నువ్వు ధ్యానం చేసావు, అప్పుడు నీకు నీవే మిత్రుడివయ్యావు, ఏ రాముడో. ఏ కృష్ణుడో. ఏ శివుడో లేకపోతె ఈ గడ్డం గాడు నిన్ను రక్షించరు, నిన్ను నువ్వే రక్షించుకోవాలి, నా పదాలని పట్టుకోమంటే పాదాలను పట్టుకుంటారు ఏమిటో రామచంద్రా! నేను నీకు నాకు నువ్వు ఏమి చేయలేము, నాకు నెను చేసుకోగలను, నీకు నువ్వు చేసుకోగలవు, ఎవరికి వారే యమునా తీరే. నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, జ్ఞాన శాస్త్రాన్ని చెప్పగలను, నేర్చుకోవలసింది మీరే, శ్రద్ధ ఉంటె నేర్చుకుంటారు, చెప్పేవాడు గురువు కాదు, నీ యొక్క శ్రద్దే, నీ యొక్క గురియే నీ గురువు. అన్యధా శరణం నాస్తి! - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
No comments:
Post a Comment