Friday, February 5, 2021

వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సునామీ,యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు...

💰వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సునామీ:💰

💰ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు

💰తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు.

💰ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

💰‘మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 17 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది.

💰రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తోంది.

💰ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది'

✍️అని యండమూరి వ్యాఖ్యానించారు.✍️

💰‘సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం.

💰కానీ సంపన్నులు ‘డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి' అవసరం లేదన్న' విషయం తెలుసుకున్నారు.

💰ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం' మానేశారు.

💰దీంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది.

💰మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తంగా పొందటానికి అలవాటు పడుతున్నారు.

💰ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వంపై ఆధారపడతారు.

✅వారినీ తప్పు పట్టలేం✅.

💰ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పన్నులు ఎక్కడ ఉంటాయి?'

❓అని యండమూరి ప్రశ్నించారు❓❓.

👉ఇలా మనుగడ కష్టసాధ్యమే..

‘సరే. సోషలిజం సంగతి పక్కన పెడదాం.

✅మీకు తెలుసా?

👉మన రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితి 3.5ను దాటింది.

👉కానీ, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు.

👉ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది.

👉మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు.

💰వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి.

💰మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు.

💰ఇదిలా ఉండగా పెన్షన్లు 1,000 శాతo పెరిగాయి'

✍️అని యండమూరి వివరించారు.

💰ఆర్థిక సునామీ తప్పదు💰..

💰రూ. 50వేల కోట్లు అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్ బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2కోట్ల బడ్జెట్ అంచనా వేసింది

💰ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది?

💰దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది.

💰అప్పటికే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు.

✍️అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే.

✍️ప్రస్తుతం ప్రమాదం చాప క్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది.

✍️మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది.

✅మళ్ళీ చెపుతున్నాను.

✅ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.

💰 కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది' అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.

💰కావున ప్రజలను చైతన్యవంతులను చేయడం చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత.కాబట్టి వీలైనన్నిసార్లు దీనిపై పదిమందిలో చర్చించండి.లేకపోతే భవష్యత్తులో మన వారసులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు.

👌 ఆలోచించండి👌

Source - Whatsapp Message

No comments:

Post a Comment