Wednesday, May 25, 2022

హనుమంతుని వద్ద మనం నేర్చుకోవలసినది ఏమిటి???

🎻🌹🙏 హనుమజ్జయంతి...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿హనుమంతుడు - సర్వ మానవాళికి ఇస్తున్న సందేశం ఏమిటి!!!

🌸 హనుమంతుని వద్ద మనం నేర్చుకోవలసినది ఏమిటి???

🌿హనుమంతుడంటే ఒక అంకితభావం,
బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం వీతన్నింటి సమ్మేళనం.

🌸 అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం.

🌿సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం,

🌸విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం

🌿 ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే....

🌸హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు,

🌿రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క.

🌸సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను.

🌿ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు ఆ తల్లిని చూసే వస్తాను.

🌸ఇది తధ్యం, నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ అన్నాడట...

🌿కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే!

🌸ఆత్మ ప్రత్యయం, ఆత్మ విశ్వాసం, ఇదే విజయానికి తొలి మెట్టు...
ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

🌿‘నీ వెవరివీ అని ఎవరైనా అడిగితే హనుమంటుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట
దాసోహం కోసలేంద్రస్య అన్నాడు...
‘నేను కోసలేంద్రుడి దాసుడినీ...'

🌸కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడట...

🌿మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే!

🌸‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని, నా పేరు ఫలానా….’ మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే!
ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

🌿‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుందీ అనేదానికి హనుమంతుడే నిదర్శనం.
ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ.

🌸 మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు.

🌿మనకంటే పెద్దవాళ్ళు మన బృందం లో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది.

🌸ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం.
మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు.

🌿ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూల మయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

🌸ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు,

🌿ఆ బంధానికి కట్టుబడ్డాడు.
ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది.
కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు

🌸ఎందుకూ అంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక.

🌿రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదూ.

🌸ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం...
ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం. ఆంజనేయ.. వరభీమ... రామ...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment