Friday, February 4, 2022

సంసార జీవితంలో ఉన్నవారు అందరూ బాధలు అనుభవిస్తున్నవారే

సంసార జీవితంలో ఉన్నవారు అందరూ
బాధలు అనుభవిస్తున్నవారే

మరి ఈ బాధలకు కారణం ఏమిటి అని ఆలోచించేవారు కొందరు మాత్రమే ఆలోచించగలుగుతున్నారు

సంసారంలో ఉంటూ సంసార జీవితాన్ని ఎలా గడపాలి ?

ఒక చెరువులో ఇద్దరు స్నానానికి దిగారు
ఒక వ్యక్తి ఈత తెలిసినవాడు
ఇంకో వ్యక్తి ఈత తెలియనివాడు

ఈత తెలియనివాడు ప్రాణభయంతో ఆ చెరువు నీటిలో మునుగుతూ తేలుతూ ఈదుతున్నాడు
ఈత తెలిసిన వ్యక్తి హాయిగా నీటిలో తేలుతూ ఆనందంతో స్నానం చేస్తున్నాడు

చెరువులో దిగే వారికి ఈత తెలిసి ఉండాలి
సంసారంలో దిగే వారికి ఆధ్యాత్మిక వైభవం తెలిసి ఉండాలి

చెరువులో దిగేవారికి ఈత రాకున్నా
సంసార జీవితం గడిపేవారికి దైవ చింతన లేకున్న
వీరిద్దరు దుఃఖాన్నే అనుభవిస్తారు
మరణ భయం కూడా ఉంటుంది
.

సేకరణ

No comments:

Post a Comment