Thursday, November 26, 2020

ప్రేమా ? పగా ? అమ్మను మోసంచేస్తున్నాను !

ప్రేమా ? పగా ?
🍀🌺🍀🌺🍀
అమ్మను మోసంచేస్తున్నాను !
➖➖➖
తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది.
మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని మారాము చేస్తున్నది.
కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది.
కోడలిది వైద్య వృత్తి.
నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది. కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది.
చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి హాయిగా నిద్రపోయింది.
ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది.
నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది.
అప్పుడు అతను, 'అమ్మ కూడా చిన్నప్పుడు మోసం చేసి మాకు బోలెడు తినిపించేది. మాయ మాటలు చెప్ప నిదుర
పుచ్ఛేది .అప్పట్లో ఆమె మోసం చేసేది.. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను.' అని అన్నాడు.
ఇట్లా కూడా అమ్మను ప్రేమించవచ్చు.
💝💝💝💝💝💝💝💝💝 💝💝💝
🙏🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment