Wednesday, November 18, 2020

ఆనందమే ఎలా?

🧘‍♂️ఆనందమే ఎలా 🧘‍♀️


కోరిక లేనప్పుడు ఉన్న స్థితి ఆనందమే !

అప్పటి వరకూ శాంతిగా ఉన్న మనసుకి సినిమాకి వెల్దామని పించింది అనుకోండి అశాంతి మొదలై చూసే వరకూ ఉంటుంది. కోరిక తీరాక తిరిగి మనసు మొదటి స్థితికి వస్తుంది. అలా అనిపించక ముందు ఎలా ఉన్నామో, ఆ కోర్కెను తీర్చుకున్న తర్వాత కూడా అలానే ఉంటాం. కోరిక రాకముందు ఉన్న హాయే కోరిక తీరిన తర్వాత కూడా ఉంటుందని గుర్తించాలి. ఈ మధ్యలో కోరిక తీవ్రతను బట్టి మన అశాంతి ఆధారపడి ఉంది. మనసు ఎప్పుడూ శాంతిగానే ఉంది. కోరిక తీవ్రతను బట్టే ఆలోచనలు ఏర్పడుతున్నాయి. అది లేనప్పుడు ఉన్న స్థితి ఆనందమే. ధర్మాన్ని అనుసరించగలిగితే కోరికలు ఉన్నా అవి కలిగించే ఆలోచనల తీవ్రత తగ్గి ఆనందస్థితే కొనసాగుతుంది



మనసు ఆనందకరమైన సమస్థితిలో ఉన్నప్పుడు తప్పులు జరగవు !!

సృష్టిలో అన్నింటితోపాటు మనిషికి ఒక ధర్మం ఉంది. సృష్టిలో మిగిలినవన్నీ వాటివాటి ధర్మాలను పాటిస్తున్నాయి. కానీ మనిషే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. సృష్టికి ధర్మమే ఆధారం. ఆ ధర్మానికి కూడా ఆత్మే ఆధారం. నిత్యశాంతి దాని ధర్మం. సాధారణ జీవనంలో వచ్చే ఆలోచనలకు, కోరిక కలిగినప్పుడు కలిగే ఆలోచనలకు 'గాలికి - పెనుగాలికి' ఉన్న తేడా ఉంటుంది. ధర్మం నుండి దూరం చేసేది కోరికే. మనంచేసే పొరపాట్లన్నీ కోరికవల్ల సంతోషం, దుఃఖం, కోపం, ఆవేశంలో జరుగుతాయి. మనసు ఆనందకరమైన సమస్థితిలో ఉన్నప్పుడు తప్పులు జరగవు !


ఆనందం లేకుండ ఏ మానవుడు, జీవరాశి మన లేవు !

మనసును వికలంచేసే గుణం కోరికలో ఉంది. కోరికలేని మనసు సంతోష, దుఃఖాలకు అతీతమైన ఆనందస్థితిలో ఉంటుంది. అప్పుడది సర్వత్రా ఉన్న పరమాత్మను గుర్తిస్తుంది. ఉన్నది ఉన్నట్లు స్వీకరించే గుణంలోనే ఆనందం ఉంది. అదే మన శాంతికి కొలమానం. లెక్కించ దగింది, అందించదగింది అదే. మహావాక్యం "అహంబ్రహ్మస్మి" అర్థం మనలోని శాంతి - ఆనందమే. అదిలేకుండా ఏ మానవుడు, జీవరాశి మన లేవు. కనుకనే మనమంతా మహా వాక్యర్థములమ అవుతాము

వాస్తవ జ్ఞానం సముపార్జించుకుంటే మనం వేదాంత స్వరూపులమే

మనందిరిలోనూ నిష్కళంకమైన ఆత్మే ఉంది కనుక మనందరం ఆత్మ స్వరూపులమే. ఈ విషయంలో ఏ "శంక" లేకపోతే అంతా శంకరస్వరూపులమే అని గుర్తుపడతాము. వేదాంతం అంటే కొత్తది కాదు. మనం గుర్తించని వాస్తవం. ఆ వాస్తవ జ్ఞానం సముపార్జించుకుంటే మనం వేదాంత స్వరూపులమే అవుతాము. సత్యదృష్టి అలవడితే అది అవాస్తవ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మనలో ఉన్న వస్తువు శివ స్వరూపమన్న సత్యం తెలిస్తే ఇక మనసు, శరీరాల గురించి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వము. మనోభావనగా ఉన్న జీవుడు, దేహం, ప్రపంచం అన్ని అసత్యమే. అంటే ఆధారవస్తువుపై కాకుండా ఈ లోకంపై ఆధారపడి ఏర్పరుచుకున్నవన్నీ అసత్యం



అసత్యం అంటే శాశ్వతంగా నిలిచి ఉండనిది

ఈలోకం మన మెలకువతో స్పృహలోకి వచ్చేదే. జయాపజయాలు, జననమరణాలు, నిద్రా మెలకువలు, సూర్యోదయ అస్తమయాలు అన్నీ మెలకువలో తప్ప నిద్రలో మనకు ఉండవు. అందుకే అవి అసత్యం. అసత్యం అంటే శాశ్వతంగా నిలిచి ఉండనివి. శాశ్వతంగా నిలిచి ఉండనిది ఎప్పుడూ ప్రామాణికం కాదు. మనసు అంటే మెలకువ తర్వాత తెలుసుకున్నది, నేర్చుకున్నదే. అదంతా ప్రపంచంలోనిదే. దానివల్ల ప్రాపంచిక ఉపయోగం తప్ప మనలోని చైతన్యానికి ఏ ఉపయోగం లేదు. ఈశ్వరరూపం సహా ప్రపంచం అంతా ఎందుకు అసత్యమైందంటే అదికూడా మన భావనపైనే ఆధారపడి ఉంది.. నిద్రలో అది నిలిచి ఉండటంలేదు కనుక

Source - Whatsapp Message

No comments:

Post a Comment