Tuesday, May 24, 2022

మన శరీరాన్ని ఎలా వాడుకోవాలి - నిత్య జీవితం లో మనమేమి చేయాలి

🍃🥀మన శరీరాన్ని ఎలా వాడుకోవాలి - నిత్య జీవితం లో మనమేమి చేయాలి 💦🎊


🍃🥀ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది.
ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు.
🍃🥀ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా రిపేరు చేయించుకుంటున్నానో, కొత్త పార్టులు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి.

🍃🥀దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి.
అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు.
🍃🥀ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించవలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి.

🍃🥀సత్యశోధనకై, సమాజ శ్రేయస్సుకై, పరమాత్మ అనుగ్రహానికై దీనిని వినియోగించాలి. అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు.
ఏదైనా ఒక వస్తువును పనికి వచ్చినంత కాలం వాడుకుంటాం. పనికి రాకపోతే పారవేస్తాం...

🍃🥀అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.

🍃🥀అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం.

🍃🥀కాని మనిషి శరీరం మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు.

🍃🥀ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి...

🍃🥀ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు. ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు.

🍃🥀భార్య కూడా భయపడుతుంది. ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు.

🍃🥀మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటం తెలివైనపనేనా...

🍃🥀కనుక ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకో. శరీరాభిమానం తగ్గించుకో, నిజంగా శరీరాభిమానమే మనకు బంధం అని గ్రహించాల్సి ఉంది.

🍃🥀 నిమ్మలంగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి అనుకునే వాళ్ళకే ఏదొక దరిద్రం వచ్చి పడుతుంది..

🍃🥀ఇక ఏదో గోడవైతే కాని నోరు దురదతో తిట్టే వాళ్లకు ఏదో కావాలి అనుకునేవాళ్ళకి లైఫ్ అంతా తృప్తి లేకుండా అశాంతితో ముగింపు చేసుకుంటారు.. కొందరికి జీవితంలో దేవుడు అన్ని ఇచ్చినా, ( ఉన్నా ) గందరగోళం చేసుకుంటారు కొందరు..

🍃🥀కొందరు వాళ్లు ఏనాడు ఒక్కరోజు అయిన ఎవరి గూర్చి ఆలోచించకుండా నేను నా ఇళ్ళు నా సంసారం అని తిని పడుకోవడంతోనే జన్మ అంతా గడుపుకుంటారు.. అది వారికి దేవుడిచ్చిన శాపమా లేక వీళ్లు చేసుకున్న పాపమో తెలియదు..

🍃🥀ఇంకా కొందరి జీవితాలు ఇతరులగూర్చి తెలుసుకోవడం వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి ఏదో తెలియని ఈర్ష, కళ్ల ఎదుట మంచిని సంతోషాన్ని తట్టుకోలేరు..

🍃🥀అందుకే... దేవుడా ఈ మానవ జన్మని సార్ధకం చేసుకోవాలనే వరం అందరికి ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:

Post a Comment