనిపిస్తుంది అంటే ఏంటి అంటే తక్కువ కాదు అని అర్థం కొదువ కాదు అంటే తక్కువ కాదు అని అర్థం మనసుపెట్టి చేస్తే ఆ పని పరిపూర్ణంగా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఒకసారి చెప్తారు ఏంటంటే ఏ విమానం నడపడమో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమో ఇవి మాత్రమే గొప్ప విషయాలు లేదంటే ఒలంపిక్స్ లో వెళ్లి స్విమ్మింగ్ చేయడమో ఇట్లాంటివి కాకుండా ఆ అంబాని అదాని లాగా కోట్లాది రూపాయలు సంపాదించడమో ఇవి మాత్రమే గొప్ప పనులు కాదు.
(06:00) ఆయన ఏం చెప్తారు వివేకానంద అంటే ఒక షూ పాలిష్ చేసేవాడు ఏకాగ్రతతో తన షూ ని ఇంకా మరింత బాగా పాలిష్ చేస్తే కూడా అది కూడా గొప్ప విషయమే అని చెప్తారుఅన్నమాట అంటే మనం చేసే పని పెద్దది చిన్నది అనేది ఏమ ఉండదు ఆ చేసే పనిని మనం ఎంత పరిపూర్ణంగా చేస్తాం ఎంత ఏకాగ్రతతో ఎంత చిత్తశుద్ధితో ఎంత నిజాయతితో చేస్తాం అనేదే ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ వేమన పద్యాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక మంచి ఉదాహరణతో తాను చెప్పే జీవిత సత్యాన్ని ని సమర్థిస్తారు అన్నమాట.
(06:33) ఇక్కడ ఏం చెప్తున్నారు వేమన గారు ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ మనక ఇచ్చారు. మర్రి గింజ చూడడానికి ఆవగింజ కంటే చిన్నదిగా ఉంటుంది. మర్రి చెట్టు అంటే మనకు తెలుసు మర్రి ఊడలతో ఒక్కొక్క చెట్టు కొన్నిసార్లు కొన్ని ఎకరాల పాటు భూమిని ఆక్రమించేస్తూ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక చెట్టు వస్తుంది ఆ చెట్టులోనుంచి మళ్ళీ ఊడలు వస్తాయి ఆ ఊడలు భూమిలోకి పాతుకుపోయి ఆ ఊడల్లోనుంచి మళ్ళీ కొత్త చెట్లు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మర్రి అనేది ఒక చెట్టులో స్టార్ట్ అయ్యి చిన్నపాటి అరణ్యంలో మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కొన్ని ఎకరాల పాటు భూమిని అది విస్తరించిపోయి వ్యాపించి మర్రి చెట్టు దాన్ని ఆక్రమించేస్తుంది
(07:11) అన్నమాట భూమిని అంత పెద్ద మర్రి చెట్టు కూడా పుట్టకముందు ఒక చిన్న విత్తనంలో ఉంటుంది మరి ఆ విత్తనం ఎంత పెద్దగా ఉండాలి కనీసం ఒక ఆపిల్ లాగానో ఆరెంజ్ లాగానో సపోజ జామపండు లాగానో ఉండదు మర్రి విత్తనం చాలా చిన్నగా ఉంటది. చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. అటువంటి ఒక చిన్న గింజలాగా ఉన్న మర్రి విత్తనం లోంచి భూమిలో పెట్టిన తర్వాత ఆ విత్తనం పగిలిపోయి దాంట్లో నుంచి ఒక వృక్షం వచ్చి ఆ వృక్షమే పెద్ద వటవృక్షంగా మారుతుంది మర్రి చెట్టుగా మారుతుంది అన్నమాట కాబట్టి మనం చేసే పని ఆ మర్రి విత్తనం లాగా చాలా చిన్నది అయినప్పటికీ దాని ఫలితం ఎలా ఉండాలి అంటే
(07:48) ఒక పెద్ద మర్రి చెట్టులాగా ఉండాలని ఇక్కడ వేయమని చెప్తున్నారు అన్నమాట. ఆ చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షం దాగి ఉంటుంది అలాగే మన చిన్న సాయంలో కూడా అనంతమైన పుణ్యం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఒక చిన్న విత్తనం ఎలాగైతే వేల మందికి నీడనిచ్చే మహావృక్షంగా మారుతుందో స్వచ్ఛమైన మనసుతో చేసే పని అలాగే విస్తరిస్తుంది.
(08:09) మనం చాలా పనులు చేస్తుంటాం కొన్ని స్వార్థంతో మన సంపాదన కోసమో ఆదాయం కోసమో చేస్తాం అవి తప్పదు జీవించడానికి చేస్తాం. అలాగే కొన్ని పేరు రావడం కోసమనో పక్కవాళ్ళతో మంచివాళ్ళు అనిపించుకోవడం కోసమో చేస్తాం. ఇవి కూడా వద్దని చెప్పడానికి లేదు కానీ దానివల్ల ఫలితం కొంతే ఉంటుంది. అది బంధువులకు ఉపయోగపడొచ్చు మన కుటుంబ సభ్యులకు ఉపయోగపడొచ్చు స్నేహితులకు ఉపయోగపడొచ్చు కానీ నిజంగా సమాజానికి మొత్తం దేశానికో ధర్మానికో లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడాలి అంటే మాత్రం మనం చేసే పని నిజాయితీగా చేయాలి నిస్వార్థంగా చేయాలి ఈ నిస్వార్థం అనేది బాగా
(08:49) గుర్తుపెట్టుకోవాలి అంటే నిస్వార్థం అంటే మనం చేసే పని యొక్క ఫలితాన్ని ఆశించడం కాకుండా ఫలితం ప్రపంచానికి మంచి జరగాలి లేదా మన ఎదుటివాడికి మంచి జరగాలి అనుకొని మనం ఆ పని చేసి మనవంతు బాధ్యతని ఎటువంటి ఆ అపేక్ష లేకుండా పూర్తి నిజాయతీతో చిత్తశుద్ధితో చేయాలి అప్పుడు దాని ఫలితం 1000 రేట్లు పెరుగుతుంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట దేవుడికి మనం సమర్పించేది కొండంత బంగారం కాదు కోరంత భక్తి అయినా అది చిత్తశుద్ధితో ఉంటే చాలు అలాగే వేమన ఈ పద్యంలో దేవుడి ముందుకు వెళ్లి భక్తి పేరుతో కొందరు ఆడంబరాలు చేస్తూ ఉంటారు వాళ్ళను కూడా సూచిస్తూ దీన్ని చెప్తున్నారు
(09:32) అన్నమాట భక్తి చాలా నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నప్పుడు అది ఎంత తక్కువ సాదా సీదాగా ఉన్నప్పటికీ గొప్ప మనశశాంతిని ఇస్తుంది అని ఏమని చెప్తున్నారు. అలా కాకుండా ఎంత ఆడంబరం చేస్తే అదంతా ఫేక్ గా మారిపోతుంది నకలీగా మారిపోతుంది దాంట్లో స్వచ్ఛత లోపిస్తుంది అన్నమాట వంద రూపాయల దానం ఆడంబరంగా చేయడం కంటే ఒక్క రూపాయి మనస్ఫూర్తిగా ఇవ్వడం మేలుని మనకి ఈ పద్యం ద్వారా తెలుస్తుంది చాలామంది దానధర్మాలు చేస్తూ ఉంటారు దానధర్మాలు అందుకే గుప్త దానం అని చెప్తారు అన్నమాట అంటే ఒక దానం చేసినప్పుడు దాన్ని పది మందికి చెప్పుకోకూడదు రహస్యంగా ఉంచాలి అని మన
(10:13) పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారు అలా అంటే ఎప్పుడైతే మనం 10 మందికి ప్రచారం చేసుకుంటామో మనం చేసిన దానం వల్ల జరిగిన మంచి కంటే కూడా మనం దానం చేశమనే ఒక ఇగో మనలో పెరుగుతుంది అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం ఎప్పుడైతే వస్తుందో మనం చేసిన మంచి కూడా కొట్టుకుపోతుంది అన్నమాట. అట్లా అందుకని మనము ఏదైనా ఒక మంచి పని చేస్తే దాన్ని నీతిగా నిజాయితీగా చేసి సాధ్యమైనంత వరకు దాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట దానివల్ల ఎదుటివాడికి మంచి జరగడంతో పాటు మనకు కూడా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ప్రచారం చేసుకోవట్లేదు కాబట్టి మనలో
(10:50) అహం పెరిగి ఇగో పెరిగి మనం తప్పుదారి పడి పతనం అవ్వకుండా ఉంటామ అన్నమాట ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ పరమాత్మకు తెలుసు మనసులో ఏముందో అందుకే బాహ్య రూపం కంటే అంత అంతర్గత శుద్ధి ముఖ్యం ఒకవేళ నిజంగా దేవుని నమ్మేవాళ్ళు దేవుడి కోసమే దానధర్మాలు చేస్తున్నామ అని ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా దేవుడికి మనం చేస్తున్న అన్ని తెలుసు కాబట్టి మళ్ళీ గోడల మీద గోపురాల మీద లేదంటే తివాచీల మీద ఆ ధ్వజస్తంభాల మీద లేదా అట్లా ఈ విధంగా ఏ అనాధాశ్రమానికో గుడి అనే కాదు దేవుడు కాకుండా ఏ అనాధాశ్రమానికో దానం చేశారు అక్కడ కూడా నేమ్ ప్లేట్స్ వేయిస్తూ ఉంటారు. చివరాఖరికి
(11:31) ఎండకాలంలో నీళ్లు దానం చేసేటప్పుడు ఆ చలివేయడం దగ్గర కూడా తమ పేరుతో కూడుకున్న ఒక బోర్డో ఆ ఒక బ్యానర్ కట్టి చేస్తూ ఉంటారు. ప్రచారం వాళ్ళు చేసుకోవద్దు అని చెప్పే హక్కు మనకు లేదు కానీ మనం ఎప్పుడైనా సరే దానం చేసినప్పుడు దాన్ని ప్రచారం చేసుకోకుండా సాదా సీదాగా చేసి 10 మందికి మంచి జరిగితే చాలు మనకు పేరు రావడం అనేది పెద్దగా ప్రధానం కాదు అని అనుకుంటే అది నిజమైన ఆ నిజమైన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని మనకు ఈ పద్యం ద్వారా వేమన చెప్తున్నారు.
(12:08) ఈ చిత్తశుద్ధి పత్యం మీద మీ అభిప్రాయాలు ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థాంక్యూ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment