Tuesday, May 31, 2022

భగవంతుడు ఎలా ఉంటాడు🙏

 🕉హరి ఓం 🙏 శ్రీలత సేకరణ

 * సభ్యులందరికి శుభోదయం* 


భగవంతుడు ఎలా ఉంటాడు🙏


ఒక పట్టణంలో ఒక స్త్రీ నివసించేది, ఆమె ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయనను ప్రత్యక్షంగా కలవాలని కోరుకుంటూ ఉండేది. ఆమె ఎప్పుడూ భగవంతుని రూపాన్ని గురించే ఆలోచిస్తూ ఉండేది.


ఒకరోజు నిద్రకు ఉపక్రమించే ముందు భగవంతుడిని చాలా శ్రద్ధగా  స్మరించుకుంది. ఆ రాత్రి భగవంతుడు కలలో కనిపించి మరుసటి రోజు ఆమెను కలుస్తానని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే స్వామికి స్వాగతం పలికేందుకు సంసిద్ధమైంది. 


ఇంటిని శుభ్రం చేసి, కన్నులపండువగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె తన ప్రభువుకు రుచికరమైన ఆహారాన్ని తయారుచేయడం ప్రారంభించింది.


 మిఠాయిలు చేస్తుండగా ఎవరో తలుపు తట్టారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది. పత్రికలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక అమ్మేవానిని చూసింది.


ఆమె చాలా చిరాకు పడి, దాదాపుగా అరుస్తునట్టుగా, "దయచేసి ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నేను ఒక ముఖ్యమైన మనిషి కోసం ఎదురు చూస్తున్నాను, కాబట్టి నా ఇంటి గుమ్మాన్ని ఖాళీగా ఉంచండి. నా సమయాన్ని వృధా చేయకు", ఆ అమ్ముకునే వానిని తరిమేసి హడావుడిగా తలుపు వేసింది.


మిఠాయిలు చేసిన తర్వాత, ఆ మహిళ వంటగదిని శుభ్రం చేసి, ముందు గదిలో స్వామి కోసం ఆత్రుతతో వేచి ఉంది.


కాసేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. భగవంతుడిని చూడాలనే ఆశతో మళ్ళీ తలుపు దగ్గరకు చేరుకుంది. తన కూతురితో ఆడుకోవడానికి వచ్చే పక్కింటి అమ్మాయిని చూసి నిరుత్సాహపడింది.


ఆమె అమ్మాయితో కోపంగా, "నన్ను క్షమించు, ఈ రోజు మేము ఒక ముఖ్యమైన అతిథి కోసం ఎదురు చూస్తున్నాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. రేపు తిరిగి వచ్చి మా పాపతో ఆడుకో" అని చెప్పింది. 


ఆ అమ్మాయి సమాధానం కోసం ఎదురుచూడకుండా తలుపు వేసుకుని, భగవంతుడు వస్తాడని ఎదురుచూస్తూ ముందు గదిలోకి తిరిగి వచ్చింది.


గంటలు గడిచిపోయాయి, పగలు రాత్రిగా మారింది, కానీ భగవంతుని జాడ లేదు! భగవంతుడు తన వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆమె చాలా నిరాశతో ఆలోచించడం ప్రారంభించింది.


చివరికి, ఆమె ఆయన గురించి ఆలోచిస్తూ, ఏడుస్తూ నిద్రపోయింది. అప్పుడు భగవంతుడు కలలో కనిపించి, "నా ప్రియతమా, నేను ఈ రోజు రెండుసార్లు నీ దగ్గరకు వచ్చాను. రెండు సార్లు నువ్వు నన్ను తరిమేసావు", అని చెప్పాడు. 

ఆమె ఆశ్చర్యపోయి, "ఇది నిజం కాదు! నీకోసం నేను రోజంతా ఎదురుచూశాను, ఎక్కడా నీ జాడ కనిపించలేదు. నువ్వు ఎప్పుడు వచ్చావు?" అని ఆమె అంది.


"మొదట నేను ఒక అమ్ముకునేవానిగా వచ్చాను, తరువాత పక్కింటి పాపగా వచ్చాను, కానీ రెండుసార్లు, నువ్వు నా మాట వినకుండా నన్ను తరిమికొట్టావు."


ఆ స్త్రీ తన తప్పును వెంటనే గ్రహించి, "క్షమించండి మహా ప్రభూ! నేను నిన్ను గుర్తించలేకపోయాను."


భగవంతుడు ఇలా చెప్పాడు, "నేను ప్రతిదానిలో ఉన్నాను, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను."


భగవంతుని భావన మన మనస్సు యొక్క సృష్టి అని మనం అర్థం చేసుకోవాలి. 

తరచుగా అది మనల్ని మోసం చేస్తుంది, దాని వలన మన అహం ఆడే ఆటను మనం అర్థం చేసుకోలేము.


భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, దాని గురించి ఎటువంటి సందేహం లేదు, కానీ భక్తుని యొక్క సంకల్పం హృదయపూర్వకమైనదని  భగవంతుడు భావించినప్పుడు మాత్రమే.


ఈ కథలోని స్త్రీ లాగే మనం కూడా మన చుట్టూ ఉన్న మనుషులను, జీవులను, వస్తువులను ప్రేమ, గౌరవం లేకుండా పరిగణిస్తాం...  ఆపైన "భగవంతుడిని చూడాలని" ఆశిస్తాం. 


మన చుట్టూ ఉన్న ప్రతి చేతన వస్తువులో, భౌతిక వస్తువులో భగవంతుడిని చూసే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోకపోతే, ఇది సాధ్యం కాదు.


"అనంతమైన అంతిమతత్వాన్ని చేరుకోవడం ప్రతీ మానవుని ప్రాధమిక కర్తవ్యం."

   

మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, 'భగవంతునితో సంపూర్ణ ఏకత్వం' అనేదే మన లక్ష్యం అయ్యిఉండాలి. ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించవద్దు🙏


🥀శుభమస్తు🥀_*

      🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


మా గ్రూప్ ల్లో చేరాలనుకునేవారు  క్రింది లింకుల ద్వారా చేరవచ్చు .ఓం నమో భగవతేరమణాయ.

https://www.facebook.com/groups/459295881500972/?ref=share


https://www.facebook.com/groups/153987413305775/permalink/155075936530256/


https://www.facebook.com/groups/2541007569307530/?ref=share


https://www.facebook.com/sreelatha53/

నేటి జనరేషన్ హృదయం, నిజజీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి.

🌿 నిజజీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. 🌿

ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.

జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.

ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది.

ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.

జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే ఆలోచించి అలా చెప్పారు.

ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ, ఎటువంటి మేజిక్కూ జరగలేదు.

అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.

"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.

అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.

ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.

జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.

కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.

సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.
తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.

మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.
ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.


🌹 ఇదీ నేటి జనరేషన్ హృదయం 🌹

సేకరణ

🙏మనోజయం

🙏మనోజయం

రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి నీ మనసు ఆధీనంలో నువ్వు ఉండటం లేదంటే నీ ఆధీనంలోకి నీ మనసును తెచ్చుకోవడం తనదే పై చేయిగా ఉండాలని, ప్రతీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు. చివరికి అదే గెలుస్తుంది. మనం ఓడిపోతాం. గెలవడం మనసుకు అలవాటు ఓడిపోవడం మనకు అలవాటు. ఓడి, గెలిచామనుకుంటూ కొంతమంది సంతృప్తి పడుతూ ఉంటారు. ఆ అవకాశం మనకు ఇచ్చేది మనసే

మనసును గెలిచినవాడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. మనసును నేల కనిపించినవాడి నడవడిక నిండుకుండలా తొణక్క బెణక్క ఉంటుంది. మనో నాశనం అయినవాడి ముఖం భగవద్గీత చెప్పిన ఉత్తమమైన యోగిలా ఉంటుంది. మనలో ఉండి, మనతో పోరాటం ఈ మనసుకు... అదే గమ్మత్తు శత్రువు ఎక్కడో ఉండడు. లోపలున్నవాడిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే తొందరగా తేల్చుకోవాలి. మనసు

చెప్పినట్లు వింటే అరిషడ్వర్గాలకు ఆహుతి అయిపోతాం. లేదంటే మనసునే మచ్చిక చేసుకోవాలి. చితిలోని కట్టెను తీసుకుని, ఆ చితినే తగలబెట్టినట్లు మనసుతోనే మనసును నాశనం చెయ్యాలి.

ప్రపంచానికి వేదిక మనసే. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఎక్కడా ఎవరూ చూడరు. నిత్యం ఈ రంగస్థలం: ఖాళీగా రకరకాల భావోద్వేగాలతో నిండిపోయి, కుట్ర కుతంత్రాలతో మరిగిపోయి, రాగ ద్వేషాలతో, ఆశాపాశాలతో వేయి. పడగల సర్పంలా బుసలు కొడుతూ ఉంటుంది.

చాలా భీకరంగా, బీభత్సంగా, భయానకంగా ఉన్నత్తంగా ఉండే ఈ మనసును కూడా లొంగదీసుకునే రాజయోగి ఒకడున్నాడు. వాడు. మనిషే వాదెన్నడూ వెనకడుగు వెయ్యలేదు. రణమో, రాజనమో అంటూ పోరాడుతూనే ఉన్నాడు.

అంతర్యామి

మనసును ఆధీనంలోకి తెచ్చుకునే దానితో సర్వకార్యాలు నెరవేర్చుకోవాలి. మనసు లేకపోతే మౌనాన్ని ఆశ్రయించాలి. కొండ మీద కూర్చోవాలి. శీతోష్ణ సుఖదుఃఖాదులను ఓర్చుకోవాలి. సంసార సముద్రాన్ని దాటేశానని సంతోషపడాలి. వద్దు వద్దు. అన్నీ ఉండగా, అందరితో ఉండగా, మనసును రళ్లెం వేసి పట్టుకుంటూనే ఈ బతుకు తీరం దాటాలి అంటాడు కబీర్ ఇది సంతోషం కలిగించే విషయం. కోట బయట యుద్ధం కంటే కోట లోపల యుద్ధం సురక్షితం అంటారు రామకృష్ణ పరమహంస..

ఇలా అందరూ చెయ్యగలరా? చెయ్యలేదు. అయినా తప్పదు. మనసు ఆధీనంలోకి మనం వెళుతున్నట్లు నటించి మన ఆధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. ఆ విషయాన్ని మనసు పసిగట్టకుండా చూసుకోవాలి. ఆ నైపుణ్యం మనకుండాలి. జీవితమంతా మనసుతో ఆడే అటే. ఇలాంటి రంజుగా ఉండే ఆట లేకపోతే బతుకు ఎంతో చప్పగా ఉంటుందనేమో భగవంతుడు మనిషికి మనసిచ్చాడు. ఆ మనసే అంతులేని శిక్షగా మారిపోయింది. మనసే బంధకారకం. మనసే మోక్ష కారకం అంటున్నాయి ఉపనిషత్తులు, అంటే ఎంతో చెడు చేసినా, చివరికి ఈ భవబంధాల్లోంచి విడగొట్టేది మన సేనన్నమాట. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు మనసు ఏదైనా చెయ్యగలదు. మంచిగా మనసుతో వ్యవహరిస్తూ అదుపు

చేసే సామర్థ్యం పెంచుకోవాలి. మనం ఒక ఎత్తు చేస్తే, అది మరో ఎత్తు వేస్తుంది. ఈ చదరంగ క్రీడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే పట్టుదల గల మనిషిని విజయం వరించకుండా ఉండదు!
ఆనందసాయి స్వామి

సేకరణ

ఆకాశవాణి సంస్కృత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియజేస్తోంది.

All India Radio ఆకాశవాణి సంస్కృత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియజేస్తోంది. ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము. పురుషునకు విద్యయే ఆభరణము కాని వేరు కాదు అని సుస్పష్ఠము.

శ్లోకము:

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

భావార్థం:

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.

చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి యొక్క సుభాషితములలోని నీతి శతకములో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు సేత ఈ  క్రింది పద్యము.

ఉ.భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా

గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .


Reference link : http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june2016/subashitam.html

భేతాళ కథలు: వ్యర్థమైనవరం

💦భేతాళ కథలు💦
🌻వ్యర్థమైనవరం🌻

♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఏ పట్టుదలకు సంతోషమేగా, హేమంతరాయుడి కుమార్తె మాలిని పొందిన వరం లాగే నీ ప్రయత్నం కూడా వృథా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమతెలియకుండా నీకు హేమంతరాయుడి కూతుళ్ళ కథ చెబుతాను విను," అంటూ ఇలా చెప్పసాగాడు.

♦️జయంతనగరంలో హేమంతరాయు తనే ప్రభు వొకడుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కాని అంత అంద గత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె, కాని ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది.

♦️మాలినీ నళినీ కూడా యుక్తవయసు వచ్చి పెళ్ళికి సిద్ధమయారు. కాని వాళ్ళకు తగిన వరుళ్ళను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి. కాని ప్రతి యువకుడూ నళినిని చేసుకుంటా ననేవాడే, మాలినిని చేసుకుంటానని ఒక్కడూ అన లేదు. పెద్దదాని పెళ్ళి చెయ్యకుండా, 'చిన్న దానికి ఎలా పెళ్ళిచెయ్యటం ?

♦️ఆ సమస్య అలా ఉంచి, రూపగర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాలలో ఒక్కడూ నచ్చలేదు. అందుచేత హేమంత రాయుడు చిన్న కుమారికే పెళ్ళి చేసేద్దా మనుకున్నా అది పొసగే దారి కనబడలేదు.

♦️పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడి చిన్ననాటి స్నేహితుడి కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం నాలుగు మూలలూ చూడాలనే ఉద్దేశంతో దేశసంచారం చేస్తూ జయంతనగరానికి వచ్చాడు.

♦️ఈ మాధవుడు చాలా అందగాడూ, మంచి మేధావీనూ, ఏ యువకుడి చేతా ఆకర్షించబడని నళినిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది. కాని నళిని అహంకార పూరితురాలని మాధవుడు గ్రహించాడు.

♦️మాధవుడు జయంతనగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంత రాయుడు అతనితో తన మనసులోని మాటా బయట పెడుతూ, 'నాయనా, నీ తండ్రి నేనూ చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగినవాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్న నాకు కోర దగిన దేముంటుంది? నా కూతుళ్ళ నిద్దరినీ నువు ఇన్నాళ్ళూ చూశాపు గద. వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ ఇద్దరిలో ఎవరిను నువు పెళ్ళాడ గోరినా నేను సంతోషిస్తాను," అన్నాడు.

♦️దానికి మాధవుడు, "మీ కోరిక చాలా ఉదోరమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణ మేమంటే, నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యమూ రెండూ కోరుతాను. దురదృష్టవశాత్తు, ఈ రెండు గుణాలూ మీ కుమార్తె లిద్దరిలోనూ ఉండి పోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగి పోయే టప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనను ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను.

♦️ఈ సారికి నన్ను క్షమించండి." అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంత రాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ, నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరూ మాధవుణ్ణి పెళ్ళాడ గోరినవాళ్ళే.

♦️మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును. కాని నళిని పూర్తిగా హతాశురాలై పోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాటి వాళ్ళనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేక పోయిందని, అందుకు తన స్వభావమే అడొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వమూ, అతి శయమూ క్రమంగా క్షీణించిపోయాయి.

♦️మాలిని హతాశురాలు కాకపోవటమే గాక, తాను ఏం చెయ్యాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చే లోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్ళాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకున్నది.

♦️ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రో పాసకుణ్ణి వెతికించి పట్టుకుని, అతనితో తన కోరిక చెప్పింది. ఆరునెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి, బలులు ఇచ్చినట్టయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చుననీ, అర్చనానుష్ఠానాలు మాత్రం ఏ లోపమూ లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది.

♦️ఆరునెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడి పైన ఆవేశించి, "అమ్మాయీ, నీ నిష్టకు సంతో షించాను. నా వల్ల నీ కేమి సహాయం కావాలి అని అడిగింది.

♦️"తల్లి, నన్ను నా చెల్లెలి కన్న సౌందర్య పతిగా చెయ్యి. నా కింకేమీ అవసరం లేదు," అన్నది మాలిని.

♦️తథాస్తు!" అని యక్షిణి ఉపాసకుడి మీది నుంచి దిగిపోయింది.

♦️అటు తరవాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది.. ఆమె క్రమంగా అందగత్తె అవుతూండటం అందరికీ కానవచ్చింది. శరీరచ్ఛాయ హెచ్చుతున్నది. కళ్ళు విశాల మవుతున్నాయి, చెక్కిళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు. తన ఇద్దరు కూతుళ్ళను చూసి, " మాలిని నళినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే? ఏమిటి చిత్రం ?" అనుకున్నాడు.

♦️కాని త్వరలోనే ఆ అక్క చెల్లెళ్ళను, చూసినవాళ్ళు, "అందంలో నళిని కన్న మాలినే ఒక పెసరు హెచ్చు. ఏమీ సందేహం లేదు." అనసాగారు.

♦️"అక్క అదృష్టవంతురాలు. ఈ సారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్ళాడతాడు," అనుకున్నది నళిని,

♦️చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంతనగరానికి వచ్చి, హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు.

♦️పూర్వం లాగే మాలిని తోనూ, నళినితోనూ మాట్లాడి చూశాడు. రెండురోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, "మీరు నన్ను మీ అమ్మాయిలలో ఎవరినైనా పెళ్ళాడమని ముందు అన్నారు. నా మనస్సులో నిర్ణయం జరిగితే మీకు చెబుతాను అన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ రెండో అమ్మాయి నళివిని పెళ్ళాడటానికి సిద్ధంగా వున్నాను.” అన్నాడు.

♦️హేమంతరాయుడు పరమానంద భరితుడయాడు. పెద్దపిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్ళాడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్న పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్ళాడతానని శపథం పట్టి, ఆమె అంతపనీ చేసింది. హేమంతరాయుడు. తన ఇద్దరు కుమార్తెలకూ ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి, వారిని అత్తవారి ఇళ్ళకు పంపేశాడు.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, " రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్న కూడా సౌందర్యవతి అయింది కదా? ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణి వరంతో తీరిపోయింది కద? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, "మాలిని సౌందర్యవతి కావటం కోసం తన సౌజన్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణి వరం కోసం ఆమె ప్రయత్నించడంలో స్వార్థమూ, చెల్లెలి పట్ల అసూయా ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్నీ, అతిశయాన్నీ విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడి పైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు రెండోసారి వచ్చి మాలినితోనూ, వళినితోనూ మాట్లాడినప్పుడు, వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు.

♦️తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. ఆతను నళిని సౌందర్యంతో అదివరకే తృప్తిపడ్డాడు. అందుచేత అంతకన్న సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశ పడలేదు. మాధవుడు కేవలము సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పెళ్ళాడి ఉండేవాడు." అన్నాడు.

♦️'రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼

సేకరణ

కనుక చెడ్డని వదిలి మంచిని పట్టుకోండి. తరిస్తారు.

చెడు చేసినవారిని వెంటనే మరచిపోండి
మంచి చేసినవారిని జీవితకాలం గుర్తుపెట్టుకోండి.
ఇలా చేశాడు కనుకే రాముడిని దేవుడు అన్నారు.

ఎవరో మీ దగ్గర ఓ పదివేలు తీసుకొని ఇచ్చే అవకాశం ఉండి కూడా ఎగ్గోట్టాడు. వాడిని అక్కడితో వదిలేయండి. వాడి బుద్ది బయటపడింది కదా!

ఎవరో ఒకపూట భోజనం పెట్టారు. ఆ పూటకి ప్రాణం నిలబడింది కనుక జీవితకాలం గుర్తుంచుకోండి. ఎన్ని చేసిన పొట్టకోసమే కదా! అలాగని భోజనం పెట్టినవారినే కాదు. మాట సాయం, ధన సాయం ఇలా అవసరంలో ఎవరు ఎలా ఆదుకున్నా వారిని గుర్తుంచుకోండి. ఏదో ఒక మేలు చేయండి. లేదంటే మీరు కూడా పైవాడి లాగా కృతఘ్నులు అవుతారు.

నా జీవితంలో నేను నిలబడడానికి ఎందఱో సాయం చేశారు. వారందరికీ ఎదో ఒకటి చేశాను. కాకపోతే కొందరికి చాలాదూరంలో ఉండడం వలన ఇవ్వలేకపోయాను. పోయ్యేలోపు ఖచ్చితంగా ఎదో ఒక మేలు చేసే తీరుతాను.

అందరూ ఒకటి గుర్తుంచుకోండి. పోయేలోపు అందరి ఋణాలు తీర్చేయాలి. లేదంటే ఆ ఋణం చెల్లించడానికి మళ్ళి జన్మేత్తి రావాలి. ఋణానుబంధం అంటారు కదా! అదే ఇది.

ఒక్కొక్కరు ఇంటి నుండి కదలరు. కానీ భార్య వలనో, బిడ్డల వలనో కాలం గడిపేస్తాడు.
మరొకరు పుట్టిన కొన్నాళ్లకే మరణిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు శోకం కలిగించి పోతారు. వారి ఋణం అంతవరకే.
ఇంకొకరు భార్య రూపంలో వేధిస్తూ ఉంటుంది. పూర్వజన్మ వేధింపుల ప్రభావం ఈ ఋణం.

ఏమి లేదండి. ఒకరు మన మీద పడి తింటున్నా, మరొకరు బాధిస్తున్నా, మరొకరు తనంతట తానుగా అన్ని భరిస్తూ మిమ్మల్ని సంతోషపెడుతున్నా దానికి కారణం ఋణానుబంధమే.
మనతో కనెక్ట్ అయ్యేవారందరూ ఎదో ఒక కారణం లేకుండా మాత్రం కనెక్ట్ అవ్వరు.

కనుక చెడ్డని వదిలి మంచిని పట్టుకోండి. తరిస్తారు. చెడునే తలుస్తూ కూర్చుంటే మానసిక వ్యథ, తద్వారా అనారోగ్యం తప్ప ఏమి ఉపయోగం లేదు. ఎవరో ఎదో అన్నారని భాదపదవద్దు. దానికి కారణం ఉంటుంది. మనకి మనం మంచిగానే కనిపిస్తాం, మీలో నుండి మీరు బయటికి వచ్చి అ పరిస్థితిని గమనిస్తే తప్పు చేశామా! ఒప్పు చేశామా! అనేది బోధపడుతుంది.

సేకరణ

ఒక్కసారి నీవు వారికి ఎందుకు పనికి రావని తెలిసినప్పుడు నీ అవసరం వారికి లేదని తెలిసినప్పుడు నీవు వారికి ఏమీ చేయలేవని తెలిసినప్పుడు వారి నుండి చీకట్లో నీడలా ఇసుకలో నీరులా నీకు కనిపించకుండా దూరంగా వెళ్తారు.

🚩🚩🚩🚩🚩😀"చాణిక్య‌:"

"వేశ్య " ఒక మనిషి దగ్గర డబ్బు అయిపోయిన వెంటనే అతన్ని దూరం చేసుకుంటుంది, ఒక చెట్టుకు పండ్లు, నీడ ఉన్నంతవరకే ఆ చెట్టుపై పక్షులు నివాసం ఉంటాయి, బంధువులు తమ అవసరం ముగించుకున్న వెంటనే తమ తమ ఇళ్లకు బయలుదేరుతారు. ఒక బ్రాహ్మణుడు తనకు అందాల్సిన ప్రతిఫలం అందిన వెంటనే ఒకరి ఇంటిని వదిలి పెట్టి వెళ్ళిపోతాడు, గురువులు తమ విద్యార్థులకు విద్యను నేర్పిన వెంటనే తమ దారి తాము చూసుకుంటారు, జంతువులు ఒక అడవి పచ్చగా ఉన్నంతవరకే అందులో ఆడుతూపాడుతూ ఉంటాయి ఒక్కసారి ఆ అడవి ఎడారిగా మారినప్పుడు ఒక్కో జంతువు ఒక్కో పక్షి అడవిని వదిలి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి, అదేవిధంగా ఒక మనిషి దగ్గర సంపద , ఆస్తి, ఐశ్వర్యం, ఉన్నంతవరకే తన దగ్గర బంధువులు స్నేహితులు మిత్రులు ఎంతో ప్రేమ అనురాగాలతో నడుచుకుంటారు. ఒక్కసారి నీవు వారికి ఎందుకు పనికి రావని తెలిసినప్పుడు నీ అవసరం వారికి లేదని తెలిసినప్పుడు నీవు వారికి ఏమీ చేయలేవని తెలిసినప్పుడు వారి నుండి చీకట్లో నీడలా ఇసుకలో నీరులా నీకు కనిపించకుండా దూరంగా వెళ్తారు. 🚩🚩🚩🚩🚩🚩🚩

సేకరణ

సుప్రసిద్ద అజ్మీర్ దర్గా దాని వెనుక దాగున్న మన చక్రవర్తుల రక్తచరిత్ర!!

👍సుప్రసిద్ద అజ్మీర్ దర్గా దాని వెనుక దాగున్న మన చక్రవర్తుల రక్తచరిత్ర:⁉️

అజ్మీర్ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో ప్రార్థన చేసే ప్రతి హిందువు మన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ గారిచేతిలో 16 సార్లు ఓడి క్షమాభిక్ష పొంది తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయననూ ఆయన పట్టపు రాణి 'సంయోగితా దేవి' గారిని ఏవిధంగా చిత్రహింసలు పెట్టి హతమార్చాడో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది.

భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఇస్లాం సూఫీ ప్రచారకుడు ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ మరియూ ఈతనిని ఘరిబ్ నవాజ్ ( పేద ప్రజల ఉద్దారకుడు) అని కూడా పిలుస్తారు అతని తదనంతరం అతని పేరున ప్రసిద్ధికెక్కిన ఈ దర్గా అజ్మీర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో తారఘర్ కొండ కింద వుంటుంది ఇందులో రెండు పెద్ద సమావేశ మందిరాలతో బాటు పలు పాలరాతి కట్టడాలు నిర్మింపబడ్డాయి, నిజాం పాలకులు నిర్మించిన అతి భారీ ద్వారము, షాజహాన్ నిర్మించిన అక్బరి మసీదుతో బాటు ఈతని పెద్ద పాలరాతి గుమ్మటము గా ఉండేది.
ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మొఘలుల దండయాత్రకు ముందు మన హిందువుల గుడి దానిని వారు కూలకొట్టి ఆ ప్రాంతంలో దర్గా నిర్మించారని చెప్తారు, భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాలే అంటే అతిసయోక్తి కాదేమో. ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దివి నుండి దిగివచ్చిన దేవుడో లేదంటే సూఫీ సన్యాసో కాదు ఈతను ఒక మూర్ఖుడు, ఉన్మాది. అతనికి భారతదేశంలో ఇస్లాం వ్యాపింపచేయాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఇక్కడకు వచ్చాడు.

ఘోరి మహమ్మద్ ను భారతదేశం పైకి దండయాత్రకు వురుకోల్పింది ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీనే అనే విషయం చాలమందికి తెలియదు. అతనికి ఏ మహిమలు లేవు పైగా ఆవు మాంసం తినే ఒక ఉన్మాదిత్వానికి రూపకర్త అతడు. హిందువులకు ఈతని దుష్క్రుత్యాలు తెలియకుండా అతని అనుయాయులు మరియు కుహానా చరిత్రకారులు అతని అసలు స్వరూపం దాచి అతనికి చరిత్రలో సుస్థిర స్థానం కల్పించారు.

దురద్రుష్టవశాత్తు మన చరిత్రలో భారతదేశాన్ని మనలను కాపాడిన మహారాజులకు తగిన స్థానం దక్కలేదు. పిరికిపంద, లక్షల మంది హిందువులను చంపిన మహమ్మద్ ఘోరీని 16 సార్లు ఘోర పరాజయం పాల్జేసిన వీర యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ ని హిందువులు గుర్తించటంలో విఫలమయ్యారనే చెప్పుకోవాలి.😰

మరగుపరచబడిన చిష్తీ అసలు స్వరూపం.
ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీయే మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ భార్యయైన ‘సంయోగిత దేవి’ని ఇస్లాంకు మారలేదని మహమ్మద్ ఘోరి చేత లైంగిక హింసలకు గురి చేసి బందించి ఒక లైంగిక బానిసగా మార్చి చంపించేసాడు. కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయటం యెంత సిగ్గుమాలిన పని? ఇంత నయవంచకుడైన ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీని ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు. ఇది మన ఆత్మగౌరవాన్ని మనమే వంచిన్చుకోవడం కాదంటారా..??

👉 మహమ్మద్ ఘోరిని 16 సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిన్యాలతో ప్రాణాలతో వదిలిపెట్టాడు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ కాని ఒక సారి వెన్నుపోటుతో యుద్ధంలో గెలిచి ఏ మాత్రం కూడా దయలేకుండా కళ్ళను పెకలించి చిత్రహింసలు పెట్టి తలను నరికించి వేశారు ఈ నరరూప రాక్షసులు.
పాండవుల వారసుడైన ధర్మ ప్రభువైన పృథ్వీరాజ్ చౌహాన్ కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఆలోచించండి.

మన తీవ్రమైన దురదృష్టం ఏమిటంటే చరిత్రలో కోట్లాది మంది హిందువులని చంపించి రక్తక్షరాలు లిఖించిన హింసోన్మాదులైన మహమ్మద్ ఘోరి, అలావుద్దీన్ ఖిల్జీ , టిప్పు సుల్తాన్ , మొఘలులు, ఇంకా చాల మంది ఇస్లామిక్ పాలకుల చరిత్రలను మన పిల్లలు చదివే చరిత్ర పాఠాలలో స్వర్ణాక్షరాలతో లిఖించడం. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత కూడా మనకు ఇటువంటి పాలకులు లభించటం మనం చేసుకున్న దౌర్భాగ్యం ప్రజలు వీరు చేసే పనులు తెలియక వీరిని ఆదరించడం అత్యంత దౌర్భాగ్యం.😰

ప్రతియొక్క పురాతనమైన మసీదు పునాదులు మన కూలగొట్టబడిన మందిరాలనే అనడంలో అతిశయోక్తి కాదేమో కాని ఇది చాల మంది చెవిటి, గుడ్డి వారైన హిందువులకు తెలియడంలేదు. అదే వారు చూడగలిగిన, వినదగిన వారైతే మహారాజ పృథ్విరాజ్ చౌహాన్ కు ఆయన ధర్మపత్ని సంయోగిత దేవికి జరిగిన ఘోరం గురించి దర్గాలోకి అడుగుపెట్టే ముందే ఆలోచిస్తారు. చిష్తీ ఎటువంటి ప్రచారకుడంటే అతను 7లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో మతం మార్చగలిగాడు దీనికి ఇస్లామిక్ పాలకుల అండదండలు మెండుగా వున్నాయి మరి. అతను మూడు సార్లు హిందూ స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్లాం లోనికి మార్చుకున్నాడు. ఈ చిష్తీ ఇలా గర్వంగా చెప్పుకుంటాడు “ మేము మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత కష్టంతో వెన్నుపోటు పొడిచి చంపి అతని సంధినుండి ఇక్కడ ఇస్లాం ని స్తాపించాం, అతని అందాలరాసియైన భార్య సంయోగితాదేవి ఇప్పుడు మహమ్మద్ ఘోరితో ఒకే మంచంపైన లైంగిక బందీ అని చెప్పుటకు గర్వపడుతున్నాను” అని అన్నాడు...
ఈ దుర్మార్గుడు ఇక్కడ ఒక దైవ దూతగా ఆరాధించబడుతున్నాడు ఇంతకన్నా ఘోరాతిఘోరము , దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా..??

దీనికి ఇంకా ఆజ్యం పోసే సంగతేంటంటే. మన మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ ఎంతటి ధీరుడు అంకితభావం కలవాడంటే అతను తన రెండుకన్నులు పెకలించినా కూడా, ఘోరి అతనికి ఆవుమాంసం తినిపించినా కూడా, ఆఖరుకు తన ధర్మపత్నియైన సంయోజితా దేవిని లైంగిక బానిసను చేసుకున్నాం, నిన్ను నీ భార్యను సజీవంగా విదడిచేస్తామన్నా కూడా అవన్నీ తనకు త్రునప్రాయమని సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి మన మహారాజు. అది మన మహారాజు యొక్క త్యాగనిరతి, తుదిశ్వాస వరకు మోఘలులని ఎదిరించన ధీరుడు పూజనీయుడు కానీ ఈ దెయ్యాలను మనం పూజించాలంటారా? ఎంతటి దౌర్భాగ్యం ఈ హిందూదేశానికి

ఈ దీరోదాత్తుడిని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని మహమ్మద్ ఘోరి యొక్క స్మారక చిహ్నం ముందు సమాధి చేసారు. ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ యెడల విపరీతమైన ద్వేషం చూపిస్తారు కాని ఆ మహానుభావుడిని, ధర్మరక్షకుడిని, మనల్ని కాపాడిన ధీరోదాత్తుడిని చంపిన కర్కసులను మాత్రం ఇక్కడ సిగ్గులేకుండా, ఆత్మగౌరవమనేది కించిత్తు కూడా లేకుండా పూజిస్తున్నాం. మనం ఆ మహావీరునికి అర్పించే నివాళి ఇదేనా? మనల్ని మనం ఒక సారి ప్రశ్నించుకుందాము, మన భావితరాలకు అసలైన చరిత్రను తెలిపి రానున్న “ఇస్లాం” అనే ఉపద్రవం గురించి ముందే హెచ్చరించుదాము...

ఇది మన భాద్యత గుర్తుంచుకోండి.
భారత్ మాతాకీ జై!!

సేకరణ

ప్రేమ అంటే ఏమిటి ?

కొత్త యుగం గురించి ప్రతి ఒకరు తెలుసుకోవాల్సిన విషయాలు

🔺 భూ మండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క "మహాఅవతరణ పుస్తకం" లో నుండి ----> డా,,సన్నీ సాటిన్. ph.D 🔺

🌹 తలాల మార్పు కోసం సంసిద్ధత 🌹
🌷 Part -- 3 🌷

🔺 ప్రేమ అంటే ఏమిటి ? :--- 🔺

🌸 మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించినప్పుడు, మీరు వాళ్ళతో ఏకమైపోతారు. మీరు ఆ మరో వ్యక్తితో ఏకమైపోయినప్పుడు, మీరు ఆ వ్యక్తిని బాధ పెట్టలేరు. ఒకవేళ మీరు బాధపెడితే కనుక, మీరు కూడా బాధ పడతారు... మరి అది మిమ్మల్ని మీరే బాధ పెట్టుకున్నట్లు ఉంటుంది. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించినప్పుడు, మీరు ఆ వ్యక్తితో అన్నీ పంచుకోవాలనుకుంటారు.

🍀 కాంతి శక్తుల కన్నా మనం చీకటి శక్తుల వల్లనే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాం.

🌻 చాలా మంది ఇష్టానికీ ప్రేమకూ మధ్య తేడా తెలుసుకోలేరు. ఒకరితో మరొకరు ప్రేమలో మునిగిపోయిన ఒక జంట ఎందువలన క్రమక్రమంగా ఒకరిని మరొకరు ద్వేషించుకోవడం మొదలు పెడతారు? ఎందుకంటే, వాళ్ళ ప్రేమ షరతులతో కూడినది.

🔺 షరతులు లేని ప్రేమే సమాధానం :--- 🔺

🍀 మీరు ఉన్న విధంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు ఏ లోపాలూ లేకుండా చక్కగా ఉన్నారని నేను అంగీకరిస్తాను. షరతులు లేని ప్రేమ అంటే ఇదే! మీరు ఇతరులు మారాలని ఆశించడం ఆపేసి, వాళ్ళు ఉన్న విధంగానే ఆ వ్యక్తులను అంగీకరించడం మొదలు పెడితే కనుక, మీరు నిజంగానే ప్రతి ఒక్కరినీ షరతులు లేకుండా ప్రేమించడం మొదలు పెడతారు.

🔺 ప్రేమ = కాంతి = ఉత్తేజితమైన DNA :--- 🔺

🌸 కాంతి 'DNA' ను ఉత్తేజితం చేస్తుందని రష్యన్ పరిశోధకులు నిరూపించారు. షరతులు లేని ప్రేమ అనేది కాంతిని అందించి, DNA ను ఉత్తేజితం చేస్తుంది. ఉత్తేజితమైన DNA, ఉన్నత చైతన్యానికి దారితీసి, మనల్ని నాలుగవ తలంలోకి చేర్చుతుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🍁 భూ మండలంలో జరిగే కొత్త విషయాలను తెలియజేసే పుస్తకం, నవ్య దివ్య భవ్య యుగం యొక్క పుస్తకం "మహావతరణ". ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు "మహావతరణ పుస్తకం" మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కావాలి అనుకునేవాళ్ళు 9032596493 no కి whats app msg చేయగలరు.



Monday, May 30, 2022

🙏ఆదివారం పవిత్ర దినం🙏

 *🙏ఆదివారం పవిత్ర దినం🙏,* ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం. 


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

 

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


తాత్పర్యం: 


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు.. ఆనారోగ్యం కూడా..!!


ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు.. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! #స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.! #సూర్య_నమస్కారాలు చేయండి.! #సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు

ఆదివారం సెలవు ఉండటం అనేది అతి పెద్ద కారణం కావచ్చు 


ఈ విషయం పై బాగా చర్చ జరగాలి  మార్పు రావాలి 🔥

50 years నిండిన మేము రెండు తరాలకు సాక్షులం

ప్రియమైన స్నేహితులు సరదాగా చదివి ఆనందించి నవ్వుకోండి 🙏🙏🙏🙏👍👍50 years నిండిన మేము రెండు తరాలకు సాక్షులం

స్వచ్చమైన గాలి నీళ్ళు,. పచ్చటి పొలాలు. 🌾🌴
పరిశుభ్రమైన. వాతావరణం లో పుట్టి. పెరిగిన వాళ్ళం...
👦తలపై నుండి. చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని...

📚 చేతికి పుస్తకాల. సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా. బయలుదేరి దారిలో స్నేహితులను
ఒక్కొక్కళ్లను. కలుస్తూ పెద్దగుంపుగా. 👦. 👦 👩. 👧 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం, 🚶🏃

జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు. లాక్కుంటు ..., చిరుగు. బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం 🕺

10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు. వేసుకున్న. , తరం మాదే...🌲

🤸🤹
గోలీలు, బొంగరాలు,
కర్రా బిళ్ళ,
నేలా బండ,. ఉప్పాట,
ఏడు పెంకులాట.....
🥎 బంతి పుచ్చుకుని. నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగ వంటి మీద ముద్ర పడే ముద్రబాల్. లాంటి ఆటలాడిన తరం...,

🚴🏊🤽
బడికి వేసవి కాలం. , సెలవులు రాగానే తాటి చెట్లూ,. .. సీమ తుమ్మ చెట్లూ ఈతచెట్లు ఎక్కి కాయలు. కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం. , తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...

🪔🪔🪔
దీపావళి కి. తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం.

5 ps ఐస్ తిన్నది మేమె. ,, . పది పైసలతో బళ్ళో. మ్యాజిక్ షో. చూసింది మేమే....

🌦️ వర్షం వస్తె తాటాకు. గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..

📖 second hand text books కోసం పరీక్షలు
అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమాలిన తరం.

🚴సెకెండ్ హ్యాండ్ సైకిల్ తొ పక్క. తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మేమే...

✉️ఉత్తరాలు.., రాసుకున్న.. ,అందుకున్న తరంవాళ్ళం... 🌴

పండగ సెలవులు,
వేసవి సెలవులు. , ,దసరా, సంక్రాంతి సెలవులు
ఎన్ని సెలవులు. వొచ్చినా ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని. 🤼 🏃🏻 ⚽ 🏸 🪁🏹 🤸 ⛹️. 🏊 అనుభవించిన తరంవోళ్ళం...,

👨👩👧👦 పెద్దలు. /పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు/రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని. పొట్ట చెక్కలయ్యేలా
నవ్వుకున్నదీ మేమే.... ☘️

ఊర్లో,. ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా,. మన ఇంట్లో జరిగినట్లు,. అంతా మాదే. ,
అంతామేమే. అన్నట్లుగా భావించి స్వచ్చందంగా. / నిస్వార్థంగా పాలుపంచుకున్న తరం మాదే...🍁

🕵🏻ఉర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని ,. పిల్లలు. అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు
🔦టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మేమే.

🕉️ 🚩 🛕
ప్రతీ శ్రీరామ
నవమి కీ గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, , మామిడి తోరణాలు కట్టడం. కోసం. ముందు రోజు రాత్రంతా జాగారం. చేసింది మేమే. .🌾

👨👩👧👧చుట్టాలు వస్తేనే అమ్మ కోడి కూర. , వండి పెట్టిన తరం....🍁
అత్తయ్యా,
మామయ్య,. ,పిన్ని,, బాబాయ్, అక్కా ,బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం... ,🌺

పుల్లల పొయ్యి మీద అన్నం/కూర ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం. వాళ్ళం..,🌱
పొయ్య మీదనుంచి. నేరుగా పళ్ళెం లోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే
తాతయ్యలు. అమ్మమ్మ/నాయనమ్మ, , అమ్మా నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,. అత్తయ్య మామయ్య, అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు తమ్ముళ్లు అందరం ఒకే. దగ్గర చేరి మధురమై. అనుభూతితో కూర్చుని అన్నం. తిన్న తరం ..,..🦋

అమ్మమ్మలు. / నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది,. అనగనగా ఒక రాజు.... కథలు విన్నది ,🌵

నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో తలంటు స్నానం చేయించు కున్న తరం...,🍀

📻రేడియో,
దూరదర్శన్📺
టూరింగ్ టాకీస్📽️. కాలం చూచిన వాళ్ళం... .🍁

🎥 40 పైసల. నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని,
1. .20. రూపాయల chair టిక్కెట్ తో ,,rs 2 ticket బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మేమే...🌵

స్కూల్ , కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.. .🍂

అమ్మా నాన్నా తో సంవత్సరానికి ఒక సారి, పరీక్ష పాస్ అయ్యావా.. .. అని మాత్రమే అడిగించు కున్న తరం వాళ్ళం...🌹

📲🖥️🖨️
ప్రస్తుత0 ఉన్న Whatsapp Fb skype లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం...,
మేమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం...
మేమే-- -💐

అవును.......రెండు తరాల మద్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం 🌸

అప్పటి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమని చూసిన వాళ్ళం,
ఇప్పుడు గుండీల g పైనుంచి వచ్చే ప్రేమని
చూస్తున్న వాళ్ళం---🌷

ఒక విధంగా చెప్పాలంటే మేం చాలా అదృష్టవంతులం...👏🙏🙏🙏🙏👍👍👍....

శీర్షిక- అమ్మ. రచన -విద్వాన్‌ కె.సుధాకర్‌

మాతృదినోత్సవ సందర్భంగా మాతలందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
రచన -విద్వాన్‌ కె.సుధాకర్‌,09.05.2021.
శీర్షిక- అమ్మ

అమ్మ

మమతల కోవెల
మమకారానికి ఆకారం
మాతృత్వానికి మాధుర్యం
మాటలకందని అనురాగం
మధురానుభూతుల స్వర్గం
మనోహరమైన అక్షరాల కలయిక
అమ్మ
మహిలో మకుటాయమానం
శిఖరాయమానం
మహిళల కాదర్శం
కవి కలానికందని
ఊహలకందని
వర్ణింప శక్యంగాని
అనిర్వచనీయం,అసాధరణం
అమ్మ
కమ్మగా,తియ్యగా పలుకు మాట
తన్మయత్వం చెందు మాట
తాదాత్మ్యం పొందుమాట
తనువు పులకించుమాట
తేనియలు చిందుమాట
అమ్మ
మధురమైన మాట
మరలా మరలా వినాలనే మాట
మళ్ళీ మళ్ళీ అనాలనే మాట
అలవోకగా అవలీలగా
యాదృచ్చికంగా
నిద్దురలో
కష్టసుఖాల్లో
తుదిశ్వాస వరకు పలికే మాట
అమ్మ
బుణం తీరనిది తీర్చుకోలేనిది
సూర్యుని వెలుగు మారవచ్చుగాక
చంద్రుని వెన్నెలా మారవచ్చుగాక
నక్షత్రాల వెలుగు అపరిమితం
వసంతకాలం వసంతానికొకసారే
కోకిలల గానమాధుర్యం వసంతంలోనే
నదుల ప్రవాహవేగం మారవచ్చుగాక
ఫలాల మధురత మారవచ్చుగాక
నదుల్లో నీరెండిపోవచ్చుగాక
బావుల్లో ఊట తగ్గిపోవచ్చుగాక
అమ్మ ప్రేమ మారనిది తరగనిది
కర్మలను బట్టి మనుషుల మమతలు మారవచ్చుగాక
సంతానం దూరమవచ్చుగాక
అధికారం,హోదా, పరపతి, డబ్బు పోవచ్చుగాక
బంధువులు మిత్రులు అందరు దూరం కావచ్చుగాక
అనారోగ్యాలు చూసి అన్యులసహ్యించుకోవచ్చుగాక
కాలక్రమేణా శక్తులుడగవచ్చుగాక
అందచందాలు తగ్గవచ్చుగాక
తగ్గనిది మారనిది అమ్మప్రేమ
అమ్మప్రేమముందు
కన్నయ్య ఫిర్యాదులు నిలబడలేదు
ప్రహ్లాదుని హరి భక్తి తప్పనిపించలేదు
రామయ్య కోర్కె అసాధ్యమనిపించలేదు
కుంతికి రహస్యం అంగీకరింపతప్పలేదు
గాంధారి పుణ్యఫలాన్నిప్రసాదింప వెనుకాడలేదు
పార్వతీపరమేశ్వరులకు సైతం పొరపచ్చాలు తప్పలేదు
మేనకాదేవి శివుడుల్లుడగుమాట పట్టించుకోలేదు
అమ్మప్రేమ కొలవలేనిది కొలమానంలేనిది.
అమ్మంటే
అమృతం కన్నా మిన్న
కల్పవృక్షం కన్నామిన్న
ఎెన్నెలకన్నా చల్లదనం
ప్రకృతికన్నా ఆహ్లాదం
అగ్నికన్నా ఎెలుగు
నీటి కన్నా స్వచ్చత
పారిజాతం కన్నా పరిమళం


కలి పురుషుడు అనేక రకాలుగా ఆర్షమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు ఈ దేశపు వైదిక మతాన్ని రూపుమాపాలని ఆలయ ద్వంసాలు, హత్యాకాండలు, హింసలు, మానభంగాలు, చేసిన విమతాలు ఇప్పుడు మరో దుర్మార్గాన్ని అవలంబించాయి. మన వేదపురాణాల్లోనే వాళ్ళ దేవుళ్ళ గురించి, మూలపురుషుల గురించి చెప్పబడిందని పేర్కొనడం. అందుకు వాళ్ళు చేస్తున్న కుయుక్తులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వేదమంత్రాలకు, పురాణ శ్లోకాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం క్రొత్త క్రొత్త సంస్కృత శ్లోకాలను రాసి అవి ఆ పురాణాల్లో ఉన్నాయని చెప్పడం. నిజానికి ఆ శ్లోకాల పూర్వాపరాలు చూస్తే వాళ్ళ అజ్ఞానం బయటపడుతుంది. వాళ్ళు ఆరాధించే ప్రవక్తలే ‘కల్కి’ అవతారం అన్న దుస్సాహసానికి దిగిన మూర్ఖులూ ఉన్నారు. ఈ దేశపు మతాన్నీ, అవతారాలనీ, దేవుళ్ళనీ, సంస్కృతినీ కాదనదానికి చేసే ప్రయత్నంలో ఈ దేశపు అవతారాలను, పురాణాలను స్పృశించవలసిన అవసరం ఏమొచ్చింది! ఇది అవివేకం, అజ్ఞానం కాదా! కల్కి గురించి చెప్పిన మాటలున్న పురాణాల్లో మన హైందవ దేవాలయాలు, హైందవ పర్వదినాలు, హైందవ ఆచారాలు, యజ్ఞయాగాలు అన్నీ ఉన్నాయి. వాటిని అనాదిగా ఆచరిస్తున్న సత్సంప్రదాయాలు మనకు ఉన్నాయి. వాటిని సమూలంగా అంతం చేద్దామని పాశవిక, రాక్షస ప్రవర్తనలతో పెచ్చరిల్లిన వాళ్ళంతా ఇప్పుడు వాటి మూలాలలో తమ మూలాలు ఉన్నాయని చెప్పుకొనేటంత దుర్బలత్వానికి దిగజారుతున్నారు. తమ మతాలలోకి మారమని ఏమార్చడానికి, మన మతపు మాటల్ని మార్చి వాడుతున్నారు. హఠాత్తుగా వేదపురాణాలపై ఇంత ప్రేమ వాళ్లకి ఎలా పొడుచుకొచ్చిందో! పాపం మన సంస్కృతి ఆధారాలు చూపిస్తే గానీ తమకు ఇక్కడ మనుగడ లేదని తమకంటూ వ్యక్తిత్వమే లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో తమ మతం వేదాలలో పురాణాలలో ఉందని చెప్పుకుంటున్నప్పుడు అనాదిగా ఇక్కడే పుట్టి పెరిగి వేదాల మార్గాన్నే అనుసరిస్తున్న మనం వాళ్ళ మతాన్ని స్వీకరించాల్సిన అవసరమేముంది! దేవాలయాలు, విగ్రహారాధనలు అక్కర్లేదనుకున్నప్పుడు తమకంటూ ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాలు ఎందుకు కాపాడుకుంటున్నట్టో! మనవాళ్ళల్లో అనాసక్తి, మూర్ఖత్వం పెరుగుతోంది. కనీసం వివేకంతో ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళ మతాలు ఎప్పుడు పుట్టాయో, ప్రవక్తలు ఎప్పుడు ఉదయించారో వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంతకు పూర్వమే ఉన్న వేదం, పురాణం, భగవద్గీతల వాక్యాలను తమ ఉనికికి ప్రమాణాలుగా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే మన ధర్మపు (హిందూ మతపు) ప్రాచీనతని, ఔన్నత్యాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఇది వెన్నెముక లేని పైశాచిక వ్యక్తిత్వానికి ఉదాహరణ కాదా! సనాతన ధర్మాన్ని యుగాల పూర్వమే చాటిన వేదవాక్యాలు చెప్పిన నిత్యసత్యాల ఛాయలు, ఆరాధనా విధానాల జాడలు ప్రపంచంలోని ఇతర మతాలలో కాసిని కనిపిస్తాయి. కానీ ఈ సంస్కృతికి ఉన్న ఔన్నత్యం, విస్తృతి వాటిలో లోపించినా, చిట్టచివరకు వారు ఏ చెట్టును నరకడానికి రాక్షస కృత్యాలు చేశారో, వాటి మూలాల్లోనే తమ మూలం ఉందని బూటకపు మాటల్లోకి దిగారంటే, మతమార్పిడులకు మరో వంచనా మార్గాన్ని ఎన్నుకున్నారని గ్రహించలేని అజ్ఞానంలో మనమున్నట్లే కదా! ఒకనాడు ప్రపంచమంతా విస్తరించిన హైందవ సంస్కృతి జాడలు ప్రపంచంలో ఎక్కడైనా దొరకవచ్చు. ‘ఎవడి మార్గం వాడిది ఎందులో వెళ్ళినా చేరేది ఒకే గమ్యం’ అని చాటిన మహోజ్జ్వల వైదిక మార్గం ఎవరినీ మతం మార్చలేదు, మార్చదు. నువ్వు ఎక్కడ పుట్టావో అది నీకు మాతృస్థానం. ఇప్పుడెవడో దుర్మార్గుడు వచ్చి ‘ఆక్రమణ’లో భాగంగా హింసించినా, ఎరలువేసినా, నువ్వు లొంగకపోయేసరికి “మా అమ్మ స్త్రీ, మీ అమ్మ స్త్రీ. ఇద్దరూ ఒకటే కనుక మీ అమ్మను వదలి మా అమ్మనే మీ అమ్మగా ఆరాధించు” అంటే ఇది బాగుందని నువ్వు నీ మాతృమూర్తిని వదిలితే ఎంత ద్రోహమో – ఇలా మతం మారినా అంతే ద్రోహం. వారి మతాల మూలాలు మన ప్రాచీన గ్రంథాలలో ఉన్నాయని చెప్పుకోవడం – ఈ దేశవాసులుగా వారు మనతో కలిసి బ్రతికే సమైక్యతకు దోహదపడాలి గాని, మన మాతృమతం నుండి విడదీసేందుకు వాడుకోవడం విచారకరం. ప్రతి స్త్రీనీ మాతృమూర్తిగా గౌరవించే సంస్కృతిలోని ఔదార్యాన్ని బలహీనతగా భావించే దుర్మార్గులకు బుద్ధి చెప్పలేని విధంగా పాలనా వ్యవస్థ, బుద్ధి జీవుల ఆలోచనా వ్యవస్థ పాడై కూర్చున్నాయి. కన్నతల్లిని తన తల్లి కాదని, పరాయితల్లి పొత్తిళ్ళలోకి చేరే కుత్సితాలను ఖండించడానికి పెద్ద తర్కాలు, సమాధానాలు అక్కర్లేదు, కాసింత ఇంగితం చాలు. మన మతంపై శత్రుతాభావం పెంచుకుని, కపటాలకు పూనుకుంటున్న విమతాలు రెండూ ఈ బాటనే అనుసరిస్తున్నాయి. వీరికి ఒకటే సూటి ప్రశ్న - తమ మతపు మూలాలు భారతీయ వేదపురాణాల్లో ఉన్నాయని కువ్యాఖ్యానిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారే ఇవే మాటలు, వారి మతాలు పుట్టి వర్ధిల్లుతున్న దేశాల్లో చెప్పగలరా! ఈ మాటల్ని వాళ్ళ మతపు భాషల్లో, వాళ్ళ దేశాల ప్రార్థనాలయాల్లో ప్రచురించి పంచగలరా! కేవలం – ఈ దేశంలో ఇక్కడి వాళ్ళ సనాతన మతాన్ని, మాతృ మతాన్ని మార్చడానికి ఈ దేశంలో మాత్రమే సాగిస్తున్న ఆత్మవంచన – పరవంచనా మార్గాలివి. ఇవే మాటలు వాళ్ళ దేశాల్లో అంటే వాళ్ళ మతపెద్దలే ఘోరంగా శిక్షిస్తారు. గతంలో ఇతర దేశాల మీదికి దాడికి వెళ్ళినప్పుడు హింసతో దాడిచేసి ఎన్నో అందమైన సంస్కృతుల్ని గ్రీక్, రోమన్, మాయా వంటి పద్ధతుల్ని బూడిద చేశారు. అవే ప్రయత్నాలు అంతకన్నా దారుణంగా చేసినా ఈ సంస్కృతి ఇంకా పచ్చగా ఉండడంతో మరోరకమైన కుత్సితానికి ఒడిగడుతున్నారు. ఇతర దేశాలలో ఇతర మతాలుగానీ ఉంటే వాళ్ళ ప్రాచీన గ్రంథాల్లో కూడా తమ దేవుళ్ళ గురించే ఉందని చెప్పడానికి కూడా వెనుకాడరు. వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం మతమార్పిడి. ఇతరుల్ని నిందించకుండా ఎవడి మానాన వాడిని, వాడి పరంపరాగత ధర్మంలో ఉండనీయక ఇలా భ్రష్టు పట్టిస్తుంటే ఇది ఎందరికో మనస్తాపాన్ని కలిగించి క్రమంగా వైషమ్యాలకు దారి తీస్తుందని, చివరకు దేశానికే ముప్పు తెస్తుందని గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఈ దేశాన్ని ఆక్రమించుకుని పాలించి తిరిగి వెళ్ళిపోయినా, ఈ సంస్కృతిని దురాక్రమించి రూపుమాపే ప్రయత్నాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. ఒక దేశపు పరంపరాగత సంస్కృతీ, ఆ దేశపు తరతరాల ఆస్తి. దానిని నశింపజేయడం దేశాన్ని దోచుకోవడం కాదా! ఈ కాసింత అవగాహన ఈ దేశాల పాలక, మేధావి వర్గాలకు ఇంకా కలగలేదా! విదేశాలలో వివేకవంతులైన విజ్ఞానులు భారతీయుల సనాతనహిందూధర్మపు ఔన్నత్యాల్ని గ్రహించి ఇటు మళ్ళి తరించుతుంటే ఇక్కడి అతి సామాన్యులని వృధా మాటలతో తమలోకి మార్చుకొని మెజారిటీని నిరూపించుకోవాలని ప్రయత్నించడం హాస్యాస్పదం, శోచనీయం. గుర్రం మీద తమ పూర్వీకుడు ఎక్కి వచ్చాడు కనుక ఆయనే కల్కి అవతారమనుకుంటే, గుర్రమెక్కిన ప్రతివాడూ కల్కి అయిపోతాడా! అన్యాక్రమణ చేసే మ్లేచ్ఛులతో యజ్ఞభూమి అయిన భరతవర్షం బాధితమైనప్పుడు కల్కి వస్తాడనీ, శంబళగ్రామం హిమాలయాలలో ఋషులచే గుప్తమై(రహస్యంగా) ఉన్న దివ్యధామమని భాగవతం, భవిష్యపురాణం చెప్పాయి. వారి పూర్వాపరాలు పరిశీలించక, ధర్మ ద్రోహులైన మ్లేచ్ఛుల నాశనం కోసం రానున్న కల్కి మ్లేచ్ఛులలోనే ఉన్నాడని, ముందే వచ్చాడని చెప్పడం మరో మ్లేచ్ఛభావం కాదా! ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని కాలంలో, ఒక ప్రబుద్ధుడు (పౌండ్రక వాసుదేవుడు) తానే కృష్ణుడినని చెప్పుకుని పాపం నశించాడు. ఇది కలియుగం కదా అవతారం ఇంకా రాకుండానే తామే అవతార పురుషులమనే కపటులు ఇంకెందరు రానున్నారో పరమాత్మకే ఎరుక! కల్కి ఇప్పటికే అవతరించి తనపని పూర్తిచేసి ఉంటే నిత్యశాంతియుతమైన కృతయుగం సహజంగా ఆవిర్భవించేది కదా! ఇన్ని అశాంతులు, దుర్భిక్షాలు, అశ్లీలాలు, దౌర్జన్యాలు ఉంటాయా! కనీసపు వివేకాన్ని కూడా తాము కోల్పోయి అందరినీ మూర్ఖులుగా చేయడమేనా మతమార్పిడి! వాళ్ళకి. అద్భుతమైన ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అనే తాత్త్విక చింతనకు ఎదిగేలా చేసే సంప్రదాయాలను సశాస్త్రీయంగా బహుముఖాలుగా ఏర్పరచుకొని బ్రతుకుతున్న అనాది భారతీయతకు ఎవ్వరి ప్రబోధాలు నూత్న మతాలూ అక్కర్లేదు. “నీ తల్లి నీకు గొప్ప – నా తల్లి నాకు గొప్ప. నీది నువ్వు ఆచరించు. నిన్ను గౌరవిస్తాను. మా వైదిక సంప్రదాయ శాఖలన్నీ మావి. వాటిని గౌరవించు. కానీ వాటిలో నీ ప్రతిబింబాన్ని చూపించి నన్ను నీలా మార్చడమెందుకు? నన్ను నాలా బ్రతకనివ్వు. నువ్వు నీలా బ్రతుకు. కలసి బ్రతుకుదాం. కలుపుకొని బ్రతకవలసిన అవసరం లేదు”, అని చెప్పగలిగేదే నిజమైన సర్వమత సమ్మత మార్గం. అదే అసలు సెక్యులరిజం. చక్కని పురాణ విద్యలో పనికిమాలిన అవైదిక ప్రక్షిప్తాలు చాలా పేరుకుపోయాయి. ఔరంగజేబును గత జన్మలో కాశీ శివభక్తునిగా వ్రాసిన కట్టు పురాణ కథ కూడా కనిపిస్తుంది. అదే మాదిరి కథలు హింసాళువైన ఘజనీకి కూడా వ్రాశారు. అవన్నీ ఆర్షవిద్యలని ఎలా అంగీకరిస్తాం! దీనికి అసలైన పరిష్కారం ప్రభుత్వాలు చేపట్టాలి. ఒకరి మాతృమతాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా కఠినంగా శిక్షించే విధానాలను ఏర్పరచిన నాడే దీనికి విమోచనం లభిస్తుంది. లేదా క్రమంగా దేశమే పరహస్తగతం కావచ్చు లేదా మతకలహాలతో మండిపోవచ్చు. ఈ ముందుచూపు లేని స్వార్థ నాయకుల బారిన ఈ దేశం పడకుండా, భారతీయ సనాతన ధర్మదేవత అనుగ్రహించుగాక! (ఒక్కవిషయం – అన్ని మతాల్నీ గౌరవించే భారతీయులం మనం. కేవలం మన సంస్కృతిని మన వాళ్ళలో రక్షించుకోవాలనే ఆత్మరక్షణ ధర్మాన్ని అనుసరించే ఆత్మనివేదన ఇది. ఏ ఒక్క మతాన్నీ, వారి ప్రవక్తల్ని కించిత్తు కూడా అవమానించడం ఋషిపీఠమైన ఈ దేశపు సంప్రదాయం కాదు). (ఎంతో వేదనలో ఆర్.ఎస్.చక్రవర్తి(ఈ సంచికలోని ‘పాఠకస్వరం’ చూడండి)వ్రాసిన ఉత్తరానికి ప్రతిస్పందన ఈ వేదనావేశం. శ్రీ చక్రవర్తి గారు ‘అశ్వమెక్కిన ధర్మ స్థాపకుడే కల్కి అయితే, శివాజీ(కూడా) కల్కి అవతారమే’ అని మరో ప్రత్యేక వ్యాసం వ్రాసి పంపారు. వీరి యుక్తి అభినందనీయమే).

Saturday, May 28, 2022

అవి ధ్యానం వల్లనే సాధ్యం.

పత్రం పుష్పం ఫలం తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః ( భగవద్గీత )

సామాన్యమైన అర్థం ఏమిటంటే :-
భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.

కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.

➡ పత్రం -- మనస్సు -- చంచలం.
➡ పుష్పం -- బుద్ధి -- వికసించడం.
➡ తోయం -- చిత్తం -- నిర్మలం.
➡ ఫలం -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.

అవి ధ్యానం వల్లనే సాధ్యం.
👉 ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.
👉 అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.
👉 అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.
👉 దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.
అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రులు అవుతారు.

ఉంది.కాబట్టినిజాయితి - దురాశ

ఉంది.కాబట్టినిజాయితి - దురాశ

విశ్వనాథ్ ఎవరికో డబ్బు ఇవ్వాల్సి ఉంది.కాబట్టి బ్యాంక్ నుండి క్యాష్ విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు. విత్ డ్రా స్లిప్ లో 1,00,000 అని వ్రాసి రెండు వైపులా సంతకం చేసి ఇచ్చాడు. ఇతడే విశ్వనాథ్ అనేది ఖచితపరచుకున్న క్యాషియర్ డబ్బు ఇచ్చేశాడు.

క్యాషియర్ ఇచ్చిన డబ్బును అక్కడే పక్కన నిలబడి లెక్కిస్తే అందులో 1,00,000 రూపాయలకు బదులు 1,20,000 ఉన్నాయి. విశ్వనాథ్ క్యాషియర్ ముఖాన్ని ఒకసారి చూశాడు. ఇదేమీ తెలియనట్లుగా అతడు మరొక వ్యవహారం లో నిమగ్నమై ఉన్నాడు. విశ్వనాథ్ మెల్లిగా డబ్బును బ్యాగ్ లో పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

నేను ఈ రకంగా చేసింది సరా, తప్పా అనే ప్రశ్న ఆయన మనసును కొరకడం ప్రారంభమైంది. ఒకసారి ఈ డబ్బును తిరిగి ఇచ్చేయాలి అని మనసు చెబితే, మరొకసారి వేరే ఎవరికైనా నేను ఈ రకంగా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళువెనక్కు ఇచ్చేవారా అనే ప్రశ్న ఎదురైంది. ఎవరు ఇస్తారు ? ఎవరూ ఇవ్వరు అని మనసు చెప్పింది. కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని విశ్వనాథ్ తీర్మానించుకున్నాడు.

కాసేపటికే మళ్ళీ డబ్బు గురించే ఆలోచన. క్యాషియర్ ఇపుడు ఈ డబ్బును తన చేతినుండి కట్టాల్సివస్తుంది. అతడి ఆర్థిక పరిస్థితి ఎలాఉందోననే ఆలోచన వచ్చింది. మరో క్షణంలో , బ్యాంక్ వారికి మంచి జీతం వస్తుంది, ఉండనీలే, అదృష్టంకొద్దీ లభించిన డబ్బును ఎందుకు ఇవ్వాలి అన్నది మనసు.

బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసేవారు తక్కువమంది. కాబట్టి నాకు ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చామనేదు వారికి తెలిసిపోతే, నన్నే అడిగితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. అయితే, ఒకసారి నా చేతికి డబ్బు వస్తే అది నాదేగదా అని మనసు మరొక దిశలో ఆలోచించింది. ఇలా అనేక సార్లు జరిగి సాయంత్రం నాలుగు గంటలు దాటింది.

అపుడు మరొకసారి ఆలోచించాడు విశ్వనాథ్. అపుడు మనసు , ఇతరుల తప్పు కారణంగా లాభం పొందడం సరికాదు. ఈ 20,000 రూపాయలు నా నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష అంతే . ఇందులో గెలవాలా, ఓడాలస అన్నదే ముఖ్యం అన్నది. దాంతో ఒక క్షణమూ ఆలోచించకుండా విశ్వానాథ్ బ్యాంక్ కు పోయాడు.

అక్కడ క్యాషియర్ తలమీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. చెమటలు పట్టి ఉన్నాయి. డబ్బును కౌంటర్ లో పెట్టి విషయం చెప్పాడు విశ్వనాథ్. క్యాషియర్ ఆ డబ్బును గుండెలకు హత్తుకుని ,కళ్ళలో నీరు నింపుకున్నాడు.

మీరు ఈ డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బందిపడేవాడిని. ఈరోజు పెద్ద మొత్తాలకు సంబంధించిన డ్రా లు జరిగాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ మొత్తం వెళ్ళిందనేది తెలియడం లేదు. మీరు తెచ్చి ఇవ్వకపోయుంటే నా జీతంలోనుండి దాన్ని వసూలు చేసేవారు. ఇప్పటికే పిల్లల స్కూలు ఫీజులకు అప్పు చేశాను. ఇపుడు ఈ మొత్తమూ కట్టాల్సివచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. థ్యాంక్స్ సర్. పది నిమిషాలలో పని ముగించి వస్తాను. కలసి కాఫీ త్రాగుదాం అన్నాడా క్యాషియర్.

అపుడు విశ్వనాథ్ ' అదేమీ వద్దు. నేనే మీకు పార్టీ ఇస్తాను. అవసరమైతే మనమిద్దరమూ మన భార్యలనూ పిలుద్దాం' అన్నాడు.

క్యాషియర్ కు ఆశ్చర్యం. మీరెందుకు పార్టీ ఇవ్వాలి, నేనుకదా ఇవ్వాల్సింది అన్నాడు.

అపుడు విశ్వనాథ్ , మీరు 20,000 ఎక్కువగా ఇచ్చినందున ఈ రోజు నేనెంత దురాశాపరుడిని అనేది నాకు తెలిసొచ్చింది. చివరకు నేను ఈ దురాశను వదలివేయగలను అన్నది కూడా ప్రూవ్ అయింది. అటా ఇటా అనే గందరగోళంనుండి నేను గెలిచాను. ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు. అందుకు కృతజ్ఞతగా ఈ పార్టీ అన్నాడు.

ఇలా కూడా ఆలోచించవచ్చా అని అవాక్కయ్యాడు క్యాషియర్...

Copy paste::
😲🙂🙏

అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.

ఎంత సేపు పూజ?

పూజ గదిలో - 30 నిమిషాలు

బయట - 23 గంటల 30 నిమిషాలు

1) ఏది పూజ? ఎంత సేపు పూజ?

2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?

3) నిద్ర లేవగానే -
i) శ్రీహరి గుర్తుకు రావాలి
ii) భూమికి నమస్కరించాలి
iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి

4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.

5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.

6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.

7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.

8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.

9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.

10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.

11) పసి పిల్లలను, స్త్రీలను చూసినప్పుడు విష్ణు మాయ గుర్తుకు రావాలి.

12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.

13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.

14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.

15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.

అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

💎☀️💜🦚🌹🌟

మర్యాదగా వినడం......
వివేకంతోసమాధా
మివ్వడం.....
ప్రశాంతంగా ఆలోచించడం...
నిష్పాక్షకంగా నిర్ణయం
తీసుకోవడం.....
ప్రతి మనిషికి అవసరం"
🌹🌳🌹


🌼 అందరూ బాగుండాలి🌼

🌺 అందులో మనముండాలి 🌺

సర్వేజనాః సుఖినోభవన్తు.

లోకాసమస్తా సుఖినోభవంతు.

☘️🦋🌸🦋🌸🦋☘️

🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳
💚 పచ్చదనం కాపాడుకుందాం 💚

🥦🍑🥦
జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు.....
ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది.
జీవితం కూడా అంతే....
ఏం జరిగిన ఏదో ఒక మంచి కోసమే.
🥦🍑🥦🍑🥦🍑🥦🍑🥦

🌿🌺🌿
జీవితంలో
ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు.
ఉన్నన్ని రోజులు
ఒకరికొకరు తోడుగా
కలసిమెలసి సంతోషంగా
బ్రతకడంలోనే ఉంది
నిజమైన ఆనందం.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

🌸🌱🌸
ఓపిక చాలా విలువైనది.

నువ్వు ఎంత ఓర్చుకొంటే
జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతావు.
🌸🌱🌸🌱🌸🌱🌸🌱🌸

🌱🌷🌱
You learn nothing from your life
if you think you are right all the time.
🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱

💟💭💟
ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు.,
అణువంత అర్ధం చేసుకునే మనసుండాలి.
సముద్రమంత సంపద ఉంటే సరిపోదు.,
సమయానికి సాయం చేసే గుణం ఉండాలి.
💟💭💟💭💟💭💟💭💟

☘️🌹☘️

Never forget three peoples in life:

▪️Who helped you in difficult times
▪️Who left you in difficult times
▪️Who put you in difficult times
☘️🌹☘️🌹☘️🌹☘️🌹☘️
🌸🍀🌸

కోల్పోవడంలో ఉన్న బాధ
తెలిసిన వారు పక్క వాళ్ళను
ఎప్పుడూ దోచుకోరు....

ఇవ్వడంలో ఉన్న ఆనందం
తెలిసినవారు ఉన్నది దాచుకోరు...
దోచుకోలేని ధనం " మంచితనం"...
దాచుకోలేని ధనం "ఆనందం".....!!
🌸🍀🌸🍀 🍀🌸🍀🌸

🟢🟣🟢
Relationships cannot be made
With moods and conditions.
They are maintained by feelings.
🟢🟣🟢🟣 🟣🟢🟣🟢

🔷🔶🔷
సుఖంలో తోడు ఉండేవారు
బంధువులైతే....

దుఃఖంలో తోడుండేవారు
భగవత్ స్వరూపులు....!!
🔷🔶🔷🔶 🔶🔷🔶🔷

🌹🌳🌹
ఏదీ శాశ్వతం కాదు...
ఈ లోకంలో గడుపుతున్న
ఈ క్షణం మాత్రమే మనది...
నిన్న అనేది తీరిపోయిన ఋణం...
రేపు అనేది దేవుడిచ్చిన వరం...!!
🌹🌳🌹🌳 🌳🌹🌳🌹
☘️🟣☘️

గెలిచే మనస్తత్వం ఉన్నవారు
ఇతరుల గెలుపుకి సహాయపడతారు.

ఓడిపోయే మనస్తత్వం ఉన్నవారు
ఇతరుల ఓటమిని కోరుకుంటారు....!!
☘️🟣☘️🟣 🟣☘️🟣☘️

🟠🔵🟠
A good apology has
three Parts....

1. I'm sorry.
2. It's my fault.
3. What can I do
to make it right ??

Most of the people
forget these three parts
because of EGO...!!

🟠🔵🟠🔵 🔵🟠🔵🟠
🟡⚫🟡
చీకటి మంచిదే
వెలుగు విలువను
చూపెడుతుంది

మితం మంచిదే...
అతిలో మతిని
మందలిస్తుంది....!!
🟡⚫🟡⚫ ⚫🟡⚫🟡

🌈🌈🌈
చెదరని నమ్మకమే
నీ నేస్తమై....
పయనం సాగిస్తే...

కనుల ఎదురుగా,
కల....నిజమై నిలుచునుగా....!!

🌈🌈🌈🌈 🌈🌈🌈🌈

🔸 అంతా మన మంచికే 🔸
🔷 ALL IS WELL 🔷

🏡 STAY HOME 💟 STAY SAFE

Source - Whatsapp Message

ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు?

ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు?

పట్టీల విలువ వేల రూపాయల్లో... కాని వేసేది కాళ్ళకి..!

కుంకుమ విలువ రూపాయలలో... కానీ పెట్టుకొనేది నుదుటిపైన..

విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము..!

ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు...

చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు.


ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు..

తీపిలో పురుగులు పడని రోజూ లేదు..!

హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి కాదు..

ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు.

ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోతావు..!


రమ్మన్నా
సన్మార్గములోకి యెవ్వరు రారు..

వద్దన్నా
చెడు మార్గమున్నే యెంచుకుంటారు.

పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి..

సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు.

పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు..

ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు.


ఆహాహా యేమి ఈలోకం..!

పెళ్ళి ఊరేగింపులో బంధు మిత్రులు ముందు.. వరుడు వెనకాల !

శవయాత్రలో
శవము ముందు.. బంధు మిత్రులు వెనకాల !

శవాన్ని ముట్టి నందుకు స్నానం చేస్తారు.

మూగ ప్రాణులను చంపి భుజిస్తారు !

కొవ్వు వత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకొంటారు.

కొవ్వు వత్తులను ఆర్పి జన్మ దినాన్ని ఆచరిస్తారు..

హే మానవా !
ఏంటి ఈ వింత ప్రవర్తనా?

శ్రీమహాలక్ష్మి ఈ ఐదింటా వుంటుంది!

🌷🌹శ్రీమహాలక్ష్మి ఈ ఐదింటా వుంటుంది!🌹🌷


క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తున్న స్థితిని ఎంతో అద్భుతంగా వర్ణించారు పోతన. ఆ తల్లి ఈ లోకములన్నింటినీ అనుగ్రహించడం కొసం పైకి వస్తుంటే.. శిరస్సు నుంచి పాదాల వరకూ, ఆ రూప వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించారు.

తొలకరి ప్రారంభమయ్యే సమయంలో, ఆకాశంలో వచ్చేటువంటి మెరుపుని, సౌదామిని అంటాం. అది కంటిని ఆకర్షిస్తుంది. తళుక్కు తళుక్కు మనే మెరుపుకి, అందరూ ఆ దిశగా చూస్తారు. లక్ష్మీ దేవి మెరుపు కూడా అలాంటిదే. లక్ష్మీ దేవి వైభవాన్ని ఎక్కడ ఎవరు వర్ణించినా, స్తుతించినా, శ్లాఘించినా, మెరుపు తీగతో పోల్చి చెబుతారు. ఎందుకంటే, అందరి కంటినీ అమితంగా ఆకర్షించే శక్తి, మెరుపుకి వుంటుంది. విద్యుల్లతలా ఆమె కరుణా కటాక్షాలు కూడా, లోకం పట్ల కాంతులు వెదజల్లుతూ వుంటుంది. ఆమె ఒక్కసారి కన్ను తెరిచి, క్రీగంట చూస్తే చాలు.. లోకములన్నీ బ్రతుకుతాయి. చైతన్యాన్ని విప్పుకుంటాయి.

ఆమె శరీరం అంతా కూడా మిలమిలా, ధగధగా మెరిసిపోతూ వుంటుంది. ఆమె ఒక కాంతి పుజం. ఆ కరుణా వీక్షణాలు ప్రసరించిన  ఉత్తర క్షణానే, ఇక ఆ ఐశ్వర్య వైభవం, మాటలకందని రీతిలో వుంటుంది. ఆ ఉత్సాహం కానీ, ఉల్లాసం కానీ, ఐశ్వర్యం కానీ, పూనిక కానీ, సంపద కానీ, అన్నీ, అంత పుష్కలత్వాన్ని పొందుతాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని అందరూ గ్రహించాల్సి వుంటుంది.

'ఐశ్వర్యము' అంటే, కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. లక్ష్మి అంటే ఎవరని అభిప్రాయపడుతున్నారు?

మనల్ని విశేషంగా సత్కరించాలనుకుంటే, ఆ తల్లి ఆడపిల్లగా ఇంటికొస్తుంది. ఆడపిల్ల అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం. ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి, తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో, ఇరు వంశీకులనూ తరింపచేస్తుంది. మగపిల్లాడికి, ఆ అవకాశం లేదు.

అసలు ఆడపిల్ల ఇంటికొచ్చిందంటేనే, లక్ష్మీ దేవి వచ్చినట్టే. 'ఆడపిల్ల' అటు వెనక పదితరాలనూ, ఇటు ముందు పది తరాలనూ, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది. మగపిల్లాడికి పెళ్లయ్యాక, ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే, అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది.

ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు, తానెక్కడెక్కడ నివాసముంటుందో, స్వయంగా తానే చెప్పింది..

కైలాసంలో 'పార్వతీ దేవి'గా,

వైకుంఠంలో 'లక్ష్మీ దేవి'గా,

బ్రహ్మ లోకంలో 'సరస్వతీ దేవి'గా,

మహా రాజు దగ్గర 'రాజ్యలక్ష్మి'గా

ప్రతి ఇంటి ఇల్లాలిలో, 'గృహలక్ష్మి'గా వుంటానని చెప్పింది.

'గృహము' అని ఎప్పుడంటారంటే, ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే! ఇంటి యజమాని ఎంత అలసిపోయినా, ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం వున్నా, ఎన్ని కోట్లు వున్నా, ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి  ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు. లక్ష్మీ దేవిని దర్శించడం  ఎంత సులువైనదీ అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, సోదరిలో చూడవచ్చు. ఈ భావన చాలు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు. ఈ ఒక్క భావన హేతువు గా నిలుస్తుంది.

దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుందీ అంటే, కనపడిన ప్రతి ఇల్లాలి వంకా చూడకూడని చూపు చూడటం వల్ల, అది దోష భూయిష్టమౌతోంది. అలా కాకుండా,  ప్రతి ఇల్లాలిని గనక లక్ష్మీ స్వరూపంగా, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి వుంటే, దేశమంతా కూడా, లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది, వర్ధిల్లుతుంది.. అందుకే లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం.. అవేమిటంటే :

1. గోవు యొక్క వెనుక వైపు. 

రోజుకొక్క సారైనా, గోవు వెనక భాగం చూసిన వారూ, ప్రదిక్షణ చేసిన వారూ, లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు, చేతులారా పండూ, ఫలమూ, పరకని తినిపించిన వాడు, సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.

2. పద్మం -  పద్మము లక్ష్మీ స్థానం.

3. ఏనుగు యొక్క కుంభస్థలం.

4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం.

5. మారేడు దళం. ఈ ఐదూ లక్ష్మీ దేవి నెలవుండే స్థానాలు.

లక్ష్మి లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి  ఎక్కడ వుంటే, అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుండటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడిదే అసలైన లక్ష్మీకటాక్షం.

పితృ దేవతా జ్ఞానం

పితృ దేవతా జ్ఞానం

దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే.
🌾🌾🌾🌾
మాసికాల రహస్యం ఇదే!
మాసికాలు ఎందుకు పెట్టాలి?
అన్ని మాసికాలు పెట్టాలా?
కొన్నిమానేయవచ్చా?
🌾🌾🌾🌾🌾


వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.

అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.

కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి?

దేవతగా ప్రేత ఎలా మారుతుంది?

పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి?

అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది.
ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు.

ఇది అథర్వణ వేదశాఖకు చెందినది.
ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది.
ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది.

దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?
అనే ప్రశ్నలు వేశారు.

దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.

ఈ శరీరం
భూమి,
నిప్పు,
నీరు,
గాలి,
ఆకాశం
అనే మహాభూతాలతో ఏర్పడింది.

ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.
ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.

ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం).
దాని వలన పంచప్రాణాలు పోతాయి.

గాలి తరువాత అగ్ని పోతుంది.
శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.

తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.

ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి.

ఇవి భూమిలో కలిసిపోతాయి.

శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది.

క్లుప్తంగా జరిగేది ఇదే.

ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ
కారణ శరీరం,
యాతనా శరీరం
అని ఉంటాయి.

కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం.
తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది.
అదే నూతన శరీరం పొందుతుంది.

యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది.

ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.

ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.

దీని తరువాత పదోరోజున
సపిండులు,
సగోత్రీకులు,
బంధువులు,
స్నేహితులు
వచ్చి, వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి.
వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.

అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.
పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ, ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.

సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో,
తన తండ్రి తాత ముత్తాతల్లో,
ముత్తాతను ముందు జరిపి,
ఆయన ఖాళీలో తాతను,
తాత స్థానంలో తండ్రిని,
తండ్రి స్థానంలో తాను
చేరుకుంటుంది.
పితృదేవతాస్థానం పొందుతుంది.

దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది.

నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.

వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది.
దీన్నే కలనం అన్నాడు.

దీని తరువాత మాంసం, చర్మం, రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన, పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం, పిండాల వలన కలుగుతుంది.

ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.

వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది.

మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.

ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది.
ఆ తరువాత
అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే.

మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.

ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది.

మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము.
మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది.

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.

తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.

కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన
కురుక్షేత్రం,
ప్రయాగ,
కాశీ,
గయా,(
వంటి వాటిలో చేయాలి.

ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము.
దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది.

వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా?
అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు.
అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.

అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు.

వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు.

గయలో ఎందుకు చేయాలి?
ప్రయాగలో ఎందుకు చేయాలి?
అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు.

పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు.
ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది.
దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు.

ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి.

ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.

ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.

విశ్వమే ప్రకృతి

విశ్వమే ప్రకృతి

భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుని మనుగడయే కష్టం.
మానవుడు ఈ భూమిపై అవతరించి తన అవసరాలను తీర్చుకొనుటకు ప్రకృతిమీదనే ఆధారపడుతున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలాలు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాసులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ముఖ్యవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుండి లభించేవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్ల నీడను సౌధాలుగా చెట్ల నారను పట్టు వస్త్రాలుగా కాయలు, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభమునుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలనం ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నది. మానవుని ప్రజ్ఞా ప్రాభవాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లాగా విహరింపజేస్తున్నాయి. సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికిని దీని ప్రభావంతో ప్రకృతి దెబ్బతింటున్నది. పూర్వకాలంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కందమూలాలు ఆరగించి మూలికా ఔషధాలను వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించెడివాడు. నేటి మానవుడు పట్టణ జీవితానికి అలవడి కృత్రిమ ఆహారాన్ని కల్తీ ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాడు.

ప్రకృతికి మూలాధారాలైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటికి హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు- మనం ఇక్కడినుండి రాళ్ళతో కొడితే అవి మనకు అక్కడినుండి ఫలాలనందిస్తున్నాయి. మనకు అవసరమైన ప్రాణవాయువును, ఆకులు, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, రావి, మేడి, వేప, జమ్మి, ఉసిరిచెట్లను పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖ దుఃఖాలున్నవని జగదీశ చంద్రబోసు నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన ‘నోబుల్’ బహుమతి పొందాడు. ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియాశక్తి, ఘ్రాణాశక్తి ఉందని నిరూపించారు. సాధారణంగా సామాన్య మానవులకుండే లక్షణాలన్నియు చెట్లకూఉన్నాయి. చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకున్నది. చెట్లు దైవీ శక్తులను కలిగి ఉన్నాయి. అవి పిలిస్తే పలికే దైవాలు. భక్తితో చెట్లను పూజించి, ప్రదక్షిణలు చేసి ఏకాగ్రతతో ప్రార్థిస్తే వృక్షమాత అనుగ్రహించి ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిలో ఒక్కొక్క చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి మహత్తర శక్తులను కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని గ్రహించి వృక్ష సంపదను పెంపొందించిన దేశ సౌభాగ్యము ఇనుమడిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో- నిరంతరం నిష్కామ భావంతో ప్రకృతిని సేవిస్తూ, రక్షిస్తారో వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తానని అర్థం, ‘వృక్షో రక్షతి రక్షితః’ అని. మనం ప్రకృని కాపాడితే ప్రకృతి మనలను తన ఒడిలో పెట్టుకుని కన్నబిడ్డలా పరిరక్షిస్తుంది. ప్రకృతిని రక్షించు ప్రకృతిలో జీవించు. ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలిసి కొని భగవంతుడు అన్నింటా వ్యాపించి యున్నాడని అన్ని ప్రాణుల యెడ భూతదయ కలిగి రక్షించుట మానవ ధర్మం. ఇదే వేద సారాంశం.

సేకరణ. మానస సరోవరం 👏

ఇలా మన సనాతన ధర్మం ‘అవిద్య’ మానవ దుఃఖానికి, జనన మరణ చక్రభ్రమణానికి, భగవంతుడికి మనిషికి మధ్య దూరానికి ప్రధాన కారణమని తేల్చిచెప్పింది.

రామకృష్ణ పరమహంస కోల్‌కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్‌ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. అందులో భాగంగా వారి మధ్య ‘అవిద్య’ అన్న అంశం చర్చకు వస్తుంది. అప్పుడు రామకృష్ణులు అవిద్య అన్న పారమార్థిక పారిభాషిక పదానికి వివరణ ఇస్తూ.. ‘మనిషిని ప్రాపంచిక మోహంలో పడదోసి, భగవంతుడికి దూరం చేసే గుణాలను కలిగి ఉండేదే అవిద్య. అది మహా మాయ. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం ఇవి ‘విద్య’ లక్షణాలైతే, భగవంతుడిపై విశ్వాసం లేకపోవటం, అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాసక్తి ఇవన్నీ ‘అవిద్య’ స్వభావాలు’ అని వివరించాడు. మనిషి తన సహజ స్వభావమైన ఆనందాన్ని కాదని, సంసార దుఃఖాల్లో కూరుకుపోవటానికి ఈ అవిద్య కారణమని పరమహంస విస్పష్టం చేశాడు.
ఒక సందర్భంలో ఓ శిష్యుడు ఆది శంకరాచార్యులతో ‘గురువర్యా! నిద్రలో ఎంతో ప్రశాంతతను, సుఖాన్ని అనుభవిస్తున్నాను. కానీ మెలకువలో ఉన్నప్పుడు ఆ సుఖశాంతులు మాయమైపోతున్నాయి? పైగా వాటిస్థానంలో అశాంతి, దుఃఖం వచ్చిచేరుతున్నాయి. కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆదిశంకరులు ‘నాయనా! నీవు మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు కూడా మేల్కొంటున్నాయి. వేటి కోసమో వెంపర్లాడుతున్నాయి. దీన్నే ‘అవిద్య’ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసంసారివి అయినా సంసారి అనుకోవటం, దేనికీ నీవు కర్తవు కాకపోయినా, ‘నేను’ కర్తను అనుకోవటం, నీవు భోక్తవు కాకపోయినా భోక్తను అనుకోవటం, నీవు ఆత్మరూపంగా శాశ్వతుడవైనా.. శరీరానికే పరిమితమై అశాశ్వతుడనని భ్రమపడటం వీటిని ‘అవిద్య’ అంటారు. నీవు మరలా, మరలా పుట్టడానికి, చావడానికి ఈ ‘అవిద్యే’ కారణమ’ని శంకరాచార్యులు ఉద్ఘాటించాడు. వారి ‘ఉపదేశ సాహస్రి’లో ఈ అంశంపై విపుల వ్యాఖ్యానం చూడవచ్చు.
అయితే వివిధ తత్త్వవిధులు వేర్వేరుగా ‘అవిద్య’ను నిర్వచించారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమించే మాయనే అవిద్య అన్నారు అద్వైతులు. తత్త్వజ్ఞానం లేకపోవటమే ‘అవిద్య’ అని వ్యాఖ్యానించారు విశిష్టాద్వైతులు. బౌద్ధమత గ్రంథాల్లో కూడా ‘అవిద్య’ అన్న ఆధ్యాత్మిక పారిభాషిక పదం ప్రస్తావన కనిపిస్తుంది. ‘క్షణికమైన వాటిని శాశ్వతమని తలచటమే అవిద్య’ అంటారు బౌద్ధమత గురువులు. పతంజలి యోగసూత్రాల్లో కూడా ‘అవిద్య’ పై వివరణ కనిపిస్తుంది. ‘అనిత్యాశుచి, దుఃఖానాత్మను నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్యా’ అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవటం ‘అవిద్య’ అని పతంజలి యోగసూత్రాల్లో సాధన యోగంలోని అయిదో సూత్రం పునరుద్ఘాటిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడ్డట్లు, అశాశ్వతమైన ప్రపంచాన్ని, శాశ్వతమని భ్రమించటమే ‘అవిద్య’.
ఇక రమణ మహర్షి తాను తనువు అనుకోవటమే ‘అవిద్య’ అంటారు. తను ఆత్మ అని తెలుసుకోవటమే ‘విద్య’ అని పేర్కొన్నారు. ‘కూలీ కోసం లగేజీ మోసేవాడు దానిని దింపే స్థలం వరకు మోసుకొని వస్తాడు. స్థలాన్ని చేరగానే సంతోషంగా బరువు దింపుతాడు. బరువు వదిలిందిరా నాయనా’ అనుకుంటాడు. అంతేకానీ, విచారించడు. వదిలించుకున్న బరువు కేసి చూడడు. జీవన్ముక్తునికి ఈ శరీరం లగేజీ లాంటిది. కూలీ వాడికి తాను మోసే లగేజీపై ‘నేను, నాది’ అనే భావం ఎలా ఉండదో, అలాగే జీవన్ముక్తునికి దేహంపై అభిమానం, మమకారం ఉండవు. మానవ శరీరంతో జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమైన ఆత్మజ్ఞానం పొందాలి. పొందాక శరీరభావాన్ని విడవాలి. భోజనం అయ్యాక, ఎంగిలి ఆకును అవతల పారేసినట్లు, శరీర భావాన్ని తోసివేయాలి. అంతేకానీ, ఇంకా దాన్ని పట్టుకొని వేలాడటం ఏమిటి? అదే అవిద్య. ఇలా మన సనాతన ధర్మం ‘అవిద్య’ మానవ దుఃఖానికి, జనన మరణ చక్రభ్రమణానికి, భగవంతుడికి మనిషికి మధ్య దూరానికి ప్రధాన కారణమని తేల్చిచెప్పింది.

సేకరణ. మానస సరోవరం 👏

ప్రస్తుతం పెళ్ళిలలో ఏమి చేస్తున్నారు? అసలు పెళ్ళి అంటే ఏమిటి ?మూడు ముళ్లు, ఏడు అడుగులు ఎందుకు వేయాలి?

—మన పురాణాలు.—
🌷🌷🌷🌷🌷🌷🌷

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..?

ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!

ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు.కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధూవరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(ఫోటోలు తీపి జ్ఞాపకాలే.. కానీ ధర్మం ఆచరించాకే మిగతావి).

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!

4. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం, వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవటం..!

6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!

7. వేదమంత్రాలు వినబడకుండా వాటి స్థానంలో మైకులు పెట్టి మరి సినిమా పాటలు వినిపించటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని.

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ, మంచి సంతానం పొంది, పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు,చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ.ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్ధిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

🌚అహంకారం వదులుకోవాలి లేదంటే నాశనం కి మొదట మెట్టు .మనకి వద్దు ఈ అహంకారము

అసలు పెళ్ళి అంటే ఏమిటి ?

పెళ్ళిఅంటే ..పెళ్ళి అంటే.. పెళ్ళి అంటే.

మూడు ముళ్ళు
ఏడు అడుగులు
రెండు హృదయాలు
ఒకటే ప్రమాణం

"నాతి చరామి"

మూడు ముళ్లు ఎందుకు వేయాలి
మూడు కాలాల పాటు వధూవరులు
ఇద్దరూ అన్యోన్యంగా సంతోషముగా
సుఖంగా జీవించడం కోసం
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా
మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి
త్రిమాత ఆశీర్వాదం కోసం
ధర్మము అర్థము కామము నకు
సంకేతంగా మూడు ముళ్ళు వేస్తారు.

ఏడు అడుగులు.......

మొదటి అడుగు.............. కోరికలు తీరటము కోసం
రెండవ అడుగు................
ధైర్యముగా ఉ త్చాహంగా కలసి మెలసి
జీవించడం కోసం

మూడవ అడుగు............
వ్రతాలు హోమాలు నిర్వహించడం కోసం

నాల్గవ అడుగు...........
సుఖంగా శౌ ఖ్యంగ జీవించడం కోసం

ఐదవ అడుగు..........
పాడి పంటలు అభివృద్ధి కోసం

ఆరవ అడుగు..........
పండగలు యజ్ఞ యాగాదులు చేయడం
కోసం

ఏడవ అడుగు...........
అన్యోన్య దాంపత్యం కోసం

ధర్మార్థ కామ మోక్షం కొరకు మన పెద్దలు
సప్తపది ఏర్పాటు చేశారు

లోకా సమస్తా సుఖినోభవంతు

ఇదీ ఎదుగుదలకు మరి మీ గురించి మీకు తెలియటానికి ఒక అవకాశం.

మీకు దిగులును పుట్టించే ఎమోషన్స్‌ వచ్చినప్పుడు అవి ఇతరులు కలుగజేశారని ఆలోచించవద్దు. మీరు కోపంగా ఉన్నట్లయితే, ఇంకొక వ్యక్తిని కోపం కలుగజేసినందుకు తిట్టడం మానివేయండి. దానికి బదులుగా, కోపాన్ని కలిగించిన feelings తో పనిచేయండి. మిమ్మల్ని మీరు అర్ధంచేసుకునేవరకు అభివృద్ధి చెందటమే ఆధ్యాత్మిక ఎదుగుదల మరింత ఉన్నతమైన మార్గాల ద్వారా నటించి నేర్చుకోవాలి. మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీ గురించే చెప్తుంది. మీరు జీవితంలో ఏంతో కలత చెందినా మిమ్మల్ని మీరు తప్పు పట్టవద్దు. ఇదీ ఎదుగుదలకు మరి మీ గురించి మీకు తెలియటానికి ఒక అవకాశం.

Friday, May 27, 2022

ఓ మంచిమాట

ఓ మంచిమాట
->ఆత్మ విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం, ఈ మూడు గుణాలు మనిషి జీవితాన్ని ఎంతో శక్తివంతంగా తయారు చేసేస్తాయి.
->మేలుకున్న జ్ఞానిగా ఉండడం ఐశ్వర్యప్రదం. నిద్రపోతూ సోమరిగా జీవించడం అన్నిటికన్నా దరిద్రం.
->ఏకాగ్రత... ఆవేశాన్ని పవిత్రం చేసి, శాంతింపజేస్తుంది. మనిషి ఆలోచనలకి శక్తినందించి, స్పష్టమైన కల్పనని చిగురింపజేస్తుంది.
->మనస్సును నిర్మలంగా ఉంచుకోగలగడమే పవిత్రమైన మతసారం. తక్కినవన్నీ అర్థంలేని బాహ్య ఆడంబరాలే.
->కాలం ఎంతో విలువైనది. గతించిపపోయిన గతాన్ని భగవంతుడైనా తిరిగి సంపాదించి పెట్టలేడు.
->నాలుకను జయించితే నరలోకాన్ని జయించినట్లే.
->ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటిని మించి మహాసంగ్రామం లాంటిది.
->మన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి ఏదో విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలా తారసపడ్డ ప్రతి వారి నుంచీ ఎంతో కొంత నేర్చుకోగలిగితే, మన జీవితం ధన్యమే.
->కోపంగా ఉండడం అంటే నిప్పును పట్టుకోవడమే. ఎదుటి వాళ్ళ మీదకు విసిరే లోపల అది నిన్నే దహించి వేస్తుంది.
->సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ ఆపూ ఉండదు.
->తాను ప్రవేశించిన పాత్ర యొక్క స్వరూపాన్ని పొందే నీటిలాగే, బుద్ధిమంతుడైన వ్యక్తి పరిస్థితులకి అనుగుణంగా తనని తాను సరిదిద్దుకుంటాడు.
->ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు. 1. రహస్యాన్ని కాపాడడం, 2. అవమానాన్ని మరచిపోవడం, 3. సమయాన్ని సద్వినియోగం చేయడం.
->కాళ్ళకు చెప్పులు లేదే అనే బాధ అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసే వరకే ఉంటుంది.
->వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు.



మంచి మాట...లు(27-05-2022)

ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥
[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥]

ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥

సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥

స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి,సరస్వతి, గాయత్రి, దుర్గా, అన్నపూర్ణ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. 💐💐💐
శుక్రవారం :-27-05-2022

పెద్ద వారితో మర్యాదగా.. అధికార హోదాలో ఉన్నవారితో గౌరవంగా.. స్నేహితులతో చనువుగా.. తెలియనివారితో అవసరం మేరకు మాత్రమే మాట్లాడటం మంచిది

కాలం కలసిరాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసివస్తుంది..ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు.. మన బాధకు కారణం ఏదైనా కావచ్చు.. కానీ ఆ కారణంగా ఎవరికీ హాని చేయుటకు ప్రయత్నం చేయకూడదు

ఖర్చు విలువ తెలియకుండా భార్యని.
కష్టం విలువ తెలియకుండా కొడుకుని.
బంధాలు విలువలు తెలియకుండా కూతుర్ని..
పెంచకూడదు..

చెప్పులు లేనివాడికి కాళ్ళు లేనివాడు కనిపించే అంత వరకు తెలియదు తాను ఎంత అదృష్టవంతుడు అనేది
అందుకనే మనం ఎప్పుడు కూడా లేని వాటికోసం కాకుండా.. మనకున్నదానిలో ఆనందం చూడగలిగితే మన అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు..

ఏదైనా మంచి కానీ చెడు కానీ చేసి మనం మరచిపోవొచ్చేమో కానీ.. చిత్రగుప్తుడు అన్ని రికార్డు(ICC) చేస్తూనే ఉంటాడు.. తప్పక దాని ఫలితం ఉంటుంది.. కాబట్టి ఏదైనా చేసే టప్పుడే ఆలోచించుకోవాలి.. అనుభవించాల్సింది మనమే కాబట్టి
సేకరణ ✒️AVB సుబ్బారావు💐🌹🤝

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?

ఏజ్ - 30 సిగరెట్ లేదు.. మందు లేదు… గుట్కా లేదు…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?
ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?అసలు కారణమేంటి…? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?
వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం… పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు… ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు… తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్… అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు… పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా… ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు… పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….?
- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?
ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…? వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం… తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు.. ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో… అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…? ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు… బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్….. ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!
కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? ఆధునికత మంచిదే….. కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!

ప్రతి ది కలుషితమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సిన కొన్ని అవసరమైన ఫుడ్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు వాడాలి. సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

మీ...శ్రేయోభిలాషి👍