🎻🌹🙏 రావణుడు మరణించాక మండోదరి ఏమైనది....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿లంకాధిపతి రావణుడి పట్టపురాణి మండోదరి పరమ పతివ్రత. ఆమె జీవితమంతా తన భర్త కోసమే జీవించింది.
🌸రామాయణ యుద్ధం ముగిసిపోయింది. రణ భూమిలో రావణుని పార్దివదేహం అలాగే పడివుంది.
🌿విషయం తెలుసుకున్న రావణుని భార్య మండోదరి ఒక్కక్షణం నివ్వెర పోయింది. మహా శక్తి సంపన్నుడు, బలశాలి, అసుర విద్యలు అవలీలగా ప్రదర్శించేవాడు,
🌸 తపస్సంపన్నుడు, గొప్ప శివ భక్తుడు అయిన తన భర్త... ఒక మానవుని చేతిలో మరణించాడని తెలిసి ఆశ్చర్య పోయింది.
🌿ఈ విషయం రాముణ్ణి అడగాలని ఆవేశంతో.... రణభూమికి బయలుదేరింది.
🌸రణభూమిలో ఒక రాయిపై కూర్చొని వున్న రాముణ్ణి చూసి అర్థం లేని ఆవేశంతో.... పరుగు పరుగున వస్తున్న మండోదరిని రాముడు గమనించాడు
🌿సూర్యుడు పడమర అస్తమించే సమయం, ఎండ ఏటవాలుగా పడడంతో.... రాముని నీడ కొంత దూరం విస్తరించి వుంది.
🌸అటుగా వస్తున్న మండోదరి నీడకూడా విస్తరించి ఉండడంతో... తన నీడకు మండోదరి నీడ తగులుతుందేమోనని గ్రహించిన రాముడు అక్కడనుండి తప్పుకున్నాడు.
🌿విషయాన్ని గ్రహించిన మండోదరి.... తన భర్త ఒక ఆడదాని విషయంలో చూపిన తీరు, రాముడు చూపిన తీరు గ్రహించి నోటమాట రాక మౌనంగా వెళ్ళిపోయింది.
🌸పవిత్రత అనేది పుట్టుకలో కాదు, సంస్కారం బట్టి ఉంటుంది అనుకున్నది.
🌿మరి రాముడి చేతిలో రావణాసురుడు హతమారిన తరువాత మండోదరి ఏమైంది అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు.
🌸అయితే ఒక పురాణం ప్రకారం మండోదరి రావణుడి మరణం తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
🌿రాజు మరణించాక, వారసులు కూడా లేనట్టయితే రాణిదే రాజ్యాధికారం. రామరావణుల యుద్ధంలో రావణుడితోపాటు కొడుకులు కూడా హతమారిపోయారు కాబట్టి
🌸 అప్పటి లంక నియమాల ప్రకారం మహారాణి మండోదరి కి రాజ్యాధికారం అప్పగించాల్సిందే.
🌿కానీ, విభీషణుడు లంకను పాలించగలడు. మొదటగా విభీషణుడు రాజు అంటే అక్కడి ప్రజలు వ్యతిరేకించారు.
🌸కానీ మండోదరిని పెళ్లి చేసుకున్నాక ఒప్పుకున్నారంట.ఈ క్రమం లో మండోదరికి పెళ్లి చేసుకుని రాజ్యాధికారం తీసుకోవాలని
విభీషణుడికి రాముడు సూచిస్తాడు.
🌿ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం.
🌸అయితే రావణుడిని ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించే మండోదరి దీనికి తిరస్కరిస్తుంది.
🌿కానీ ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కోసం జరిగే లాంఛనప్రాయమైన పెళ్లే కాబట్టి అంగీకరించాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది.
🌸తరువాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment